పిల్లల కోసం ChatGPT మారుతోంది!

ఇక 13–17 ఏళ్ల వాళ్లు ChatGPT వాడితే.. పెద్దలు వాడే విధంగా అంతా ఒకేలా ఉండదు. OpenAI టీనేజర్ల కోసం ప్రత్యేకంగా ChatGPT for Teensను తీసుకొచ్చింది. ఎందుకంటే ఈ వయసులో AIని వాడేటప్పుడు కొన్ని విషయాల్లో మరింత జాగ్రత్త అవసరం. అందుకే సున్నితమైన కంటెంట్‌పై అదనపు పరిమితులు, వయసుకు తగ్గ సమాధానాలు ఉంటాయి. అంతేకాదు, తల్లిదండ్రులు కొన్ని సెట్టింగ్స్‌ను తమకు నచ్చినట్టు మార్చుకోవచ్చు. అంటే.. ChatGPT ఇప్పుడు ఎవరు అడుగుతున్నారు అనేదాన్ని కూడా పట్టించుకునే దిశగా అడుగు వేసిందన్నమాట.



