అమ్మ నోట్స్ తో ఐఐటీ డ్రీమ్ ఫుల్ !

బీహార్‌కు చెందిన 17 ఏళ్ల గుంజన్ కుమార్‌కు ఊపిరితిత్తి కుప్పకూలడం, 70% చూపు తగ్గడం, మూడు నెలలు బెడ్‌రెస్ట్... వరుస కష్టాలు ఎదురైనా IIT డ్రీమ్‌ను వదల్లేదు. ఆన్‌లైన్ క్లాసులకు అతని అమ్మ గుంజా కుమారి హాజరై, చేతితో నోట్స్ రాసి చదివించింది. ఆ కష్టమే ఫలించింది. ఇప్పుడు గుంజన్ IIT ఢిల్లీ అబుదాబి క్యాంపస్‌లో కంప్యూటర్ సైన్స్ సీట్ దక్కించుకుని అందరికీ స్ఫూర్తిగా నిలిచాడు.



