Motivational· 18 Aug 2026
ఉదయాన్నే నిద్రలేవాలా? ఈ ట్రిక్ వాడండి!
ఉదయాన్నే త్వరగా లేవడం వల్ల జీవితంలో క్రమశిక్షణ, గెలుపు సాధ్యమవుతాయి. అయితే బద్ధకాన్ని వదిలి మంచం దిగడం చాలామందికి కష్టంగా ఉంటుంది. దీనికోసం ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు మెల్ రాబిన్స్ ‘5 సెకన్ల రూల్’ అనే ఒక మంచి ట్రిక్ చెప్పారు. ఉదయం మెలకువ రాగానే రాకెట్ లాంచ్ లాగా మనసులో 5, 4, 3, 2, 1 అని కౌంట్‌డౌన్ చేసుకుని వెంటనే మంచం దిగేయాలి. ఈ చిట్కా బద్ధకాన్ని పోగొట్టడమే కాకుండా, ఆందోళనను, సాకులు చెప్పే అలవాటును వదిలించడానికి అద్భుతంగా పనిచేస్తుందని తెలిపారు.