డెలివరీ బాయ్‌పై రాజు వెడ్స్ రాంబాయి హీరో దాడి
TG: 'రాజు వెడ్స్ రాంబాయి' చిత్రంతో ఘనవిజయం సాధించిన యంగ్ హీరో అఖిల్ రాజ్ ఉద్దెమరి వివాదంలో చిక్కుకున్నారు. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన ఫుడ్ తప్పుగా తెచ్చాడనే నెపంతో అఖిల్ రాజ్, అతని కుటుంబసభ్యులు ఓ డెలివరీ బాయ్‌పై దాడి చేశారు. దాడికి యత్నించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాను క్షమాపణలు చెప్పినా వినకుండా హీరో కొట్టడానికి వచ్చాడని, అతని తల్లి తన ముఖంపై ఉమ్మివేసి అవమానించిందని సదరు డెలివరీ బాయ్ ఆవేదన వ్యక్తం చేశాడు. హీరో ప్రవర్తనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.



