రన్నింగ్ కారులో మంటలు.. జస్ట్ మిస్

TG: రన్నింగ్ కారులో మంటలు చెలరేగి అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ వైపు వెళ్తున్న కారు ఇంజన్‌లో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఇద్దరు గాయపడ్డారు. కారు డ్రైవర్ సహా, అందులో ఉన్నవారు వెంటనే కిందికు దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. చూస్తుండగానే కారు పూర్తిగా కాలి బూడిదైంది. వెంటనే క్షతగాత్రులను శంషాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



