Latest

రామ్ మందిర్ విరాళాల వివాదం అప్డేట్
National· 17 Aug 2026

రామ్ మందిర్ విరాళాల వివాదం అప్డేట్

అయోధ్య రామ్ టెంపుల్ డొనేషన్స్ దుర్వినియోగం కేసు విచారణపై సుప్రీంకోర్టు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. CJI జస్టిస్ సూర్య కాంత్ నేతృత్వంలోని త్రిసభ్య బెంచ్ ఈ కేసులో ప్రస్తుతానికి జోక్యం చేసుకోబోమని, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) ఈ ఇన్వెస్టిగేషన్‌ను లాజికల్ కన్‌క్లూజన్‌కు తీసుకువెళ్లాలని స్పష్టం చేసింది. ఒకవేళ SIT పనితీరు సరిగ్గా లేకపోతేనే తాము ఇన్వాల్వ్ అవుతామని హెచ్చరించింది. ఎవరివద్దైనా సూచనలు ఉంటే డైరెక్ట్‌గా సోలిసిటర్ జనరల్ ఆఫీస్‌ను కాంటాక్ట్ చేయవచ్చని తెలిపింది.

జార్ఖండ్‌లో మాస్ ప్రోటెస్ట్ హెచ్చరిక- దేవేంద్ర నాథ్ మహతో
National· 17 Aug 2026

జార్ఖండ్‌లో మాస్ ప్రోటెస్ట్ హెచ్చరిక- దేవేంద్ర నాథ్ మహతో

జార్ఖండ్‌లో ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో పర్మనెంట్ రిఫార్మ్స్ కోసం విద్యార్థి నాయకుడు దేవేంద్ర నాథ్ మహతో చేపట్టిన హంగర్ స్ట్రైక్ 15వ రోజుకు చేరింది. ఆయన హెల్త్ కండిషన్ చాలా క్రిటికల్‌గా మారింది. ప్రభుత్వం తమను చర్చలకు పిలిచిందని, నేడు జరగబోయే టాక్స్‌లో పాజిటివ్ అవుట్‌కమ్ వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఒకవేళ ఈ టాక్స్ సక్సెస్ కాకపోతే విద్యార్థులందరితో కలిసి పెద్ద ఎత్తున మాస్ మూవ్‌మెంట్ స్టార్ట్ చేస్తామని, ఎంత ఫోర్స్ ఉపయోగించినా ఈ నిరసనను ఆపలేరని ఆయన హెచ్చరించారు.

కాసేపట్లో తెలంగాణలో వర్షాలు!🌧️☔
TG· 17 Aug 2026

కాసేపట్లో తెలంగాణలో వర్షాలు!🌧️☔

TG : తెలంగాణలోని వరంగల్, హనుమకొండ జిల్లాల్లో రానున్న 1-2 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు. అలాగే సాయంత్రం 6 గంటల వరకు మహబూబాబాద్, ఖమ్మం, యాదాద్రి, భద్రాద్రి, జనగామ, కామారెడ్డి, నిజామాబాద్, సంగారెడ్డి, సిరిసిల్ల జిల్లాల్లోనూ వర్షాలు పడతాయని చెబుతున్నారు. అయితే చాలా చోట్ల ఎండలు మండిపోతున్నాయని, మబ్బుల జాడ లేదని ప్రజలు అంటున్నారు.

ఆడుకుంటూ ప్రాణాలు కోల్పోయిన 10th స్టూడెంట్!
AP· 17 Aug 2026

ఆడుకుంటూ ప్రాణాలు కోల్పోయిన 10th స్టూడెంట్!

AP: మన్యం జిల్లా సాలూరు గవర్నమెంట్ హైస్కూల్‌లో తీవ్ర విషాదం జరిగింది. పాఠశాల ఆవరణలోని పాత వాచ్‌మన్ రూమ్ ప్రహరీ వాల్ అకస్మాత్తుగా కూలిపోవడంతో 10వ క్లాస్ స్టూడెంట్ అరుణ్ తేజ (15) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. విద్యార్థులు ఆడుకుంటూ ఆ పాత గోడపై కూర్చోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మరో స్టూడెంట్‌కు తీవ్ర గాయాలు కాగా, వెంటనే ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఈ విషాద ఘటనతో స్కూల్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర కలకలం రేగింది.

IOCLలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. అప్లై చేసుకోండి
Jobs· 17 Aug 2026

IOCLలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. అప్లై చేసుకోండి

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌ (IOCL) వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆన్‌లైన్‌ అప్లికేషన్స్ ఆగస్ట్ 14 నుంచి సెప్టెంబర్‌ 3, 2026 సా.5 గం. వరకు స్వీకరిస్తారు. సెప్టెంబర్‌ 24న CBT నిర్వహించనున్నారు. ఎంపికలో CBTకి 85%, గ్రూప్‌ డిస్కషన్‌/టాస్క్‌కు 5%, పర్సనల్‌ ఇంటర్వ్యూకు 10% వెయిటేజీ ఉంటుంది. SC/ST/PwBD వారికి ఫీజు Exemption ఉండగా, ఇతరులకు రూ.1,000 + GST ఫీజు ఉంటుంది. అప్లికేషన్ కోసం ఇక్కడ Click చేయండి.

BJP నేషనల్ టీమ్‌లో పురందేశ్వరి.. తెలంగాణకు నో ఛాన్స్‌!
National· 17 Aug 2026

BJP నేషనల్ టీమ్‌లో పురందేశ్వరి.. తెలంగాణకు నో ఛాన్స్‌!

BJP నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీని పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. నేషనల్ వైస్ ప్రెసిడెంట్‌గా 13 మందిని నియమించగా.. ఆ లిస్ట్‌లో APకి చెందిన దగ్గుబాటి పురందేశ్వరి చోటు దక్కించుకున్నారు. నేషనల్ జనరల్ సెక్రటరీగా స్మృతి ఇరానీని నియమించారు. పార్టీ జాయింట్‌ కోఆర్డినేటర్‌గా విష్ణువర్ధన్‌రెడ్డికి అవకాశం కల్పించారు. తెలంగాణకు నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో చోటు దక్కకపోగా.. నేషనల్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న డీకే అరుణను తప్పించారు.

ఫ్లైట్స్‌ భోగాపురానికి.. కార్మికులు రోడ్డుపైకి!
Current Affairs· 17 Aug 2026

ఫ్లైట్స్‌ భోగాపురానికి.. కార్మికులు రోడ్డుపైకి!

AP: విశాఖపట్నం ఎయిర్‌ పోర్టులో ఔట్‌సోర్సింగ్‌ కార్మికులు ఆందోళనకు దిగారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు నేటి నుంచి విమాన సర్వీసులు తరలిపోవడంతో తమ ఉపాధి కోల్పోయామని పోర్టర్లు, శానిటేషన్‌ వర్కర్లు ఆవేదన వ్యక్తం చేశారు. 20 నుంచి 30 ఏళ్లుగా విశాఖ ఎయిర్‌పోర్టులో పనిచేస్తున్న తమను ఇప్పుడు కాంట్రాక్టర్లు పట్టించుకోవడం లేదని కన్నీరు పెట్టుకున్నారు. ఎయిర్‌ పోర్టు మూసివేతతో రోడ్డున పడ్డ తమకు ప్రభుత్వమే ఉపాధి కల్పించి ఆదుకోవాలని కార్మికులు కోరారు.

ఈ ఉద్యోగం కంటే చావే మేలు
TG· 17 Aug 2026

ఈ ఉద్యోగం కంటే చావే మేలు

TG : పక్షవాతంతో, యూరినల్ బ్యాగ్‌తో రోజూ పనికి వెళ్తున్న సింగరేణి కార్మికుడు రామ్ నివాస్ చాలా బాధపడుతున్నారు. పనివేళల్లో మలవిసర్జన వస్తే కుటుంబసభ్యులు వచ్చి తీసుకెళ్లే వరకు నరకం అనుభవిస్తున్నానని, ఈ నరకం కంటే చావే మేలని కన్నీరు పెట్టుకున్నారు. ఆయనకు తక్షణమే రీ-మెడికల్ పరీక్షలు నిర్వహించి, మెడికల్ ఇన్వాలిడేషన్ కింద కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం ఇవ్వాలని, యాజమాన్యం మానవత్వంతో స్పందించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

పక్షవాతం వచ్చినా డ్యూటీకి రావాలా?
TG· 17 Aug 2026

పక్షవాతం వచ్చినా డ్యూటీకి రావాలా?

TG : కొత్తగూడెం ఏరియాకి చెందిన రామ్ నివాస్ అనే కార్మికుడు తీవ్రమైన పక్షవాతం, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. ఎడమ చేయి, కాలు పనిచేయక యూరినల్ బ్యాగ్‌ సహాయంతో జీవిస్తున్న అతనికి మెడికల్ బోర్డు డ్యూటీ కేటాయించింది. కనీసం నడవలేని, సొంతంగా పనులు చేసుకోలేని పరిస్థితిలో ఉన్నా ఆయనను ‘ఫిట్ ఫర్ సర్ఫేస్ డ్యూటీ’ అని తెలిపింది. దీంతో ఆయన రుద్రంపూర్ డిస్పెన్సరీలో విధులు కేటాయించడంలో ఇబ్బందులు పడుతుండగా, ఈ నిర్ణయంపై ఇతర కార్మికులు మండిపడుతున్నారు.

షాప్ బోర్డు పెడుతుండగా షాకింగ్ ఘటన
Local· 17 Aug 2026

షాప్ బోర్డు పెడుతుండగా షాకింగ్ ఘటన

TG: హైదరాబాద్‌ బాలానగర్‌లో షాప్ బోర్డు ఏర్పాటు చేస్తుండగా విద్యుత్‌ తీగలు తగలడంతో సంజు చౌదరి(26) అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. బాలానగర్‌ PS పరిధిలోని గురుకృప ప్లైవుడ్‌ అండ్‌ హార్డ్‌వేర్‌ షాప్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. బోర్డు ఏర్పాటు చేస్తుండగా పైనున్న కరెంట్ వైర్లు సంజు చౌదరికి తగలడంతో షాక్‌ వచ్చింది. తీవ్రంగా గాయపడిన అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

IT ఆఫీసులో ఒక్కసారిగా మంటలు.. 12 ఫైర్‌ ఇంజిన్లు!
National· 17 Aug 2026

IT ఆఫీసులో ఒక్కసారిగా మంటలు.. 12 ఫైర్‌ ఇంజిన్లు!

ముంబైలోని చర్చ్‌గేట్‌ ప్రాంతంలో ఉన్న ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీస్ భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భవనం నుంచి పెద్ద ఎత్తున మంటలు, దట్టమైన పొగ ఎగసిపడటంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఫైర్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకురావడానికి 12 ఫైర్‌ ఇంజిన్లను వాడుతున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు, ప్రాణ, ఆస్తి నష్టంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

పిల్లలు మొండిగా ప్రవర్తిస్తున్నారా? ఈ సింపుల్ ట్రిక్ వాడండి!
Parenting· 17 Aug 2026

పిల్లలు మొండిగా ప్రవర్తిస్తున్నారా? ఈ సింపుల్ ట్రిక్ వాడండి!

ఈ రోజుల్లో పిల్లలు మాట వినకపోతే వెంటనే కొట్టడం లేదా తిట్టడం చేస్తున్నారా? దీనివల్ల వాళ్లలో పట్టుదల మరింత పెరుగుతుంది. పిల్లలను మార్చడానికి సైకాలజిస్టులు 'పాజిటివ్ రీఇన్‌ఫోర్స్‌మెంట్' అనే ట్రిక్ చెబుతున్నారు. అంటే పిల్లలు తప్పు చేసినప్పుడు తిట్టడం కంటే, వాళ్లు ఏదైనా మంచి పని చేసినప్పుడు వెంటనే మెచ్చుకోవడం లేదా చిన్న గిఫ్ట్ ఇవ్వడం చేయాలి. ఇలా చేస్తే వాళ్లు మెప్పు కోసం మంచి పనులు చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు.

గ్రూప్‌-1 పై అసెంబ్లీలో బాబు షాకింగ్‌ కామెంట్స్‌!
AP· 17 Aug 2026

గ్రూప్‌-1 పై అసెంబ్లీలో బాబు షాకింగ్‌ కామెంట్స్‌!

AP: గత ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్‌-1 పరీక్షలపై సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో గ్రూప్‌-1 లాంటి స్కామ్‌ను చూడలేదని అన్నారు. గత ప్రభుత్వ విధానాలతో ఎంతోమంది మెరిట్‌ విద్యార్థులు నష్టపోయారని పేర్కొన్నారు. 2019-2024 మధ్య ఒక్క టీచర్‌ నియామకం కూడా చేపట్టలేదని విమర్శించారు. YSRCP హయాంలో ఇంగ్లిష్‌ మీడియం పేరుతో ఎక్కువగా ప్రచారం చేసుకున్నారని, తన హయాంలోనే ఎక్కువగా టీచర్‌ నియామకాలు జరిగాయని చంద్రబాబు అన్నారు.

ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి
Local· 17 Aug 2026

ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి

TG: నిజామాబాద్ జిల్లా నందిపేట్‌లో సోమవారం నిర్వహించిన మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. MPDO కార్యాలయంలో MPDO బి.శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వివిధ గ్రామాల ప్రజలు తమ సమస్యలపై అధికారులకు వినతులు అందజేశారు. భూ, రెవెన్యూ, పంచాయతీరాజ్, విద్య, వ్యవసాయం, వైద్యం, గృహ నిర్మాణం, సంక్షేమం తదితర అంశాలపై ఫిర్యాదులు స్వీకరించారు. డిప్యూటీ తహసీల్దార్ అనంత లక్ష్మణ్‌తో పాటు వివిధ శాఖల అధికారులు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.

పక్షుల సౌండ్స్ మనకు ఎందుకు నచ్చుతాయి?
Current Affairs· 17 Aug 2026

పక్షుల సౌండ్స్ మనకు ఎందుకు నచ్చుతాయి?

జంతువులకు, పక్షులకు నచ్చే సౌండ్సే మనుషులకు కూడా బాగా నచ్చుతాయని సైన్స్ జర్నల్‌ కొత్త రీసెర్చ్ లో తేలింది. క్సాస్ టెక్సాస్ యూనివర్సిటీకి చెందిన రిసెర్చర్ లోగన్ ఎస్ జేమ్స్ దాదాపు 4,000 మందిపై ఒక ఆన్‌లైన్ ప్రయోగం చేశారు.
కప్పలు, పక్షులు, కీటకాలు చేసే రకరకాల సౌండ్స్‌లో జంతువులకు ఏవైతే నచ్చుతాయో... మనుషులు కూడా 54శాతం టైమ్ అవే శబ్దాలను సెలెక్ట్ చేసుకుంటున్నారని తేలింది. జీవుల నర్వస్ సిస్టమ్‌లో (నాడీ వ్యవస్థలో) ఉన్న పోలికల వల్లే మనకు కూడా ఆ సౌండ్స్ నచ్చుతున్నాయని సైంటిస్టులు చెబుతున్నారు

బిర్యానీ కోసం వచ్చి.. రెస్టారెంట్‌లో ఫర్నీచర్ ధ్వంసం
TG· 17 Aug 2026

బిర్యానీ కోసం వచ్చి.. రెస్టారెంట్‌లో ఫర్నీచర్ ధ్వంసం

TG: వరంగల్ జిల్లా నర్సంపేటలో బిర్యానీ విషయంలో తలెత్తిన వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మద్యం మత్తులో MFC రెస్టారెంట్‌కు వచ్చిన ఆరుగురు యువకులు బిర్యానీ కావాలని కోరగా, అది అందుబాటులో లేదని యజమాని కుమారుడు చెప్పడంతో వాగ్వాదానికి దిగి దాడికి పాల్పడ్డారు. రెస్టారెంట్‌లోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేయడంతో పాటు క్యాష్ కౌంటర్‌లో ఉన్న కంప్యూటర్‌ను పగులగొట్టారు. వాటర్ బాటిళ్లతో సిబ్బందిపై దాడి చేయడంతో అక్కడ ఉన్న కస్టమర్లు భయంతో పరుగులు తీశారు. యజమాని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

చరిత్రను మార్చిన పరాజితుల చరిత్ర
Arts/Literature· 17 Aug 2026

చరిత్రను మార్చిన పరాజితుల చరిత్ర

అమెరికన్ రచయిత అలెక్స్ హేలీ రాసిన ‘Roots’ నవల ఆఫ్రికన్-అమెరికన్ చరిత్రను ప్రపంచం ముందు కొత్త కోణంలో నిలబెట్టింది. 1976లో వెలువడిన ఈ నవల అతని పూర్వీకుల కథను చెప్తుంది. గాంబియా నుంచి 1750లో బలవంతంగా తీసుకువచ్చిన కుంటా కింటే అనే యువకుడు బానిసగా అమెరికాకు చేరుకున్నాడు. అతని కష్టాలు, బానిసత్వం, తర్వాత స్వేచ్ఛ కోసం పోరాటం..ఇవన్నీ హేలీ కుటుంబ చరిత్రగా మారాయి. ఈ పుస్తకాన్ని తెలుగులో ‘ఏడు తరాలు’ పేరుతో సహవాసి అనువాదం చేశారు. ఇంగ్లీషు పుస్తకం కొనేందుకు లింక్. తెలుగు పుస్తకం కొనేందుకు లింక్.

పోలీసుల కారులో గంజాయి?
Crime· 17 Aug 2026

పోలీసుల కారులో గంజాయి?

AP: అద్దంకి సమీపంలో బల్లికురవ ఎస్సై నాగరాజు, సంతమాగులూరు ఎస్సై నాగమల్లేశ్వరరావు ప్రయాణిస్తున్న పోలీసుల కారు ఆటోను ఢీకొట్టింది. పోలీసుల కారులోని డిక్కీలో గంజాయి ఉన్నట్లు స్థానికులు గుర్తించినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న అద్దంకి సీఐ ఘటనాస్థలికి చేరుకున్నారు. స్థానికులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరగడంతో కొద్దిసేపు ఉద్రిక్త నెలకొంది.

శాఖల నిర్లక్ష్యంతో ప్రజల ఇబ్బందులు
Local· 17 Aug 2026

శాఖల నిర్లక్ష్యంతో ప్రజల ఇబ్బందులు

AP: గుడివాడ పట్టణం నుండి విజయవాడ వెళ్లే రోడ్డు మార్గంలో ఉన్న కల్వర్టు కూలిపోయి ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. 15 రోజుల క్రితం కూలిపోయిన కల్వర్టు తమ పరిధి కాదని ఆర్అండ్‌బి, తమ పరిధిలో లేదంటూ మునిసిపాలిటీ..ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డు మార్గం పూర్తిగా ఆగిపోయింది. నిత్యం గుడివాడ విజయవాడ నాన్ స్టాప్ బస్సులు, పలు గ్రామాలకు వెళ్లాల్సినటువంటి పల్లె వెలుగు బస్సులు పట్టణమంతా చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపులో అక్రమాలపై సంతకాల సేకరణ
Local· 17 Aug 2026

డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపులో అక్రమాలపై సంతకాల సేకరణ

TG: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపులో జరిగిన అక్రమాలు, అర్హతలేని వ్యక్తులకు ఇళ్ల కేటాయింపుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మండల ప్రజలు సంతకాల సేకరణ చేపట్టారు. అనర్హులకు ఇళ్లు కేటాయించారనే ఆరోపణలపై విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాలని ప్రజలు కోరుతున్నారు. సేకరించిన సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమంలో అధికారులకు సమర్పించారు.

శ్రీశైలం జలాశయానికి పెరిగిన ప్రవాహం
AP· 17 Aug 2026

శ్రీశైలం జలాశయానికి పెరిగిన ప్రవాహం

AP: శ్రీశైలం జలాశయానికి జూరాల నుంచి 23,197 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 23,197 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 50,673 క్యూసెక్కులుగా ఉంది. జలాశయ నీటిమట్టం 876.50 అడుగులు కాగా, నీటి నిల్వ 170.6640 టీఎంసీలుగా ఉంది. కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.