← Back to news

AI హైప్ ఓకే… రిటర్న్స్ ఎక్కడ?

By Nani Garikina· 21 Aug 2026
AI హైప్ ఓకే… రిటర్న్స్ ఎక్కడ?

AI బిజినెస్‌పై కంపెనీలు భారీగా ఖర్చు చేస్తున్నాయి. కానీ ఇక్కడే ఇన్వెస్టర్లకు చిన్న డౌట్ మొదలైంది. డేటా సెంటర్లు, చిప్స్, విద్యుత్, మోడల్ ట్రైనింగ్ కోసం బిలియన్ల డాలర్లు పెడుతున్నారు. ఆ ఖర్చుకు తగ్గ లాభాలు ఎప్పుడు వస్తాయో మాత్రం ఇంకా క్లారిటీ లేదు. పైగా ఈ పెట్టుబడుల్లో కొంత భాగం అప్పుల ద్వారా వస్తుండటంతో, వడ్డీ రేట్లు కూడా మార్కెట్‌పై ఒత్తిడి పెంచుతున్నాయి. తాజాగా AI కోసం భారీగా అప్పులు తీసుకుంటున్న టెక్ కంపెనీల బాండ్లపై ఇన్వెస్టర్లు ఎక్కువ రాబడి కోరుతున్నారు.

More in Technology