Latest

మారికవలస స్కూల్ రద్దు వద్దు...  2 రోజులుగా parents ఆందోళన
Local· 27 Aug 2026

మారికవలస స్కూల్ రద్దు వద్దు... 2 రోజులుగా parents ఆందోళన

మారికవలస పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు పాడేరు ఐటీడీఏలో రెండో రోజు ఆందోళన కొనసాగిస్తున్నారు. వారి డిమాండ్ స్పష్టంగా ఉంది – "మా పిల్లలను మారికవలస పాఠశాలలోనే కొనసాగించాలి." సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పేరుతో స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ను రద్దు చేయడం ఆదివాసులకు తీవ్ర అన్యాయమని, ఆదివాసి ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల్లో చదువుకునే అవకాశాన్ని లేకుండా చేయడం తీవ్ర దెబ్బ అని ఆందోళన వ్యక్తం చేశారు.
విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ స్పందించాలని, మారికవలస గురుకుల స్కూలు కొనసాగించాలని, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

కిట కిట లాడుతున్న RTC బస్సులు
Local· 27 Aug 2026

కిట కిట లాడుతున్న RTC బస్సులు

రాఖీ పౌర్ణమి పండుగను పురస్కరించుకుని వరంగల్‌–తొర్రూరు మార్గంలో ఆర్టీసీ బస్సులు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య భారీగా పెరగడంతో బస్సుల్లో రద్దీ నెలకొంది. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వరంగల్‌–తొర్రూరు రూట్‌లో అదనపు ఆర్టీసీ బస్సులు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.

3 కి.మీ.అదనం... హైవేతో సూరారంకు అన్యాయం..
Local· 27 Aug 2026

3 కి.మీ.అదనం... హైవేతో సూరారంకు అన్యాయం..

కొత్త హైవే వచ్చి ఊరిని మరింత దూరం చేసింది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామం మెయిన్ రోడ్డును నేషనల్ హైవే అధికారులు మూసేశారు. ఇప్పుడా గ్రామానికి వెళ్లాలంటే.. వల్లభాపూర్ మీదుగా సుమారు 3 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సిందే. ఎల్కతుర్తి, హుజురాబాద్, హనుమకొండ వైపు రోజూ వెళ్లే విద్యార్థులు, వృద్ధులు, రైతులు, ద్విచక్ర వాహనదారులు – అందరికీ ఇది భారీ ఇబ్బంది. "అసలు సూరారం మండలంలోనే అతి పెద్ద గ్రామం. ఇలా మార్గం మూసేయడం వల్ల నిత్యావసరాలకే ఆటంకం" అంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రీపెయిడ్ కరెంట్.. కోరుట్లలో టీఆర్ఎస్ ధర్నా!
Local· 27 Aug 2026

ప్రీపెయిడ్ కరెంట్.. కోరుట్లలో టీఆర్ఎస్ ధర్నా!

మొబైల్ రీఛార్జ్ లాగా.. ఇక కరెంట్ కూడా ముందస్తు చెల్లింపేనా? అంటూ.. కోరుట్ల బస్టాండ్ వద్ద తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) నేతలు భారీ ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం ప్రీపెయిడ్ విద్యుత్ విధానం తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ ఈ ఆందోళన జరిగింది. టీఆర్ఎస్ కోరుట్ల ఇన్ఛార్జ్ డా. రఘు మాట్లాడుతూ – "స్మార్ట్ మీటర్లకు మేము వ్యతిరేకం కాదు. కానీ ముందుగారీచార్జ్ చేస్తేనే కరెంట్ వచ్చే విధానం ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తుంది" అని ఖండించారు. ఇది పేద, గ్రామీణ వర్గాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

జీకేవీధి ఏకలవ్య విద్యార్థి ఆకస్మిక మృతి
Local· 27 Aug 2026

జీకేవీధి ఏకలవ్య విద్యార్థి ఆకస్మిక మృతి

జీకేవీధి ఏకలవ్య పాఠశాల విద్యార్థి ఆకస్మికంగా మృతి చెందారు. కొయ్యూరు మండలం తోటిమామునిపాలెం గ్రామానికి చెందిన దీపక్ ఏకలవ్యలో 7వ తరగతి చదువుతున్నాడు. నిన్న జ్వరం రావడంతో పాఠశాల వైద్య సిబ్బంది జీకేవీధి ఆసుపత్రికి తీసుకువెళ్లారు. గురువారం కూడా ఆసుపత్రికి తీసుకువెళ్లగా ఊపిరి అందక ఇబ్బంది పడినట్లు చింతపల్లిలో ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు ప్రిన్సిపల్ రమణారావు తెలిపారు.

వారికి 100% రిజర్వేషన్లు.. స్పష్టత కావాల్సందే...
Local· 27 Aug 2026

వారికి 100% రిజర్వేషన్లు.. స్పష్టత కావాల్సందే...

ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల 29న అరకులోయ మండలం గన్నెల పర్యటన సందర్భంగా ఆదివాసులకు 100% రిజర్వేషన్ ఆర్డినెన్స్ జారీ చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ డిమాండ్ చేశారు.1/70 చట్టం పరిరక్షణకు సుప్రీంకోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని హైడ్రో పవర్ ప్రాజెక్ట్ క్రమ ఒప్పందాలు జారీ చేసిన జీవోలు13,51,2,29 రద్దు చేయాలని పీఎం జన్మన్ హౌసింగ్ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన లక్ష రూపాయలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఆన్‌లైన్‌లో నో స్టాక్.. రోడ్డుపై రైతుల రాస్తారోకో!
Local· 27 Aug 2026

ఆన్‌లైన్‌లో నో స్టాక్.. రోడ్డుపై రైతుల రాస్తారోకో!

యూరియా కోసం ఆన్‌లైన్ బుకింగ్ – కానీ ప్రతీసారీ 'నో స్టాక్'. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డుపై రాస్తారోకో చేశారు. ఓ వైపు 440 బస్తాలు తాడ్వాయి పీఎసీఎస్ పరిధిలో ఉన్నాయని, కావాల్సిన రైతులు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలని అధికారులు చెబుతుంటే, మరోవైపు రైతులు యాప్ ఓపెన్ చేస్తే.. మళ్లీ 'నో స్టాక్' అని వచ్చింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు రోడ్డెక్కారు. సమస్యను పై స్థాయి అధికారులకు తెలియచేస్తానని AO హామీనివ్వడంతో శాంతించారు.

చెట్లకు రాఖీ.. నల్లకుంటలో 'వృక్షా బంధన్' క్రియేటివిటీ!
Local· 27 Aug 2026

చెట్లకు రాఖీ.. నల్లకుంటలో 'వృక్షా బంధన్' క్రియేటివిటీ!

రక్షా బంధన్ అంటే అక్క చెల్లెళ్లు తమ్ముళ్లకు రాఖీ కట్టే పండుగ. కానీ Hyd లోని నల్లకుంటలో మాత్రం సీన్ వేరు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల, నల్లకుంట (GHS Nallakunta) లో రక్షా బంధన్ సందర్భంగా.. 'వృక్షా బంధన్' కార్యక్రమం నిర్వహించారు.ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు ముత్యాల రవీందర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ – "మనుషులు వృక్షాలతో సహజీవనం చేసినప్పుడే వాటి ప్రయోజనాలు పొందుతారు. మొక్కలు నాటడమే కాదు.. వాటిని రక్షించుకోవడం చాలా అవసరం" అని అన్నారు. పిల్లలు, స్టాఫ్ కలిసి ఆకులు, పువ్వులు, విత్తనాలతో రకరకాల రాఖీలు తయారు చేశారు.

తాడేపల్లి SHG మహిళకు egg cart
Local· 27 Aug 2026

తాడేపల్లి SHG మహిళకు egg cart

గుంటూరు జిల్లా తాడేపల్లిలో మెప్మా ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘం సభ్యురాలికి ఉచితంగా ఎగ్ కార్ట్‌ను అందజేశారు. ఎన్ఈసీసీ ఆర్థిక సహాయంతో రూ.50 వేల విలువైన ఈ కార్ట్‌ను మాధురీ సంజన సంఘం సభ్యురాలు స్వీకరించారు. టీడీపీ తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు వల్లభనేని వెంకట్రావు మాట్లాడుతూ – "ఇది మహిళా సాధికారతకు ఎంతో దోహదం చేస్తుంది. మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయి. మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యం మాకు ఉంది" అని అన్నారు.

సూర్యాపేటలో underpass కష్టాలు..
Local· 27 Aug 2026

సూర్యాపేటలో underpass కష్టాలు..

సూర్యాపేట పట్టణంలోని హైవే అండర్‌పాస్ సమీపంలో, మాంగల్య షాపింగ్ మాల్ వద్ద నిత్యం ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ట్రాఫిక్ సిగ్నల్ లేదు. ట్రాఫిక్ పోలీసులు లేరు. మరో వైపు అండర్‌పాస్‌ వద్ద వాహనాల రద్దీ పెరగడంతో ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ఇతర వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోతున్నాయి. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్‌ రద్దీని నియంత్రించేందుకు అధికారులు వెంటనే చర్యలు చేపట్టి, వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించాలని స్థానికులు కోరుతున్నారు.

ఎక్కువ నిద్రా.. తక్కువ నిద్రా? బాడీకి ఏది మంచిది?
Technology· 27 Aug 2026

ఎక్కువ నిద్రా.. తక్కువ నిద్రా? బాడీకి ఏది మంచిది?

రోజూ ఎంతసేపు నిద్రపోతే బాడీ ఆరోగ్యంగా ఏజ్ అవుతుంది? కొత్త రీసెర్చ్‌కి ఆసక్తికరమైన సమాధానం ఉంది. దాదాపు 5 లక్షల మందికి సంబంధించిన డేటాను పరిశీలించిన సైంటిస్టులు, 23 బయోలాజికల్ ఏజింగ్ క్లాక్స్‌తో నిద్రకు ఉన్న సంబంధాన్ని చూశారు. రోజుకు 6.4 నుంచి 7.8 గంటలు నిద్రపోయేవారిలో బాడీ ఏజింగ్ లెవెల్స్ తక్కువగా కనిపించాయి. 6 గంటల కంటే తక్కువ లేదా 8 గంటల కంటే ఎక్కువ నిద్రపోయేవారిలో మాత్రం ఏజింగ్ వేగంగా కనిపించింది. అయితే నిద్ర తక్కువగానీ, ఎక్కువగానీ ఉండటమే నేరుగా ఏజింగ్‌కు కారణమని ఈ స్టడీ నిరూపించలేదు.

బ్రెయిన్‌లోనే నొప్పికి ‘బ్రేక్’ ఉందా?
Technology· 27 Aug 2026

బ్రెయిన్‌లోనే నొప్పికి ‘బ్రేక్’ ఉందా?

నొప్పి మొదలైతే బ్రెయిన్ దాన్ని ఆపలేదా? సైంటిస్టులు ఇప్పుడు బ్రెయిన్‌లోనే నొప్పిని తగ్గించే ఒక ‘బ్రేక్’ లాంటి వ్యవస్థను గుర్తించారు. ఎలుకలపై చేసిన రీసెర్చ్‌లో, బ్రెయిన్‌లోని ఒక ప్రత్యేక భాగంలోని ము ఓపియాయిడ్ రిసెప్టర్లు నొప్పి సిగ్నల్స్‌ను అదుపులో ఉంచుతున్నట్టు కనిపించింది. ఈ రిసెప్టర్లను తొలగించగానే నొప్పికి సెన్సిటివిటీ పెరిగింది.. తిరిగి పెట్టినప్పుడు తగ్గింది. దీన్ని మనుషుల్లోనూ ఉపయోగించగల చికిత్సగా మార్చేందుకు ఇంకా రీసెర్చ్ అవసరం.

నవులూరు ప్రభుత్వ పాఠశాలకు దాతల చేయూత
Local· 27 Aug 2026

నవులూరు ప్రభుత్వ పాఠశాలకు దాతల చేయూత

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరు జెడ్పీ ఉన్నత పాఠశాలకు టీడీపీ నాయకులు రూ.15 వేల విలువైన All in one ప్రింటర్, బయోమెట్రిక్ మిషన్‌ను బహూకరించారు. పేద విద్యార్థులు జిరాక్స్ కాపీలు, పరీక్ష పత్రాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని HM చెప్పడంతో స్పందించిన దాతలు ఈ సదుపాయాలను అందించారు.కొల్లి వెంకటరావు, బత్తుల నాగరాజు, తోట శ్రీనుబాబు, రుద్రం శ్రీనివాస రావు, పేరుబోయిన వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు సమాజం అండగా నిలిస్తే విద్యార్థులకు మంచి విద్య అందుతుందన్నారు.

కాకినాడలో లెప్రసీ కాలనీకి ఎంపీజే సాయం..
Local· 27 Aug 2026

కాకినాడలో లెప్రసీ కాలనీకి ఎంపీజే సాయం..

కాకినాడలో లెప్రసీ కాలనీకి ఓ చేయూత. ఎంపీజే కాకినాడ జిల్లా ఆధ్వర్యంలో 55 మంది లెప్రసీ బాధితులకు డ్రెస్సింగ్ కార్యక్రమం నిర్వహించారు. అమరులు అలీ జ్ఞాపకార్థం ఆర్థిక సహాయం అందించారు. ఇంకా.. 39 మంది మహిళలకు చీరలు, 17 మంది పురుషులకు లుంగీలు, టవల్స్ పంపిణీ చేశారు. భోజనంతో పాటు సబ్బు, టూత్‌పేస్ట్, బ్రష్, కొబ్బరి నూనె, షాంపూ, సర్ఫ్ వంటి పరిశుభ్రత కిట్లు కూడా అందజేశారు.
జిల్లా అధ్యక్షులు ఎం.డి. హలీం నాయకత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. జనరల్ సెక్రటరీ ఎం.డి. ఉస్మాన్ షబ్బీర్, షాకీర్, తదితరులు పాల్గొన్నారు.

ఖేలో ఇండియాతో స్పోర్ట్స్ లో ఫుల్ జోష్
Local· 27 Aug 2026

ఖేలో ఇండియాతో స్పోర్ట్స్ లో ఫుల్ జోష్

క్రీడాకారులను ప్రోత్సహించి.. తెలుగు వారిని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఖేలో ఇండియా సంవాద్ ప్రారంభమైందని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. నందిగామ మండలంలోని సింబాసిస్ క్యాంపస్‌లో ఖేలో ఇండియాపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులను ఉద్దేశించి ఎంపీ మాట్లాడారు.
ఇంకో స్పెషల్ అట్రాక్షన్ – ప్రముఖ క్రీడాకారిణి పీవీ సింధు స్వయంగా హాజరై విద్యార్థుల ఎదుగుదల ఆవశ్యకతను వివరించారు.

PRC పెండింగ్ D. A కోసం ధర్నా
Local· 27 Aug 2026

PRC పెండింగ్ D. A కోసం ధర్నా

TGEJAC ఆధ్వర్యంలో పిఆర్సి నీ వెంటనే అమలు చేయాలని 6 పెండింగ్ DA లను వెంటనే ప్రకటించాలని రాష్ర్ట వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో ధర్నా కార్యక్రమాలు జరిగాయి. ఇందులో భాగంగానే మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నేడు ధర్నా నిర్వహించడం జరిగింది. వందలాది మంది ఉపాధ్యాయులు, పెన్షనర్లు, ఉద్యోగులు ధర్నాలో పాల్గొన్నారు. పిఆర్సీ, పెండింగ్ డిెఎ, పేరుకు పోయిన బకాయిల చెల్లింపు తదితర డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు.

పురుగులంటే అసహ్యం.. 9,000 ఏళ్ల రహస్యమా?
Technology· 27 Aug 2026

పురుగులంటే అసహ్యం.. 9,000 ఏళ్ల రహస్యమా?

మనుషులకు పురుగులు చూస్తేనే అసహ్యం ఎందుకు? దీనికి వేల ఏళ్ల నాటి కారణం ఉండొచ్చని కొత్త రీసెర్చ్ చెబుతోంది. సైంటిస్టులు 745 పురాతన మానవుల పళ్లపై పేరుకున్న టార్టార్ శాంపిల్స్‌ను పరిశీలించగా, ఉత్తర యూరేషియాలో మన పూర్వీకులు పురుగులను చాలా అరుదుగా తిన్నట్టు తేలింది. కానీ నియాండర్తల్స్‌లో పురుగుల DNA ఎక్కువగా కనిపించింది. అంటే వాళ్లు పురుగులను ఎక్కువగా తిని ఉండొచ్చని అంచనా. ఈ ఆహార అలవాట్ల ప్రభావం 9,000 ఏళ్లుగా మన జీన్స్‌లో కొనసాగి ఉండొచ్చని రీసెర్చ్ చెబుతోంది.

600 మంది tribal విద్యార్థులకు... NEET JEE.. Free
Local· 27 Aug 2026

600 మంది tribal విద్యార్థులకు... NEET JEE.. Free

Tribal విద్యార్థుల కలలకు ఓ పెద్ద అడుగు. మెరిట్ exam ద్వారా సెలెక్ట్ చేసిన 600 మంది స్టూడెంట్స్ కి ఫ్రీగా నీట్, IIT-JEEకు ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్ ను AP గవర్నమెంటు ఇస్తోంది. ఈ లక్ష్యం కోసమే విశాఖపట్నం మారికవలసలో ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ ఏర్పాటు చేసింది. సెలెక్ట్ అయిన వారిలో 300 మంది boys, 300 మంది girls ఉన్నారు. వీరికి ఉచితవిద్యతో పాటు వసతి, ఆహారం, పౌష్టికాహారం, ICT సదుపాయాలు కూడా ఉన్నాయి. ‘‘దీనివల్ల పెద్ద చదువులు చదవాలన్న తమ పిల్లల కల నెరవేరబోతోంద’’ని తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.

చిత్తూరులో 20 వేల మంది.. చెకుముకి సంబరాల హోరు!
Local· 27 Aug 2026

చిత్తూరులో 20 వేల మంది.. చెకుముకి సంబరాల హోరు!

రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు చెకుముకి సైన్స్ సంబరాలు ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్లోని 8,9,10 తరగతుల నాలుగు లక్షల మంది విద్యార్థులు పాఠశాల స్థాయి పరీక్ష రాశారు. ఇందులో చిత్తూరు జిల్లా స్పెషల్గా నిలిచింది.
జిల్లాలోని అన్ని మండలాల్లో కలిపి 20 వేల మంది విద్యార్థులు దిగ్విజయంగా ఈ పరీక్ష పూర్తి చేశారు.
ఈ సందర్భంగా JVV అధ్యక్షులు అరుణ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి యుగంధర్ బాబు మాట్లాడుతూ
మండల స్థాయి సంబరాలు సెప్టెంబర్ 11న, జిల్లాస్థాయి 27న, రాష్ట్రస్థాయి నవంబర్ 1,2,3న జరగనున్నాయని చెప్పారు.

ఆ 76 కోట్లతో పలమనేరులో చేయబోతున్నది ఇదే..
Local· 27 Aug 2026

ఆ 76 కోట్లతో పలమనేరులో చేయబోతున్నది ఇదే..

పలమనేరు రూపురేఖల్లో మార్పులు రానున్నా య్. HMA, DMF, APUFIDC, SC/ST subplan నుంచి రూ.76కోట్లు వచ్చాయి. ఈ నిధులతో చేసే పనుల list మున్సిపల్ కమిషనర్ లోకేష్ వర్మ చెప్పారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పైప్‌లైన్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. తాగునీటి సమస్య పరిష్కారానికి పైప్‌లైన్ పునరుద్ధరణ, కొత్త ఈఎల్‌ఎస్‌ఆర్‌ల నిర్మాణం, ఐదు బోర్ల ఏర్పాటు చేపట్టామన్నారు.FSTP నిర్మాణం తుది దశకు చేరుకుందని, వీధి దీపాల నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. MLA ఎన్. అమరనాథ్ రెడ్డి ప్రత్యేక చొరవ తోడ్పడిందన్నారు.

తెలుగు భాష నశిస్తే.. ఏం జరుగుతుందంటే?
Local· 27 Aug 2026

తెలుగు భాష నశిస్తే.. ఏం జరుగుతుందంటే?

తెలుగు భాష పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి అధ్యక్షుడు పి. తులసినాథం నాయుడు కోరారు. గురువారం తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో కళామందిరంలో ముందస్తుగా తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా తులసినాథం నాయుడు మాట్లాడుతూ "తెలుగు భాష నశిస్తే తెలుగు జాతి ఉనికే ప్రమాదం" అని హెచ్చరించారు.
భాష పరిరక్షణకు ప్రభుత్వం సభా సంఘం ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. కానీ వెంటనే దాన్ని నియమించి అమలు చేయాలని నాయుడు డిమాండ్ చేశారు.