TG

చిన్న నిర్లక్ష్యం.. క్షణాల్లో పెను ప్రమాదం
TG· 12 Jul 2026

చిన్న నిర్లక్ష్యం.. క్షణాల్లో పెను ప్రమాదం

TG: క్షణకాలపు అజాగ్రత్త జీవితకాలపు ఆవేదనకు దారితీస్తుందనడానికి ఈ CCTV దృశ్యాలే సజీవ సాక్ష్యం. వాహనం ఆపి, ఇంజిన్ రన్ అవుతుండగానే పిల్లలను దానిపై వదిలేయడం లేదా వారు పక్కనే ఉన్నప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంతటి పెను ప్రమాదానికి దారితీస్తుందో ఈ ఘటన చూస్తే అర్థమవుతుంది. వాహనం స్టార్ట్ చేసి ఉన్నప్పుడు వారు తెలియక చేసే ఆ చిన్న పొరపాటే క్షణాల్లో ఊహించని ప్రమాదంగా మారి ప్రాణాల మీదికి తెస్తుంది. అందుకు కనీస జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలని హైదరాబాద్ CP వీసీ సజ్జనార్ ఈ వీడియోను తన ట్విట్టర్‌‌లో పోస్ట్ చేసి అవగాహన కల్పించారు.

షాబాద్ ఘటనతో భయాందోళన
TG· 12 Jul 2026

షాబాద్ ఘటనతో భయాందోళన

TG: రిమాండ్‌లో ఉన్న నిందితులు బెయిల్‌పై బయటికి వస్తే ఎలాంటి దారుణాలకు దారి తీస్తుందో నిన్న జరిగిన రంగారెడ్డి జిల్లా షాబాద్ ఆరుహత్యల ఘటనే ఉదాహరణగా మారింది. నిందితుడు రాజ్‌కుమార్ సుమారు రూ.20 లక్షలు షాబాద్ PS అధికారులతో ఒప్పందం కుదుర్చుకుని స్టేషన్ బెయిల్‌పై బయటకు వచ్చినట్లు సమాచారం. షాబాద్ ఘటనతో బండి భగీరథ్ బాధిత కుటుంబం కూడా తీవ్ర భయాందోళనకు గురవుతుందని BRS నేత RS ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. తనకు బాలిక, ఆమె తల్లి ఫోన్ చేసి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారని, ఇతను కూడా బెయిల్‌పై వచ్చాడు. మా పరిస్థితి ఏంటోనని టెన్షన్ పడ్డారని ఆయన తెలిపారు.

నేరెళ్ల బాధితుడు కన్నుమూత
TG· 11 Jul 2026

నేరెళ్ల బాధితుడు కన్నుమూత

TG: రాజన్నసిరిసిల్ల జిల్లా నేరెళ్లలో 2017 జూలైలో జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇసుక లారీలు అడ్డుకున్న దళితులను పోలీసులు తీవ్రంగా హింసించి థర్డ్ డిగ్రీ ప్రయోగించడం, ఆ తర్వాత పరిణామాలు పెద్ద వివాదంగా మారాయి. ఈ ఘటనలో పోలీసుల థర్డ్ డిగ్రీకి గురైన ఎనిమిది మంది బాధితుల్లో ఒకరైన గంధం గోపాల్ అనారోగ్యంతో బాధపడుతూ శనివారం మృతి చెందారు. గోపాల్ మృతితో మిగిలిన బాధితులు మరోసారి న్యాయం కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఘటన జరిగి దాదాపు పదేళ్లు గడిచినా తమకు న్యాయం జరగలేదని, ప్రభుత్వాలు మారినా తమ పరిస్థితి మాత్రం మారలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

రన్నింగ్ కారులో మంటలు.. జస్ట్ మిస్
TG· 11 Jul 2026

రన్నింగ్ కారులో మంటలు.. జస్ట్ మిస్

TG: రన్నింగ్ కారులో మంటలు చెలరేగి అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ వైపు వెళ్తున్న కారు ఇంజన్‌లో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఇద్దరు గాయపడ్డారు. కారు డ్రైవర్ సహా, అందులో ఉన్నవారు వెంటనే కిందికు దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. చూస్తుండగానే కారు పూర్తిగా కాలి బూడిదైంది. వెంటనే క్షతగాత్రులను శంషాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్
TG· 11 Jul 2026

హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్

TG: హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవేపై భారీగా ట్రాఫిక్‌జామ్ అయింది. వీకెండ్ కావడం, ఖమ్మం జిల్లాలో నిన్న CM రేవంత్‌రెడ్డి సభ ఉండడంతో వాహనాల రద్దీ ఊహించని స్థాయికి చేరుకుంది. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. CM సభకు జనాలను తరలించేందుకు HYDలోని వివిధ డిపోల నుంచి వందలాది RTC బస్సులను ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించింది. బస్సులు ఒకేసారి హైదరాబాద్ నుంచి యాదాద్రి జిల్లా పంతంగి టోల్ ప్లాజా మీదుగా బయలుదేరాయి. అప్పటికే వాహనాలతో నిండిపోయిన హైవే, ఈ బస్సులు తోడవడంతో పంతంగి టోల్‌గేట్ వద్ద పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయింది.

విద్యార్థి సంఘాల ఆందోళన
TG· 10 Jul 2026

విద్యార్థి సంఘాల ఆందోళన

TG: విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా KG టు PG విద్యాసంస్థల బంద్‌కు వామపక్ష విద్యార్థి సంఘాల నేతలు పిలుపునిచ్చారు. SFI, AISFI, PDSU, AIDSO, AIFDS, AISB, AIPSU విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో హైదరాబాద్‌‌లో భారీ ప్రదర్శన నిర్వహించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం విద్యారంగంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, ప్రభుత్వ విద్యను బాగుచేస్తామని చెప్పి 23వేల ప్రభుత్వ స్కూళ్లను మూసివేయాలని నిర్ణయించడం దుర్మార్గమన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్స్‌ విడుదల కాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు.

RTC బస్సు ఎత్తుకెళ్లిన మందుబాబు
TG· 10 Jul 2026

RTC బస్సు ఎత్తుకెళ్లిన మందుబాబు

TG: మద్యం మత్తులో ఓ వ్యక్తి RTC బస్సును ఉడాయించిన సంఘటన జనగాంలో చోటు చేసుకుంది. పాలకుర్తి మండలం చెన్నూరుకు చెందిన జిట్టబోయిన వెంకన్న ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కుటుంబకలహాల కారణంగా ఇంట్లో నుంచి జనగాంకు వచ్చాడు. రాత్రి 11గంటలకు ట్రిప్ ముగించుకొని వచ్చిన RTC బస్సును డ్రైవర్ జనగాం బస్టాండ్‌ ఆవరణలోని పార్కింగ్ చేసి ఇంటికి వెళ్లాడు. మద్యంమత్తులో ఉన్న వెంకన్న తెల్లవారుజామున బస్సులోని టూల్‌బాక్స్‌పై తాళం కనిపించడంతో బస్సును స్టార్ట్ చేశాడు. దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి టోల్‌గేట్ వద్ద సిమెంట్ దిమ్మెను ఢీకొట్టాడు. టోల్‌గేట్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.

TG బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మృతి
TG· 9 Jul 2026

TG బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మృతి

తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దాసరి మూర్తి (65) గురువారం సాయంత్రం నిజామాబాద్ జిల్లా మెండోరా మండల కేంద్రంలోని ఆయన స్వగృహంలో గుండెపోటుతో మృతి చెందారు. బీసీ సంక్షేమం కోసం నిరంతరం శ్రమించే నాయకుడు హఠాన్మరణంతో బీసీ సంఘాల నాయకులు, మిత్రులు శ్రేయోభిలాషులు,బంధువులు కన్నీరు మున్నిరవు తున్నారు.దాసరి మూర్తి ఆకస్మికంగా గుండెపోటుతో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విచారంలో మునిగిపోయారు. అంత్యక్రియలను ఆయన స్వగ్రామంలో శుక్రవారం ఉదయం నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు,బంధువులు తెలిపారు.