Latest

వయసు తేడాతో ప్రేమ కథా?
Cinema· 14 Aug 2026

వయసు తేడాతో ప్రేమ కథా?

దర్శకుడు వెంకీ అట్లూరి 'లక్కీ భాస్కర్' సినిమాకు ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితగా జాతీయ అవార్డు గెలుచుకున్నారు. ఈ అవార్డు రావడం తన బాధ్యతను మరింత పెంచిందని ఆయన అన్నారు. ప్రస్తుతం హీరో సూర్య, మమితా బైజు జంటగా 'విశ్వనాథ్ అండ్ సన్స్' అనే సినిమా తీస్తున్నారు. ఇందులో 40 ఏళ్ల వ్యక్తికి, 20 ఏళ్ల అమ్మాయికి మధ్య ఉండే ప్రేమకథను చూపిస్తున్నామని, సూర్య నటనతో ఈ కుటుంబ కథా చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందని చెప్పారు.

3D Movies vs 2D Movies
Cinema· 14 Aug 2026

3D Movies vs 2D Movies

'Times of India' రిపోర్ట్ ఆధారంగా సినిమా థియేటర్ల యజమానులు 3D సినిమాలకే ఎక్కువ షోలు ఇస్తుంటే, ప్రేక్షకులు మాత్రం 2D లో చూడటానికి ఇబ్బంది పడుతున్నారు. కళ్లద్దాలు వాడేవాళ్లు 3D గ్లాసెస్ పెట్టుకోవడం కష్టంగా ఉందంటున్నారు. పైగా థియేటర్లలో ఇచ్చే గ్లాసెస్ శుభ్రంగా లేక కంటి ఇన్ఫెక్షన్లు వస్తున్నాయని సోషల్ మీడియాలో కొందరు అంటున్నారు. కానీ థియేటర్ల నిర్వాహకులు మాత్రం ప్రతి షో తర్వాత గ్లాసెస్‌ను క్లీన్ చేస్తున్నామని, కలెక్షన్లు 3Dలోనే ఎక్కువగా వస్తున్నాయని చెబుతున్నారు.

కారు దూసుకెళ్లి స్తంభానికి ఢీ.. మెడికో స్పాట్‌డెడ్
AP· 14 Aug 2026

కారు దూసుకెళ్లి స్తంభానికి ఢీ.. మెడికో స్పాట్‌డెడ్

AP: కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం అనాతవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొనడంతో వైద్య విద్యార్థి అల్లం జయసూర్య (30) అక్కడికక్కడే మృతి చెందాడు. అమలాపురం కిమ్స్‌ ఆసుపత్రికి చెందిన నలుగురు వైద్య విద్యార్థులు కాకినాడ నుంచి అమలాపురం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మరో ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Gen-Z ఖర్చుల లెక్కలు చూస్తే షాకవ్వాల్సిందే!
Gen Z· 14 Aug 2026

Gen-Z ఖర్చుల లెక్కలు చూస్తే షాకవ్వాల్సిందే!

ఇండియన్ Gen-Z యువత మంత్లీ ఖర్చుల్లో ప్రయాణాలకు కేవలం 5 శాతం మాత్రమే పెడుతున్నారని SalarySe రిసెర్చ్‌లో వెల్లడించింది. శాలరీ తీసుకుంటున్న 5.2 లక్షలకు పైగా Gen-Z కన్స్యూమర్ల లక్షలాది UPI ట్రాన్సాక్షన్స్‌ను అనలైజ్ చేసి ఈ స్టడీ చేశారు. వారి ఖర్చుల్లో బిల్లులు, సబ్‌స్క్రిప్షన్లు 20.1 శాతం , కిరాణా 15.7 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 12.2 శాతం, షాపింగ్ 11.9 శాతం, ఫుడ్ 11.5 శాతంగా ఉన్నాయి. దీంతో Gen-Z ఖర్చుల్లో డైలీ అవసరాలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్లు అర్థమౌతుంది.

పూజలు, పెళ్లిళ్లే కాదు.. ఇప్పుడు ఇల్లు..
Infotainment· 14 Aug 2026

పూజలు, పెళ్లిళ్లే కాదు.. ఇప్పుడు ఇల్లు..

ఒకప్పుడు పూజలు, పెళ్లిళ్ల కోసమే పువ్వులు కొనేవారు. కానీ ఇప్పుడు చాలామంది తమ ఇళ్లను అందంగా అలంకరించుకోవడానికి తాజా పువ్వులను కొంటున్నారు. డైనింగ్ టేబుల్ లేదా వర్క్ టేబుల్‌పై పాత గాజు సీసాలు, టీ కప్పుల్లో రెండు మూడు పువ్వులు పెట్టినా ఇల్లు ప్రశాంతంగా, కొత్తగా కనిపిస్తుంది. తక్కువ ధరకు దొరికే గులాబీలు, చామంతులు, బంతి పూలతోనే ఇల్లు ఎంతో హాయిగా మారుతుంది. అందుకే వీకెండ్స్‌లో ఇళ్లను పూలతో అలంకరించుకోవడానికి యువత బాగా ఆసక్తి చూపుతున్నారు.

పింఛన్‌ కోసం బతికున్న భర్తను చంపేసింది
Crime· 14 Aug 2026

పింఛన్‌ కోసం బతికున్న భర్తను చంపేసింది

AP: వితంతు పింఛన్‌ పొందాలన్న ఆశతో బతికున్న భర్తను చనిపోయినట్లు చూపించి మరణ ధ్రువపత్రం పొందిన ఘటన కృష్ణా జిల్లా పెనమలూరులో వెలుగుచూసింది. కానూరు శివాలయం రోడ్డుకు చెందిన యర్రంశెట్టి రమాదేవి తన భర్త మురళీకృష్ణ మృతిచెందినట్లు తాడిగడప మున్సిపల్ అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చి మరణ ధ్రువపత్రం పొందినట్లు అధికారులు గుర్తించారు. ఈ విషయం ఇటీవల భర్తకు తెలియడంతో విచారణ చేపట్టారు. రమాదేవి తన తప్పును అంగీకరించినట్లు కమిషనర్‌ నజీర్ పేర్కొన్నారు. ఆమెపై కేసు నమోదు చేయాలని కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

షూటింగ్ ముగిసింది.. ఎగ్జిబిషన్ మొదలైంది!
Infotainment· 14 Aug 2026

షూటింగ్ ముగిసింది.. ఎగ్జిబిషన్ మొదలైంది!

హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ తీసిన 'ది ఒడిస్సీ' సినిమాతో ఇటలీలోని 'ఫావిగ్నానా' అనే చిన్న దీవికి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో ఆ దీవిని 'ఇథాకా' రాజభవనంగా చూపించారు. సినిమా చూసి వచ్చే టూరిస్టులను ఆకట్టుకునేందుకు స్థానిక అధికారులు అక్కడ ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో షూటింగ్ సమయంలో వాడిన బట్టలు, వస్తువులను చూపిస్తారు. దీంతో ఆ చిన్న దీవికి టూరిస్టులు ఎక్కువగా వచ్చే అవకాశం కనిపిస్తోంది.

2 ఏళ్ల మానసిక నరకం : అనుపమ
Cinema· 14 Aug 2026

2 ఏళ్ల మానసిక నరకం : అనుపమ

హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తన లవ్ బ్రేకప్‌పై మాట్లాడారు. గత రెండేళ్లుగా తాను మానసిక, శారీరక వేధింపులు ఎదుర్కొన్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తన Ex-Lover ప్రవర్తన ఒక్కో రోజు ఒక్కోలా ఉండేదని, 'అపరిచితుడు' సినిమాలో క్యారెక్టర్లలా మారిపోతూ బాధపెట్టేవాడని తెలిపారు. ఆ బాధను తట్టుకోలేక చాలా బరువు తగ్గిపోయానని, పూర్తిగా కోలుకున్నాకే ఈ విషయాన్ని బయటకు చెబుతున్నానని అన్నారు.

PM  SVANidhi స్కీమ్‌.. చిన్న వ్యాపారులకు ఆర్థిక భరోసా
Infotainment· 14 Aug 2026

PM SVANidhi స్కీమ్‌.. చిన్న వ్యాపారులకు ఆర్థిక భరోసా

కరోనా టైమ్‌లో నష్టపోయిన చిన్న వ్యాపారులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం స్వనిధి <a href="https://uatapi.udyamimitra.in/PMSVANidhi/">(PM SVANidhi)</a> స్కీమ్‌ను అమలు చేస్తోంది. ఈ స్కీమ్‌ ద్వారా చిన్న వ్యాపారులకు ఎలాంటి ష్యూరిటీ లేకుండా దశలవారీగా రూ.90,000 వరకు లోన్ ఇస్తుంది. లోన్‌ను ఆన్‌టైమ్‌లో కడితే మరో ఫేజ్‌లో ఎక్కువ లోన్ పొందే అవకాశముంటుంది. డిజిటల్ ట్రాన్సాక్షన్స్‌ను ఎంకరేజ్ చేయడానికి క్యాష్‌బ్యాక్ వంటి బెనిఫిట్స్ కూడా అందిస్తుంది. ఈ పథకం 2030 మార్చి 31 వరకు అమల్లో ఉంటుంది.

CAను బురిడీ కొట్టించిన సైబర్‌ కేటుగాళ్లు
Crime· 14 Aug 2026

CAను బురిడీ కొట్టించిన సైబర్‌ కేటుగాళ్లు

TG: ట్రేడింగ్‌లో భారీ లాభాల ఆశచూపి రంగారెడ్డి జిల్లాలోని గండిపేటకు చెందిన చార్టర్డ్‌ అకౌంటెంట్‌ నరసింహారెడ్డిని సైబర్‌ నేరగాళ్లు భారీగా మోసం చేశారు. ఈమెయిల్‌, టెలిగ్రామ్‌ ద్వారా పరిచయమైన మోసగాళ్లు ప్రత్యేక ట్రేడింగ్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయించి మొదట రూ.2లక్షలు పెట్టుబడి పెట్టించారు. 12రోజుల్లో 52విడతల్లో బాధితుడి నుంచి ఏకంగా రూ.2.45 కోట్లు పెట్టుబడిగా తీసుకున్నారు. డబ్బులు విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించగా సాధ్యపడలేదు. నిందితులు స్పందించక పోవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

సిటీలో మరో హైటెక్ హాస్పిటల్.. CM చేతులమీదుగా
Politics· 14 Aug 2026

సిటీలో మరో హైటెక్ హాస్పిటల్.. CM చేతులమీదుగా

TG: హైదరాబాద్ సనత్‌నగర్‌లోని మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (TIMS) హాస్పిటల్ ప్రారంభానికి రెడీ అయ్యింది. ఈ నెల 17న CM రేవంత్‌రెడ్డి హాస్పిటల్‌ను ప్రారంభిస్తారు. 22.6 ఎకరాల్లో రూ.1,070 కోట్లతో నిర్మించిన హాస్పిటల్‌లో ముందుగా 582 బెడ్స్‌తో సర్వీసెస్ అందుబాటులోకి రానున్నాయి. అక్టోబర్‌లో మరో 500 బెడ్స్‌ అందుబాటులోకి వస్తాయి. కార్డియాక్‌, నెఫ్రాలజీ-యూరాలజీ, ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్, ట్రామా డిపార్ట్‌మెంట్స్‌తో పాటు 37 డిపార్ట్‌మెంట్స్‌ సర్వీసులు అందిస్తాయి.

డెలివరీ బాయ్స్‌ మధ్య వివాదం.. ఒకరు మృతి
Crime· 14 Aug 2026

డెలివరీ బాయ్స్‌ మధ్య వివాదం.. ఒకరు మృతి

TG: హైదరాబాద్‌ శివారు నార్సింగిలో డెలివరీ బాయ్స్‌ మధ్య జరిగిన ఘర్షణ విషాదంగా మారింది. డెలివరీ విషయంలో ఇద్దరి మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నాయి. గురువారం రాత్రి పనిచేసే ప్రాంతంలో మరోసారి వాగ్వాదం జరగడంతో వివాదం తీవ్రమైంది. ఒకరిపై ఒకరు దాడి చేసుకోగా, కోకాపేటకు చెందిన బ్లింకెట్‌ డెలివరీ బాయ్‌ అబ్దుల్‌ సమీద్‌(31) తలకు తీవ్ర గాయమైంది. దీంతో స్పాట్‌లోనే కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నార్సింగి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

రీల్ తెచ్చిన తిప్పలు.. అధికారులకు లెటర్!
News· 14 Aug 2026

రీల్ తెచ్చిన తిప్పలు.. అధికారులకు లెటర్!

హీరో విక్రమ్ ఒక అరుదైన విదేశీ కోతి (లార్ గిబ్బన్)తో తీసిన వీడియో పెద్ద వివాదానికి దారితీసింది. ఆ వీడియో చూసి అటవీ శాఖ అధికారులు విచారణ ప్రారంభించారు. దీంతో విక్రమ్ ఆ వీడియోను డిలీట్ చేసి, ఫారెస్ట్ ఆఫీసర్లకు లెటర్ రాసిచ్చారు. ఆ కోతి తనది కాదని, దానిపై తనకు ఎలాంటి హక్కులు లేవని అందులో తెలిపారు. అక్రమంగా విదేశీ జంతువులను దేశంలోకి తీసుకొచ్చారా అనే దానిపై అధికారులు విచారణ చేస్తున్నారు.

రైల్వేలో 3,993 జాబ్స్.. వెంటనే అప్లై చేసుకోండి!
Jobs· 14 Aug 2026

రైల్వేలో 3,993 జాబ్స్.. వెంటనే అప్లై చేసుకోండి!

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) జూనియర్ ఇంజినీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ పోస్టులకు 3,993 వేకెన్సీలను ప్రకటించింది. అప్లికేషన్ ప్రాసెస్ ఈరోజు ప్రారంభమై సెప్టెంబర్ 13తో ముగుస్తుంది. 18–33 ఏళ్ల కాండిడేట్లు <a href="https://www.rrbapply.gov.in/#/auth/landing">అప్లై చేసుకోవచ్చు</a>. JE పోస్టులకు ఇంజినీరింగ్ డిప్లొమా/డిగ్రీ, DMSకు ఏదైనా ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా ఉండాలి. ఎంపిక CBT, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్షల ద్వారా జరుగుతుంది. అప్లికేషన్ ఫీజ్ రూ.500 ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ CBTకి అటెండ్ ఐతే రూ.500 రిఫండ్ చేస్తారు.

పీవీ సింధు వెనుక ఉన్న అసలైన శక్తి..
Sports· 14 Aug 2026

పీవీ సింధు వెనుక ఉన్న అసలైన శక్తి..

తన భర్త వెంకట దత్త సాయి గురించి భారత బ్యాడ్మింటన్ 'పీవీ సింధు' ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆటలో గెలుపోటములు ఎదురైనప్పుడు దత్తా తనను ఎంతగానో ప్రోత్సహిస్తారని చెప్పారు. 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్సే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు, అలాగే విశాఖపట్నంలో 'PV Sindhu Centre for Sports Excellence' నిర్మిస్తున్నామని అన్నారు. ఆట తనకు ఇచ్చిన దానిలో కొంతైనా సమాజానికి తిరిగి ఇవ్వాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

చిన్నారులకు కొత్త జీవితం
News· 14 Aug 2026

చిన్నారులకు కొత్త జీవితం

TG : హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) ఆసుపత్రిలో గుండె సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు ఆగస్టు 13 నుంచి ఉచితంగా ఆపరేషన్లు చేయనున్నారు. ఈ విషయాన్ని నిమ్స్ డైరెక్టర్ రాహుల్ దేవరాజ్ తెలిపారు. <br>దీని కోసం ఎలాంటి అపాయింట్‌మెంట్ అవసరం లేదు. పిల్లల పేరెంట్స్ ఆస్పత్రి పాత భవనంలోని 32వ రూంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇందుకోసం మొదటి అంతస్తులోని సీటీ ఆఫీస్‌‌కి వెళ్లాలి. అక్కడ వివరాలు చెబుతారు. తద్వారా చిన్నారికి కొత్త జీవితాన్ని అందించవచ్చు.

కొత్త యాప్‌తో రైతులకు కష్టాలు
TG· 14 Aug 2026

కొత్త యాప్‌తో రైతులకు కష్టాలు

TG: మెదక్‌ జిల్లాలో కొత్త ఎరువుల బుకింగ్‌ యాప్‌ రైతులకు కొత్త తిప్పలు తెచ్చిపెట్టింది. యాప్‌లో అన్ని వివరాలు నమోదు చేసి యూరియా బుక్‌ చేసేలోపే స్టాక్‌ ఖాళీగా చూపిస్తుండటంతో అన్నదాతలు <a href="https://www.theclearcutnews.com/n/VbwizMx">ఆందోళన</a> చెందుతున్నారు. ఆండ్రాయిడ్‌ ఫోన్‌, ఫార్మర్‌ రిజిస్ట్రీ, ఆధార్‌కు మొబైల్‌ నంబర్‌ లింక్‌ వంటి నిబంధనలు చిన్న, సన్నకారు రైతులకు ఇబ్బందిగా మారాయి. యాప్‌ ఓపెన్‌ అయ్యేందుకు గంటల తరబడి వేచి చూసినా, బుకింగ్‌ చేసేలోపే స్టాక్‌ నిల్‌ అవుతోందని రైతులు వాపోయారు. చేగుంట, రామాయంపేట ప్రాంతాల్లో రైతులు నిరసనలు చేపట్టారు.

‘SIR’ పేరుతో ఫోన్‌ చేస్తే నమ్మొద్దు: సుదర్శన్ రెడ్డి
TG· 14 Aug 2026

‘SIR’ పేరుతో ఫోన్‌ చేస్తే నమ్మొద్దు: సుదర్శన్ రెడ్డి

TG: ఓటర్లను లక్ష్యంగా చేసుకుని SIR పేరుతో సైబర్‌ మోసాలు జరుగుతున్నందున అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి హెచ్చరించారు. ఎన్నికల సంఘం పేరుతో ఫోన్‌ కాల్స్‌, వాట్సాప్‌ మెసేజ్‌లు లేదా లింకులు పంపి ఫారం పూర్తి చేయాలని ఎవరైనా కోరితే స్పందించవద్దని సూచించారు. ఫారం నింపిన తర్వాత రూ.5 చెల్లించాలని, నెట్‌బ్యాంకింగ్‌, డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డు వివరాలు ఇవ్వాలని కోరుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. లాగిన్‌, పాస్‌వర్డ్‌, CVV, ATM PIN వంటి వివరాలను ఇవ్వొద్దని అన్నారు.

నన్ను గుర్తుపడతావు కదూ అమ్మా..!
News· 14 Aug 2026

నన్ను గుర్తుపడతావు కదూ అమ్మా..!

భారత స్వాతంత్య్ర పోరాటంలో చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప విప్లవకారుడు ఖుదీరాంబోస్. 1908లో కేవలం 18 సంవత్సరాల వయసులోనే బ్రిటీష్ పాలకులు ఆయనను ఉరితీశారు. కనీసం చేతులకు సంకెళ్లు కూడా సరిగ్గా పట్టక జారిపోయేంత చిన్న వయసు అది. అయినా సరే, ఆయన కొంచెం కూడా భయపడలేదు. భగవద్గీతను చేతిలో పట్టుకుని... 'నా మెడపై ఉండే ఉరితాడు గుర్తుతో నన్ను గుర్తుపట్టు భారత్‌మాతా' అని నవ్వుతూ ప్రాణాలు అర్పించాడు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఆయన ధైర్యం, త్యాగం భారత స్వాతంత్య్ర చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచాయి.

పసిబిడ్డ చేసిన చిన్న పనికి.. తల్లిపై దారుణం
Crime· 14 Aug 2026

పసిబిడ్డ చేసిన చిన్న పనికి.. తల్లిపై దారుణం

పంజాబ్‌ రాష్ట్రం కాపుర్తలాలో దారుణ ఘటన జరిగింది. మాతా శ్రీ భద్రకాళి టెంపుల్ వద్ద బిక్షాటన చేస్తున్న మహిళపై ఓ వ్యక్తి ఇష్టానుసారంగా దాడి చేశాడు. ఆమెతో ఉన్న పసిబిడ్డ బైక్‌ను తాకిందని కోపంతో బైక్‌ ఓనర్ వికాస్‌ శర్మ.. మహిళను కిందకు తోసి చెప్పుతో కొట్టి, కాలితో తన్నాడు. అక్కడున్నవారు ఆపినా దాడి కంటిన్యూ చేశాడు. ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. పోలీసులు సుమోటోగా కేసు బుక్ చేసి, అతడిపై BNS సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. నిందితుడి కోసం పోలీసులు వెతుకుతున్నారు.

కొత్త స్మార్ట్ రేషన్ కార్డు.. నకిలీకి నో ఛాన్స్!
TG· 14 Aug 2026

కొత్త స్మార్ట్ రేషన్ కార్డు.. నకిలీకి నో ఛాన్స్!

TG: తెలంగాణ ప్రభుత్వం ఇవ్వనున్న స్మార్ట్ రేషన్ కార్డులకు మల్టీ లేయర్ సెక్యూరిటీ కల్పిస్తోంది. ఫేక్ కార్డులకు అడ్డుకట్ట వేసేలా చాలా సెక్యూరిటీ ఫీచర్లతో కార్డులను డిజైన్ చేస్తున్నారు. పాస్‌పోర్టులు, కరెన్సీ నోట్లలో వాడే అడ్వాన్స్‌డ్ సెక్యూరిటీ ఫీచర్లను ఇందులో అమలు చేస్తున్నారు. కార్డుపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫొటోలు, బెనిఫిషియరీ డీటెయిల్స్, రేషన్ షాప్ నంబర్, సంతకానికి చోటు ఉంటుంది. డిజిటల్ ద్వారా కార్డు ఆథెంటిసిటీని గుర్తించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.