TG

కృష్ణా జలాలతో పాలమూరును పచ్చగా మారుస్తా: రేవంత్‌రెడ్డి
TG· 4 Jun 2026

కృష్ణా జలాలతో పాలమూరును పచ్చగా మారుస్తా: రేవంత్‌రెడ్డి

TG: కృష్ణా జలాలతో మహబూబ్‌నగర్ జిల్లాలోని పంటలను పచ్చగా కలకలలాడేలా చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రెండురోజుల పర్యటనలో భాగంగా ఫస్ట్ డే కోయిల్ సాగర్ ప్రాజెక్ట్, కృష్ణా, బీమా నదులపై ప్రతిపాదించిన కొత్త బ్యారేజీల స్థలాలు, జూరాల ప్రాజెక్టు డ్యాంను సీఎం వీక్షించారు. ప్రాజెక్టుల ప్రస్తుత స్థితిగతులు, నీటినిల్వల సామర్ధ్యాలను ఇరిగేషన్ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మక్తల్, కొడంగల్ ఎత్తిపోతల పథకాల పరిధిలోని పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో సీఎం పరిశీలించారు.

నేషనల్ హైవేపై పెట్రోల్ ట్యాంకర్ బోల్తా.. హైఅలెర్ట్
TG· 4 Jun 2026

నేషనల్ హైవేపై పెట్రోల్ ట్యాంకర్ బోల్తా.. హైఅలెర్ట్

TG: రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్‌పేట్ సమీపంలోని హైదరాబాద్ - విజయవాడ నేషనల్ హైవేపై పెట్రోల్ ట్యాంకర్ అదుపుతప్పి కార్లను ఢీకొట్టింది. ట్యాంకర్ ముందుగా వెళ్తున్న రెండుకార్లను బలంగా ఢీకొట్టి బోల్తా పడింది. రెండు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కార్లలో ఉన్న ప్రయాణికులకు గాయాలవడంతో స్థానికులు హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. పెట్రోల్ లీకవడంతో అధికారులు అక్కడికి ఎవరూ రాకుండా హైఅలెర్ట్ ప్రకటించారు. ట్యాంకర్ క్యాబిన్‌లో డ్రైవర్ ఇరుక్కుపోవడంతో ఫైర్ సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఘటనతో నేషనల్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

 అమెరికాలో మధు యాష్కీ భార్యకు కారు ప్రమాదం ః తీవ్రగాయాలు
TG· 3 Jun 2026

అమెరికాలో మధు యాష్కీ భార్యకు కారు ప్రమాదం ః తీవ్రగాయాలు

కాంగ్రెస్ మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ సతీమణికి అమెరికాలో కారు యాక్సిడెంట్ అయ్యింది.కుమార్తె గగన యాష్కీని ఎండీ కోర్సులో జాయిన్ చేసి తిరిగి వస్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది. బోస్టన్ నుంచి న్యూయార్క్ కు వస్తుండగా భారీ వర్షం కారణంగా కారు అదుపు తప్పి పల్టీలు కొట్టింది.డాక్టర్ కూడా అయిన సుచీ యాష్కీకి రిబ్స్ విరిగాయని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి జంట రేపు ఇండియాకు తిరిగి రావాల్సి ఉంది. లగేజీ ఎక్కువగా ఉండటంతో ఇద్దరూ వేర్వేరు కార్లలో ట్రావెల్ చేస్తున్నారు. మధు యాష్కీ ఫౌండేషన్ ద్వారా డాక్టర్ సుచీ పేదలకు ఆరోగ్య సంరక్షణ సేవలు అందిస్తున్నారు..

తెలంగాణ సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: మినిస్టర్ వివేక్
TG· 2 Jun 2026

తెలంగాణ సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: మినిస్టర్ వివేక్

TG: తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. సామాజిక న్యాయం, ఆర్థిక పురోగతి దిశగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజాప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు. తెలంగాణ స్టేట్ ఫార్మెషన్ డే సందర్భంగా మెదక్ కలెక్టరేట్‌లో నిర్వహించిన సెలబ్రేషన్స్‌కు మినిస్టర్ అటెండయ్యారు. తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించి నేషనల్ ఫ్లాగ్‌ను ఆవిష్కరించారు. రైతుల సంక్షేమం, ఉమెన్ ఎంపవర్‌మెంట్, జాబ్ ఆపర్ట్యూనిటీస్, విద్య, వైద్యం, మౌలికసదుపాయాల అభివృద్ధికి స్టేట్ గవర్నమెంట్ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

నిరుద్యోగులకు తెలంగాణ గవర్నమెంట్ గుడ్‌న్యూస్
TG· 2 Jun 2026

నిరుద్యోగులకు తెలంగాణ గవర్నమెంట్ గుడ్‌న్యూస్

TG: తెలంగాణ ఫార్మెషన్ డే సందర్భంగా స్టేట్ గవర్నమెంట్ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. 280 పోస్టులతో మూడు నోటిఫికేషన్స్ రిలీజ్ చేసినట్లు TGPSC ఛైర్మన్ బుర్రా వెంకటేశం అనౌన్స్ చేశారు. ఇందులో పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అసిస్టెంట్ ఇన్విరాన్‌మెంట్ ఇంజనీర్లు 9, రోడ్డు భవనాల డిపార్ట్‌మెంట్‌లో ఏఈఈ సివిల్ 222, ఎలక్ట్రికల్ 49 పోస్టులు ఉన్నాయన్నారు. గవర్నమెంట్ జాబ్స్ రిక్రూట్‌మెంట్‌కు ఇకపై ప్రతినెలా రెండుమూడు ఉద్యోగ ప్రకటనలు చేస్తామని చెప్పారు. మరోవైపు తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు నోటిఫికేషన్ వేయకపోతే గవర్నమెంట్‌పై తిరగబడతామని నిరుద్యోగ జేఏసీ, పలు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

ఖైదీలకు తెలంగాణ గవర్నమెంట్ గుడ్‌న్యూస్
TG· 2 Jun 2026

ఖైదీలకు తెలంగాణ గవర్నమెంట్ గుడ్‌న్యూస్

TG: ఖైదీలకు తెలంగాణ గవర్నమెంట్ గుడ్‌న్యూస్ చెప్పింది. తెలంగాణ స్టేట్ ఫార్మెషన్ డే సందర్భంగా వివిధ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న 92మంది ఖైదీలకు క్షమాభిక్ష పెట్టింది. చాలాకాలంగా జైలుశిక్ష అనుభవిస్తున్న ఖైదీల ప్రవర్తన, వయస్సు, ఆరోగ్య పరిస్థితులు, జైలులో వారి ప్రవర్తనా తీరు అంశాలను పరిగణనలోకి తీసుకుని ఖైదీలను విడుదల చేయనున్నారు. 86మంది పురుషులు, ఆరుగురు మహిళా ఖైదీలు ఉన్నారు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించి 12ఇయర్స్ కంప్లీట్ చేసుకుని 13వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా మానవతా దృక్పథంతో స్టేట్ గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ డిసిషన్‌ పట్ల ఖైదీల కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తంచేశారు.

ఉపాధి పనుల్లో వింత ఘటన.. బయటపడ్డ సాఫ్ట్‌వేర్ లోపం
TG· 29 May 2026

ఉపాధి పనుల్లో వింత ఘటన.. బయటపడ్డ సాఫ్ట్‌వేర్ లోపం

TG: ఉపాధి హామీ పథకం సాఫ్ట్‌వేర్‌లో ఉన్న లోపాలు మరోసారి బయటపడ్డాయి. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం కోమటిపల్లి గ్రామానికి చెందిన మల్యాల శ్రీనివాస్ ఇటీవల కొండగట్టు అంజన్నకు తలనీలాలు సమర్పించాడు. ఉపాధి పనులకు వెళ్లిన శ్రీనివాస్ ఫేస్ రికగ్నేషన్ యాప్‌తో ఫోటో తీయడానికి ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫోటో తీసుకోలేదు. చివరికి గడ్డం, మీసాలను పోలినట్లు నల్లని బొగ్గు కలర్ వేసుకున్నాడు. తలపై ఓ మహిళ జుట్టును వేసుకోగా ఫేస్ రికగ్నేషన్ యాప్ వెంటనే ఫోటో తీసుకుంది. హమ్మయ్య అంటూ శ్రీనివాస్ ఉపాధి పనుల్లో పాల్గొన్నాడు.

'నా భర్తను ఇండియాకు రప్పించండి'
TG· 27 May 2026

'నా భర్తను ఇండియాకు రప్పించండి'

TG: నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం దూదిగాం గ్రామానికి చెందిన తోకల శ్రీకాంత్ రూ.70 వేలు లక్ష్మణచందా గ్రామానికి చెందిన రమేష్ అనే ఏజెంట్‌కు చెల్లించి ఈ నెల 15న ఇంటి నుంచి బయలుదేరి 9 మందితో కలిసి దుబాయ్‌కి వెళ్లాడు. శ్రీకాంత్‌తో కలిసి వెళ్లిన మిగతా తొమ్మిది మంది పనికి వెళ్తున్నారని ఏజెంట్ రమేష్ తెలిపారు. 9మందితో కలిసి పనికి వెళ్లకుండా గత 13రోజుల నుంచి నా భర్త శ్రీకాంత్ ఫోన్ కంటాక్ట్, ఆచూకీ లేకుండా పోయిందని, నా భర్త ఎక్కడున్నా ఆచూకీ కనుక్కొని ఇండియాకు రప్పించాలని భార్య అలేఖ్య కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను రిక్వెస్ట్ చేసింది.