భార్యకు వీడియో కాల్ చేస్తూ వ్యక్తి ఆత్మహత్య!

వరంగల్ జిల్లా కాజీపేటలో షాకింగ్ ఘటన జరిగింది. రాజేష్ నాయక్ (45) అనే డాక్యుమెంట్ రైటర్, ఆస్తి గొడవల వల్ల భార్య, తల్లిదండ్రులతో గొడవపడి రాత్రి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రైలు పట్టాలపై నిలబడి, ఎదురుగా వస్తున్న రైలును భార్యకు వీడియో కాల్‌లో చూపిస్తూ సూసైడ్ చేసుకున్నాడు. తాను చనిపోతున్నానని చెప్తే అతను బెదిరిస్తున్నాడని ఆమె లైట్ తీసుకుంది. సోమవారం ఉదయం పట్టాలపై శవమై తేలడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతుడికి ఒక కుమారుడు ఉన్నాడు.



