Latest

రైతు బంధు ఫండ్స్ రిలీజ్!▶
News· 30 Jun 2026

రైతు బంధు ఫండ్స్ రిలీజ్!

CM రేవంత్ రెడ్డి వానాకాలం సీజన్‌కు సంబంధించిన రైతు బంధు ఫండ్స్‌ను రిలీజ్ చేశారు. ఈ ఇన్వెస్ట్‌మెంట్ అసిస్టెన్స్‌ను ప్రభుత్వం దశల వారీగా అకౌంట్లలో డిపాజిట్ చేయనుంది. ఫస్ట్ ఫేజ్ కింద 2 ఎకరాల లోపు భూమి ఉన్న సుమారు 41.37 లక్షల మంది చిన్న, సన్నకారు రైతుల అకౌంట్లలోకి ఈ రోజే రూ.6,000 క్రెడిట్ అయ్యాయి. మిగిలిన రైతులకు కూడా త్వరలోనే మనీ ట్రాన్స్‌ఫర్ చేయనున్నారు.

బండి సంజయ్‌పై కేసు కొట్టివేసిన నాంపల్లి కోర్టు!
Politics· 30 Jun 2026

బండి సంజయ్‌పై కేసు కొట్టివేసిన నాంపల్లి కోర్టు!

బండి సంజయ్‌కు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో ఊరట లభించింది. హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో అప్పటి అధికార BRS పార్టీ ఓటుకు రూ.25 వేలు ఇస్తోందంటూ ఆయన చేసిన కామెంట్స్ అప్పట్లో పెద్ద సెన్సేషన్ అయ్యాయి. దీనిపై హుజూరాబాద్ పోలీసులు బండి సంజయ్‌పై పలు IPC సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. ఈ కేసును విచారించిన నాంపల్లి కోర్టు, తాజాగా ఆయనపై ఉన్న ఆ కేసును కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది.

థర్మల్ పవర్ యూనిట్‌ను మూసేసిన తెలంగాణ ప్రభుత్వం
TG· 30 Jun 2026

థర్మల్ పవర్ యూనిట్‌ను మూసేసిన తెలంగాణ ప్రభుత్వం

TG: రాష్ట్రంలో బొగ్గు కొరత నేపథ్యంలో జెన్‌కో సన్సెషనల్ డిసిషన్ తీసుకుంది. బొగ్గు కొరత కారణంగా రాష్ట్రంలో రెండు థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి యూనిట్లను మూసివేసింది. యాదాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (YTPS)లో ఒక యూనిట్‌, కాకతీయ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌(KTPS)లో మరో యూనిట్‌లో విద్యుత్‌ ఉత్పత్తిని నిలిపివేసింది. ఇలా రెండు యూనిట్లను మూసివేయడం రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి. సింగరేణి నుంచి జెన్‌కో యూనిట్లకు బొగ్గు సరఫరా తగ్గిపోవడమే ఇందుకు కారణం. అయితే బొగ్గు సరఫరాకు సంబంధించి చెల్లింపులు సకాలంలో చేయకపోవడంతోనే సింగరేణి సంస్థ సరఫరాను తగ్గించింది.

తుంగభద్ర నదిలో ఊహించని విషాదం!▶
Viral· 30 Jun 2026

తుంగభద్ర నదిలో ఊహించని విషాదం!

కర్నూల్ కలెక్టరేట్ దగ్గర జరిగిన పౌర్ణమి వేడుకల్లో ఒక శాడ్ ఇన్సిడెంట్ జరిగింది. సురేష్ అనే రైతు తన ఎద్దులను తుంగభద్ర నదిలో స్నానం చేయిస్తుండగా, ఊహించని విధంగా ఆ రెండు ఎద్దులు నీటిలో మునిగిపోయాయి. కళ్లముందే ప్రాణం లాంటి ఎద్దులు చనిపోవడంతో ఆ రైతు ఫ్యామిలీ కన్నీరుమున్నీరైంది. వారి ఏడుపు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరినీ కదిలించింది. దీనికి సంబంధించిన హార్ట్ బ్రేకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

జైపూర్‌లో భారీ ఎగ్జామ్ స్కామ్.. నలుగురు అరెస్ట్!▶
Education· 30 Jun 2026

జైపూర్‌లో భారీ ఎగ్జామ్ స్కామ్.. నలుగురు అరెస్ట్!

రాజస్థాన్ జైపూర్‌లో మరో ఎగ్జామ్ స్కామ్ బయటపడింది. పారామెడికల్ డిప్లొమా పరీక్షలో కాపీయింగ్ కొట్టించడానికి ఒక ముఠా పక్కా ప్లాన్ వేసింది. ఇన్విజిలేటర్ల హెల్ప్‌తో స్టూడెంట్స్‌ని పాస్ చేయించేందుకు కాలేజీ అడ్మినిస్ట్రేటర్ గ్యాంగ్ ట్రై చేసింది. దీనికోసం స్టూడెంట్స్ నుండి లక్షల్లో డబ్బులు కూడా వసూలు చేశారు. అయితే ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికి ముందే పోలీసులు ఎంట్రీ ఇచ్చి నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. దీంతో ఈ భారీ మాస్ కాపీయింగ్ కుట్ర ఫెయిల్ అయింది.

హాస్పిటల్‌లో ఘోరం.. వైరల్ వీడియో!▶
Viral· 30 Jun 2026

హాస్పిటల్‌లో ఘోరం.. వైరల్ వీడియో!

రాయ్‌బరేలీలోని ఒక హాస్పిటల్‌లో షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. ఓ మెంటల్లీ డిస్టర్బ్డ్ పర్సన్ ఫ్లోర్‌పై పడుకుని ఉంటే, అక్కడి ఫీమేల్ వార్డ్ ఇన్‌చార్జ్ తన కాళ్లతో అతని ముఖం, ఛాతీపై దారుణంగా తన్నింది. పైగా బూతులు తిడుతూ అవమానించింది. పక్కనే సెక్యూరిటీ గార్డ్ ఉన్నా ఆపకుండా సైలెంట్‌గా చూస్తూ ఉండిపోయాడు. ఈ దారుణమైన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. "ఆ ఇన్‌ఛార్జ్‌ని వెంటనే సస్పెండ్ చేయాలి" అంటూ నెటిజన్లు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు.

పొలిటికల్ ఎంట్రీ రూమర్స్‌కి ఎండ్ కార్డ్: రాఘవ లారెన్స్
Politics· 30 Jun 2026

పొలిటికల్ ఎంట్రీ రూమర్స్‌కి ఎండ్ కార్డ్: రాఘవ లారెన్స్

రాఘవ లారెన్స్ తన పొలిటికల్ ఎంట్రీ రూమర్స్‌కి ఫుల్‌స్టాప్ పెట్టారు. తిరుచ్చి ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం బై-ఎలక్షన్ రేస్‌లో తాను లేనని క్లియర్ చేశారు. ప్రస్తుతానికి ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదని మీడియాకు వివరించారు. ప్రజెంట్ తన ఫోకస్ మొత్తం సోషల్ సర్వీస్, బ్యాక్ టు బ్యాక్ సినిమా ప్రాజెక్ట్స్‌పైనే ఉందని లారెన్స్ స్పష్టం చేశారు. దీంతో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న పొలిటికల్ సస్పెన్స్‌కి ఎండ్ కార్డ్ పడింది!

బంగారం దొరికిన పొలంపై కొత్త ట్విస్ట్
TG· 30 Jun 2026

బంగారం దొరికిన పొలంపై కొత్త ట్విస్ట్

TG: వరంగల్ జిల్లా కోపాకులపాడులోని వ్యవసాయ భూమిలో బంగారు నగలు దొరకడం హాట్ టాఫిక్‌గా మారింది. ఈ భూమిని పదేళ్ల క్రితం చెన్నారావుపేటకు చెందిన ఓ వ్యక్తి, కోపాకులపాడుకి చెందిన రైతు నుంచి కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఈ భూమిని ఈర్యతండాకు చెందిన ఒక రైతు కౌలుకు తీసుకుని పత్తిసాగు చేస్తున్నాడు. గతంలో ఇక్కడ గుప్తనిధులు లభ్యమైనట్లు స్థానికులు చెపుతున్నారు. గతంలో ఈ భూమిని విక్రయించిన పాత యజమాని కుమారుడు PSలో ఫిర్యాదు చేశారు. తమ తాతలకాలం నాటి భూమిలో దొరికిన బంగారాన్ని తమకు అప్పగించాలని కోరారు. ప్రస్తుత యజమాని కూడా ఫిర్యాదు చేయడం గమనార్హం.

అత్తమామల స్కెచ్‌కి ప్రేమ జంట బలి!
Crime· 30 Jun 2026

అత్తమామల స్కెచ్‌కి ప్రేమ జంట బలి!

రంగారెడ్డి జిల్లా జనవాడలో ఘోరం జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న బాలసాయి, పద్మ దంపతులు అత్తమామల మోసానికి బలయ్యారు. ఇంట్లో గుప్తనిధులు ఉన్నాయంటూ నమ్మించిన అత్తమామలు, పూజల కోసం బాలసాయి చేత ₹10 లక్షలు అప్పు చేయించారు. తీరా తవ్వితే ఏమీ దొరకలేదు. అప్పు ఇచ్చిన వారి ప్రెషర్ తట్టుకోలేక, మోసపోయామని గ్రహించిన ఈ జంట ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నారు. ఐదు నెలల చిన్నారి అనాథగా మిగిలింది. బాలసాయి ఫోన్ మెసేజ్ ఆధారంగా పోలీసులు అత్తమామలను, బావను అరెస్ట్ చేశారు.

వాట్సాప్‌లో క్రేజీ అప్‌డేట్.. ఇక ఫోన్ నంబర్ దాచేయొచ్చు!
Technology· 30 Jun 2026

వాట్సాప్‌లో క్రేజీ అప్‌డేట్.. ఇక ఫోన్ నంబర్ దాచేయొచ్చు!

ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే మెసేజింగ్ యాప్ 'వాట్సాప్' యూజర్ల ప్రైవసీ కోసం సూపర్ ఫీచర్ తెచ్చింది. ఇకపై కొత్తవారితో చాట్ చేయడానికి మీ ఫోన్ నంబర్ అక్కర్లేదు, జస్ట్ 'యూజర్‌నేమ్' ఉంటే చాలు. ప్రొఫైల్ సెట్టింగ్స్‌లో 3-35 అక్షరాల లోపు యూనిక్ యూజర్‌నేమ్ సెట్ చేసుకోవచ్చు. సెక్యూరిటీ కోసం 'యూజర్‌నేమ్ కీ' కూడా ఉంటుంది. ప్రస్తుతానికి కొందరికే వచ్చిన ఈ ఫీచర్, త్వరలోనే అందరికీ రానుంది. మీ యాప్ అప్‌డేట్ చేసి చెక్ చేసుకోండి.

ఈరోజే రైతుల అకౌంట్లలోకి డబ్బులు!
News· 30 Jun 2026

ఈరోజే రైతుల అకౌంట్లలోకి డబ్బులు!

తెలంగాణ రైతులకు నేటి నుంచే 'రైతు భరోసా' నిధులు విడుదల కానున్నాయి. ఈరోజు సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. మొదటి విడతలో భాగంగా 2 ఎకరాల లోపు భూమి ఉన్న 41.37 లక్షల మంది రైతులకు రూ. 2,482 కోట్ల నిధులను నేరుగా బ్యాంక్ అకౌంట్లలో జమ చేయనున్నారు. మిగిలిన రైతులకు విడతల వారీగా ఈ అమౌంట్ అందుతుంది.

విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలొద్దు
Education· 30 Jun 2026

విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలొద్దు

TG: ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కీమ్‌ను నిర్వీర్యం చేయొద్దని BC సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం అన్నారు. మంగళవారం జాతీయ BC సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్త కళాశాలల బహిష్కరణ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లోని కొత్తపేట చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని, పెండింగ్‌లో ఉన్న రూ.8,000 కోట్ల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలి. విద్యార్థులపై అదనపు ఆర్థిక భారం మోపే విధానాలను వెనక్కి తీసుకోవాలన్నారు.

సోనమ్ వాంగ్‌చుక్ హెల్త్ కండిషన్ సీరియస్!
Education· 30 Jun 2026

సోనమ్ వాంగ్‌చుక్ హెల్త్ కండిషన్ సీరియస్!

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సోనమ్ వాంగ్‌చుక్ చేస్తున్న నిరాహార దీక్ష 3వ రోజుకు చేరుకుంది. అయితే, ఈ పోరాటం లో ఒక ఆందోళనకరమైన విషయం వెలుగుచూసింది. దీక్ష కారణంగా ఆయన షుగర్ లెవెల్స్ సాధారణం కంటే తక్కువగా (66 కి) పడిపోయాయి. ఆరోగ్యం క్షీణిస్తున్నప్పటికీ ఆయన తన పోరాటాన్ని కంటిన్యూ చేస్తున్నారు.

రాఘవ లారెన్స్ ఏం చెప్పబోతున్నారు?
News· 30 Jun 2026

రాఘవ లారెన్స్ ఏం చెప్పబోతున్నారు?

కొరియోగ్రాఫర్, హీరో అండ్ డైరెక్టర్ రాఘవ లారెన్స్ తన సోషల్ మీడియాలో ఒక సంచలన ట్వీట్ చేశారు. ఈరోజు మధ్యాహ్నం 12:00 గంటలకు రెండు ఇంపార్టెంట్ విషయాల గురించి మాట్లాడబోతున్నట్లు అనౌన్స్ చేశారు. రీసెంట్‌గా జరిగిన ప్రెస్ మీట్ వివాదంతో పాటు, తిరుచ్చి ఎలక్షన్ల గురించిన రూమర్స్‌పై ఆయన క్లారిటీ ఇవ్వనున్నారు. దీంతో లారెన్స్ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారా లేదా అనే దానిపై అందరిలోనూ విపరీతమైన క్యూరియాసిటీ నెలకొంది.

మద్యంమత్తులో డ్రైవర్ బీభత్సం.. కొడుకు ముందే తల్లి స్పాట్‌డెడ్
Crime· 30 Jun 2026

మద్యంమత్తులో డ్రైవర్ బీభత్సం.. కొడుకు ముందే తల్లి స్పాట్‌డెడ్

TG: మేడ్చల్ జిల్లా దుండిగల్ PS పరిధిలోని బహుదూర్‌పల్లి మెయిన్ రోడ్‌పై మద్యంమత్తులో బొలెరో డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. బైక్‌పై వెళ్తున్న తల్లీకొడుకును బొలెరో వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల్లి లతారెడ్డి(49) స్పాట్‌లోనే మృతిచెందగా.. కొడుకు వేదాంత్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వేదాంత్‌ను చికిత్స నిమిత్తం స్థానిక హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అలాగే లతారెడ్డి డెడ్‌బాడీని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

భారీగా పడిపోయిన బంగారం ధరలు!
Business· 30 Jun 2026

భారీగా పడిపోయిన బంగారం ధరలు!

బంగారం కొనాలనుకునే వారికి గుడ్‌న్యూస్! మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. మంగళవారం ఉదయం 10 గంటల సమయానికి హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.1,40,130 కి చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,450 గా ఉంది. అయితే, గోల్డ్ రేట్స్ ఎప్పటికప్పుడు మారుతుంటాయి కాబట్టి, మీరు షాపింగ్‌కి వెళ్లే ముందు ఒకసారి కరెంట్ లైవ్ ప్రైస్ చెక్ చేసుకోవడం బెస్ట్.

ఆయన ప్రాణాలు రక్షించే బాధ్యత ప్రభుత్వానిదే: మంద కృష్ణ
Politics· 30 Jun 2026

ఆయన ప్రాణాలు రక్షించే బాధ్యత ప్రభుత్వానిదే: మంద కృష్ణ

TG: BRS పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ IPS అధికారి RS ప్రవీణ్‌కుమార్‌ ప్రాణాలను రక్షించే బాధ్యత ప్రభుత్వానిదేనని MRPS జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌కు భద్రత కుదించడంపై CM రేవంత్‌రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు. ఎలాంటి ముందస్తు సమాచారం, నోటీసులు ఇవ్వకుండా చట్ట విరుద్ధంగా సెక్యూరిటీని సర్కార్ తొలగించిందని లేఖలో వివరించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు ప్రతిపక్ష నేత, మాజీ పోలీస్ అధికారికి సెక్యూరిటీ ఎలా తొలగిస్తారని నిలదీశారు.

డెలివరీ బాయ్‌పై రాజు వెడ్స్ రాంబాయి హీరో దాడి▶
TG· 30 Jun 2026

డెలివరీ బాయ్‌పై రాజు వెడ్స్ రాంబాయి హీరో దాడి

TG: 'రాజు వెడ్స్ రాంబాయి' చిత్రంతో ఘనవిజయం సాధించిన యంగ్ హీరో అఖిల్ రాజ్ ఉద్దెమరి వివాదంలో చిక్కుకున్నారు. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన ఫుడ్ తప్పుగా తెచ్చాడనే నెపంతో అఖిల్ రాజ్, అతని కుటుంబసభ్యులు ఓ డెలివరీ బాయ్‌పై దాడి చేశారు. దాడికి యత్నించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాను క్షమాపణలు చెప్పినా వినకుండా హీరో కొట్టడానికి వచ్చాడని, అతని తల్లి తన ముఖంపై ఉమ్మివేసి అవమానించిందని సదరు డెలివరీ బాయ్ ఆవేదన వ్యక్తం చేశాడు. హీరో ప్రవర్తనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పొలంలో బంగారు నగలు.. రాత్రంతా తవ్వకాలు
TG· 30 Jun 2026

పొలంలో బంగారు నగలు.. రాత్రంతా తవ్వకాలు

TG: వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం కోపాకులపాడులోని ఆరెకరాల భూమిని కౌలుకు తీసుకోవడానికి జనం పోటీ పడుతున్నారు. మాకు ఇవ్వాలంటే మాకు ఇవ్వాలని యజమానిపై ఒత్తిడి తెస్తున్నారు. ఇంత డిమాండ్ ఎందుకంటే ఈ భూమిని కౌలుకు చేసిన రైతుకు బంగారు నగలు దొరికాయి. ఓ కౌలు రైతు ఆ భూమిలో పత్తి సాగు చేస్తున్నాడు. ఈ నెల 24న కలుపు తీయిస్తుండగా కూలీలకు బంగారు ఆభరణాలు దొరికినట్లు ప్రచారం జరిగింది. యజమాని కూలీలను పిలిచి అడిగితే, వాళ్లు బంగారం చూపించారు. దీనిపై యజమాని PSలో ఫిర్యాదు చేశారు. బంగారం ప్రచారంతో రాత్రి వేళల్లో చుట్టుపక్కల గ్రామాల వారు పొలాల్లో తవ్వకాలు చేపడుతున్నారు.

గవర్నమెంట్ స్కూళ్లలో  AI టెక్నాలజీ
Education· 30 Jun 2026

గవర్నమెంట్ స్కూళ్లలో AI టెక్నాలజీ

AP విద్యాశాఖ గవర్నమెంట్ స్కూళ్లలో విద్యార్థుల హాజరు నమోదు కోసం కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత సరికొత్త ఫేస్ రికగ్నిషన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఉపాధ్యాయుల సమయం ఆదా అవ్వడానికి, హాజరు పారదర్శకతకు, కచ్చితత్వానికి ఈ విధానం ఎంతో ఉపయోగపడుతుంది. మంగళగిరి, తాడేపల్లి, విజయవాడలో ప్రయోగాత్మకంగా మొదలైన ఈ విధానం త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అమలు కానుంది. విద్యార్థుల ముఖాలను ఫేస్ రికగ్నిషన్ ద్వారా గుర్తించి, గ్రూప్ ఫొటో తీయగానే ఆటోమేటిక్‌గా హాజరు నమోదవుతుంది. టైమ్ సేవ్ అవ్వడమే కాకుండా, హాజరు నమోదులో కచ్చితత్వం, పారదర్శకత పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు.

కాన్సాస్ వరదల్లో AP యువకుడు మృతి
AP· 30 Jun 2026

కాన్సాస్ వరదల్లో AP యువకుడు మృతి

AP: అమెరికాలోని కాన్సాస్ ప్రాంతంలో సంభవించిన వరదల్లో బాపట్ల జిల్లా పర్చూరు మండలం దేవరపల్లికి చెందిన దొప్పలపూడి వెంకటేశ్(32) గల్లంతయ్యాడు. అతడి డెడ్‌బాడీ తన కారుకు సమీపంలోనే బురదలో కూరుకుపోయి ఉన్నట్లు అమెరికా పోలీసులు గుర్తించి, కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మూడేళ్ల క్రితం ఉన్నత విద్య (MS) కోసం అమెరికా వెళ్లిన వెంకటేశ్, చదువు పూర్తిచేసుకుని అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. చేతికి అందివచ్చిన కుమారుడు ప్రాణాలు కోల్పోవడంతో వెంకటేశ్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.