ఎనిమిది గంటలు గాల్లో తిరిగి తిరిగి ల్యాండ్ అయిన ఎయిర్ఇండియా ఫ్లైట్

ఢిల్లీ నుండి శాన్ ఫ్రాన్సిస్కో వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం (AI173) సాంకేతిక లోపం కారణంగా తిరిగి ఢిల్లీకి చేరుకుంది. చైనా వైమానిక రంగంలో ఉండగా లోపాన్ని గుర్తించిన పైలట్, విమానాన్ని వెనక్కి మళ్లించారు. దాదాపు 8 గంటల పాటు గాల్లోనే ప్రయాణించిన ఈ విమానం 230 మంది ప్రయాణికులతో సురక్షితంగా ల్యాండ్ అయింది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ground సిబ్బంది ఆహారం, హోటల్ వసతి మరియు ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, కేవలం వారం రోజుల క్రితమే (మే 21న) బెంగళూరు నుండి ఢిల్లీ వచ్చిన మరో ఎయిర్ ఇండియా విమానం ఇంజన్‌లో మంటలు చెలరేగడం గమనార్హం.



