Droneలతో Armyకి కొత్త బలం.. ఎందుకో తెలుసా?

డ్రోన్లు ఇప్పుడు సైన్యానికి కేవలం నిఘా సాధనాలు కాదు.. యుద్ధంలో వేగంగా నిర్ణయం తీసుకునే ‘కళ్లూ, చెవులూ’గా మారుతున్నాయి. అందుకే భారత సైన్యం పంజాబ్‌లో తొలి ప్రత్యేక ‘బాజ్’ డ్రోన్ బెటాలియన్‌ను ఏర్పాటు చేసింది. జలంధర్‌లోని 11 కార్ప్స్ ఆధ్వర్యంలో పనిచేసే ఈ యూనిట్ డ్రోన్లతో సరిహద్దు నిఘా, సమాచార సేకరణ, అవసరమైనప్పుడు దాడి సామర్థ్యాలను పెంచనుంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత సైన్యం టెక్నాలజీ ఆధారితంగా మారుతున్న నేపథ్యంలో ఇది కీలక అడుగుగా కనిపిస్తోంది. భవిష్యత్ యుద్ధాల్లో డ్రోన్లదే కీలక పాత్ర.



