← Back to news

పొలంలో బంగారు నగలు.. రాత్రంతా తవ్వకాలు

By DK· 30 Jun 2026· వరంగల్ జిల్లా
పొలంలో బంగారు నగలు.. రాత్రంతా తవ్వకాలు

TG: వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం కోపాకులపాడులోని ఆరెకరాల భూమిని కౌలుకు తీసుకోవడానికి జనం పోటీ పడుతున్నారు. మాకు ఇవ్వాలంటే మాకు ఇవ్వాలని యజమానిపై ఒత్తిడి తెస్తున్నారు. ఇంత డిమాండ్ ఎందుకంటే ఈ భూమిని కౌలుకు చేసిన రైతుకు బంగారు నగలు దొరికాయి. ఓ కౌలు రైతు ఆ భూమిలో పత్తి సాగు చేస్తున్నాడు. ఈ నెల 24న కలుపు తీయిస్తుండగా కూలీలకు బంగారు ఆభరణాలు దొరికినట్లు ప్రచారం జరిగింది. యజమాని కూలీలను పిలిచి అడిగితే, వాళ్లు బంగారం చూపించారు. దీనిపై యజమాని PSలో ఫిర్యాదు చేశారు. బంగారం ప్రచారంతో రాత్రి వేళల్లో చుట్టుపక్కల గ్రామాల వారు పొలాల్లో తవ్వకాలు చేపడుతున్నారు.

పొలంలో బంగారు నగలు.. రాత్రంతా తవ్వకాలు

More in TG