Latest

ఆఫీస్ లో ఉన్నప్పుడు ఇలా అస్సలు చేయకండి !
ఆఫీస్ లో గంటల తరబడి ఒకే భంగిమలో కూర్చుంటున్నారా? అయితే మీరు డేంజర్ లో పడినట్లే. ఒకే పోజ్ లో గనక మీరు కూర్చుంటే డిస్క్ సమస్యలతో పాటు, రక్త ప్రసరణ సమస్యలు, హార్మోనల్ ఇంబాలెన్స్ కూడా వస్తాయని వైద్యులు వార్న్ చేస్తున్నారు. కూర్చున్నప్పుడు రెండు పాదాలు నేలపై పూర్తిగా ఆనేలా ఉండాలి. అలాగే మన వెన్నెముక కుర్చీ బ్యాక్ కి ఆనుకుని నిటారుగా ఉండాలి.ప్రతీ అరగంటకు లేచి రెండు, మూడు నిమిషాలు (micro breaks) అటూ ఇటూ నడవాలి. కూర్చున్న చోటే కాళ్లను స్ట్రెచ్ చేయడం, మడమలు తిప్పడం లాంటివి చేయాలి. కాలు మీద కాలు వేసుకు కూర్చుంటే రక్త ప్రసరణ సమస్యలతో పాటు, బీపీ పెరుగుతుంది.

హీట్ వేవ్ తో మూతబడిన ఈఫిల్ టవర్ !
తీవ్రమైన వడగాల్పుల (హీట్‌వేవ్) కారణంగా ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక కేంద్రం 'ఈఫిల్ టవర్' జూన్ 23న నిర్ణీత సమయం కంటే ముందే మూసివేయబడింది. పారిస్‌లో ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడంతో పర్యాటకులు, అక్కడి సిబ్బంది ఆరోగ్యం మరియు రక్షణను దృష్టిలో ఉంచుకుని అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం పారిస్ నగరం ఈ తీవ్రమైన ఎండలను తట్టుకోవడానికి అనేక ఇబ్బందులు పడుతోంది.

నెగటివ్ థాట్స్ కి చెక్ చెప్పేందుకు ఇలా చేయండి !
నెగటివ్ థాట్స్ తో సతమతమవుతున్నారా? అయితే మీరు కొన్ని టిప్స్ ఫాలో అవ్వండి. ఆ వ్యతిరేక ఆలోచనలనుంచి మీరు బయట పడతారు. అవేంటంటే మీలో నెగటివ్ థాట్స్ ఎందుకు , ఎలా, ఎప్పుడు వస్తున్నాయో గుర్తించండి. మీ ఆలోచనలకు కాస్త దూరం జరిగి వాటిని అబ్జర్వ్ చేస్తూండండి. అలాగే ఈ పరిస్థితి నాకే ఎందుకు వచ్చింది? లేదా రావాలి అనే ఆలోచననుంచి దీనినుంచి నేనెలా బయటపడాలి అనే అంశంపై దృష్టి పెట్టండి. ఈ సమస్యనుంచి బయట పడటానికి ప్రతీరోజు ఒక నిర్ణీత టైమ్ పెట్టుకుని ఆ టైమ్ లో మాత్రమే దాని గురించి ఆలోచించండి.అలాగే మీకు ఎదురవుతున్న అనుభవాలను ప్రాసెస్ చేయాల్సి వచ్చినప్పుడు వాటిని పేపర్ పై పెట్టండి.

కరువు సీమలో బంగారు పంట
AP: కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో బంగారు గని ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. దేశంలోనే తొలి ప్రైవేట్ బంగారు గనిగా పేరొందిన జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్స్ బంగారం ఉత్పత్తిని CM చంద్రబాబు నాయుడు బుధవారం ప్రారంభించనున్నారు. ఈ ప్లాంట్ ద్వారా తొలి సంవత్సరం 400కిలోలు, రెండో సంవత్సరం వేయి కేజీల బంగారం ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టును జియోమైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహించనుంది. ఇందుకోసం 405 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టింది. జొన్నగిరి మైన్ ద్వారా సుమారు 700 మందికి ఉపాధి దొరుకనుంది.

గుడ్లతో ఈ ఆహారాలు తింటే ఈ ప్రాబ్లమ్స్ తప్పవు!
గుడ్లు హెల్త్ కి ఎంతో మేలు చేసినప్పటికీ, కొన్ని రకాల ఫుడ్స్‌తో కలిపి తీసుకుంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ముఖ్యంగా గుడ్లతో పాటు సోయా పాలు లేదా నాన్వెజ్ అస్సలు తీసుకోకూడదు. వీటిలో ప్రొటీన్స్ ఎక్కువగా ఉండడం వల్ల డైజెషన్ సిస్టమ్‌పై భారం పడి అసిడిటీ, అలసట వస్తాయి. అలాగే బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్లు తింటూ టీ తాగడం వల్ల, టీలోని పదార్థాల కారణంగా గుడ్డులోని ప్రొటీన్స్‌ని బాడీ గ్రహించలేదు. దీనికి తోడు గుడ్లు తిన్న వెంటనే అరటిపండ్లు లేదా ఎక్కువ షుగర్ ఉన్న ఫుడ్స్ తింటే కడుపు ఉబ్బరం, గ్యాస్ లాంటి ఇబ్బందులు వస్తాయి. అందుకే గుడ్లను ఎప్పుడూ కూరగాయలు, ధాన్యాలు లేదా పండ్లతో కలిపి తీసుకోవడం మంచిది.

గోల్డ్ లవర్స్‌కి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ధరలు!
బంగారం ధరలు వరుసగా మూడో రోజు కూడా భారీగా తగ్గాయి. ఈరోజు (జూన్ 24) తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.2,000 తగ్గి, రూ.1,44,330కి చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,32,300గా ఉంది. ఇక సిల్వర్ అయితే ఏకంగా రూ.5,000 తగ్గి, కిలో వెండి ధర రూ.2,49,900 కి పడిపోయింది. షాపింగ్ ప్లాన్ చేసుకునే వాళ్లకి ఇది బెస్ట్ టైమ్. Note: ప్రైసెస్ ఎప్పుడైనా మారొచ్చు, కాబట్టి షాపింగ్‌కి వెళ్లే ముందు ఒకసారి లైవ్ రేట్ చెక్ చేసుకోండి.

మూడు పెళ్లిళ్ల ట్రాప్.. రైల్వే ఉద్యోగి సూసైడ్
AP: తూర్పుగోదావరి జిల్లా కడియం ప్రాంతానికి చెందిన రవి రైల్వే ఉద్యోగి. మహిళా సంఘం నాయకురాలిగా చలామణి అవుతున్న ఉషారాణి మ్యాట్రిమోని సైట్ ద్వారా రవికి పరిచయమైంది. మాయమాటలతో రవిని ట్రాప్ చేసి మూడేళ్లుగా అతనితో సహజీవనం సాగించింది. రవి రైల్వే రికార్డులో, అతని రూ.1కోటి ఇన్సూరెన్స్ పాలసీకి నామినిగా పెట్టాలని ఆమె ఒత్తిడి చేసింది. రవి రేణిగుంట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెకు మూడు పెళ్లిళ్లు అయినట్లు గుర్తించారు. మహిళా సంఘం, CPI నాయకులతో మాట్లాడి రాజీ చేసుకోవాలని పోలీసులు రవికి చెప్పినట్లు సమాచారం. తనకు న్యాయం జరగలేదని రవి సూసైడ్ చేసుకున్నాడు.

హీరో జయం రవి చుట్టూ మరో వివాదం.. వర్కర్లను కట్టేసి టార్చర్?
కోలీవుడ్ స్టార్ జయం రవి మరో పెద్ద కాంట్రవర్సీలో చిక్కుకున్నారు. ఇంట్లో దొంగతనం జరిగిందనే అనుమానంతో తన దగ్గర పనిచేసే ఇద్దరు మహిళలను, ఒక అబ్బాయిని రవి కట్టేసినట్లు ఎలిగేషన్స్ వచ్చాయి. ఇంట్లోనే వాళ్లను బంధించడంతో. ఒక మహిళా వర్కర్ భర్త పోలీసులకు కంప్లైంట్ చేశాడు. రంగంలోకి దిగిన నీలాంగరై పోలీసులు రవి ఇంటికి వెళ్లి వాళ్లను రెస్క్యూ చేశారు. దొంగతనం జరిగితే లీగల్‌గా కంప్లైంట్ ఇవ్వాలి కానీ, ఇలా కట్టేయడం కరెక్ట్ కాదని పోలీసులు యాక్టర్‌కి వార్నింగ్ ఇచ్చారు.

భారతీయురాలిగానే చనిపోవాలని ఉంది
AP: బాపట్ల జిల్లా చినగంజాం మండలం చింతగుంపలకు చెందిన కొండ్రుగుంట మహాలక్ష్మమ్మ, నాగభూషణం దంపతుల కుమారుడు బుచ్చయ్యచౌదరి అమెరికాలో డాక్టర్‌గా స్థిరపడ్డారు. మహాలక్ష్మమ్మకు 2000 సంవత్సరంలో అమెరికా పౌరసత్వం లభించింది. ఆమె తన సొంతూరులోనే భారత పౌరురాలిగా తుదిశ్వాస విడవాలని కోరిక ఉంది. అమెరికా పౌరసత్వం వదులుకున్న ఆమె, భారత పౌరసత్వం కోసం ఆన్‌లైన్ ద్వారా గవర్నమెంట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఆమె దరఖాస్తు బాపట్ల జిల్లా కలెక్టర్ దగ్గరకు చేరింది. అమెరికా నుంచి క్లియరెన్స్ రాగానే భారత పౌరురాలిగా హోదా దక్కుతుందని కలెక్టర్ తెలిపారు.

రామ్ చరణ్ పై PM మోదీ ప్రశంసలు.. ట్విట్టర్‌లో చిరంజీవి ప్రౌడ్ పోస్ట్!
రామ్ చరణ్, PM మోదీల ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఒక నేషనల్ ఈవెంట్‌లో మోదీ చరణ్‌ను “న్యూ ఏజ్ మెగాస్టార్” అని సంబోధించారు. దీనిపై మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్‌లో స్పందిస్తూ. “పుత్రోత్సాహం తండ్రికి కొడుకు పుట్టినప్పుడు కలగదు, జనాలు పొగిడినప్పుడే కలుగుతుంది” అనే సుమతీ శతక పద్యాన్ని గుర్తు చేసుకున్నారు. ఇంత పెద్ద ప్రతిష్ఠాత్మక వేదికపై చరణ్‌కు దక్కిన రెస్పెక్ట్, గౌరవం చూసి ఒక తండ్రిగా చాలా ప్రౌడ్‌గా ఉందంటూ చిరు ట్వీట్ చేశారు.

HYD ప్రయాణికులకు గుడ్‌న్యూస్
TG: కాలుష్య రహిత మహానగరమే లక్ష్యంగా TGSRTC మరో కీలక అడుగు వేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి మరో 37 అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్సులు నడపనున్నట్లు తెలిపింది. ఇప్పటికే కూకట్‌పల్లి డిపో పరిధిలో ప్రారంభించిన 23 ఎలక్ట్రిక్ బస్సులు ఐదు వేర్వేరు మార్గాల్లో విజయవంతంగా నడుస్తూ ప్రయాణికుల నుంచి విశేష ఆదరణ పొందుతుంది. అధికారులు ఈ ఎలక్ట్రిక్ బస్సుల నెట్‌వర్క్‌ను నగరం నలువైపులా విస్తరిస్తున్నారు. తాజాగా 37 బస్సులు తోడైతే నగరంలో కాలుష్య నివారణకు మరింత తోడ్పాటు లభిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

విజయశాంతి రేర్ రికార్డ్.. ఇండస్ట్రీలోకి వచ్చి 45 ఏళ్ళు!
తెలుగు సినిమా 'లేడీ అమితాబ్' విజయశాంతి హీరోయిన్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి నేటితో 45 ఏళ్లు పూర్తయింది. సూపర్ స్టార్ కృష్ణ ‘కిలాడి కృష్ణుడు’తో కెరీర్ స్టార్ట్ చేసిన ఆమె, రీసెంట్‌గా కృష్ణ కొడుకు మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ వరకు 200 పైగా సినిమాల్లో నటించారు. టి.కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘నేటి భారతం’, ‘ప్రతిఘటన’ చిత్రాలు ఆమెను విప్లవాత్మక నటిగా నిలబెట్టాయి. ‘కర్తవ్యం’ సినిమాకు నేషనల్ అవార్డ్ అందుకున్న విజయశాంతి, ‘ఒసేయ్ రాములమ్మ’తో రికార్డ్ క్రియేట్ చేశారు. గ్లామర్, యాక్షన్ చిత్రాలతో హీరోలతో సమానంగా మాస్ ఫాలోయింగ్, హైయెస్ట్ రెమ్యునరేషన్ అందుకున్న ఏకైక భారతీయ నటిగా ఆమె చరిత్ర సృష్టించారు.
CI నాగరాజుపై ‘సిట్’ షాకింగ్ రిపోర్ట్!
విజయవాడ గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ‘సిట్’ అధికారులు షాకింగ్ విషయాలు బయటపెట్టారు. సాయికృష్ణను పోలీస్ స్టేషన్ లాకప్‌లోనే కొట్టి చంపేశారని CI నాగరాజుపై ఇచ్చిన అఫీషియల్ రిపోర్టులో రాశారు. ఆ తర్వాత బాడీని, CCTV ఫుటేజ్‌ను కూడా మాయం చేసినట్లు కోర్టుకు చెప్పారు. అరెస్ట్ అయిన CI నాగరాజును పోలీసులు భారీ బందోబస్తుతో విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్‌కు మెడికల్ చెకప్ కోసం తీసుకెళ్లారు. ఈ టెస్టులు అయిపోయాక ఆయన్ను జడ్జి ముందు ప్రెజెంట్ చేసి, జైలుకు షిఫ్ట్ చేయనున్నారు.
స్టూడెంట్స్‌తో CM విజయ్ రేర్ గ్రూప్ ఫోటో!
తమిళనాడులో పదో తరగతి, ఇంటర్ లో టాప్ మార్కులు సాధించిన స్టూడెంట్స్‌ను సన్మానించేందుకు ఒక గ్రాండ్ ఈవెంట్ జరిగింది. ఈ ప్రోగ్రామ్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన CM విజయ్ స్టూడెంట్స్ ను అప్రిషియేట్ చేశారు. ఈ సందర్భంగా ఆడిటోరియంలో కూర్చున్న స్టూడెంట్స్ అందరి మధ్యలో కూర్చొని విజయ్ ఒక మెమరబుల్ గ్రూప్ ఫోటో దిగారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.

అస్థిరతకు అమెరికానే కారణం: ఇరాన్
ఇరాన్ మద్దతు ఉన్న గ్రూపుల వల్లే ప్రాంతీయ అస్థిరత ఏర్పడుతోందన్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో వ్యాఖ్యలను ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ ఖండించారు. అమెరికా సైనికవాదం, జోక్యం చేసుకునే విధానం, ఇజ్రాయెల్‌కు మద్దతు ఇవ్వడమే మధ్యప్రాచ్యంలో శాంతికి ప్రధాన అడ్డంకులని ఆయన అన్నారు.
ఇందిరా భవన్‌లో యాక్షన్ లోకి దిగిన మంత్రి పొన్నం ప్రభాకర్!
గాంధీ భవన్‌లోని ఇందిరా భవన్‌లో జరిగిన ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ప్రజల నుంచి స్వయంగా వినతిపత్రాలు తీసుకొని, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా భూ సమస్యలు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, ఉద్యోగాలకు సంబంధించిన కంప్లైంట్స్‌పై అధికారులతో వెంటనే ఫోన్‌లో మాట్లాడి, సాల్వ్ చేయాలని ఆర్డర్స్ ఇచ్చారు. ప్రజల ప్రాబ్లమ్స్‌కి ఇన్స్టంట్‌గా రెస్పాండ్ అవుతూ సొల్యూషన్స్ చూపించారు.

తుని చిన్నారి మిస్సింగ్ కేసుపై హైకోర్ట్ సీరియస్
AP: కాకినాడ జిల్లా తుని మండలం CH అగ్రహారానికి చెందిన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసుపై హైకోర్ట్ సీరియస్ అయింది. పాప ఆచూకీ కనుగొనేందుకు తీసుకున్న చర్యల వివరాలు, ప్రస్తుత దర్యాప్తు పరిస్థితిపై సమగ్ర స్థాయి నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. మిస్సైన పిల్లల విషయంలో సుప్రీంకోర్టు నిర్దేశించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను పాటించారా లేదా తెలపాలని కోరింది. చిన్నారి ఆచూకీ కనుగొనడంలో పోలీసులు విఫలమయ్యారని లాయర్ శ్రీకాంత్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్ట్ ఈ ఆదేశాలను జారీ చేసింది.
మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్‌ల క్యూట్ వైరల్ వీడియో!
మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్‌ల క్యూట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రీసెంట్ సూపర్ హిట్ 'పెద్ది' మూవీ సక్సెస్ మీట్‌లో చరణ్‌ను చూపిస్తూ.. "న్యూ ఏజ్ మెగాస్టార్ అయిన నా కొడుకును ముందుంచి, నేను వెనక ఉండడమే కరెక్ట్" అంటూ చిరు పుత్రోత్సాహాన్ని ఎంజాయ్ చేశారు. 'చరణ్-జీవి' అంటూ మురిసిపోయారు. తండ్రీకొడుకుల ఈ అద్భుతమైన క్యూట్ మూమెంట్‌ని చూసి మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

సాయికృష్ణ మిస్సింగ్ కేసు.. CI నాగరాజుపై సిట్ సీరియస్
AP: విజయవాడ సాయికృష్ణ మిస్సింగ్ కేసులో అరెస్టైన CI నాగరాజును సిట్ సుదీర్ఘంగా విచారిస్తోంది. అధికారులు సాయికృష్ణ అదృశ్యంపై ప్రశ్నల వర్షం కురిపించారు. CI నాగరాజు నోరు మెదపకపోవడం, సమాధానాలు దాటవేస్తుండటంతో ఈ కేసు మరింత మిస్టరీగా మారింది. సీఐ నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడం, సాయికృష్ణ ఆచూకీ దొరకకపోవడం, CC ఫుటేజ్ మాయమవ్వడం వంటి పరిణామాలు ఇది లాకప్‌డెత్ అన్న అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. నాగరాజును నేడు కోర్టులో ప్రవేశపెట్టనుండడంతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

రూ.158 కోట్ల భారీ రైస్‌మిల్ కుంభకోణం గుట్టురట్టు
TG: కరీంనగర్ కట్టరాంపూర్ భగత్‌నగర్‌కు చెందిన సౌభాగ్య లక్ష్మి రైస్ ఇండస్ట్రీస్ మేనేజర్ బండారి మారుతి, పార్ట్‌నర్ అంజయ్య వీరిద్దరూ పౌరసరపరాల జిల్లా మేనేజర్ ముప్పిడి శ్రీకాంత్‌తో CMR ధాన్యం ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ప్రభుత్వానికి 2023 సంవత్సరంలో ఇవ్వాల్సిన 3116.360 మెట్రిక్ టన్నులు, 2024లో 2119.125 మెట్రిక్ టన్నుల బియ్యం ప్రభుత్వానికి అందించాల్సి ఉంది. తప్పించుకు తిరుగుతున్న ఇద్దరిని సుల్తానాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమ విక్రయాలకు పాల్పడి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం రూ.158కోట్ల ప్రభుత్వ సొమ్మును పక్కదారి పట్టించినట్లు పోలీసులు నిర్ధారించారు.

పెద్దపులి సంచారం.. భయం భయం
AP: ఏలూరు జిల్లాలో సంచరిస్తున్న పెద్దపులి బుట్టాయగూడెం మండలంలోకి రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నిమ్మలగూడెం శివారు పాలకుంట చెరువు వద్ద పులి దాడిలో 2ఆవులు మృతి చెందాయి. అటవీ ప్రాంతాల్లో ఎవరూ ఒంటరిగా తిరగవద్దని అటవీ అధికారుల సూచించారు. పులికి అమర్చిన రేడియో కాలర్‌తో కదలికలను సిబ్బంది పరిశీలిస్తున్నారు. పులిని పట్టుకునేందుకు మత్తుమందు, బోన్లు సిద్ధం చేశారు. సమీప అటవీ ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.