Latest

 ఎవరెస్ట్ పై చనిపోయిన హైదరాబాదీ ! ఫ్యామిలీ ఏం చేసిందంటే..
General· 27 May 2026

ఎవరెస్ట్ పై చనిపోయిన హైదరాబాదీ ! ఫ్యామిలీ ఏం చేసిందంటే..

ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి తిరుగుప్రయాణంలో మరణించిన హైదరాబాద్ పర్వతారోహకుడు అరుణ్ కుమార్ తివారి (53) డెడ్ బాడీని అక్కడే వదిలేయాలని ఆయన కుటుంబం నిర్ణయించింది. ఎవరెస్ట్ పర్వతం శివుని నివాసమని, ఆయనను అక్కడే ప్రశాంతంగా విశ్రమించనివ్వడం సరైనదని కుటుంబసభ్యులు భావించారు. అంతేకాకుండా, తీవ్రమైన వాతావారణం, ఆక్సిజన్ లేకపోవడం వల్ల ఎవరెస్ట్ 'డెత్ జోన్' (హిల్లరీ స్టెప్) నుండి మృతదేహాన్ని తీసుకురావడం అత్యంత ప్రమాదకరమైన ,కష్టతరమైన ప్రక్రియ కావడంతో వారు ఈ డెసిషన్ తీసుకున్నారు.

 ఆ రెండు అంశాల  కోసమే  మోడీతో విజయ్ భేటీ
Politics· 27 May 2026

ఆ రెండు అంశాల కోసమే మోడీతో విజయ్ భేటీ

తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జోసెఫ్ విజయ్ తొలిసారిగా మోడీని కలసింది రెండు అంశాలపై విన్నవించడానికే నని తెలుస్తోంది. కర్ణాటక మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వద్దని ప్రధానిని కోరేందుకు, ప్రభుత్వ ఫంక్షన్స్ లో ప్రారంభంలో తమిళ రాష్ట్ర గీతాన్ని ఆలపించేందుకు అనుమతి ఇవ్వాలనీ విజయ్ విజ్ఞప్తి చేశారు. కర్ణాటక కాబోయే సీఎం డీకే శివకుమార్ ఈ మధ్యనే ఆ ప్రాజెక్టు డీపీఆర్ కేంద్రానికి సబ్ మిట్ చేశారు. దాంతో తమిళనాట నిరసనలు రేగాయి. అలాగే హాలండ్ నుండి పురాతన రాగి పలకలను తీసుకువచ్చినందుకు ప్రధానికి విజయ్ కృతజ్ఞతలు తెలిపారు.

 సిద్దూనీ  డీకే ఎలా దారికి తెచ్చారంటే !!- అసలు రీజన్ ఇదే !
Politics· 27 May 2026

సిద్దూనీ డీకే ఎలా దారికి తెచ్చారంటే !!- అసలు రీజన్ ఇదే !

కర్ణాటకలో డి.కె శివకుమార్ సిద్దరామయ్యకు (సిద్దు) పెద్ద ఝలకే ఇచ్చారు. ఇన్నాళ్లూ నెంబర్ గేమ్ పై నమ్మకం పెట్టుకున్న సిద్దరామయ్య తన పక్కన ఎమ్మెల్యేలు ఉన్నంత కాలం తననెవరూ ఏం చేయలేరని అనుకుంటూ వారిని కాపాడుకుంటూ వచ్చారు. కానీ డీకె మాత్రం కాంగ్రెస్ టాప్ బ్యాండ్ ని నమ్ముకున్నారు. హై కమాండ్ తో రెగ్యులర్ టచ్ లో ఉంటూ రెండున్నరేళ్లు కంప్లీట్ కాగానే హైకమాండ్ తలుపు తట్టారు. రాజస్థాన్ తరహా క్రైసిస్ రాకూడదని, ఎన్నికల ముందు గొడవలు ఇష్టం లేని రాహుల్ సిద్దరామయ్యకు ఏకాంత భేటీలో కుర్చీ దిగక తప్పదని తేల్చేశారు. ఓబీసీ లీడర్ గా మంచి ఫ్యూచర్ చూపిస్తామని ఆశపెట్టడంతో కథ సుఖాంతం అయ్యింది.

ఎల్ నినో  డేంజర్ తప్పదు !!  ముందస్తు ఏర్పాట్లలో కేంద్రం
Politics· 27 May 2026

ఎల్ నినో డేంజర్ తప్పదు !! ముందస్తు ఏర్పాట్లలో కేంద్రం

ఆస్ట్రేలియా వాతావరణ సంస్థ (BOM) తీవ్రమైన 'ఎల్ నినో' రాకపై స్పష్టమైన అంచనాలను ప్రకటించింది. పసిఫిక్ మహాసముద్ర ఉపరితల జలాలు వేడెక్కడం వల్ల ఏర్పడే ఈ మార్పు, గాలులు , వర్షపాత వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ఇప్పటికే రుతుపవనాల ఆలస్యంతో తీవ్ర ఎండలను ఎదుర్కొంటున్న మనదేశానికి ఇది ఆందోళనకరమైన విషయం. దీని తీవ్రత , వ్యవసాయంపై పడే ప్రభావంపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.

  విజయ్- మోడీ  25  నిమిషాల ఏకాంత భేటీ !
Politics· 27 May 2026

విజయ్- మోడీ 25 నిమిషాల ఏకాంత భేటీ !

తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ న్యూఢిల్లీలోని సేవా తీర్థ్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. దాదాపు 25 నిమిషాల పాటు సాగిన ఈ వన్-ఆన్-వన్ భేటీ, విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగిన ఫస్ట్ అఫీషియల్ ఢిల్లీ ట్రిప్. దాదాపు 12 ఏళ్ల తర్వాత వీరిద్దరి మధ్య జరిగిన ఈ మొదటి సమావేశం, కేంద్ర ప్రభుత్వం,తమిళనాడు కొత్త నాయకత్వం మధ్య మారబోయే రాజకీయ సమీకరణాలపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చలకు దారితీసింది. పర్యటనలో భాగంగా విజయ్‌కి తమిళనాడు హౌస్‌లో గౌరవ వందనం సమర్పించారు.

స్వదేశీ స్టెల్త్ ఫైటర్ జెట్ 'AMCA' తయారీ రేసులో 3 ప్రైవేట్ సంస్థలు:
Technology· 27 May 2026

స్వదేశీ స్టెల్త్ ఫైటర్ జెట్ 'AMCA' తయారీ రేసులో 3 ప్రైవేట్ సంస్థలు:

ప్రభుత్వ రంగ సంస్థ అయిన HAL (Hindustan Aeronautics Ltd) చేతుల్లోనే ఉండే యుద్ధ విమానాల తయారీ బాధ్యతను, మొదటిసారిగా ఒక ప్రధాన ప్రాజెక్ట్ కోసం ప్రైవేట్ రంగానికి అప్పగించాలని రక్షణ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌కు దక్కిన అరుదైన అవకాశం: ఈ ₹15,000 కోట్ల భారీ ప్రాజెక్టులో గెలిచిన ప్రైవేట్ భాగస్వామి, పుట్టపర్తిలో ఏర్పాటు చేయబోయే సరికొత్త గ్రీన్‌ఫీల్డ్ ఫెసిలిటీలో 5 AMCA ప్రోటోటైప్‌లను (నమూనాలను) నిర్మిస్తారు. టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్, L&T-BEL-డైనమాటిక్ కన్సార్టియం, భారత్ ఫోర్జ్-BEML-డేటా ప్యాటర్న్స్ కన్సార్టియం లాంటి దేశీయ ప్రైవేట్ కూటములు ఈ రేసులో ఉన్నాయి.

 ఎనిమిది గంటలు గాల్లో తిరిగి తిరిగి ల్యాండ్ అయిన ఎయిర్ఇండియా ఫ్లైట్
Politics· 27 May 2026

ఎనిమిది గంటలు గాల్లో తిరిగి తిరిగి ల్యాండ్ అయిన ఎయిర్ఇండియా ఫ్లైట్

ఢిల్లీ నుండి శాన్ ఫ్రాన్సిస్కో వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం (AI173) సాంకేతిక లోపం కారణంగా తిరిగి ఢిల్లీకి చేరుకుంది. చైనా వైమానిక రంగంలో ఉండగా లోపాన్ని గుర్తించిన పైలట్, విమానాన్ని వెనక్కి మళ్లించారు. దాదాపు 8 గంటల పాటు గాల్లోనే ప్రయాణించిన ఈ విమానం 230 మంది ప్రయాణికులతో సురక్షితంగా ల్యాండ్ అయింది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ground సిబ్బంది ఆహారం, హోటల్ వసతి మరియు ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, కేవలం వారం రోజుల క్రితమే (మే 21న) బెంగళూరు నుండి ఢిల్లీ వచ్చిన మరో ఎయిర్ ఇండియా విమానం ఇంజన్‌లో మంటలు చెలరేగడం గమనార్హం.

గవర్నమెంట్‌కు ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఓపెన్ ఛాలెంజ్!▶
Politics· 27 May 2026

గవర్నమెంట్‌కు ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఓపెన్ ఛాలెంజ్!

ప్రొఫెసర్‌ నాగేశ్వరరావు అరెస్ట్ వార్తలపై గవర్నమెంట్‌కు ఓపెన్ ఛాలెంజ్ చేశారు. మీరు అరెస్ట్ చేస్తారో, కేసులు విత్ డ్రా చేసుకుంటారో మీ ఇష్టం. నేను మాత్రం మాట్లాడుతూనే ఉంటా. చావనైనా చస్తా కానీ నా వాయిస్ ఆపలేరు. కావాలంటే మీరే టైమ్, ప్లేస్ చెప్పండి. నేనే డైరెక్ట్‌గా వస్తా, అరెస్ట్ చేసుకోండి అంటూ గవర్నమెంట్ కి సవాల్ విసిరాడు.

 ఎండల దెబ్బకు పారిస్ లో తిరగని రైళ్లు... బెంబేలెత్తుతున్న జనం
Politics· 27 May 2026

ఎండల దెబ్బకు పారిస్ లో తిరగని రైళ్లు... బెంబేలెత్తుతున్న జనం

ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఎండలు మండిపోతున్నాయి. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతల వల్ల రైల్వే ఇనుప పట్టాలు విపరీతంగా వేడెక్కి సాగిపోతున్నాయి (వ్యాకోచిస్తున్నాయి). దీనివల్ల రైళ్లు పట్టాలు తప్పే ప్రమాదం ఉండటంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా పలు రూట్లలో రైళ్ల వేగాన్ని తగ్గించడమే కాకుండా, మరికొన్ని రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశారు. పాత రైళ్లలో ఏసీలు కూడా పనిచేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏసీలేని రైళ్లలో ఉండలేక మధ్యలోనే రైళ్లు దిగిపోయి పొలాల్లోకి జనం పరుగులు తీస్తున్నారు.

చంద్రబాబు ఇంత చిల్లర పని చేస్తారా? ▶
Politics· 27 May 2026

చంద్రబాబు ఇంత చిల్లర పని చేస్తారా?

ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇష్యూపై పృథ్వీ మరోసారి చంద్రబాబు గవర్నమెంట్‌పై ఫుల్ ఫైర్ అయ్యారు. నాగేశ్వర్ సార్ లాంటి వ్యక్తికి జగన్ పార్టీ జెండాను అంటగడతారా అని క్వశ్చన్ చేశారు. "చంద్రబాబు ఇంత చిల్లర పనులు చేస్తారా? మేము ఓపెన్‌గా చెప్తున్నాం.. సార్ చెప్పింది 100% కరెక్ట్" అంటూ పృథ్వీ నాగేశ్వరరావుకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. సార్‌ను టార్గెట్ చేస్తూ పాలిటిక్స్ చేయడం కరెక్ట్ కాదంటూ ఆయన తీవ్రంగా తప్పుపట్టారు.

తెలంగాణ లో ఎన్టీఆర్ విగ్రహాలు దిష్టిబొమ్మల్లా కనిపిస్తున్నాయి!▶
Politics· 27 May 2026

తెలంగాణ లో ఎన్టీఆర్ విగ్రహాలు దిష్టిబొమ్మల్లా కనిపిస్తున్నాయి!

తెలంగాణ భాష, ఎన్టీఆర్ విగ్రహాల వివాదంపై పృధ్వీ shocking కామెంట్స్ చేశారు. సినిమాల్లో గుండాలు, విలన్లు, రేపిస్టులకు తెలంగాణ భాషను పెట్టడం వల్లే ఇప్పుడు ఈ పంచాయితీ వచ్చిందని ఆయన ఫైర్ అయ్యారు. మైత్రివనం దగ్గర ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టాల్సిన అవసరం లేదని, ఇలాగే చేసుకుంటూ పోతే అవి దిష్టిబొమ్మల్లా కనిపిస్తాయని కామెంట్ చేశారు. ఎన్టీఆర్ కంటే ఎక్కువ సినిమాలు చేసిన వాళ్లు ఉన్నారని. పైడి జైరాజ్, ప్రభాకర్ రెడ్డి, సినారే లాంటి తెలంగాణ కళాకారుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ చేశారు.

లైఫ్‌లో అన్నీ చూశా.. జైలు ఒక్కటే మిగిలింది!▶
Politics· 27 May 2026

లైఫ్‌లో అన్నీ చూశా.. జైలు ఒక్కటే మిగిలింది!

అరెస్టుల ఇష్యూపై ప్రొఫెసర్‌ నాగేశ్వరరావు మరోసారి ఫుల్ పవర్‌ఫుల్ కామెంట్స్ చేశారు. తను అరెస్టులకు భయపడేవాడైతే ఇంతదూరం వచ్చేవాడే కాదని, ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా అస్సలు ఫైల్ చేయనని క్లియర్ చేశారు. నేను నా లైఫ్‌లో అన్నీ చూశాను.. ఒక్క జైలు ఎక్స్ పీరియన్స్ తప్ప. అక్కడికి కూడా వెళ్లి వస్తే నా ఆత్మకథ కంప్లీట్ అవుతుంది అంటూ నాగేశ్వరరావు గవర్నమెంట్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

ధాన్యం బస్తాలు దహనం చేసి నిరసన
Local· 27 May 2026

ధాన్యం బస్తాలు దహనం చేసి నిరసన

TG: మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పు లింగాపూర్ వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ - వెల్దుర్తి ప్రధాన రహదారిపై ధాన్యం బస్తాలు దహనం చేసి నిరసన తెలిపారు. గత నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బంది పడుతున్నామని, అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు వచ్చి ధాన్యం కొనుగోలు చేసే వరకు తాము వెళ్ళమంటూ రోడ్డుపై గ్యాస్ పొయ్యి పెట్టి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా కలెక్టర్ రావాలంటూ నినాదాలు చేశారు. పోలీసులను సైతం అక్కడి నుండి వెళ్లకుండా అడ్డుకున్నారు.

ఒకవైపు TDP లీడర్స్ స్పీచ్‌లు.. ఇంకోవైపు రికార్డింగ్ డాన్సులు!▶
Politics· 27 May 2026

ఒకవైపు TDP లీడర్స్ స్పీచ్‌లు.. ఇంకోవైపు రికార్డింగ్ డాన్సులు!

కడప జిల్లా బద్వేల్‌లో జరిగిన టీడీపీ మహానాడు ప్రోగ్రామ్‌లో ఒక వింత సీన్ కనిపించింది. ఒకవైపు స్టేజ్ మీద లీడర్స్ సీరియస్‌గా స్పీచ్‌లు ఇస్తుంటే.. దానికి కరెక్ట్‌గా ఆపోజిట్ లో స్క్రీన్ ముందు మాత్రం రికార్డింగ్ డాన్సులు పెట్టేశారు. లీడర్స్ మాటలు వినడం పక్కన పెట్టి, జనాలు ఆ డాన్సులు చూడటంలో బిజీ అయిపోయారు. మహానాడు లాంటి అఫీషియల్ ప్రోగ్రామ్‌లో ఇలా రికార్డింగ్ డాన్సులు పెట్టడం ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.

పవన్ కళ్యాణ్‌కు ప్రొఫెసర్ నాగేశ్వరరావు కౌంటర్!▶
Politics· 27 May 2026

పవన్ కళ్యాణ్‌కు ప్రొఫెసర్ నాగేశ్వరరావు కౌంటర్!

తనపై పెట్టిన కేసులపై ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఫుల్ కౌంటర్ ఇచ్చారు. తను క్యాస్ట్ పరమైన గొడవలు పెట్టేలా మాట్లాడానని గవర్నమెంట్ కేసులు పెట్టడంపై ఆయన నవ్వుకున్నారు. అసలు తన మాటల్లో ఎక్కడా 'క్యాస్ట్' అనే వర్డే లేదని, అలాంటప్పుడు కేసు ఎలా పెడతారని క్వశ్చన్ చేశారు. పవన్ కళ్యాణే క్యాస్ట్, రీజియన్ టాపిక్స్ తెచ్చి, ఇప్పుడు మళ్ళీ తమపైనే నిందలు వేస్తున్నారని ఫైర్ అయ్యారు. తను కేవలం మాట్లాడానని, బాంబులు వేయలేదని నాగేశ్వరరావు ప్రెస్ క్లబ్ లో పవన్ కళ్యాణ్ కి కౌంటర్ ఇచ్చారు.

నాగేశ్వరరావు ముందు పవన్ కళ్యాణ్‌ ఒక లిల్లీపుట్!▶
Politics· 27 May 2026

నాగేశ్వరరావు ముందు పవన్ కళ్యాణ్‌ ఒక లిల్లీపుట్!

సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై ఫుల్ ఫైర్ అయ్యారు. ఒకప్పుడు చేగువేరా బొమ్మ పెట్టుకున్న పవన్, ఇప్పుడు చంద్రబాబు వెనకాల తిరుగుతున్నారంటూ ఫైర్ అయ్యారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు ముందు పవన్ జస్ట్ ఒక లిల్లీపుట్ లాంటివాడని, ఆయన చేసిన కామెంట్స్‌కే అరెస్ట్ చేస్తారా అని క్వశ్చన్ చేశారు. అసలు పవన్‌ను డిప్యూటీ సీఎం చేయడమే పెద్ద తప్పు అంటూ యాదగిరి షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఆరుగాలం కష్టం.. తడిసి ముద్ధైన ధాన్యం
Local· 27 May 2026

ఆరుగాలం కష్టం.. తడిసి ముద్ధైన ధాన్యం

TG: మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో కురిసిన వర్షం అన్నదాతలను తీవ్రంగా నష్టపరిచింది. మంగళవారం అర్ధరాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో కొనుగోలు కేంద్రం వద్ద ఆరబోసిన ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయింది. నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లారీలు, హమాలీలు, గన్ని బ్యాగుల కొరత వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని పూర్తిగా ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు కోరారు.

ఏకగ్రీవం అయితే ఊరుకోను.. YSRCP లీడర్స్‌కు జగన్ బిగ్ వార్నింగ్!▶
Politics· 27 May 2026

ఏకగ్రీవం అయితే ఊరుకోను.. YSRCP లీడర్స్‌కు జగన్ బిగ్ వార్నింగ్!

YSRCP లీడర్స్‌కు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ serious instructions ఇచ్చారు. త్వరలో జరగబోయే లోకల్ ఎలక్షన్స్ లో ఏ సిట్యుయేషన్ లోనైనా అన్ని చోట్లా YSRCP జెండా ఖచ్చితంగా ఎగరాలని ఆయన టార్గెట్ పెట్టారు. ముఖ్యంగా ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే మాత్రం తాను చాలా సీరియస్‌గా తీసుకుంటానని లీడర్స్‌ను గట్టిగా హెచ్చరించారు. ఈ లోకల్ పోల్స్ లో ప్రతి ఒక్కరూ ఫుల్ యాక్టివ్‌గా ఉండి పని చేయాలని జగన్ క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు.

 పొలాల్లో గడ్డి కాల్చడంతో పర్యావరణానికి నష్టం
Local· 27 May 2026

పొలాల్లో గడ్డి కాల్చడంతో పర్యావరణానికి నష్టం

మెదక్ జిల్లా: పంట కోత అనంతరం పొలాల్లో మిగిలిన వరి, మొక్కజొన్న గడ్డిని కాల్చడం వల్ల నేల సారవంతం తగ్గడంతోపాటు పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతుందని మాసాయిపేట మండల వ్యవసాయ అధికారిణి కవిత తెలిపారు. పంట అవశేషాలను కాల్చడం వల్ల నేలలోని సేంద్రియ పదార్థం, ప్రయోజనకర సూక్ష్మజీవులు నశించి పోషకాల లోపం ఏర్పడుతుందని చెప్పారు. పంట గడ్డిని కాల్చడం వల్ల వాయు కాలుష్యం, గ్రీన్‌హౌస్ వాయువుల ఉద్గారం పెరిగి ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందన్నారు.

 కేసీఆర్ ఒక్కరోజైనా ఆ పనిచేశారా: జూపల్లి
Politics· 27 May 2026

కేసీఆర్ ఒక్కరోజైనా ఆ పనిచేశారా: జూపల్లి

TG: పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును బీఆర్ఎస్ నేతలు రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. బుధవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అసంపూర్తి పనులతో పాలమూరు ప్రాజెక్టును పూర్తిగా అటకెక్కించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని ఆక్షేపేంచారు. నార్లాపూర్, ఏదుల, వట్టెం వద్ద పూర్తిస్థాయిలో మోటర్లు కూడా ఏర్పాటు చేయలేదని దుయ్యబట్టారు. కుర్చీ వేసుకొని ప్రాజెక్టు పూర్తిచేస్తానన్న కేసీఆర్ కనీసం ఒక్కరోజైనా ఆ పనిచేశారా అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందువైన పాలమూరు జిల్లాను గత ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసిందన్నారు.

 నెహ్రూ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయం: భట్టి
Politics· 27 May 2026

నెహ్రూ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయం: భట్టి

TG: భారత తొలి ప్రధానమంత్రి, నవభారత నిర్మాత పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. బుధవారం నెహ్రూ వర్ధంతి సందర్భంగా ఖమ్మం జిల్లా క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశ ప్రగతికి, ఆధునిక భారతదేశ నిర్మాణానికి ఆయన చేసిన సేవలు ఎల్లప్పుడూ స్మరణీయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.