కేసీఆర్ ఒక్కరోజైనా ఆ పనిచేశారా: జూపల్లి

TG: పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును బీఆర్ఎస్ నేతలు రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. బుధవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అసంపూర్తి పనులతో పాలమూరు ప్రాజెక్టును పూర్తిగా అటకెక్కించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని ఆక్షేపేంచారు. నార్లాపూర్, ఏదుల, వట్టెం వద్ద పూర్తిస్థాయిలో మోటర్లు కూడా ఏర్పాటు చేయలేదని దుయ్యబట్టారు. కుర్చీ వేసుకొని ప్రాజెక్టు పూర్తిచేస్తానన్న కేసీఆర్ కనీసం ఒక్కరోజైనా ఆ పనిచేశారా అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందువైన పాలమూరు జిల్లాను గత ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసిందన్నారు.



