Local

గేమ్స్‌పై ఇంట్రెస్ట్ పెంపొందించుకోవాలి: ఎమ్మెల్యే గూడెం
Local· 30 May 2026

గేమ్స్‌పై ఇంట్రెస్ట్ పెంపొందించుకోవాలి: ఎమ్మెల్యే గూడెం

TG: నేటి యూత్ గేమ్స్‌పై ఇంట్రెస్ట్ పెంపొందించుకోవాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సూచించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం భానురు విలేజ్‌లో ఏర్పాటు చేసిన పీపీఆర్ వాలీబాల్ టోర్నమెంట్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. క్రీడలు శారీరక దృఢత్వంతోపాటు మానసిక వికాసానికి కూడా దోహదపడతాయని తెలిపారు. నేటి యూత్ ఎక్కువ టైమ్ ఫోన్లు, సోషల్ మీడియాకే పరిమితం కాకుండా గేమ్స్‌లో పాల్గొనడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవనాన్ని అలవర్చుకోవాలని సూచించారు. క్రీడా సదుపాయాలను సద్వినియోగం చేసుకొని నేషనల్, ఇంటర్నేషనల్ లెవల్‌లో రాణించేలా కృషి చేయాలని కోరారు.

అంగన్వాడీ టీచర్లకు అవమానం
Local· 29 May 2026

అంగన్వాడీ టీచర్లకు అవమానం

TG: అంగన్వాడీ టీచర్లను కింద కూర్చోబెట్టి వారి ఎదుట ఐసీడీఎస్ సీడీపీవో, సూపర్వైజర్ కుర్చీలపై కూర్చొని అంగన్వాడీ టీచర్లను అవమానపరిచారు. ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా యాదాద్రిభువనగిరి జిల్లా వలిగొండలోని అంగన్వాడి కేంద్రంలో వెయ్యిరోజుల ప్రాముఖ్యత ప్రొగ్రామ్ నిర్వహించారు. తల్లులు, గర్భిణీలకు అవగాహన కల్పించే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఐసీడీఎస్ సీడీపీవో వెంకటరమణ, సూపర్‌వైజర్లు గోదా ధనమ్మ, పారిజాత బాలమణి కుర్చీలపై కూర్చొని మిగతా వారిని కింద కూర్చొబెట్టారు. మేము మీకంటే స్థాయిలో ఎక్కువ అనే విధంగా వారు బిహెవ్ చేయడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

'ప్రజల్లో నమ్మకం పెంచేలా విజిబుల్ పోలీసింగ్ నిర్వహించాలి'
Local· 29 May 2026

'ప్రజల్లో నమ్మకం పెంచేలా విజిబుల్ పోలీసింగ్ నిర్వహించాలి'

TG: ప్రజల్లో పోలీసులపై నమ్మకం పెంచేలా విజిబుల్ పోలీసింగ్ నిర్వహించాలని జిల్లా ఎస్పీ ఆకాంక్ష్ యాదవ్ సూచించారు. శుక్రవారం యాదాద్రిభువనగిరి జిల్లా వలిగొండ పోలీస్‌స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పనితీరు, సిబ్బంది క్రమశిక్షణ, అత్యవసర సమయాల్లో స్పందించే విధానాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు. స్టేషన్‌లోని రిసెప్షన్ కౌంటర్, క్రైమ్ విభాగం, జనరల్ డైరీ నిర్వహణను ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులకు తక్షణమే సహాయం అందించాలని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో లేదా విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

రైతులు పుకార్లు నమ్మొద్దు : కలెక్టర్ ప్రతిమాసింగ్
Local· 27 May 2026

రైతులు పుకార్లు నమ్మొద్దు : కలెక్టర్ ప్రతిమాసింగ్

TG: అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, రైతులు పుకార్లను నమ్మి మోసపోవద్దని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ రైతులకు విజ్ఞప్తి చేశారు. బుధవారం నర్సాపూర్ మండలం తుల్జారంపేట్ గ్రామంలోని ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆర్డీవో రామకృష్ణ, తహసీల్దార్ శ్రీనివాస్‌తో కలిసి పరిశీలించారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. నిన్న కురిసిన వర్షానికి జిల్లా వ్యాప్తంగా 400 మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసిందని రిపోర్ట్ ఉందని, ఆరబెట్టి తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ మిల్లులకు పంపించి రైతులకు న్యాయం చేస్తామన్నారు.

ధాన్యం బస్తాలు దహనం చేసి నిరసన
Local· 27 May 2026

ధాన్యం బస్తాలు దహనం చేసి నిరసన

TG: మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పు లింగాపూర్ వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ - వెల్దుర్తి ప్రధాన రహదారిపై ధాన్యం బస్తాలు దహనం చేసి నిరసన తెలిపారు. గత నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బంది పడుతున్నామని, అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు వచ్చి ధాన్యం కొనుగోలు చేసే వరకు తాము వెళ్ళమంటూ రోడ్డుపై గ్యాస్ పొయ్యి పెట్టి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా కలెక్టర్ రావాలంటూ నినాదాలు చేశారు. పోలీసులను సైతం అక్కడి నుండి వెళ్లకుండా అడ్డుకున్నారు.

'అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక నిఘా పెట్టాలి'
Local· 26 May 2026

'అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక నిఘా పెట్టాలి'

TG: బక్రీద్ పండుగ నేపథ్యంలో మెదక్ టౌన్ పరిధిలోని బోధన్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక చెక్‌పోస్టును మెదక్ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాస రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వాహనాల తనిఖీ విధానం, రికార్డుల నిర్వహణ, విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది పనితీరును పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, సంబంధిత అనుమతి పత్రాలు, రవాణా ధ్రువపత్రాలను తప్పనిసరిగా పరిశీలించాలని ఆదేశించారు. తనిఖీ చేసిన వాహనాల వివరాలను రిజిస్టర్లలో నమోదు చేయాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు.

తమ ధాన్యానికి తొందరగా తూకం వేయండి సారూ
Local· 26 May 2026

తమ ధాన్యానికి తొందరగా తూకం వేయండి సారూ

TG: మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం సూరారంలో నెలరోజులు దాటినా ధాన్యాన్ని తూకం వేయడంలేదని, లారీలు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. తన హెల్త్ బాగలేక హాస్పిటల్‌కు వెళ్లి వచ్చానని, 45రోజులు దాటినా ఇప్పటికీ ధాన్యం తూకం వేయలేదని రైతు నాగులు తన బాధను తెలిపాడు. కొనుగోలు కేంద్రం నుంచి ధాన్యం లోడ్ చేసి రైస్‌మిల్‌కు పంపి ఐదురోజులు గడుస్తుందని, లారీలు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, నలుగురు ఐదుగురు రైతులతో కలిసి లారీలను తీసుకొచ్చి ధాన్యాన్ని తరలిస్తున్నామని నిర్వాహకురాలు ఊర్మిళ తెలిపారు. అందుకే వరుసక్రమంలో లారీలను పెట్టలేకపోతున్నామని ఆమె చెప్పారు.

పెండింగ్‌ కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేయాలి: ఎస్పీ
Local· 26 May 2026

పెండింగ్‌ కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేయాలి: ఎస్పీ

TG: ప్రజలకు పోలీసులు మెరుగైన సేవలు అందించాలని, పెండింగ్‌ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని మెదక్ ఎస్పీ డీవీ.శ్రీనివాస్ రావు సూచించారు. మెదక్ జిల్లా చిన్న శంకరంపేట్ పోలీస్‌‌స్టేషన్‌ను ఎస్పీ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లో నిర్వహిస్తున్న రికార్డులు, పెండింగ్‌ కేసులు, నేర నియంత్రణ చర్యలు, సిబ్బంది విధి నిర్వహణ తదితర అంశాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను సమీక్షించిన ఎస్పీ.. కేసుల దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

 'అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి'
Local· 26 May 2026

'అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి'

TG: హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలో నిర్మిస్తున్న పీవీ విజ్ఞాన కేంద్రం అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి సంబంధితశాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం మాజీ ప్రధానమంత్రి దివంగత నేత పాములపర్తి వెంకట నరసింహారావు స్వగ్రామమైన వంగరలో నిర్మిస్తున్న పీవీ విజ్ఞాన కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పీవీ స్ఫూర్తి వనంలోని ఫోటోగ్యాలరీ, సైన్స్ మ్యూజియం, సమావేశ మందిరాన్ని సందర్శించిన కలెక్టర్, అసంపూర్తిగా ఉన్న పనులను సత్వరమే పూర్తి చేయాలని పర్యాటక శాఖ, కుడా అధికారులకు సూచించారు.