← Back to news

రెండు చోట్ల ఓటు ఉంటే జైలే

By DK· 11 Jul 2026· హైదరాబాద్‌
రెండు చోట్ల ఓటు ఉంటే జైలే

TG: ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఒక వ్యక్తికి ఒక్కచోటే ఓటు ఉండాలని, అలాకాకుండా రెండు, అంతకన్నా ఎక్కువ చోట్ల ఓటు ఉంటే ఏడాది జైలు శిక్ష, జరిమానా పడుతుందని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి సీ.సుదర్శన్‌ రెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మీట్‌ ది ప్రెస్‌’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎవరికైనా రెండు చోట్ల ఓటు ఉంటే గుర్తిస్తామని, ఇందుకోసం ఎలక్షన్ కమిషన్ ‘డెమోగ్రాఫికల్లీ సిమిలర్‌ ఎంట్రీస్‌’ (DCE) అనే అత్యాధునిక సాఫ్ట్‌వేర్‌ను తీసుకొచ్చిందని చెప్పారు.

More in TG