Latest

ఫ్లైట్స్‌ భోగాపురానికి.. కార్మికులు రోడ్డుపైకి!
Current Affairs· 17 Aug 2026

ఫ్లైట్స్‌ భోగాపురానికి.. కార్మికులు రోడ్డుపైకి!

AP: విశాఖపట్నం ఎయిర్‌ పోర్టులో ఔట్‌సోర్సింగ్‌ కార్మికులు ఆందోళనకు దిగారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు నేటి నుంచి విమాన సర్వీసులు తరలిపోవడంతో తమ ఉపాధి కోల్పోయామని పోర్టర్లు, శానిటేషన్‌ వర్కర్లు ఆవేదన వ్యక్తం చేశారు. 20 నుంచి 30 ఏళ్లుగా విశాఖ ఎయిర్‌పోర్టులో పనిచేస్తున్న తమను ఇప్పుడు కాంట్రాక్టర్లు పట్టించుకోవడం లేదని కన్నీరు పెట్టుకున్నారు. ఎయిర్‌ పోర్టు మూసివేతతో రోడ్డున పడ్డ తమకు ప్రభుత్వమే ఉపాధి కల్పించి ఆదుకోవాలని కార్మికులు కోరారు.

ఈ ఉద్యోగం కంటే చావే మేలు
TG· 17 Aug 2026

ఈ ఉద్యోగం కంటే చావే మేలు

TG : పక్షవాతంతో, యూరినల్ బ్యాగ్‌తో రోజూ పనికి వెళ్తున్న సింగరేణి కార్మికుడు రామ్ నివాస్ చాలా బాధపడుతున్నారు. పనివేళల్లో మలవిసర్జన వస్తే కుటుంబసభ్యులు వచ్చి తీసుకెళ్లే వరకు నరకం అనుభవిస్తున్నానని, ఈ నరకం కంటే చావే మేలని కన్నీరు పెట్టుకున్నారు. ఆయనకు తక్షణమే రీ-మెడికల్ పరీక్షలు నిర్వహించి, మెడికల్ ఇన్వాలిడేషన్ కింద కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం ఇవ్వాలని, యాజమాన్యం మానవత్వంతో స్పందించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

పక్షవాతం వచ్చినా డ్యూటీకి రావాలా?
TG· 17 Aug 2026

పక్షవాతం వచ్చినా డ్యూటీకి రావాలా?

TG : కొత్తగూడెం ఏరియాకి చెందిన రామ్ నివాస్ అనే కార్మికుడు తీవ్రమైన పక్షవాతం, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. ఎడమ చేయి, కాలు పనిచేయక యూరినల్ బ్యాగ్‌ సహాయంతో జీవిస్తున్న అతనికి మెడికల్ బోర్డు డ్యూటీ కేటాయించింది. కనీసం నడవలేని, సొంతంగా పనులు చేసుకోలేని పరిస్థితిలో ఉన్నా ఆయనను ‘ఫిట్ ఫర్ సర్ఫేస్ డ్యూటీ’ అని తెలిపింది. దీంతో ఆయన రుద్రంపూర్ డిస్పెన్సరీలో విధులు కేటాయించడంలో ఇబ్బందులు పడుతుండగా, ఈ నిర్ణయంపై ఇతర కార్మికులు మండిపడుతున్నారు.

షాప్ బోర్డు పెడుతుండగా షాకింగ్ ఘటన
Local· 17 Aug 2026

షాప్ బోర్డు పెడుతుండగా షాకింగ్ ఘటన

TG: హైదరాబాద్‌ బాలానగర్‌లో షాప్ బోర్డు ఏర్పాటు చేస్తుండగా విద్యుత్‌ తీగలు తగలడంతో సంజు చౌదరి(26) అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. బాలానగర్‌ PS పరిధిలోని గురుకృప ప్లైవుడ్‌ అండ్‌ హార్డ్‌వేర్‌ షాప్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. బోర్డు ఏర్పాటు చేస్తుండగా పైనున్న కరెంట్ వైర్లు సంజు చౌదరికి తగలడంతో షాక్‌ వచ్చింది. తీవ్రంగా గాయపడిన అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

IT ఆఫీసులో ఒక్కసారిగా మంటలు.. 12 ఫైర్‌ ఇంజిన్లు!
National· 17 Aug 2026

IT ఆఫీసులో ఒక్కసారిగా మంటలు.. 12 ఫైర్‌ ఇంజిన్లు!

ముంబైలోని చర్చ్‌గేట్‌ ప్రాంతంలో ఉన్న ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీస్ భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భవనం నుంచి పెద్ద ఎత్తున మంటలు, దట్టమైన పొగ ఎగసిపడటంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఫైర్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకురావడానికి 12 ఫైర్‌ ఇంజిన్లను వాడుతున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు, ప్రాణ, ఆస్తి నష్టంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

పిల్లలు మొండిగా ప్రవర్తిస్తున్నారా? ఈ సింపుల్ ట్రిక్ వాడండి!
Parenting· 17 Aug 2026

పిల్లలు మొండిగా ప్రవర్తిస్తున్నారా? ఈ సింపుల్ ట్రిక్ వాడండి!

ఈ రోజుల్లో పిల్లలు మాట వినకపోతే వెంటనే కొట్టడం లేదా తిట్టడం చేస్తున్నారా? దీనివల్ల వాళ్లలో పట్టుదల మరింత పెరుగుతుంది. పిల్లలను మార్చడానికి సైకాలజిస్టులు 'పాజిటివ్ రీఇన్‌ఫోర్స్‌మెంట్' అనే ట్రిక్ చెబుతున్నారు. అంటే పిల్లలు తప్పు చేసినప్పుడు తిట్టడం కంటే, వాళ్లు ఏదైనా మంచి పని చేసినప్పుడు వెంటనే మెచ్చుకోవడం లేదా చిన్న గిఫ్ట్ ఇవ్వడం చేయాలి. ఇలా చేస్తే వాళ్లు మెప్పు కోసం మంచి పనులు చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు.

గ్రూప్‌-1 పై అసెంబ్లీలో బాబు షాకింగ్‌ కామెంట్స్‌!
AP· 17 Aug 2026

గ్రూప్‌-1 పై అసెంబ్లీలో బాబు షాకింగ్‌ కామెంట్స్‌!

AP: గత ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్‌-1 పరీక్షలపై సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో గ్రూప్‌-1 లాంటి స్కామ్‌ను చూడలేదని అన్నారు. గత ప్రభుత్వ విధానాలతో ఎంతోమంది మెరిట్‌ విద్యార్థులు నష్టపోయారని పేర్కొన్నారు. 2019-2024 మధ్య ఒక్క టీచర్‌ నియామకం కూడా చేపట్టలేదని విమర్శించారు. YSRCP హయాంలో ఇంగ్లిష్‌ మీడియం పేరుతో ఎక్కువగా ప్రచారం చేసుకున్నారని, తన హయాంలోనే ఎక్కువగా టీచర్‌ నియామకాలు జరిగాయని చంద్రబాబు అన్నారు.

ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి
Local· 17 Aug 2026

ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి

TG: నిజామాబాద్ జిల్లా నందిపేట్‌లో సోమవారం నిర్వహించిన మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. MPDO కార్యాలయంలో MPDO బి.శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వివిధ గ్రామాల ప్రజలు తమ సమస్యలపై అధికారులకు వినతులు అందజేశారు. భూ, రెవెన్యూ, పంచాయతీరాజ్, విద్య, వ్యవసాయం, వైద్యం, గృహ నిర్మాణం, సంక్షేమం తదితర అంశాలపై ఫిర్యాదులు స్వీకరించారు. డిప్యూటీ తహసీల్దార్ అనంత లక్ష్మణ్‌తో పాటు వివిధ శాఖల అధికారులు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.

పక్షుల సౌండ్స్ మనకు ఎందుకు నచ్చుతాయి?
Current Affairs· 17 Aug 2026

పక్షుల సౌండ్స్ మనకు ఎందుకు నచ్చుతాయి?

జంతువులకు, పక్షులకు నచ్చే సౌండ్సే మనుషులకు కూడా బాగా నచ్చుతాయని సైన్స్ జర్నల్‌ కొత్త రీసెర్చ్ లో తేలింది. క్సాస్ టెక్సాస్ యూనివర్సిటీకి చెందిన రిసెర్చర్ లోగన్ ఎస్ జేమ్స్ దాదాపు 4,000 మందిపై ఒక ఆన్‌లైన్ ప్రయోగం చేశారు.<br>కప్పలు, పక్షులు, కీటకాలు చేసే రకరకాల సౌండ్స్‌లో జంతువులకు ఏవైతే నచ్చుతాయో... మనుషులు కూడా 54శాతం టైమ్ అవే శబ్దాలను సెలెక్ట్ చేసుకుంటున్నారని తేలింది. జీవుల నర్వస్ సిస్టమ్‌లో (నాడీ వ్యవస్థలో) ఉన్న పోలికల వల్లే మనకు కూడా ఆ సౌండ్స్ నచ్చుతున్నాయని సైంటిస్టులు చెబుతున్నారు

బిర్యానీ కోసం వచ్చి.. రెస్టారెంట్‌లో ఫర్నీచర్ ధ్వంసం
TG· 17 Aug 2026

బిర్యానీ కోసం వచ్చి.. రెస్టారెంట్‌లో ఫర్నీచర్ ధ్వంసం

TG: వరంగల్ జిల్లా నర్సంపేటలో బిర్యానీ విషయంలో తలెత్తిన వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మద్యం మత్తులో MFC రెస్టారెంట్‌కు వచ్చిన ఆరుగురు యువకులు బిర్యానీ కావాలని కోరగా, అది అందుబాటులో లేదని యజమాని కుమారుడు చెప్పడంతో వాగ్వాదానికి దిగి దాడికి పాల్పడ్డారు. రెస్టారెంట్‌లోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేయడంతో పాటు క్యాష్ కౌంటర్‌లో ఉన్న కంప్యూటర్‌ను పగులగొట్టారు. వాటర్ బాటిళ్లతో సిబ్బందిపై దాడి చేయడంతో అక్కడ ఉన్న కస్టమర్లు భయంతో పరుగులు తీశారు. యజమాని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

చరిత్రను మార్చిన పరాజితుల చరిత్ర
Arts/Literature· 17 Aug 2026

చరిత్రను మార్చిన పరాజితుల చరిత్ర

అమెరికన్ రచయిత అలెక్స్ హేలీ రాసిన ‘Roots’ నవల ఆఫ్రికన్-అమెరికన్ చరిత్రను ప్రపంచం ముందు కొత్త కోణంలో నిలబెట్టింది. 1976లో వెలువడిన ఈ నవల అతని పూర్వీకుల కథను చెప్తుంది. గాంబియా నుంచి 1750లో బలవంతంగా తీసుకువచ్చిన కుంటా కింటే అనే యువకుడు బానిసగా అమెరికాకు చేరుకున్నాడు. అతని కష్టాలు, బానిసత్వం, తర్వాత స్వేచ్ఛ కోసం పోరాటం..ఇవన్నీ హేలీ కుటుంబ చరిత్రగా మారాయి. ఈ పుస్తకాన్ని తెలుగులో ‘ఏడు తరాలు’ పేరుతో సహవాసి అనువాదం చేశారు. ఇంగ్లీషు పుస్తకం కొనేందుకు <a href="https://amzn.in/d/0bzqJmC5">లింక్</a>. తెలుగు పుస్తకం కొనేందుకు <a href="https://www.telugubooks.in/products/yedu-tharaalu?srsltid=AfmBOooKUyW6q1LqNLX2pxvxXAWxzI4SJjCudbe-mt9uSxZVjl-gXCyP">లింక్</a>.

పోలీసుల కారులో గంజాయి?
Crime· 17 Aug 2026

పోలీసుల కారులో గంజాయి?

AP: అద్దంకి సమీపంలో బల్లికురవ ఎస్సై నాగరాజు, సంతమాగులూరు ఎస్సై నాగమల్లేశ్వరరావు ప్రయాణిస్తున్న పోలీసుల కారు ఆటోను ఢీకొట్టింది. పోలీసుల కారులోని డిక్కీలో గంజాయి ఉన్నట్లు స్థానికులు గుర్తించినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న అద్దంకి సీఐ ఘటనాస్థలికి చేరుకున్నారు. స్థానికులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరగడంతో కొద్దిసేపు ఉద్రిక్త నెలకొంది.

శాఖల నిర్లక్ష్యంతో ప్రజల ఇబ్బందులు
Local· 17 Aug 2026

శాఖల నిర్లక్ష్యంతో ప్రజల ఇబ్బందులు

AP: గుడివాడ పట్టణం నుండి విజయవాడ వెళ్లే రోడ్డు మార్గంలో ఉన్న కల్వర్టు కూలిపోయి ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. 15 రోజుల క్రితం కూలిపోయిన కల్వర్టు తమ పరిధి కాదని ఆర్అండ్‌బి, తమ పరిధిలో లేదంటూ మునిసిపాలిటీ..ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డు మార్గం పూర్తిగా ఆగిపోయింది. నిత్యం గుడివాడ విజయవాడ నాన్ స్టాప్ బస్సులు, పలు గ్రామాలకు వెళ్లాల్సినటువంటి పల్లె వెలుగు బస్సులు పట్టణమంతా చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపులో అక్రమాలపై సంతకాల సేకరణ
Local· 17 Aug 2026

డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపులో అక్రమాలపై సంతకాల సేకరణ

TG: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపులో జరిగిన అక్రమాలు, అర్హతలేని వ్యక్తులకు ఇళ్ల కేటాయింపుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మండల ప్రజలు సంతకాల సేకరణ చేపట్టారు. అనర్హులకు ఇళ్లు కేటాయించారనే ఆరోపణలపై విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాలని ప్రజలు కోరుతున్నారు. సేకరించిన సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమంలో అధికారులకు సమర్పించారు.

శ్రీశైలం జలాశయానికి పెరిగిన ప్రవాహం
AP· 17 Aug 2026

శ్రీశైలం జలాశయానికి పెరిగిన ప్రవాహం

AP: శ్రీశైలం జలాశయానికి జూరాల నుంచి 23,197 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 23,197 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 50,673 క్యూసెక్కులుగా ఉంది. జలాశయ నీటిమట్టం 876.50 అడుగులు కాగా, నీటి నిల్వ 170.6640 టీఎంసీలుగా ఉంది. కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

కల్యాణలక్ష్మి కేసుపై తప్పు ఎవరిదో తేలుస్తామన్న మంత్రి పొన్నం
TG· 17 Aug 2026

కల్యాణలక్ష్మి కేసుపై తప్పు ఎవరిదో తేలుస్తామన్న మంత్రి పొన్నం

TG : కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. దీనికి రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. దీంతో స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్, కల్యాణలక్ష్మి విషయంలో నాలుగైదు సార్లు అవకాశమిచ్చినా కౌంటర్ ఫైల్ చేయకపోవడంపై విచారణ జరుపుతున్నామని చెప్పారు. ఇందులో అధికారుల తప్పా లేక న్యాయవాదుల తప్పా అని తేలాక చర్యలు తీసుకుంటామన్నారు.

పాడి రైతులకు అండగా 25 ఏళ్ల సేవలు
Local· 17 Aug 2026

పాడి రైతులకు అండగా 25 ఏళ్ల సేవలు

TG: హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ మహిళా డెయిరీ 25వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రజతోత్సవ వేడుకలను నిర్వహించారు. 25 ఏళ్ల డెయిరీ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అధ్యక్షురాలు బుర్ర ధనశ్రీ, మేనేజర్ భాస్కర్ రెడ్డి, డెయిరీ సిబ్బంది, మహిళా సభ్యులు, పాడి రైతులు పాల్గొన్నారు. భవిష్యత్‌లో పాల సేకరణను విస్తరించడం, డెయిరీని మరింత అభివృద్ధి చేయడం వంటి అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడ్డారు.

షాదీ ముబారక్‌, కల్యాణలక్ష్మి నిధులు వెంటనే విడుదల చేయాలి
Local· 17 Aug 2026

షాదీ ముబారక్‌, కల్యాణలక్ష్మి నిధులు వెంటనే విడుదల చేయాలి

TG: పేద కుటుంబాలకు అండగా నిలిచే షాదీ ముబారక్‌, కల్యాణలక్ష్మి పథకాల నిధులను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ నిజామాబాద్ జిల్లా నందిపేట్‌లో బీఆర్‌ఎస్‌ నాయకులు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ముచ్చర్ల సాగర్‌ మాట్లాడుతూ షాదీ ముబారక్‌, కల్యాణలక్ష్మి పథకాల లబ్ధిదారులకు నిధులు అందకపోవడంతో పేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు. అర్హులైనవారి ఖాతాలో నిధులు జమ చేయాలని డిమాండ్‌ చేశారు.

సెలబ్రిటీ ప్రమోషన్స్‌పై FDA యాక్షన్!
Current Affairs· 17 Aug 2026

సెలబ్రిటీ ప్రమోషన్స్‌పై FDA యాక్షన్!

విమల్ ఎలాచీ యాడ్ ద్వారా నిషేధిత పాన్ మసాలాను పరోక్షంగా ప్రమోట్ చేస్తున్నారంటూ బాలీవుడ్ స్టార్స్ షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్‌లకు మహారాష్ట్ర FDA షోకాజ్ నోటీసులు ఇచ్చింది. వీరికి ఫుడ్ సేఫ్టీ, కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్‌ల కింద రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు పెనాల్టీ పడే ఛాన్స్ ఉంది. నటులు నేరుగా రానవసరం లేదు, 15 రోజుల్లోగా వారి లీగల్ టీమ్‌ ద్వారా రిప్లై ఇవ్వొచ్చు. కమిషనర్ తుకారామ్ ముండే ఈ సెలబ్రిటీ యాడ్స్‌పై ఫుల్ ఫోకస్ పెట్టారు.

శుభ్‌మన్ గిల్ సూపర్ క్యాచ్!
Sports· 17 Aug 2026

శుభ్‌మన్ గిల్ సూపర్ క్యాచ్!

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో టీమ్ ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుతమైన ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నారు. కుల్దీప్ బౌలింగ్‌లో శ్రీలంక బ్యాటర్ కమిందు మెండిస్ (14) ముందుకు వచ్చి షాట్ కొట్టగా, గిల్ ఎడమవైపుకి డైవ్ చేస్తూ ఒంటిచేత్తో క్యాచ్ పట్టుకున్నారు. ఆశ్చర్యపోయిన బ్యాటర్ క్రీజు వదిలి వెళ్లక తప్పలేదు. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక జట్టు లంచ్ సమయానికి 5 వికెట్ల నష్టానికి 99 రన్స్ చేసింది.

ప్రజావాణిలో వినతుల వెల్లువ.. సమస్యలను పరిష్కరించాలి
Local· 17 Aug 2026

ప్రజావాణిలో వినతుల వెల్లువ.. సమస్యలను పరిష్కరించాలి

TG: రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలోని MPDO కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి 20 దరఖాస్తులు వచ్చినట్లు ఎంపీడీవో రమేష్ తెలిపారు. వివిధ సమస్యలపై ప్రజలు సమర్పించిన ఫిర్యాదులను అధికారులు స్వీకరించారు. ఆయా దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని ఆయన సూచించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందేలా అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. విధుల నిర్వహణలో సమయపాలన పాటించాలని స్పష్టం చేశారు.