TG· 8 Aug 2026
ఆరుతడి పంటలనే సాగు చేయాలి: కోమటిరెడ్డి
TG: వరికి బదులుగా తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటలు, కూరగాయల సాగు వైపు రైతులను మళ్లించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం నల్గొండలో నిర్వహించిన వ్యవసాయ, ఉద్యానవన శాఖల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎల్నినో ప్రభావంతో చిన్న, సన్నకారు రైతులు నష్టపోకుండా ఉండేందుకు తక్కువ నీటితో సాగయ్యే పంటలపై దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. రానున్న రెండు, మూడు నెలల్లో వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతులకు ఆరుతడి పంటల సాగుపై అవగాహన కల్పించాలన్నారు.