← Back to news

‘Brain Rot’ అంటే తెలుసా?

By Nani· 4 Aug 2026
‘Brain Rot’ అంటే తెలుసా?

ఒక్క రీల్ చూద్దామని ఫోన్ తీస్తాం.. చూస్తే గంట గడిచిపోతుంది! 📱 ఇలాంటి లో-క్వాలిటీ, రిపీటెడ్ ఆన్‌లైన్ కంటెంట్‌ను ఎక్కువగా చూడటం వల్ల మన ఆలోచనా సామర్థ్యం లేదా మెంటల్ స్టేట్ దెబ్బతింటోందనే భావనను ‘బ్రెయిన్ రాట్’ అంటారు. ఇది మెడికల్ డయాగ్నోసిస్ కాదు.. ఇంటర్నెట్‌లో పాపులర్ అయిన పదం మాత్రమే. ఈ పదం ఎంత ట్రెండ్ అయిందంటే Oxford Word of the Year 2024గా కూడా ఎంపికైంది. కంటెంట్ చూస్తున్నామా.. లేక స్క్రోలింగ్‌కే అలవాటు పడిపోయామా అనేది అప్పుడప్పుడు చెక్ చేసుకోవడం బెటర్!

More in Education