స్కూల్ స్టూడెంట్స్ వైరల్ వీడియో!
పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని తమ్మవరం గ్రామ స్కూల్ విద్యార్థులు రోడ్డుపై నిలబడి CM నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ CM పవన్ కళ్యాణ్‌లకు ఒక ఎమోషనల్ అప్పీల్ చేశారు. “CM సార్.. ప్లీజ్ మా ఊరికి ఒక తారు రోడ్డు వేయించండి, మమ్మల్ని కాపాడండి” అంటూ పిల్లలంతా కలిసి వేడుకున్నారు. వర్షాలు వస్తే రోడ్డు అధ్వాన్నంగా మారి స్కూల్‌కి వెళ్లడానికి పడుతున్న ఇబ్బందులను వారు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ స్టూడెంట్స్ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.



