Jobs

10th క్లాస్ అర్హతతో ఇండియా పోస్ట్‌లో ఉద్యోగాలు.. భారీ జీతం
Jobs· 4 Aug 2026

10th క్లాస్ అర్హతతో ఇండియా పోస్ట్‌లో ఉద్యోగాలు.. భారీ జీతం

ఇండియా పోస్ట్ బెంగళూరులోని మెయిల్ మోటర్ సర్వీస్ (MMS) డిపార్ట్‌మెంట్‌లో స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులకు అప్లికేషన్స్ స్టార్ట్ అయ్యాయి. మొత్తం 11 ఖాళీలు ఉండగా, వాటిలో 10 బెంగళూరు, ఒకటి మైసూరు సబ్‌డిపోలో ఉన్నాయి. సెలెక్టయిన వారికి నెలకు రూ.19,900 నుంచి రూ.63,200 వరకు శాలరీ ఉంటుంది. పదో తరగతితో పాటు లైట్, హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్, మూడేళ్ల డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్, ఏజ్ 56 ఇయర్స్ లోపుండాలి. కావాల్సిన డాకుమెంట్స్ అన్ని <a href="https://www.indiapost.gov.in/vacancies">ఆఫ్‌లైన్‌</a> ద్వారా 60 రోజుల్లో బెంగళూరులోని MMS మేనేజర్‌కు మెయిల్ పంపాలి.

మోదీ వెంటనే క్షమాపణ చెప్పాలి
Jobs· 22 Jul 2026

మోదీ వెంటనే క్షమాపణ చెప్పాలి

దిల్లీలో విద్యార్థులపై జరిగిన దాడికి ప్రధాని మోదీ నైతిక బాధ్యత వహించి క్షమాపణ చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. రామ్‌మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించి ఆయన మాట్లాడారు. విద్యార్థులపై జరిగిన దాడి, వారి ఆందోళనలను అణిచివేయడం వల్ల యువతలో తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు. పోటీపరీక్షల వ్యవస్థను నాశనం చేయడం ద్వారా ఉద్యోగ అవకాశాలు తగ్గిస్తున్నారని ఫైరయ్యారు. హోంమంత్రి అమిత్ షా, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నారు. విద్యార్థులను కొట్టిన ఢిల్లీ పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు.