ఎండిపోయిన చెరువులో 5K RUN

TG: చెరువుల పరిరక్షణ, భూగర్భ జలాల పెంపుపై అవేర్నేస్ కల్పించేందుకు ధాత్రి NGO సంస్థ వినూత్న కార్యక్రమం నిర్వహించింది. హైదరాబాద్‌లోని మన్సూరాబాద్‌లో ఎండిపోయిన పెద్దచెరువు అడుగున 5K Run Below The Lake పేరుతో రన్ నిర్వహించి ప్రజలను చైతన్యపరిచారు. చెరువు మధ్యలో నీటి బిందువు ఆకారంలో నిల్చొని "చెరువులను కాపాడుకుందాం-భూగర్భ జలాలను పెంచుకుందాం" అనే సందేశంతో అవగాహన కల్పించారు. ధాత్రి NGO వ్యవస్థాపకులు వెంకట్ మాట్లాడుతూ.. చెరువులు ఎండిపోతే బోర్లు ఎండిపోతాయని, బోర్లు ఎండిపోతే భవిష్యత్ తరాలకే కాదు ప్రస్తుత తరానికే ముప్పు తప్పదన్నారు.



