లవర్ కోసం జైలు గోడ దూకిన ఖైదీ!

మహబూబ్‌నగర్ జిల్లా జైలు నుంచి ఒక రిమాండ్ ఖైదీ పరారయ్యాడు. POCSO కేసులో అరెస్టై జైలు క్యాంటీన్ లో పని చేస్తున్న కిషోర్ కుమార్ (22), సోమవారం తెల్లవారుజామున బాత్రూమ్ కు వెళ్తున్నానని చెప్పి, టవల్ సాయంతో గోడ ఎక్కి పారిపోయాడు. అమరచింత మండలం నందిమల్ల గ్రామానికి చెందిన ఇతను 25 రోజుల క్రితం పట్టుబడ్డాడు. ఖైదీ తప్పించుకున్న విషయం తెలుసుకున్న DIG చౌహాన్, SP శశికాంత్తో మాట్లాడారు. One Town Police ఖైదీ కోసం గాలిస్తున్నారు.



