Local

పెండింగ్‌ కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేయాలి: ఎస్పీ
Local· 26 May 2026

పెండింగ్‌ కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేయాలి: ఎస్పీ

TG: ప్రజలకు పోలీసులు మెరుగైన సేవలు అందించాలని, పెండింగ్‌ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని మెదక్ ఎస్పీ డీవీ.శ్రీనివాస్ రావు సూచించారు. మెదక్ జిల్లా చిన్న శంకరంపేట్ పోలీస్‌‌స్టేషన్‌ను ఎస్పీ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లో నిర్వహిస్తున్న రికార్డులు, పెండింగ్‌ కేసులు, నేర నియంత్రణ చర్యలు, సిబ్బంది విధి నిర్వహణ తదితర అంశాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను సమీక్షించిన ఎస్పీ.. కేసుల దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

 'అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి'
Local· 26 May 2026

'అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి'

TG: హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలో నిర్మిస్తున్న పీవీ విజ్ఞాన కేంద్రం అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి సంబంధితశాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం మాజీ ప్రధానమంత్రి దివంగత నేత పాములపర్తి వెంకట నరసింహారావు స్వగ్రామమైన వంగరలో నిర్మిస్తున్న పీవీ విజ్ఞాన కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పీవీ స్ఫూర్తి వనంలోని ఫోటోగ్యాలరీ, సైన్స్ మ్యూజియం, సమావేశ మందిరాన్ని సందర్శించిన కలెక్టర్, అసంపూర్తిగా ఉన్న పనులను సత్వరమే పూర్తి చేయాలని పర్యాటక శాఖ, కుడా అధికారులకు సూచించారు.

 యువతి ముందు జిప్పు తీసి ?  మార్నింగ్ వాక్ లో షాకింగ్  ఘటన
Local· 27 Apr 2026

యువతి ముందు జిప్పు తీసి ? మార్నింగ్ వాక్ లో షాకింగ్ ఘటన

హైదరాబాద్‌లో యువతి మార్నింగ్ వాక్ లో వరస్ట్ ఎక్స్ పీరియన్స్ ఫేస్ చేసింది. ఎదురైంది. మై హోమ్ అవతార్ -నార్సింగి చౌరస్తా రూట్ లో సైకిల్ ట్రాక్ సమీపంలో ఉదయం 6 గంటలకి వాక్‌కు వెళ్లిన ఆమె ముందే ఓ వ్యక్తి ప్యాంట్ జిప్ తీసి అసభ్యంగా ప్రవర్తించాడు. తాను ధరించిన స్పోర్ట్స్ డ్రెస్‌లో ఎలాంటి తప్పు లేదని ప్రశ్నించిన ఆమె, రోడ్లపై ఆటోలు, బైక్‌లపై వెళ్లే కొందరు పెద్దవారు కూడా అసభ్యంగా చూడటం బాధాకరమని ఫీల్ అయింది. ఈ ఎక్స్ పీరియన్స్ ని ఆ యువతి సోషల్ మీడియాలో వీడియో రూపంలో షేర్ చేసింది. హైదరాబాద్ లో మహిళలకు సేఫ్టీ లేదా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

డిస్టెన్స్ డిగ్రీలపై తెలంగాణ  హైకోర్టు షాకింగ్  జడ్జిమెంట్ !
Local· 26 Apr 2026

డిస్టెన్స్ డిగ్రీలపై తెలంగాణ హైకోర్టు షాకింగ్ జడ్జిమెంట్ !

పక్క రాష్ట్రాల వర్సిటీల స్టడీ సెంటర్లలో Distance Education ద్వారా డిగ్రీలు చేసిన వారికి తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. రాష్ట్రాలు దాటి నిర్వహించే ఇలాంటి డిగ్రీలు కేవలం కాగితపు ముక్కలే అని, ప్రభుత్వ ఉద్యోగాలకు ఇవి Not Valid అని తేల్చి చెప్పింది. ఈ సంచలన తీర్పుతో సర్కారీ కొలువులే లక్ష్యంగా ఉన్న వేలాది మంది అభ్యర్థుల ఫ్యూచర్ ఇప్పుడు రిస్క్‌లో పడింది!2022 లైబ్రేరియన్ పోస్టుల వెరిఫికేషన్ సమయంలో ఆచార్య నాగార్జున వర్సిటీ డిగ్రీలను టీజీపీఎస్సీ తిరస్కరించడంతో ఈ వివాదం మొదలైంది. యూజీసీ నిబంధనల ప్రకారం వర్సిటీలు తమ రాష్ట్ర సరిహద్దులు దాటి డిగ్రీలు ఇవ్వడం చెల్లదని న్యాయస్థానం స్పష్టం చేసింది.

తెలంగాణలో సెల్ఫ్ జనగణన షురూ.. ఆన్‌లైన్‌లో మీరే నింపేయండి ఇలా!
Local· 26 Apr 2026

తెలంగాణలో సెల్ఫ్ జనగణన షురూ.. ఆన్‌లైన్‌లో మీరే నింపేయండి ఇలా!

తెలంగాణలో స్వీయ జనగణన ఇవాళ్టి నుంచి మొదలైంది. మే 9వరకు మీరే డైరెక్ట్ గా ఆన్‌లైన్‌లో మీ డీటెయిల్స్ నింపేయొచ్చు. అఫీషియల్ పోర్టల్ se.census.gov.in ఓపెన్ చేసి తెలంగాణ ఎంచుకోండి. మీ ఇంట్లో కుటుంబ పెద్ద పేరు, మీ మొబైల్ నెంబర్, ఎంటర్ చేయండి. మీ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. దానిని ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఇంటి అడ్రస్ డీటెయిల్స్ 'Google Earth' మ్యాప్ ద్వారా కరెక్ట్ గా మార్క్ చేయాలి. మొత్తం 33 ప్రశ్నలు ఉంటాయి. వాటిని నింపి సబ్మిట్ చేయగానే మీకు ఒక Reference ID వస్తుంది. ఎమ్మూనరేటర్లు మే 11 నుంచి జూన్ 9 మధ్య మీ ఇంటికి వచ్చినప్పుడు ID చూపిస్తే మీ పనైపోతుంది. హెల్ప్ లైన్ నెంబర్ 1855కి కాల్ చేయొచ్చు.