TG

హైటెక్ సిటీలో 15ఏకరాల భూమికి కంచె
TG· 11 Jun 2026

హైటెక్ సిటీలో 15ఏకరాల భూమికి కంచె

TG: హైటెక్ సిటీలోని ఖానామెట్ గ్రామంలో అరబిందో టవర్స్ పక్కనున్న 15ఎకరాల ప్రభుత్వ భూమికి హైడ్రా కంచె ఏర్పాటు చేసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ విలేజ్‌లోని సర్వే నంబర్లు 41/12, 13, 14లో పదిహేను ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ భూమి సంరక్షణకు చర్యలు చేపట్టినట్లు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. స్థలాన్ని ఖాళీ చేయాలంటూ 2016లో TGIIC ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ భూమి తమదేనంటూ ఇట్టినా ప్రాపర్టీస్ సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. పిటిషనర్ సమర్పించిన పట్టా పత్రాలు నకిలీవి అని తేలింది.

రైతుభరోసా వద్దని రెండునెలలు తిరిగాను: బీ.సుదర్శన్‌రెడ్డి
TG· 9 Jun 2026

రైతుభరోసా వద్దని రెండునెలలు తిరిగాను: బీ.సుదర్శన్‌రెడ్డి

TG: CM రేవంత్ రెడ్డి కౌలు రైతులకు ఇచ్చిన హామీతో పాటు వరంగల్ డిక్లరేషన్‌ను ఇంప్లిమెంట్ చేయాలని సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జీ జస్టిస్ బీ.సుదర్శన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో కౌలు రైతుల సమస్యలపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. నాకు సుప్రీంకోర్టు నుంచి పెన్షన్ వస్తుంది. ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లిస్తాను. ఉండటానికి ఇల్లు కూడా ఉంది. అయినా నాకు రైతుభరోసా ఇస్తుంటే దాన్ని వదిలించుకోవడానికి రెండునెలలు అధికారుల చుట్టూ తిరిగానన్నారు. మొత్తానికి రైతుభరోసాను వదిలించుకున్నట్లు చెప్పారు.