← Back to news

మెసేజ్ చదివి… రిప్లై కూడా పంపేస్తుందా?

By Nani Garikina· 21 Aug 2026
మెసేజ్ చదివి… రిప్లై కూడా పంపేస్తుందా?

ఇక ChatGPT కేవలం మనతో చాట్ చేసే టూల్‌గా ఉండకపోవచ్చు. కొత్త Apple Messages ప్లగిన్‌తో Macలో ఉన్న iMessage, SMS, RCS మెసేజ్‌లను వెతకడం, చదవడం, సారాంశం చెప్పడం, రిప్లై రాయడం మాత్రమే కాదు… మన అనుమతితో ఆ మెసేజ్‌ను పంపడం కూడా చేయొచ్చు. అంటే “ఏం రిప్లై ఇవ్వాలి?” అని ఆలోచించే పని కూడా ChatGPTకి అప్పగించొచ్చు. అయితే ఈ ఫీచర్‌కి మెసేజ్‌లు, కాంటాక్ట్స్‌కి ప్రత్యేక అనుమతులు ఇవ్వాలి. పంపే ముందు మెసేజ్, ఎవరికి పంపాలో యూజర్‌కి చూపించి అనుమతి తీసుకోవడం డిఫాల్ట్‌గా ఉంటుంది.

More in Technology