Motivational

పిల్లలు అడిగిందల్లా ఇస్తున్నారా? దీని వల్ల కలిగే నష్టాలు ఇవే!
Motivational· 22 Jun 2026

పిల్లలు అడిగిందల్లా ఇస్తున్నారా? దీని వల్ల కలిగే నష్టాలు ఇవే!

పిల్లలు అడిగిన ప్రతిదాన్ని వెంటనే కొనిపెట్టడం ప్రేమ అనుకుంటే పొరపాటే. ఇలా చేయడం వల్ల వారి ఫ్యూచర్ పాడవుతుంది. ఏది అడిగినా వెంటనే వారికి దొరికేయడం వల్ల పిల్లల్లో ఓర్పు నశిస్తుంది. దేనికోసం వెయిట్ చేయడం వారికి అస్సలు నచ్చదు. అలాగే ఏ కష్టం లేకుండా అన్నీ వచ్చేస్తుంటే, వస్తువుల విలువతో పాటు వాటి వెనుక ఉన్న పేరెంట్స్ కష్టం కూడా వారికి అస్సలు తెలియదు. దీనివల్ల పిల్లల్లో మొండితనం, స్వార్థం పెరిగిపోయి ఎప్పుడూ తమ గురించే ఆలోచిస్తారు. అందుకే పిల్లలకు ప్రేమతో పాటు క్రమశిక్షణ నేర్పడం, హద్దులు పెట్టడం, అవసరమైనప్పుడు 'కాదు' అని చెప్పడం పేరెంటింగ్‌లో చాలా ఇంపార్టెంట్.

ఆడవారు మీకంటే హైట్ ఉన్నా, ఎక్కువ సంపాదిస్తున్నా.. మగాళ్లకు భయమా?
Motivational· 20 Jun 2026

ఆడవారు మీకంటే హైట్ ఉన్నా, ఎక్కువ సంపాదిస్తున్నా.. మగాళ్లకు భయమా?

మహిళా భాగస్వామి కంటే మగవారే పైచేయిగా ఉండాలనే రూల్ వెనుక పితృస్వామ్య (patriarchy) ఆలోచనలు ఉన్నాయి.5,000 ఏళ్ల క్రితం ఇద్దరూ సమానమే అయినా, కాలక్రమేణా మగవారిలో అభద్రతాభావం పెరిగింది. డేటింగ్ యాప్స్‌లో పురుషులు హైట్ అబద్ధం చెప్పడం, వైఫ్ ఎక్కువ సంపాదిస్తే ఇన్ఫీరియర్‌గా ఫీల్ అవ్వడం దీనికి నిదర్శనం. అమెరికాలో 16% మంది భార్యలే భర్త కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. బ్రిటన్ రాణి భర్త ఆల్బర్ట్ కూడా 'నేను ఇంట్లో కేవలం భర్తను, యజమానిని కాదు' అని బాధపడ్డారు. నిజానికి మహిళలు ఎక్కువ హైట్ ఉన్నా, ఎక్కువ సంపాదించినా అది చాలా నార్మల్! మనసుతో భాగస్వామిని ఎంచుకుంటేనే రిలేషన్స్ హ్యాపీగా ఉంటాయి.

ఫెయిల్యూర్స్ నుంచే సక్సెస్ కు పునాదులు- ఇంద్రనూయి
Motivational· 19 Jun 2026

ఫెయిల్యూర్స్ నుంచే సక్సెస్ కు పునాదులు- ఇంద్రనూయి

విజయాల కంటే అపజయాలే వ్యాపార సామ్రాజ్యాలకు అసలైన దిక్సూచి! తప్పుల నుండి నేర్చుకుంటూ, విఫలమైన చోట నుంచే విజయ తీరాల వైపు ప్రయాణాన్ని ప్రారంభిం చడమే నిజమైన నాయకత్వ లక్షణం.ఫెయిల్ స్మార్టర్ అనే ఈ కొత్త పుస్తకం వ్యాపార ప్రపంచంలో విఫలమైన వ్యూహాలను ఎలా విజయవంత మైన అవకాశాలుగా మార్చుకోవచ్చో అద్భుతంగా విశ్లేషించింది. ఓటములను చూసి వెనకడుగు వేయరాదన్న మెసేజ్ ను ఈ బుక్ బాగా వివరిస్తోంది.పెప్సీ కంపెనీ మాజీ సీఈఓ ఇంద్రనూయీ రాసిన ఈ బుక్ ఈ తరానికి మంచి ఇన్స్ పిరేషన్ గా ఉంటుంది. సో బుక్ లవర్స్.. ఎంజాయ్ రీడింగ్ దిస్ బుక్ !

లైఫ్‌లో ఈ 8 టైప్స్ ఫ్రెండ్స్ మస్ట్!
Motivational· 19 Jun 2026

లైఫ్‌లో ఈ 8 టైప్స్ ఫ్రెండ్స్ మస్ట్!

మీ ఫ్రెండ్స్ అప్పుడప్పుడు మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తుంటారు. అలా ఒకే ఫ్రెండ్ నుంచి మీకు కావాల్సినవన్నీ దొరకవని గాలప్ రీసెర్చ్ వెల్లడించింది. అందుకే మీ లైఫ్‌లో కచ్చితంగా 8 రకాల ఫ్రెండ్స్ ఉండాలని ఈ స్టడీ చెప్తోంది. మిమ్మల్ని మోటివేట్ చేసే 'కోచ్', సపోర్ట్ చేసే 'చీర్‌లీడర్', కలిసి వర్క్ చేసే 'పార్ట్నర్', ఎనీటైమ్ తోడుండే 'బెస్ట్ ఫ్రెండ్' అవసరం. అలాగే పరిచయాలు పెంచే 'కనెక్టర్', నవ్విస్తూ ఉండే 'ఫన్ పర్సన్', కొత్త విషయాలు నేర్పే 'ఇంటెలిజెంట్ ఫ్రెండ్', మంచి దారి చూపించే 'మెంటార్' ఉండాలి. ఈ డిఫరెంట్ క్యారెక్టర్స్ మీ లైఫ్‌ని కంప్లీట్ చేస్తాయి. మీ ఫ్రెండ్స్ లిస్ట్‌లో వీరంతా ఉన్నారో లేదో ఒకసారి చూసుకోండి.

కోట్లు సంపాదించినా పెళ్లి చేసుకోకపోతే అంతే!
Motivational· 18 Jun 2026

కోట్లు సంపాదించినా పెళ్లి చేసుకోకపోతే అంతే!

పిల్లలు ఎంత పెద్ద స్థాయికి ఎదిగినా, కోట్లు సంపాదించినా. వారి పెళ్లి చూడాలనేదే పేరెంట్స్, తాతమ్మల పెద్ద కోరిక అని చెప్పే వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అమెరికాకు చెందిన ఒక మల్టీ మిలియనీర్ కంపెనీ ఓనర్ తన స్టోరీని షేర్ చేశారు. వారి విలేజ్ సాంప్రదాయం ప్రకారం ఒక వేడుకలో పెళ్లయిన కూతుళ్లకు బ్లాంకెట్స్ ఇచ్చే ట్రెడిషన్ ఉందని, తాను మ్యారేజ్ చేసుకోకపోవడంతో ఆ గిఫ్ట్స్ తన అమ్మమ్మకు రాలేదని, దీంతో ఆమె బాధపడుతున్నారు అంటూ చెప్పుకొచ్చారు. కోట్లు సంపాదించినా పెళ్లి చేసుకోకపోతే అంతే అంటూ ప్రెసెంట్ ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.