Technology

 మేకిన్ ఇండియా అద్భుతం.. పోర్టబుల్ వాటర్ పంప్ !!
Technology· 23 Apr 2026

మేకిన్ ఇండియా అద్భుతం.. పోర్టబుల్ వాటర్ పంప్ !!

సముద్రపు నీటిని మంచి నీరుగా మార్చే సరికొత్త పరికరాన్ని డీఆర్ డీవో తయారు చేసింది.దీనికి ఎలాంటి కరెంటు అవసరం లేదు. ఇది మాన్యువల్ ప్రెషర్ పంప్.. బ్యాటరీ, ఫిల్టర్ కూడా అవసరం లేదు. హ్యాండ్ పంపు కొట్టినప్పుడు సముద్రపు నీరు మెంబ్రేన్ ఫిల్టర్ల గుండా లోపలికి వెళ్లి, ఉప్పు, బాక్టీరియా , వైరస్ లను వడకట్టి స్వచ్ఛమైన తాగు నీరు అందిస్తుంది. గంటకు 4-5 లీటర్ల నీరు శుద్ధి చేస్తుంది. ఇది యుద్ధరంగంలో సైనికులకు, విపత్తులప్పుడు బాగా యూజ్ అవుతుంది. ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా డీఆర్డీవో స్వదేశీ టెక్నాలజీతో దీనిని తయారు చేసింది.

 జయహో భారత్ ... న్యూక్లియర్ పవర్ లో రికార్డు!!
Technology· 15 Apr 2026

జయహో భారత్ ... న్యూక్లియర్ పవర్ లో రికార్డు!!

న్యూక్లియర్ పవర్లో భారత్ కొత్త విజయం సాధించింది. ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ల ద్వారా ఇంధనాన్ని తయారు చేయడంలో సక్సెస్ అయింది. తమిళనాడు, కల్పక్కంలోని ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ మన దేశంలో దొరికే యురేనియం 238 రకం, థోరియం లను ఉపయోగించి రియాక్టర్ నడిచేందుకు ఇంధనాన్ని తయారు చేసింది. కానీ అణు రియాక్టర్ నడవాలంటే యురేనియం 235 రకం అవసరం. మనకు ఈ నిల్వలు లేవు. దాంతో పుష్కలంగా దొరికే ఆల్టర్నేటివ్ ఖనిజంతో ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ను పనిచేయించారు. ఇది ఇంధనం తనకు తాను తయారు చేసుకుంటుంది..పైగా అణు శక్తిని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది.

గ్యాస్ లేకుండానే మంట! సరికొత్త ప్లాస్మా స్టవ్
Technology· 11 Apr 2026

గ్యాస్ లేకుండానే మంట! సరికొత్త ప్లాస్మా స్టవ్

ఇకపై గ్యాస్ సిలిండర్లతో పనిలేకుండానే, విద్యుత్తుతో గ్యాస్ స్టవ్ తరహాలో వంట చేసుకోవచ్చు. అదే ఈ Electric Flame Plasma Stove ప్రత్యేకత.LPG లేకుండా విద్యుత్తు ద్వారా ప్లాస్మా టెక్నాలజీతో నిజమైన మంటను సృష్టిస్తుంది. ఇండక్షన్ స్టవ్‌లా కాకుండా, దీనిపై మనం గ్యాస్ పొయ్యిపై చేసినట్లుగానే అన్ని రకాల పాత్రలతో వంట చేయవచ్చు. ఇది గాలిని అయనీకరణం (Ionize) చేయడం ద్వారా 1200°C నుండి 1300°C వరకు వేడిని ఇచ్చే ప్లాస్మా జెట్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది చూడటానికి సాధారణ గ్యాస్ మంటలాగే కనిపిస్తుంది. గ్యాస్ లీకేజీ భయం ఉండదు. గ్యాస్ లభ్యత ఇంకా సంక్షోభంలో ఉండడంతో ఇలాంటి స్టవ్ లు బెటర్ ఆప్షన్. కానీ రేట్ కాస్త ఎక్కువే. దాదాపుగా రూ 35,000 ఉంది. మిడిల్ క్లాస్ కి అందుబాటులో రావాలంటే కాస్త టైమ్ పడుతుంది.