← Back to news

రూ.158 కోట్ల భారీ రైస్‌మిల్ కుంభకోణం గుట్టురట్టు

By డీకే· 24 Jun 2026· Hmtvlive· కరీంనగర్ జిల్లా
రూ.158 కోట్ల భారీ రైస్‌మిల్ కుంభకోణం గుట్టురట్టు

TG: కరీంనగర్ కట్టరాంపూర్ భగత్‌నగర్‌కు చెందిన సౌభాగ్య లక్ష్మి రైస్ ఇండస్ట్రీస్ మేనేజర్ బండారి మారుతి, పార్ట్‌నర్ అంజయ్య వీరిద్దరూ పౌరసరపరాల జిల్లా మేనేజర్ ముప్పిడి శ్రీకాంత్‌తో CMR ధాన్యం ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ప్రభుత్వానికి 2023 సంవత్సరంలో ఇవ్వాల్సిన 3116.360 మెట్రిక్ టన్నులు, 2024లో 2119.125 మెట్రిక్ టన్నుల బియ్యం ప్రభుత్వానికి అందించాల్సి ఉంది. తప్పించుకు తిరుగుతున్న ఇద్దరిని సుల్తానాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమ విక్రయాలకు పాల్పడి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం రూ.158కోట్ల ప్రభుత్వ సొమ్మును పక్కదారి పట్టించినట్లు పోలీసులు నిర్ధారించారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 21h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.