Latest
మనుషులపై హ్యూమనాయిడ్ రోబో దాడి !
ఇటీవల చైనా, జపాన్‌లలో రోబోల దాడులు పెరుగుతుండగా, తాజాగా ఇండోనేషియాలో ఓ వింత ఘటన వెలుగుచూసింది. అక్కడ ఓ హ్యూమనాయిడ్ రోబో ఒక్కసారిగా మనుషులపై విరుచుకుపడింది. ప్రొఫెషనల్ ఫైటర్‌లా కిక్స్ ఇస్తూ కొందరిని గాయపరిచింది. అయితే, దాడి తర్వాత అది బ్రూస్ లీ తరహాలో ఇచ్చిన ఫైటింగ్ పోజు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.
గుజరాత్ లో పశువుల కాపరిపై సింహం దాడి !
గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లాలో ఒక సింహం పశువుల కాపరిపై దాడి చేసిన భయంకరమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆవులకు మేత వేస్తుండగా అకస్మాత్తుగా సింహం అతనిపై పంజా విసిరి, దాదాపు 30 నిమిషాల పాటు వదలకుండా కింద పడేసి పట్టుకుంది. గ్రామస్థులు ఎంత అరిచినా, సింహం అతని చేతిని నోటితో, కాలును పంజాతో గట్టిగా పట్టి ఉంచింది. తీవ్ర గాయాలైన ఆ వ్యక్తిని ఎట్టకేలకు రక్షించి ఆసుపత్రికి తరలించారు.

మైక్రోసాఫ్ట్ లో 4,800 మంది ఉద్యోగుల తొలగింపు
మైక్రోసాఫ్ట్ సంస్థ మరోసారి భారీగా ఉద్యోగుల తొలగింపునకు తెరలేపింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను విస్తృతంగా వాడుతుండటంతో, కంపెనీలో దాదాపు 4,800 మంది ఉద్యోగులను తీసివేయాలని నిర్ణయించింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ విభాగాలపై దీని ప్రభావం పడనుంది. టెక్ రంగంలో AI హవా పెరుగుతుండటంతో వ్యయాలను తగ్గించుకోవడానికి, వ్యాపార ప్రాధాన్యతలను మార్చుకోవడానికే మైక్రోసాఫ్ట్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ లేఆఫ్స్ టెక్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.
CM విజయ్ బాటలో మరో హీరో!
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ తమిళనాడులో జోరుగా ప్రచారం సాగుతోంది. నటుడు విజయ్ బాటలోనే ధనుష్ కూడా అడుగులు వేస్తున్నట్లు టాక్. ఇప్పటికే ధనుష్ ఫ్యాన్ క్లబ్ ఫ్లాగ్ లాంచ్ అవ్వడం, రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేస్తుండటంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆయన పాలిటిక్స్‌లోకి వస్తారనే రూమర్స్ వినిపిస్తున్నాయి. ధనుష్ దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

MLA అరవ శ్రీధర్ శవయాత్ర!
రైల్వే కోడూరు జనసేన MLA అరవ శ్రీధర్ ప్రవర్తన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. తమ లీడర్‌ను విమర్శించారంటూ రావణ్, జడ శ్రావణ్ కుమార్, ప్రకాష్ రాజ్‌ల ఫొటోలతో జనసేన ఆఫీస్ నుండి శవయాత్ర నిర్వహించారు. అనంతరం MLA స్వయంగా వారి దిష్టిబొమ్మలను దహనం చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. గతంలో వీణ అనే యువతి తనను MLA లైంగికంగా వేధించారంటూ బయటకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు MLA, జనసేన నేతల తీరు చూసి ప్రజలు షాక్ అవుతున్నారు.
పవన్ కళ్యాణ్‌పై పోలీసులకి సుగాలి ప్రీతి తల్లి కంప్లైంట్!
డిప్యూటీ CM పవన్ కళ్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి పార్వతీ దేవి పోలీసులకు కంప్లైంట్ చేశారు. పవన్ తన కూతురి మరణాన్ని పాలిటిక్స్ కోసం వాడుకున్నారని ఆమె ఆరోపించారు. పవర్‌లోకి వస్తే ఫస్ట్ సైన్ ప్రీతి కేసుపైనే అని చెప్పి, డిప్యూటీ CM అయ్యాక మాట మార్చారని ఫైర్ అయ్యారు. ఇప్పుడు నిందితులకు క్లీన్ చిట్ ఇస్తున్నారని, తాను న్యాయం అడిగితే జనసేన వాళ్లను ఉసిగొల్పి తనపై దాడులు చేయిస్తున్నారంటూ కంప్లైంట్‌లో పేర్కొన్నారు.

పవన్ కళ్యాణ్‌పై పోలీసులకి సుగాలి ప్రీతి తల్లి కంప్లైంట్!
డిప్యూటీ CM పవన్ కళ్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి పార్వతీ దేవి పోలీసులకు కంప్లైంట్ చేశారు. పవన్ తన కూతురి మరణాన్ని పాలిటిక్స్ కోసం వాడుకున్నారని ఆమె ఆరోపించారు. పవర్‌లోకి వస్తే ఫస్ట్ సైన్ ప్రీతి కేసుపైనే అని చెప్పి, డిప్యూటీ CM అయ్యాక మాట మార్చారని ఫైర్ అయ్యారు. ఇప్పుడు నిందితులకు క్లీన్ చిట్ ఇస్తున్నారని, తాను న్యాయం అడిగితే జనసేన వాళ్లను ఉసిగొల్పి తనపై దాడులు చేయిస్తున్నారంటూ కంప్లైంట్‌లో పేర్కొన్నారు.
సాయికృష్ణ ఫ్యామిలీకి రూ.20 లక్షల సాయం
విజయవాడ కృష్ణలంక లాకప్‌డెత్ బాధితుడు గాదె సాయికృష్ణ కుటుంబాన్ని YSRCP నేతలు పరామర్శించారు. తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని సాయికృష్ణ నివాసానికి వెళ్లిన అంబటి రాంబాబు, ఆయన తల్లి విజయలక్ష్మిని ఓదార్చారు. పార్టీ తరపున ఆమెకు రూ.20 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కేసులో బాధితులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని మాట ఇచ్చారు.
పవన్ కళ్యాణ్, రావణ్ ఇద్దరూ ఒకేలా మాట్లాడారు!
‘ప్రశ్న రావణ్’ అరెస్ట్‌పై CPI నేత నారాయణ AP గవర్నమెంట్‌పై సీరియస్ అయ్యారు. పవన్ కళ్యాణ్, రావణ్ ఇద్దరూ ఒకేలా మాట్లాడారని.. కానీ రావణ్‌పై UAPA లాంటి తీవ్రమైన కేసులు పెట్టి జైల్లో వేయడం అన్యాయమన్నారు. బెయిల్ రాగానే మళ్లీ అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదన్నారు. డెమోక్రసీలో ప్రొటెస్ట్ చేసే రైట్ అందరికీ ఉంటుందని మహారాష్ట్ర కోర్టు తీర్పును గుర్తు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం రాజ్యాంగానికి వ్యతిరేకంగా నడుస్తోందని నారాయణ విమర్శించారు.
పవన్ కళ్యాణ్, రావణ్ ఇద్దరూ ఒకేలా మాట్లాడారు!
ప్రశ్న రావణ్ అరెస్ట్‌పై CPI నేత నారాయణ AP గవర్నమెంట్‌పై సీరియస్ అయ్యారు. పవన్ కళ్యాణ్, రావణ్ ఇద్దరూ ఒకేలా మాట్లాడారని, కానీ రావణ్‌పై UAPA లాంటి తీవ్రమైన కేసులు పెట్టి జైల్లో వేయడం అన్యాయమన్నారు. బెయిల్ రాగానే మళ్లీ అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదన్నారు. డెమోక్రసీలో ప్రొటెస్ట్ చేసే రైట్ అందరికీ ఉంటుందని మహారాష్ట్ర కోర్టు తీర్పును గుర్తు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం రాజ్యాంగానికి వ్యతిరేకంగా నడుస్తోందని, పోలీసులు పాలకుల చేతిలో పావుల్లా మారారని నారాయణ విమర్శించారు.

APలో రిటైర్ అయినా మళ్లీ జాబ్!
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్ల ఉద్యోగులకు ఏపీ గవర్నమెంట్ గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్‌ని 60 నుండి 62 ఏళ్లకు పెంచుతూ కొత్త GO రిలీజ్ చేసింది. ఈ రూల్ 2022 జనవరి 1 నుండి వర్తిస్తుంది. అంటే.. అప్పటినుండి రిటైర్ అయిన వాళ్లను అవసరమైన చోట మళ్లీ డ్యూటీలోకి తీసుకుంటారు. మళ్లీ జాబ్‌లో చేరడం ఇష్టం లేని వాళ్లు 60 ఏళ్లకే రిటైర్ అవ్వచ్చు. ఈ డెసిషన్‌తో రిటైర్మెంట్ వయస్సుపై ఉన్న కన్ఫ్యూజన్‌కి ఎండ్ కార్డ్ పడింది.

AP హైకోర్టులో కొత్తగా ముగ్గురు జడ్జీలు!
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులుగా సునీత గంధం, ఆలపాటి గిరిధర్, పురుషోత్తమ్ కుమార్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ లీసా గిల్ వీళ్లతో ప్రమాణం చేయించారు. ప్రెసిడెంట్ ద్రౌపదీ ముర్ము గారు వీళ్ల నియామకానికి ఓకే చెప్పడంతో సెంట్రల్ గవర్నమెంట్ అఫీషియల్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ కొత్త జడ్జీల ఎంట్రీతో AP హైకోర్టులో టోటల్ జడ్జీల సంఖ్య 29 నుండి 32కి చేరింది. ఈ ప్రోగ్రామ్‌కి పలువురు సీనియర్ లాయర్లు, అధికారులు అటెండ్ అయ్యారు.

లవర్ రూమ్‌లో వైఫ్‌ని చంపేసిన భర్త!
హర్యానాలో ఒక ఘోరమైన మర్డర్ జరిగింది. అంకిత్ అనే వ్యక్తికి పెళ్లికి ముందే రజనీ అనే గర్ల్‌ఫ్రెండ్ ఉంది. కానీ అతను మధు అనే అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు. పెళ్లయ్యాక కూడా లవర్‌తోనే ఉన్న అంకిత్, వైఫ్‌ని వదిలించుకోవాలని ప్లాన్ చేశాడు. మే 21న భార్యను లవర్ రూమ్‌కి తీసుకెళ్లి గన్‌తో కాల్చి చంపేశాడు. ఆ తర్వాత ఇద్దరూ నేపాల్ పారిపోయారు. నెల రోజుల తర్వాత ఇండియాకు తిరిగొచ్చిన ఆ ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

లవర్ కోసం జైలు గోడ దూకిన ఖైదీ!
మహబూబ్‌నగర్ జైలు నుండి POCSO కేస్ రిమాండ్ ఖైదీ కిషోర్ కుమార్ (22) పరారయ్యాడు. వనపర్తి సఖి కేంద్రంలో ఉన్న తన లవర్‌ని కలవడానికి.. సోమవారం తెల్లవారుజామున బాత్రూమ్‌కి వెళ్తున్నానని చెప్పి, 4 టవల్స్ సాయంతో జైలు గోడ దూకి ఎస్కేప్ అయ్యాడు. అమరచింత మండలానికి చెందిన ఈ ఖైదీ 25 రోజుల క్రితమే అరెస్టయ్యాడు. ఈ ఘటనపై DIG చౌహాన్ జైలు సూపరింటెండెంట్ శశికాంత్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం వన్‌టౌన్ పోలీసులు ఖైదీ కోసం వెతుకుతున్నారు.

లవర్ కోసం జైలు గోడ దూకిన ఖైదీ!
మహబూబ్‌నగర్ జిల్లా జైలు నుంచి ఒక రిమాండ్ ఖైదీ పరారయ్యాడు. POCSO కేసులో అరెస్టై జైలు క్యాంటీన్ లో పని చేస్తున్న కిషోర్ కుమార్ (22), సోమవారం తెల్లవారుజామున బాత్రూమ్ కు వెళ్తున్నానని చెప్పి, టవల్ సాయంతో గోడ ఎక్కి పారిపోయాడు. అమరచింత మండలం నందిమల్ల గ్రామానికి చెందిన ఇతను 25 రోజుల క్రితం పట్టుబడ్డాడు. ఖైదీ తప్పించుకున్న విషయం తెలుసుకున్న DIG చౌహాన్, SP శశికాంత్తో మాట్లాడారు. One Town Police ఖైదీ కోసం గాలిస్తున్నారు.

భార్యకు వీడియో కాల్ చేస్తూ వ్యక్తి ఆత్మహత్య!
వరంగల్ జిల్లా కాజీపేటలో షాకింగ్ ఘటన జరిగింది. రాజేష్ నాయక్ (45) అనే డాక్యుమెంట్ రైటర్, ఆస్తి గొడవల వల్ల భార్య, తల్లిదండ్రులతో గొడవపడి రాత్రి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రైలు పట్టాలపై నిలబడి, ఎదురుగా వస్తున్న రైలును భార్యకు వీడియో కాల్‌లో చూపిస్తూ సూసైడ్ చేసుకున్నాడు. తాను చనిపోతున్నానని చెప్తే అతను బెదిరిస్తున్నాడని ఆమె లైట్ తీసుకుంది. సోమవారం ఉదయం పట్టాలపై శవమై తేలడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతుడికి ఒక కుమారుడు ఉన్నాడు.

తగ్గిన బంగారం ధరలు!
గోల్డ్ లవర్స్‌కి గుడ్‌న్యూస్.. ఈరోజు బంగారం ధరలు కాస్త తగ్గాయి! హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై ₹110, 22 క్యారెట్లపై ₹100 వరకు తగ్గింది. దీంతో ప్రస్తుతం 24 క్యారెట్ల గోల్డ్ రేట్ ₹1,46,620 గా ఉండగా.. 22 క్యారెట్ల రేట్ ₹1,34,400 గా ఉంది. బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి కాబట్టి, షాపింగ్‌కి వెళ్లే ముందు లేటెస్ట్ రేట్స్ ఒకసారి చెక్ చేసుకోండి.

వారణాసి మూవీలో మహేష్ బాబు రాముడు లుక్!
ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న 'వారణాసి' సినిమా సెట్స్ నుంచి లీకైన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో మహేష్ శ్రీరాముడి వేషధారణలో కాషాయ వస్త్రాలు, విల్లు, గడ్డంతో కనిపించారు. ఈ లుక్‌ను చిత్రబృందం గోప్యంగా ఉంచినా ఫొటో బయటకు రావడంతో అభిమానుల్లో భారీ చర్చ మొదలైంది. సినిమా విడుదలపై అంచనాలు మరింత పెరిగాయి.

బహ్రెయిన్‌లో తెలంగాణ వాసి దుర్మరణం
ఇంటర్నెట్‌డెస్క్: బహ్రెయిన్‌లో తెలంగాణ వాసి మృతి చెందారు. దురత్ అల్ బహ్రెయిన్ సముద్ర తీరంలో జరిగిన ప్రమాదంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ తోట నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. బహ్రెయిన్‌లోని ఓ సంస్థలో ప్రాజెక్ట్ డిపార్ట్‌మెంట్‌లో ఆపరేటర్‌గా శ్రీనివాస్ 2019 నవంబర్ 26 నుంచి విధులు నిర్వహిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే బహ్రెయిన్ కోస్ట్‌గార్డు బృందాలు సంఘటన స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. అనంతరం సంబంధిత అధికారులు చట్టపరమైన ప్రక్రియ ప్రారంభించారు. శ్రీనివాస్ పని చేస్తున్న MAC సంస్థ యాజమాన్యం అతడి మృతికి సంతాపం ప్రకటించింది.
స్కూల్ స్టూడెంట్స్ వైరల్ వీడియో!
పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని తమ్మవరం గ్రామ స్కూల్ విద్యార్థులు రోడ్డుపై నిలబడి CM నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ CM పవన్ కళ్యాణ్‌లకు ఒక ఎమోషనల్ అప్పీల్ చేశారు. “CM సార్.. ప్లీజ్ మా ఊరికి ఒక తారు రోడ్డు వేయించండి, మమ్మల్ని కాపాడండి” అంటూ పిల్లలంతా కలిసి వేడుకున్నారు. వర్షాలు వస్తే రోడ్డు అధ్వాన్నంగా మారి స్కూల్‌కి వెళ్లడానికి పడుతున్న ఇబ్బందులను వారు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ స్టూడెంట్స్ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.

తగ్గిన బంగారం ధరలు!
గోల్డ్ లవర్స్‌కి గుడ్‌న్యూస్.. ఈరోజు బంగారం ధరలు కాస్త తగ్గాయి! హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై ₹110, 22 క్యారెట్లపై ₹100 వరకు తగ్గింది. దీంతో ప్రస్తుతం 24 క్యారెట్ల గోల్డ్ రేట్ ₹1,46,620 గా ఉండగా, 22 క్యారెట్ల రేట్ ₹1,34,400 గా ఉంది. బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి కాబట్టి, షాపింగ్‌కి వెళ్లే ముందు లేటెస్ట్ రేట్స్ ఒకసారి చెక్ చేసుకోండి.