Education

శాతవాహన యూనివర్సిటీలో TRSV నిరాహార దీక్ష
Education· 23 Jul 2026

శాతవాహన యూనివర్సిటీలో TRSV నిరాహార దీక్ష

TG: కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీలో నీట్ పేపర్ లీకేజీలు, పరీక్షల్లో అవకతవకలకు నిరసనగా TRSV నాయకులు నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. పోటీ పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. నీట్ పేపర్ లీకేజీతో దేశంలోని లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్మేంద్ర ప్రధాన్‌ను బర్తరఫ్ చేసి, పరీక్షల నిర్వహణలో పారదర్శకత తీసుకురావాలని నాయకులు డిమాండ్ చేశారు.

కలెక్టర్ వినూత్న తనిఖీలతో స్కూల్స్‌లో మార్పు
Education· 23 Jul 2026

కలెక్టర్ వినూత్న తనిఖీలతో స్కూల్స్‌లో మార్పు

కేరళంలోని అల్లపుజ జిల్లా కలెక్టర్ ఎస్.సుహాన్ వినూత్న కార్యక్రమంతో ప్రశంసలు అందుకుంటున్నారు. 2012 IAS బ్యాచ్‌కు చెందిన ఆయన, మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించేందుకు తరచూ పాఠశాలలకు వెళ్లి విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్నారు. నీరుకున్నమ్‌లోని శ్రీదేవి విల్సమ్ అప్పర్ ప్రైమరీ స్కూల్‌లో పిల్లల మధ్య కూర్చుని భోజనం చేసి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. వయనాడ్‌లో కలెక్టర్‌గా ఉన్నప్పుడు కూడా గిరిజన పాఠశాలలపై ప్రత్యేక దృష్టి పెట్టి విద్యార్థుల సంఖ్య పెంచారు. కలెక్టర్ తనిఖీలతో స్కూల్స్ అన్నీ వణికిపోతున్నాయి. ఎప్పుడు ఏ స్కూల్‌కు వచ్చి భోజనం చేస్తారోననే భయం పట్టుకుంది.

డిమాండ్లు నెరవేరితేనే దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్!
Education· 22 Jul 2026

డిమాండ్లు నెరవేరితేనే దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్!

NEET పేపర్ లీకేజీపై 25 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్ కేంద్రానికి లేఖ రాశారు. "నాకు బతకాలని ఉంది, స్టూడెంట్స్ కోసం చాలా చేయాలి" అని పేర్కొంటూనే, ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకోమని హామీ ఇస్తేనే దీక్ష విరమిస్తానని స్పష్టం చేశారు. పేపర్ లీక్ బాధితులకు పరిహారం, విద్యాశాఖ మంత్రి రాజీనామా, పార్లమెంట్‌లో చర్చపై హాస్పిటల్ కి వచ్చి మంత్రులు సానుకూలంగా స్పందించారని తెలిపారు. ప్రొటెస్ట్ చేసిన వారిపై కేసులు, వేధింపులు ఉండవని కేంద్రం భరోసా ఇవ్వకపోతే తన నిరవధిక దీక్ష కొనసాగుతుందని హెచ్చరించారు.