రూల్స్ బ్రేక్.. ఫైన్‌కు బదులు అవగాహన

TG: ట్రాఫిక్ నిబంధనలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు సూర్యాపేట జిల్లా కోదాడ ట్రాఫిక్ SI బైరెడ్డి అంజిరెడ్డి వినూత్నంగా స్పందించారు. కోదాడ పట్టణంలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో రిజిస్ట్రేషన్ నంబర్ స్పష్టంగా లేని ఓ ఆటోను గుర్తించారు. వాహనదారుడికి నిబంధనలు వివరించడంతో పాటు, అక్కడికక్కడే ఆటోపై రిజిస్ట్రేషన్ నంబర్‌ను స్వయంగా రాశారు. వాహనాలపై రిజిస్ట్రేషన్ నంబర్ స్పష్టంగా కనిపించేలా ఉంచడం ప్రతి వాహనదారుడి బాధ్యత అని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా నంబర్లు ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.



