బాలుడి చేయి విరిగేలా కొట్టిన టీచర్

అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలంలోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్‌లో రెండో తరగతి చదువుతున్న మొహమ్మద్ అలీపై హిందీ ఉపాధ్యాయురాలు దాడి చేసినట్లు తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఘటనలో బాలుడి చేతికి తీవ్ర గాయమైందని, చేయి విరిగేలా కొట్టారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారిపై ఇంత తీవ్రంగా దాడి చేయడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బాధ్యురాలైన ఉపాధ్యాయురాలిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.



