Latest

సూసైడ్‌కు సిద్దమైన మహిళ.. కాపాడిన పోలీసులు
TG: కుటుంబ కలహాలతో తీవ్ర మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకోవాలనుకున్న ఓ మహిళను ఉప్పల్ పోలీసులు కాపాడారు. నాగోల్‌లోని మమతానగర్‌కు చెందిన బోడుగ స్వాతి(56) ఉప్పల్ భగాయత్ ప్రాంతంలో ఒంటరిగా కన్పించగా, డ్యూటీలో ఉన్న ఉప్పల్ బ్లూకోల్ట్స్ కానిస్టేబుళ్లు మోహన్ చౌహన్, శివకృష్ణ ఆమెను గమనించారు. ఆమెను ఆపి మాట్లాడగా, ఇంట్లో జరిగిన గొడవల కారణంగా ఆత్మహత్య చేసుకోవడానికి మూసీనది వైపు వెళ్తున్నట్లు తెలిపింది. వెంటనే ఆమెకు కౌన్సెలింగ్ నిర్వహించి జీవితంపై నమ్మకం కల్పిస్తూ కుటుంబసభ్యులతో మాట్లాడేలా చేశారు. పోలీసుల అప్రమత్తతతో ఒక కుటుంబంలో విషాదం తప్పింది.

మరికొద్ది గంటల్లో నీట్.. విద్యార్థిని సూసైడ్
TG: ఆంధ్రప్రదేశ్‌లోని YSR కడప జిల్లాకు చెందిన జాఫర్ హుస్సేన్ కుటుంబం HYDలోని మియాపూర్‌లో నివాసముంటోంది. జాఫర్ కుమార్తె షేక్ సనా(19) NEET రీఎగ్జామ్‌కు ప్రిపేర్ అవుతుంది. లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకున్న సనా.. పరీక్ష ఒత్తిడిని తట్టుకోలేకపోయింది. రీఎగ్జామినేషన్ ఒత్తిడిని తట్టుకోలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది. సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత ఏడాది నీట్ పరీక్ష రాసినా ర్యాంక్ రాలేదు. దీంతో సనా మళ్లీ ప్రిపేర్ అవుతుంది. ఇవాళ జరిగే నీట్ పరీక్ష ఆమె రాయాల్సి ఉంది.

క్రిమినల్స్‌ను రాజ్యాంగ పదవుల్లోకి రానివ్వను: పవన్
క్రిమినల్స్‌ను రాజ్యాంగ పదవుల్లోకి రానివ్వనని AP డిప్యూటి CM పవన్ కల్యాణ్ తెలిపారు. కాకినాడలో నిర్వహించిన 'మన ఊరు- మాటామంతి' కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నేరగాళ్లు పదవుల్లోకి వచ్చి మన జీవితాలను శాసిస్తామని బెదిరిస్తుంటే సహించేది లేదన్నారు. వారిపై తిరగబడడానికి నేనెప్పుడూ సిద్ధమేనని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. నేరస్థులకు కులాలు ఆపాదిస్తున్నారని ఫైరయ్యారు. క్రిమినల్స్ ను వెనకేసుకొచ్చే రాజకీయ నాయకులను ఆమడదూరంలో పెట్టాలన్నారు. లేకుంటే మీ భవిష్యత్తు పాడవుతుందని నేతలకు దిశానిర్దేశం చేశారు.

బైక్‌పై యువకులు స్టంట్స్.. పట్టేసిన డ్రోన్
TG: హైదరాబాద్ నగరంలో యువకులు బైక్ రేసింగ్‌కు పాల్పడుతూ ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఉప్పల్ భగాయత్‌లో బైక్ రేసింగ్‌కు పాల్పడ్డ యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిఘా పెట్టినప్పటికీ తప్పించుకోవడంతో ఉప్పల్ పోలీసులు సరికొత్తగా డ్రోన్ ప్యాట్రోలింగ్ చేపట్టారు. బైక్‌పై స్టంట్స్ చేస్తున్న యువకులను డ్రోన్‌తో గుర్తించారు. గమనించిన యువకులు బైక్‌ను అక్కడే వదిలేసి పరుగులు తీశారు. బైక్ నంబర్ ఆధారంగా వారిని గుర్తించి వారిపై కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ రామలింగారెడ్డి తెలిపారు.

స్ట్రెచ్ చేయండి, శ్వాస తీసుకోండి.. వెల్‌నెస్ జర్నీని స్టార్ట్ చేయండి!
ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగా, స్ట్రెచింగ్స్ ఒక సంజీవనిలా పనిచేస్తాయి. రోజూ ఉదయాన్నే ఒంటిని కాస్త స్ట్రెచ్ చేస్తూ, ప్రశాంతంగా దీర్ఘ శ్వాస (ప్రాణాయామం) తీసుకోవడం వల్ల మానసిక ఒత్తిడి మాయమవడమే కాకుండా శరీరానికి సరికొత్త ఎనర్జీ వస్తుంది. బాడీ ఫ్లెక్సిబిలిటీ పెరిగి, మైండ్ రిలాక్స్ అవుతుంది. ఈ సింపుల్ అలవాట్లతోనే మీ శారీరక, మానసిక ఆరోగ్య ప్రయాణానికి (వెల్‌నెస్ రోడ్) గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయండి.

అన్నదాతలను ఆదుకుంటా: చంద్రబాబు
AP: రైతు కష్టంలో తోడుంటానని, ప్రతి ఒక్కరినీ ఆదుకుంటానని CM చంద్రబాబు పేర్కొన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో 'పీఎం కిసాన్- అన్నదాత సుఖీభవ' సాయం కింద 2026 ఖరీఫ్ సీజన్‌కు 46.86 లక్షల మంది రైతుల ఖాతాలకు ఒక్కొక్కరికి రూ.7 వేల చొప్పున రూ.3,125 కోట్ల ఆర్థికసాయం విడుదల చేశారు. రైతులు తల్లిలాంటి భూమిని.. రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు విరివిగా వాడకుండా కాపాడుకోవాలని సూచించారు. ప్రకృతి సేద్యంతో సాగును మరింత పరిపుష్టం చేయాలన్నారు.

ఈ వర్షాలకి మీ బెస్ట్ పార్ట్ నర్స్ ఇవే....లాగించండి
బయట చల్లటి జల్లులు పడుతుంటే, ఇంట్లో వేడివేడిగా ఏదైనా తింటే వచ్చే మజానే వేరు. ఈ వీకెండ్ వర్షాల కోసం పర్ఫెక్ట్ 'కమ్‌ఫర్ట్ ఫుడ్' కాంబినేషన్స్ కొన్ని - చమసాలా చాయ్ & వేడి పకోడీలు: ఉల్లిపాయ లేదా మిర్చి బజ్జీలతో పాటు అల్లం టీ ఉంటే వర్షానికి బెస్ట్ పార్ట్‌నర్. కమ్మని పప్పు చారు & అన్నం: వేడి అన్నంలో కాస్త నెయ్యి, పప్పు చారు లేదా సాంబార్ కలుపుకుని, నంచుకోవడానికి ఆలు ఫ్రై లేదా అప్పడం ఉంటే స్వర్గమే. వేడి సూప్ లేదా నూడుల్స్: స్పైసీగా ఉండే హాట్ అండ్ సోర్ సూప్ లేదా మసాలా నూడుల్స్ ఈ చలికి సూపర్ కిక్ ఇస్తాయి. కాస్త టైమ్ దొరికితే గరం గరం కిచిడీ లేదా వేడి ఉప్మా ట్రై చేయండి.. వీకెండ్ వైబ్స్ అదిరిపోతాయి

బొగ్గు నిల్వలపై సింగరేణి మౌనం.. దేనికి సంకేతం
TG: సింగరేణి కాలరీస్ బొగ్గు నిల్వల వ్యవహారం రాష్ట్రంలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సింగరేణి యాజమాన్యం చెపుతున్న లెక్కల్లోనే అవకతవకలు జరిగినట్లు స్పష్టమవుతుంది. 40లక్షల టన్నుల వ్యత్యాసంపై సూటిగా స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి ప్రకటించిన అధికారిక గణాంకాలే ఆరోపణలకు పునాదిగా మారాయి. 69.01 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి కాగా 65.27 మిలియన్ టన్నుల బొగ్గు రవాణా, అమ్మకం జరిగినట్లు సింగరేణి ప్రకటించింది. మిగిలిన 3.74 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి కాకుండానే సింగరేణి ప్రకటించిందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

ఆర్థిక ఆరోగ్య సూచీలో తెలంగాణ అగ్రస్థానం
ఆర్థిక ఆరోగ్య సూచీలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. AP ఆర్థిక స్థిరత్వం అంత బలంగా లేదని, తెలంగాణలో పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉందని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ (NIPFP) ప్రపంచ బ్యాంక్ నివేదిక తెలిపింది. బడ్జెట్‌తో నిమిత్తం లేకుండా తెలంగాణలో అత్యధిక అప్పులు చేసినా గత మూడేళ్లుగా ఈ అప్పులు తగ్గిపోతున్నాయని స్పష్టం చేసింది. ఇది మంచి పరిణామమని పేర్కొంది. తెలంగాణకు రుణాలు, హామీలు, ఇతర భారాలు ఆందోళనకరంగా ఉన్నా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే దానికి బలమైన ఆర్థిక సామర్థ్యం ఉందని నివేదికలో పేర్కొంది.

అల్జీమర్స్ కి ఫస్ట్ స్టేజ్‌లో డ్రగ్ వాడితేనే రిజల్ట్ అంటున్న నిపుణులు
మతిమరుపు వ్యాధి (అల్జీమర్స్) చికిత్సలో కొత్త ఔషధాలు అద్భుతాలు సృష్టిస్తున్నా.. అవి వ్యాధి ప్రారంభ దశలో ఉన్న రోగులపైనే అత్యంత సమర్థవంతంగా పనిచేస్తున్నాయని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మెదడులో కణాలు పూర్తిగా దెబ్బతినక ముందే, అంటే ‘ఎర్లీ స్టేజ్’లోనే ఈ డ్రగ్స్ ఇస్తే వ్యాధి తీవ్రతను విజయవంతంగా అడ్డుకోవచ్చని రీసెర్చ్‌లలో తేలింది. ముదిరిన తర్వాత వాడితే పెద్దగా ఫలితం ఉండదని, అందుకే ఫస్ట్ స్టేజ్‌లోనే గుర్తించడం కీలకమని హెచ్చరిస్తున్నారు.

ఏఐ సాయంతో ఐటీ రిటర్నులు డేంజర్ అంటున్న నిపుణులు
ఐటి రిటర్నులు దాఖలు చేయడానికి ఏఐ హెల్ప్ తీసుకుంటున్నారా? అయితే మీరు కాస్త డేంజర్లో ఉన్నట్లే. ఎందుకంటే ఏఐ తో మేలుకన్నా చిక్కులే ఎక్కువ. ఏఐ వల్ల పన్ను డేటా భద్రతకు తీవ్ర ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. పైగా మల్టిపుల్ ఆదాయ వనరులు, అంతర్జాతీయ పన్నులు, సంక్లిష్టమైన నిబంధనలను అర్థం చేసుకోవడంలో ఏఐ తడబడుతుంది. దీనివల్ల తప్పుడు సమాచారంతో కూడిన ఐటీఆర్ దాఖలై, చిక్కుల్లో పడే అవకాశం ఉంది. వచ్చే జూలైలో ఐటీ రిటర్నులు (ITR) దాఖలు చేయడానికి చాట్‌జీపీటీ, క్లాడ్ వంటి ఏఐ టూల్స్ వాడేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వర్షాకాలంలో రెయిన్ బో లాగా మెరిసిపొండి !
మబ్బుల వల్ల వర్షాకాలంలో వాతావరణ మంతా కాస్త డల్‌గా ఉంటుంది. అందుకే ఈ సీజన్‌లో మిమ్మల్ని బ్రైట్‌గా చూపించే కలర్ థెరపీ ఇక్కడుంది. నలుపు, తెలుపు రంగులను పక్కనపెట్టి.. వైబ్రెంట్ ఎల్లో, నియాన్ గ్రీన్, స్కై బ్లూ, పింక్ వంటి షేడ్స్ ట్రై చేయండి. దీనికి తోడు వాటర్‌ప్రూఫ్ ఫ్యాబ్రిక్స్ ఎంచుకో వడం, అలాగే మట్టి మరకలు పడకుండా డార్క్ బాటమ్స్ (ఫ్యాంట్లు) మ్యాచ్ చేయడం వల్ల మీ లుక్ మరింత పవర్‌ఫుల్‌గా, ట్రెండీగా మారుతుంది!

హర్ముజ్ జలసంధిని మళ్లీ మూసేసిన ఇరాన్ !
హర్ముజ్ జలసంధిని ఇరాన్ మళ్లీ మూసేసింది. లెబనాన్ పై ఇజ్రాయెల్ కంటిన్యుయస్ గా దాడులు చేయడాన్ని ఇరాన్ తప్పుబట్టింది. అమెరికా,ఇజ్రాయోల్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి నందున జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఇది తమ రియాక్షన్ లో మొదటి అడుగు మాత్రమేనని, ఇలాగే కొనసాగితే ఇంకా తీవ్రంగా స్పందిస్తామని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. ఏ నౌకలు జలసంధి దగ్గరకు రావొద్దని వస్తే ముప్పు తప్పదని ఇరాన్ సూచించింది.

నీట్ రీ-టెస్ట్ ఎఫెక్ట్: 37 రోజుల్లో 12 మంది విద్యార్థుల ఆత్మహత్య!
పేపర్ లీక్ వివాదంతో మే 3న జరిగిన నీట్-యుజి (NEET-UG) పరీక్ష రద్దు కావడం, రేపు మళ్లీ రీ-టెస్ట్ నిర్వహించాల్సి రావడంతో విద్యార్థుల్లో తీవ్ర మానసిక ఆందోళన వ్యక్తమవుతోంది. పరీక్ష రద్దయిన ఈ 37 రోజుల్లోనే దేశవ్యాప్తంగా కనీసం 12 మంది మెడికల్ అభ్యర్థులు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది. పరీక్షలు రాసి సీటు వస్తుందనుకున్న తరుణంలో, మళ్లీ రాయాలనే భయం, నిరాశే ఈ ఘోరాలకు కారణమని తెలుస్తోంది.
సముద్రాన్ని చీల్చేస్తానంటూ బయల్దేరిన పాస్టర్ !
నైజీరియాలో ఓ పాస్టర్ బైబిల్‌లోని మోసెస్‌లా సముద్రాన్ని చీల్చాలని ప్రయత్నించి వార్తల్లో నిలిచాడు. చేతిలో బైబిల్, కర్ర పట్టుకుని సముద్రంలోకి నడుచుకుంటూ వెళ్లగా, అద్భుతం జరుగుతుందని అనుచరులు ఆసక్తిగా గమనించారు. అయితే అకస్మాత్తుగా వచ్చిన భారీ అల ఆయనను ముంచెత్తడంతో కొద్దిసేపు ఆందోళన నెలకొంది. చివరకు ప్రాణాలతో ఒడ్డుకు చేరుకున్నాడు. ఈ ఘటనపై నెటిజన్లు సరదాగా స్పందిస్తూ, దేవుడి పేరుతో ఇలాంటి ప్రమాదకర విన్యాసాలు చేయొద్దని, ప్రకృతి శక్తిని తక్కువ అంచనా వేయకూడదని కామెంట్లు చేస్తున్నారు.

గంటల కొద్దీ క్యూలు.. బారక్‌పూర్ బిర్యానీ క్రేజ్!
బెంగాల్‌లోని 'బారక్‌పూర్' ఇప్పుడు బిర్యానీ ప్రియుల పాలిట స్వర్గధామంగా మారింది. ఇక్కడి ప్రసిద్ధ 'దాదా బౌదీ' హోటల్ రుచులను ఆస్వాదించేందుకు జనాలు గంటల తరబడి ప్రయాణాలు చేసి, మండుటెండల్లో కూడా క్యూ లైన్లలో నిల్చుంటున్నారు. ఒక్క ముక్క నోట్లో పెట్టగానే కరిగిపోయే ఇక్కడి బిర్యానీ కోసం జరిగే ఈ 'బిర్యానీ యాత్రలు' ఇప్పుడు బెంగాల్‌లోనే హాట్ టాపిక్‌గా మారాయి.

హోరాహోరి 'బిర్యానీ వార్'.. పోటాపోటీగా కాపీ క్యాట్స్!
ఒకే ఒక చిన్న బిర్యానీ షాప్ సక్సెస్.. ఒక ఊరినే 'బిర్యానీ టౌన్'గా మార్చేసింది! బారక్‌పూర్‌లో ఒరిజినల్ హోటల్ క్రేజ్ చూసి, కోల్‌కతాకు చెందిన పెద్ద పెద్ద రెస్టారెంట్ చైన్లు కూడా అక్కడ వాలాయి. అంతేకాదు, అదే పేరుతో బోలెడన్ని కాపీ షాపులు పుట్టుకొచ్చి కస్టమర్ల కోసం తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఈ మసాలా పోరుతో బారక్‌పూర్ వీధులన్నీ ఘుమ ఘుమలాడుతున్నాయి! బిర్యానీ లవర్స్ కి ఈ వార్తే బిర్యానీ తిన్నంతగా నోరూరుతోంది కదూ !

మెలోనీ పై ట్రంప్ రెండోసారి ఎదురు దాడి !
తనతో ఫోటో కోసం ఇటలీ ప్రధాని మెలోని వెంపర్లాడిందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ప్రకటించారు. ఈ కామెంట్ ను మెలోని ఖండించారు. తానేనాడూ ఫొటో కోసం పాకులాడలేదని క్లారిటీ ఇచ్చారు. కానీ ట్రంప్ మళ్లీ అదే కామెంట్ రిపీట్ చేశారు. మెలోని కు పాపులారిటీ రాను రాను తగ్గిపోతోందని అందుకే ఆమె తనతో ఫోటో కోసం క్రేజీగా వెంటపడుతున్నారని అన్నారు. ఇరాన్ అమెరికా వార్ నేపధ్యంలో అమెరికాతో మరింతగా రిలేషన్స్ పెంచుకోవాలని మెలోని భావిస్తున్నారన్నారు.
ఢిల్లీలో హై టెన్షన్: CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే!
ఢిల్లీలో జరుగుతున్న పీస్‌ఫుల్ ప్రొటెస్ట్‌కు టైమ్ ఎక్స్టెండ్ చేయాలన్న రిక్వెస్ట్‌ను పోలీసులు రిజెక్ట్ చేశారు. అంతేకాకుండా, CJP ఫౌండర్ అభిజీత్ దీప్కేను అరెస్ట్ చేయడానికి పోలీసులు రెడీ అవుతున్నారు. ఈ విషయం తెలియడంతో అభిజీత్ సోషల్ మీడియా ద్వారా ఒక అలర్ట్ మెసేజ్ షేర్ చేశారు. దేశంలోని ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుండాలని కోరుకునే స్టూడెంట్స్, పేరెంట్స్, ప్రతీ ఒక్క సిటిజన్ వెంటనే ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గరకు రావాలంటూ వారు రిక్వెస్ట్ చేస్తున్నారు. ప్రెజెంట్ ఈ ట్వీట్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.

అందం కోసం మిరాకిల్ డ్రగ్స్ వెంట అమెరికన్ల పరుగులు
బరువు తగ్గడం, యవ్వనంగా కనిపించడం, కండరాల పుష్టి కోసం అమెరికాలో 'పెప్టైడ్స్' వాడకం విపరీతంగా పెరిగింది. ఎలాంటి కఠినమైన ప్రభుత్వ నిబంధనలు (FDA నియంత్రణలు) లేకపోవడంతో, వీటిని 'మిరాకిల్ డ్రగ్స్'గా ప్రచారం చేస్తూ బ్లాక్ మార్కెట్, ఆన్‌లైన్ క్లినిక్స్‌లో విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. అయితే, క్లినికల్ ట్రయల్స్ లేని ఈ అన్‌రెగ్యులేటెడ్ ఇంజెక్షన్ల వల్ల ప్రాణాలకే ముప్పు ఉందని, యువత వీటి బారిన పడొద్దని వైద్య నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.

50 ప్లస్‌లోనూ ఫ్యాషన్ ఫైర్.. సోషల్ మీడియాలో సెన్సేషన్!
ఫ్యాషన్ అంటే కేవలం యూత్‌దే అనుకుంటే పొరపాటే. యాభై ఏళ్లు దాటినా ముసలితనాన్ని దరిచేరనీయకుండా, సరికొత్త ఫ్యాషన్ ట్రెండ్స్‌తో దుమ్మురేపుతున్నారు కొందరు సీనియర్స్. లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ, కుర్రకారు మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్‌లో స్టైలిష్ ఔట్‌ఫిట్స్‌తో అదరగొడుతున్నారు. ఏజ్ గ్యాప్‌ని బ్రేక్ చేస్తూ, తమ బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ లుక్స్‌తో డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్‌పై ట్రెండ్ సెట్ చేస్తున్నారు. జెన్ జీ సైతం స్టైల్ , లుక్ లో వీరితో పోటీ పడాల్సిందే ఇక !