← Back to news

రాజకీయ ద్వేషంతో రైతులను ఆగం చేయొద్దు

By DK· 11 Jul 2026
రాజకీయ ద్వేషంతో రైతులను ఆగం చేయొద్దు

TG: కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయ ద్వేషంతో రైతులను ఆగం చేయడం క్షమించరాని నేరమని మాజీ మంత్రి హరీష్ రావు ఫైరయ్యారు. కన్నెపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోయలేని తన చేతగానితనాన్ని CM రేవంత్ రెడ్డి అబద్ధాలతో కప్పిపుచ్చాలని చూడటం హీనమైన చర్య అని అన్నారు. 28లక్షల క్యూసెక్కుల వరద వచ్చినప్పుడే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు చెక్కు చెదరలేదని, ఇప్పుడు వస్తున్న లక్ష క్యూసెక్కుల వరదకు ఏదో జరుగుతుందని ఎందుకు భ్రమలు కల్పిస్తున్నారని ప్రశ్నించారు. వెంటనే కన్నెపల్లి పంపులు ఆన్‌ చేసి ఎల్లంపల్లి, అన్నపూర్ణ, రంగనాయక సాగర్‌, మల్లన్నసాగర్‌ సహా అన్ని రిజర్వాయర్లను నింపాలని డిమాండ్ చేశారు.

More in Politics