Latest

బిర్యానీ కోసం వచ్చి.. రెస్టారెంట్‌లో ఫర్నీచర్ ధ్వంసం
TG· 17 Aug 2026

బిర్యానీ కోసం వచ్చి.. రెస్టారెంట్‌లో ఫర్నీచర్ ధ్వంసం

TG: వరంగల్ జిల్లా నర్సంపేటలో బిర్యానీ విషయంలో తలెత్తిన వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మద్యం మత్తులో MFC రెస్టారెంట్‌కు వచ్చిన ఆరుగురు యువకులు బిర్యానీ కావాలని కోరగా, అది అందుబాటులో లేదని యజమాని కుమారుడు చెప్పడంతో వాగ్వాదానికి దిగి దాడికి పాల్పడ్డారు. రెస్టారెంట్‌లోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేయడంతో పాటు క్యాష్ కౌంటర్‌లో ఉన్న కంప్యూటర్‌ను పగులగొట్టారు. వాటర్ బాటిళ్లతో సిబ్బందిపై దాడి చేయడంతో అక్కడ ఉన్న కస్టమర్లు భయంతో పరుగులు తీశారు. యజమాని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

చరిత్రను మార్చిన పరాజితుల చరిత్ర
Arts/Literature· 17 Aug 2026

చరిత్రను మార్చిన పరాజితుల చరిత్ర

అమెరికన్ రచయిత అలెక్స్ హేలీ రాసిన ‘Roots’ నవల ఆఫ్రికన్-అమెరికన్ చరిత్రను ప్రపంచం ముందు కొత్త కోణంలో నిలబెట్టింది. 1976లో వెలువడిన ఈ నవల అతని పూర్వీకుల కథను చెప్తుంది. గాంబియా నుంచి 1750లో బలవంతంగా తీసుకువచ్చిన కుంటా కింటే అనే యువకుడు బానిసగా అమెరికాకు చేరుకున్నాడు. అతని కష్టాలు, బానిసత్వం, తర్వాత స్వేచ్ఛ కోసం పోరాటం..ఇవన్నీ హేలీ కుటుంబ చరిత్రగా మారాయి. ఈ పుస్తకాన్ని తెలుగులో ‘ఏడు తరాలు’ పేరుతో సహవాసి అనువాదం చేశారు. ఇంగ్లీషు పుస్తకం కొనేందుకు <a href="https://amzn.in/d/0bzqJmC5">లింక్</a>. తెలుగు పుస్తకం కొనేందుకు <a href="https://www.telugubooks.in/products/yedu-tharaalu?srsltid=AfmBOooKUyW6q1LqNLX2pxvxXAWxzI4SJjCudbe-mt9uSxZVjl-gXCyP">లింక్</a>.

పోలీసుల కారులో గంజాయి?
Crime· 17 Aug 2026

పోలీసుల కారులో గంజాయి?

AP: అద్దంకి సమీపంలో బల్లికురవ ఎస్సై నాగరాజు, సంతమాగులూరు ఎస్సై నాగమల్లేశ్వరరావు ప్రయాణిస్తున్న పోలీసుల కారు ఆటోను ఢీకొట్టింది. పోలీసుల కారులోని డిక్కీలో గంజాయి ఉన్నట్లు స్థానికులు గుర్తించినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న అద్దంకి సీఐ ఘటనాస్థలికి చేరుకున్నారు. స్థానికులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరగడంతో కొద్దిసేపు ఉద్రిక్త నెలకొంది.

శాఖల నిర్లక్ష్యంతో ప్రజల ఇబ్బందులు
Local· 17 Aug 2026

శాఖల నిర్లక్ష్యంతో ప్రజల ఇబ్బందులు

AP: గుడివాడ పట్టణం నుండి విజయవాడ వెళ్లే రోడ్డు మార్గంలో ఉన్న కల్వర్టు కూలిపోయి ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. 15 రోజుల క్రితం కూలిపోయిన కల్వర్టు తమ పరిధి కాదని ఆర్అండ్‌బి, తమ పరిధిలో లేదంటూ మునిసిపాలిటీ..ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డు మార్గం పూర్తిగా ఆగిపోయింది. నిత్యం గుడివాడ విజయవాడ నాన్ స్టాప్ బస్సులు, పలు గ్రామాలకు వెళ్లాల్సినటువంటి పల్లె వెలుగు బస్సులు పట్టణమంతా చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపులో అక్రమాలపై సంతకాల సేకరణ
Local· 17 Aug 2026

డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపులో అక్రమాలపై సంతకాల సేకరణ

TG: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపులో జరిగిన అక్రమాలు, అర్హతలేని వ్యక్తులకు ఇళ్ల కేటాయింపుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మండల ప్రజలు సంతకాల సేకరణ చేపట్టారు. అనర్హులకు ఇళ్లు కేటాయించారనే ఆరోపణలపై విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాలని ప్రజలు కోరుతున్నారు. సేకరించిన సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమంలో అధికారులకు సమర్పించారు.

శ్రీశైలం జలాశయానికి పెరిగిన ప్రవాహం
AP· 17 Aug 2026

శ్రీశైలం జలాశయానికి పెరిగిన ప్రవాహం

AP: శ్రీశైలం జలాశయానికి జూరాల నుంచి 23,197 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 23,197 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 50,673 క్యూసెక్కులుగా ఉంది. జలాశయ నీటిమట్టం 876.50 అడుగులు కాగా, నీటి నిల్వ 170.6640 టీఎంసీలుగా ఉంది. కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

కల్యాణలక్ష్మి కేసుపై తప్పు ఎవరిదో తేలుస్తామన్న మంత్రి పొన్నం
TG· 17 Aug 2026

కల్యాణలక్ష్మి కేసుపై తప్పు ఎవరిదో తేలుస్తామన్న మంత్రి పొన్నం

TG : కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. దీనికి రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. దీంతో స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్, కల్యాణలక్ష్మి విషయంలో నాలుగైదు సార్లు అవకాశమిచ్చినా కౌంటర్ ఫైల్ చేయకపోవడంపై విచారణ జరుపుతున్నామని చెప్పారు. ఇందులో అధికారుల తప్పా లేక న్యాయవాదుల తప్పా అని తేలాక చర్యలు తీసుకుంటామన్నారు.

పాడి రైతులకు అండగా 25 ఏళ్ల సేవలు
Local· 17 Aug 2026

పాడి రైతులకు అండగా 25 ఏళ్ల సేవలు

TG: హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ మహిళా డెయిరీ 25వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రజతోత్సవ వేడుకలను నిర్వహించారు. 25 ఏళ్ల డెయిరీ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అధ్యక్షురాలు బుర్ర ధనశ్రీ, మేనేజర్ భాస్కర్ రెడ్డి, డెయిరీ సిబ్బంది, మహిళా సభ్యులు, పాడి రైతులు పాల్గొన్నారు. భవిష్యత్‌లో పాల సేకరణను విస్తరించడం, డెయిరీని మరింత అభివృద్ధి చేయడం వంటి అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడ్డారు.

షాదీ ముబారక్‌, కల్యాణలక్ష్మి నిధులు వెంటనే విడుదల చేయాలి
Local· 17 Aug 2026

షాదీ ముబారక్‌, కల్యాణలక్ష్మి నిధులు వెంటనే విడుదల చేయాలి

TG: పేద కుటుంబాలకు అండగా నిలిచే షాదీ ముబారక్‌, కల్యాణలక్ష్మి పథకాల నిధులను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ నిజామాబాద్ జిల్లా నందిపేట్‌లో బీఆర్‌ఎస్‌ నాయకులు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ముచ్చర్ల సాగర్‌ మాట్లాడుతూ షాదీ ముబారక్‌, కల్యాణలక్ష్మి పథకాల లబ్ధిదారులకు నిధులు అందకపోవడంతో పేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు. అర్హులైనవారి ఖాతాలో నిధులు జమ చేయాలని డిమాండ్‌ చేశారు.

సెలబ్రిటీ ప్రమోషన్స్‌పై FDA యాక్షన్!
Current Affairs· 17 Aug 2026

సెలబ్రిటీ ప్రమోషన్స్‌పై FDA యాక్షన్!

విమల్ ఎలాచీ యాడ్ ద్వారా నిషేధిత పాన్ మసాలాను పరోక్షంగా ప్రమోట్ చేస్తున్నారంటూ బాలీవుడ్ స్టార్స్ షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్‌లకు మహారాష్ట్ర FDA షోకాజ్ నోటీసులు ఇచ్చింది. వీరికి ఫుడ్ సేఫ్టీ, కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్‌ల కింద రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు పెనాల్టీ పడే ఛాన్స్ ఉంది. నటులు నేరుగా రానవసరం లేదు, 15 రోజుల్లోగా వారి లీగల్ టీమ్‌ ద్వారా రిప్లై ఇవ్వొచ్చు. కమిషనర్ తుకారామ్ ముండే ఈ సెలబ్రిటీ యాడ్స్‌పై ఫుల్ ఫోకస్ పెట్టారు.

శుభ్‌మన్ గిల్ సూపర్ క్యాచ్!
Sports· 17 Aug 2026

శుభ్‌మన్ గిల్ సూపర్ క్యాచ్!

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో టీమ్ ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుతమైన ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నారు. కుల్దీప్ బౌలింగ్‌లో శ్రీలంక బ్యాటర్ కమిందు మెండిస్ (14) ముందుకు వచ్చి షాట్ కొట్టగా, గిల్ ఎడమవైపుకి డైవ్ చేస్తూ ఒంటిచేత్తో క్యాచ్ పట్టుకున్నారు. ఆశ్చర్యపోయిన బ్యాటర్ క్రీజు వదిలి వెళ్లక తప్పలేదు. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక జట్టు లంచ్ సమయానికి 5 వికెట్ల నష్టానికి 99 రన్స్ చేసింది.

ప్రజావాణిలో వినతుల వెల్లువ.. సమస్యలను పరిష్కరించాలి
Local· 17 Aug 2026

ప్రజావాణిలో వినతుల వెల్లువ.. సమస్యలను పరిష్కరించాలి

TG: రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలోని MPDO కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి 20 దరఖాస్తులు వచ్చినట్లు ఎంపీడీవో రమేష్ తెలిపారు. వివిధ సమస్యలపై ప్రజలు సమర్పించిన ఫిర్యాదులను అధికారులు స్వీకరించారు. ఆయా దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని ఆయన సూచించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందేలా అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. విధుల నిర్వహణలో సమయపాలన పాటించాలని స్పష్టం చేశారు.

సోషల్ మీడియాపై సుప్రీంకోర్టు సీరియస్!
National· 17 Aug 2026

సోషల్ మీడియాపై సుప్రీంకోర్టు సీరియస్!

కోర్టులో జడ్జీలు మాట్లాడే మాటలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ప్రచారం చేయడంపై సుప్రీంకోర్టు ఫోకస్ పెట్టింది. తీర్పులపై విమర్శలు ఓకే కానీ, చెప్పని మాటలను క్రియేట్ చేసి ప్రచారం చేస్తే న్యాయ వ్యవస్థ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని అడ్వకేట్ రాజా చౌదరి కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై CJI సూర్యకాంత్ రియాక్ట్ అవుతూ ఈ విషయంలో జడ్జీలు చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తోందని చెప్పారు. ఈ సోషల్ మీడియా ఫేక్ ట్రోలింగ్ అంశంపై పూర్తి విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు సిద్ధమైంది.

ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక భరోసా ఇవ్వాలని ధర్నా
Local· 17 Aug 2026

ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక భరోసా ఇవ్వాలని ధర్నా

TG: రాష్ట్రంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల పునరుద్ధరణ కోసం బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు వికారాబాద్‌లో ఆందోళన చేపట్టారు. పథకాలను వెంటనే అమలు చేయాలని ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పేద కుటుంబాల్లో ఆడపిల్లల వివాహాలకు ఆర్థికభరోసా కల్పించేందుకు KCR ప్రభుత్వం ఈ పథకాలను తీసుకొచ్చిందని నాయకులు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాలను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. అర్హులైన లబ్ధిదారులకు వెంటనే ఆర్థికసాయం అందించాలని అధికారులకు వినతిపత్రం అందజేశారు.

బొత్స వర్సెస్‌ అచ్చెన్న.. ‘దద్దమ్మ’ పదంతో వేడెక్కిన మండలి
AP· 17 Aug 2026

బొత్స వర్సెస్‌ అచ్చెన్న.. ‘దద్దమ్మ’ పదంతో వేడెక్కిన మండలి

AP: DSC అంశంపై శాసనమండలిలో మంత్రి అచ్చెన్నాయుడు, YSRCP నేత బొత్స సత్యనారాయణ మధ్య మాటల యుద్ధం జరిగింది. అచ్చెన్నాయుడు ‘దద్దమ్మ’ అంటూ చేసిన వ్యాఖ్యలపై బొత్స అభ్యంతరం వ్యక్తం చేశారు. “మనిషి పెరిగితే సరిపోదు.. భాష కూడా బాగుండాలి” అని బొత్స అన్నారు. దీనికి అచ్చెన్నాయుడు స్పందిస్తూ.. చేతగాని వాళ్లను ‘దద్దమ్మ’ అంటారని, అది అన్ పార్లమెంటరీ పదం కాదని తిరిగి సమాధానమిచ్చారు. దీంతో DSC అంశంపై మాటల తూటాలు పేలడంతో ఏపీ శాసనమండలిలో గందరగోళం నెలకొంది.

కొరియన్ నూడుల్స్‌కి మన ఊరి తడ్కా భలే రుచి!
Health· 17 Aug 2026

కొరియన్ నూడుల్స్‌కి మన ఊరి తడ్కా భలే రుచి!

విదేశీ కొరియన్ రామెన్ నూడుల్స్ ఇప్పుడు మన ఇండియన్ టేస్ట్‌తో కొత్తగా తయారవుతున్నాయి. మనవాళ్లు ఈ నూడుల్స్‌లో వెల్లుల్లి చట్నీ, కొత్తిమీర, తడ్కా, మహారాష్ట్ర స్పెషల్ ‘తేచా’ (పచ్చిమిర్చి-వెల్లుల్లి కారం) కలిపి వెరైటీ డిషెస్ ట్రై చేస్తున్నారు. ఉల్లిపాయలు, టమాటోలు, గరం మసాలా, పసుపు వేసి దేనికదే క్రేజీ టేస్ట్‌తో ఈ నూడుల్స్ వండేస్తున్నారు. విదేశీ వంటకమే అయినా మన ఊరి దేశీ మసాలాలు తోడయ్యేసరికి ఫుడీస్ వీటిని చాలా ఇష్టంగా తింటున్నారు.

ఇవాళ విలియం కేరీ జయంతి
Infotainment· 17 Aug 2026

ఇవాళ విలియం కేరీ జయంతి

భారతదేశంలో ఆధునిక విద్య, పత్రికారంగం, సామాజిక సంస్కరణల విస్తరణలో కీలక పాత్ర పోషించిన విలియం కేరీ జయంతి ఇవాళ. ఆగస్టు 17, 1761 న ఇంగ్లాండ్ లో జన్మించారు. 1793లో భారతదేశానికి వచ్చి శ్రీరాంపుర్ కేంద్రంగా తన సేవలను ప్రారంభించారు. కోల్‌కతాలోని ఫోర్ట్ విలియం కళాశాలలో బెంగాలీ, సంస్కృత లెక్చరర్‌గా పనిచేశారు. 1818లో శ్రీరాంపుర్ కాలేజీని స్థాపించారు. జూన్ 9, 1834న మరణించారు. సతీ సహగమన దురాచార నిర్మూలనలో, బహుభాషా డిక్షనరీల తయారీలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం.

గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా వర్ల రామయ్య
AP· 17 Aug 2026

గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా వర్ల రామయ్య

AP: గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. YSRCPకి చెందిన పాండుల రవీంద్రబాబు, జాకియా ఖానం పదవీ విరమణతో ఖాళీ అయిన రెండు స్థానాలపై ఎన్డీఏ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ టీడీపీ నాయకుడు వర్ల రామయ్యకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించింది. భవిష్యత్తులో ఆయనకు శాసన మండలి ఛైర్మన్ పదవి కూడా దక్కవచ్చని ప్రచారం జరుగుతోంది.

యువత ఉజ్వల భవిష్యత్తే లక్ష్యం: మంత్రి వివేక్‌
Local· 17 Aug 2026

యువత ఉజ్వల భవిష్యత్తే లక్ష్యం: మంత్రి వివేక్‌

TG: మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని చిన్నచింతకుంట మండలంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్‌ (ATC) ఏర్పాటుకు అడుగు పడింది. లాల్‌కోట–నెల్లికొండి గ్రామాల మధ్య ఎర్రగట్టు వద్ద రూ.44 కోట్లతో నిర్మించనున్న ATCకి మంత్రి వివేక్ వెంకటస్వామి, MLA జి. మధుసూదన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంత యువత నగరాలకు వెళ్లకుండానే ఆధునిక సాంకేతిక నైపుణ్యాల్లో శిక్షణ పొందే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు.

దర్శిగుంటపేటలో మహిళ దారుణహత్య.. ప్రజల ఆందోళన
Local· 17 Aug 2026

దర్శిగుంటపేటలో మహిళ దారుణహత్య.. ప్రజల ఆందోళన

AP: మార్కాపురం జిల్లా చంద్రశేఖరపురం మండలం దర్శిగుంటపేటలో ఈనెల 13న బంగారం కోసం ఓ మహిళ దారుణ హత్యకు గురయ్యారు. పోలీసుల దర్యాప్తులో బంగారం కోసమే ఈ హత్య జరిగినట్లు నిర్ధారణ అయింది. మృతురాలు ధరించిన బంగారు నగలను దుండగులు తీసుకెళ్లారు. పోస్టుమార్టం నివేదికలో గొడ్డలితో తలపై దాడి చేయడం వల్ల తీవ్ర గాయం కావడంతో ఆమె మృతి చెందినట్లు తేలింది. హత్య జరిగి నాలుగు రోజులైనా నిందితులను ఇంకా పట్టుకోకపోవడంతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. గ్రామంలో పోలీసు భద్రతను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.

462 రన్స్ కి ఆలౌట్.. అయినా ఇండియాదే పైచేయి!
Sports· 17 Aug 2026

462 రన్స్ కి ఆలౌట్.. అయినా ఇండియాదే పైచేయి!

ఇండియా, శ్రీలంక మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ 3వ రోజున టీమిండియా తమ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 462 రన్స్‌కి ఆలౌట్ అయ్యింది. ఈ మ్యాచ్‌లో ఇండియా బ్యాటర్ దేవదత్ పడిక్కల్ 167 రన్స్‌తో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి టీమ్‌కి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సోమవారం నాటి ఆటలో శ్రీలంక బౌలర్లు మిగతా వికెట్లను త్వరగా పడగొట్టి కమ్‌బ్యాక్ చేశారు. అయినప్పటికీ, పడిక్కల్ సెంచరీ హెల్ప్‌తో ఇండియా ఈ టెస్ట్ మ్యాచ్‌పై ఫుల్ కంట్రోల్ సాధించి, శ్రీలంకపై మంచి ఆధిక్యంలో నిలిచింది.