Latest

2 ఏళ్ల మానసిక నరకం : అనుపమ
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తన లవ్ బ్రేకప్‌పై మాట్లాడారు. గత రెండేళ్లుగా తాను మానసిక, శారీరక వేధింపులు ఎదుర్కొన్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తన Ex-Lover ప్రవర్తన ఒక్కో రోజు ఒక్కోలా ఉండేదని, 'అపరిచితుడు' సినిమాలో క్యారెక్టర్లలా మారిపోతూ బాధపెట్టేవాడని తెలిపారు. ఆ బాధను తట్టుకోలేక చాలా బరువు తగ్గిపోయానని, పూర్తిగా కోలుకున్నాకే ఈ విషయాన్ని బయటకు చెబుతున్నానని అన్నారు.

PM SVANidhi స్కీమ్.. చిన్న వ్యాపారులకు ఆర్థిక భరోసా
కరోనా టైమ్‌లో నష్టపోయిన చిన్న వ్యాపారులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం స్వనిధి <a href="https://uatapi.udyamimitra.in/PMSVANidhi/">(PM SVANidhi)</a> స్కీమ్‌ను అమలు చేస్తోంది. ఈ స్కీమ్ ద్వారా చిన్న వ్యాపారులకు ఎలాంటి ష్యూరిటీ లేకుండా దశలవారీగా రూ.90,000 వరకు లోన్ ఇస్తుంది. లోన్‌ను ఆన్‌టైమ్‌లో కడితే మరో ఫేజ్‌లో ఎక్కువ లోన్ పొందే అవకాశముంటుంది. డిజిటల్ ట్రాన్సాక్షన్స్‌ను ఎంకరేజ్ చేయడానికి క్యాష్‌బ్యాక్ వంటి బెనిఫిట్స్ కూడా అందిస్తుంది. ఈ పథకం 2030 మార్చి 31 వరకు అమల్లో ఉంటుంది.

CAను బురిడీ కొట్టించిన సైబర్ కేటుగాళ్లు
TG: ట్రేడింగ్‌లో భారీ లాభాల ఆశచూపి రంగారెడ్డి జిల్లాలోని గండిపేటకు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ నరసింహారెడ్డిని సైబర్ నేరగాళ్లు భారీగా మోసం చేశారు. ఈమెయిల్, టెలిగ్రామ్ ద్వారా పరిచయమైన మోసగాళ్లు ప్రత్యేక ట్రేడింగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయించి మొదట రూ.2లక్షలు పెట్టుబడి పెట్టించారు. 12రోజుల్లో 52విడతల్లో బాధితుడి నుంచి ఏకంగా రూ.2.45 కోట్లు పెట్టుబడిగా తీసుకున్నారు. డబ్బులు విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించగా సాధ్యపడలేదు. నిందితులు స్పందించక పోవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

సిటీలో మరో హైటెక్ హాస్పిటల్.. CM చేతులమీదుగా
TG: హైదరాబాద్ సనత్‌నగర్‌లోని మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS) హాస్పిటల్ ప్రారంభానికి రెడీ అయ్యింది. ఈ నెల 17న CM రేవంత్‌రెడ్డి హాస్పిటల్‌ను ప్రారంభిస్తారు. 22.6 ఎకరాల్లో రూ.1,070 కోట్లతో నిర్మించిన హాస్పిటల్‌లో ముందుగా 582 బెడ్స్‌తో సర్వీసెస్ అందుబాటులోకి రానున్నాయి. అక్టోబర్‌లో మరో 500 బెడ్స్ అందుబాటులోకి వస్తాయి. కార్డియాక్, నెఫ్రాలజీ-యూరాలజీ, ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్, ట్రామా డిపార్ట్‌మెంట్స్‌తో పాటు 37 డిపార్ట్‌మెంట్స్ సర్వీసులు అందిస్తాయి.

డెలివరీ బాయ్స్ మధ్య వివాదం.. ఒకరు మృతి
TG: హైదరాబాద్ శివారు నార్సింగిలో డెలివరీ బాయ్స్ మధ్య జరిగిన ఘర్షణ విషాదంగా మారింది. డెలివరీ విషయంలో ఇద్దరి మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నాయి. గురువారం రాత్రి పనిచేసే ప్రాంతంలో మరోసారి వాగ్వాదం జరగడంతో వివాదం తీవ్రమైంది. ఒకరిపై ఒకరు దాడి చేసుకోగా, కోకాపేటకు చెందిన బ్లింకెట్ డెలివరీ బాయ్ అబ్దుల్ సమీద్(31) తలకు తీవ్ర గాయమైంది. దీంతో స్పాట్‌లోనే కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నార్సింగి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

రీల్ తెచ్చిన తిప్పలు.. అధికారులకు లెటర్!
హీరో విక్రమ్ ఒక అరుదైన విదేశీ కోతి (లార్ గిబ్బన్)తో తీసిన వీడియో పెద్ద వివాదానికి దారితీసింది. ఆ వీడియో చూసి అటవీ శాఖ అధికారులు విచారణ ప్రారంభించారు. దీంతో విక్రమ్ ఆ వీడియోను డిలీట్ చేసి, ఫారెస్ట్ ఆఫీసర్లకు లెటర్ రాసిచ్చారు. ఆ కోతి తనది కాదని, దానిపై తనకు ఎలాంటి హక్కులు లేవని అందులో తెలిపారు. అక్రమంగా విదేశీ జంతువులను దేశంలోకి తీసుకొచ్చారా అనే దానిపై అధికారులు విచారణ చేస్తున్నారు.

రైల్వేలో 3,993 జాబ్స్.. వెంటనే అప్లై చేసుకోండి!
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) జూనియర్ ఇంజినీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ పోస్టులకు 3,993 వేకెన్సీలను ప్రకటించింది. అప్లికేషన్ ప్రాసెస్ ఈరోజు ప్రారంభమై సెప్టెంబర్ 13తో ముగుస్తుంది. 18–33 ఏళ్ల కాండిడేట్లు <a href="https://www.rrbapply.gov.in/#/auth/landing">అప్లై చేసుకోవచ్చు</a>. JE పోస్టులకు ఇంజినీరింగ్ డిప్లొమా/డిగ్రీ, DMSకు ఏదైనా ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా ఉండాలి. ఎంపిక CBT, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్షల ద్వారా జరుగుతుంది. అప్లికేషన్ ఫీజ్ రూ.500 ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ CBTకి అటెండ్ ఐతే రూ.500 రిఫండ్ చేస్తారు.

పీవీ సింధు వెనుక ఉన్న అసలైన శక్తి..
తన భర్త వెంకట దత్త సాయి గురించి భారత బ్యాడ్మింటన్ 'పీవీ సింధు' ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆటలో గెలుపోటములు ఎదురైనప్పుడు దత్తా తనను ఎంతగానో ప్రోత్సహిస్తారని చెప్పారు. 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్సే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు, అలాగే విశాఖపట్నంలో 'PV Sindhu Centre for Sports Excellence' నిర్మిస్తున్నామని అన్నారు. ఆట తనకు ఇచ్చిన దానిలో కొంతైనా సమాజానికి తిరిగి ఇవ్వాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

చిన్నారులకు కొత్త జీవితం
TG : హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) ఆసుపత్రిలో గుండె సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు ఆగస్టు 13 నుంచి ఉచితంగా ఆపరేషన్లు చేయనున్నారు. ఈ విషయాన్ని నిమ్స్ డైరెక్టర్ రాహుల్ దేవరాజ్ తెలిపారు. <br>దీని కోసం ఎలాంటి అపాయింట్‌మెంట్ అవసరం లేదు. పిల్లల పేరెంట్స్ ఆస్పత్రి పాత భవనంలోని 32వ రూంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇందుకోసం మొదటి అంతస్తులోని సీటీ ఆఫీస్‌కి వెళ్లాలి. అక్కడ వివరాలు చెబుతారు. తద్వారా చిన్నారికి కొత్త జీవితాన్ని అందించవచ్చు.

కొత్త యాప్‌తో రైతులకు కష్టాలు
TG: మెదక్ జిల్లాలో కొత్త ఎరువుల బుకింగ్ యాప్ రైతులకు కొత్త తిప్పలు తెచ్చిపెట్టింది. యాప్‌లో అన్ని వివరాలు నమోదు చేసి యూరియా బుక్ చేసేలోపే స్టాక్ ఖాళీగా చూపిస్తుండటంతో అన్నదాతలు <a href="https://www.theclearcutnews.com/n/VbwizMx">ఆందోళన</a> చెందుతున్నారు. ఆండ్రాయిడ్ ఫోన్, ఫార్మర్ రిజిస్ట్రీ, ఆధార్‌కు మొబైల్ నంబర్ లింక్ వంటి నిబంధనలు చిన్న, సన్నకారు రైతులకు ఇబ్బందిగా మారాయి. యాప్ ఓపెన్ అయ్యేందుకు గంటల తరబడి వేచి చూసినా, బుకింగ్ చేసేలోపే స్టాక్ నిల్ అవుతోందని రైతులు వాపోయారు. చేగుంట, రామాయంపేట ప్రాంతాల్లో రైతులు నిరసనలు చేపట్టారు.

‘SIR’ పేరుతో ఫోన్ చేస్తే నమ్మొద్దు: సుదర్శన్ రెడ్డి
TG: ఓటర్లను లక్ష్యంగా చేసుకుని SIR పేరుతో సైబర్ మోసాలు జరుగుతున్నందున అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి హెచ్చరించారు. ఎన్నికల సంఘం పేరుతో ఫోన్ కాల్స్, వాట్సాప్ మెసేజ్‌లు లేదా లింకులు పంపి ఫారం పూర్తి చేయాలని ఎవరైనా కోరితే స్పందించవద్దని సూచించారు. ఫారం నింపిన తర్వాత రూ.5 చెల్లించాలని, నెట్‌బ్యాంకింగ్, డెబిట్ లేదా క్రెడిట్ కార్డు వివరాలు ఇవ్వాలని కోరుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. లాగిన్, పాస్‌వర్డ్, CVV, ATM PIN వంటి వివరాలను ఇవ్వొద్దని అన్నారు.

నన్ను గుర్తుపడతావు కదూ అమ్మా..!
భారత స్వాతంత్య్ర పోరాటంలో చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప విప్లవకారుడు ఖుదీరాంబోస్. 1908లో కేవలం 18 సంవత్సరాల వయసులోనే బ్రిటీష్ పాలకులు ఆయనను ఉరితీశారు. కనీసం చేతులకు సంకెళ్లు కూడా సరిగ్గా పట్టక జారిపోయేంత చిన్న వయసు అది. అయినా సరే, ఆయన కొంచెం కూడా భయపడలేదు. భగవద్గీతను చేతిలో పట్టుకుని... 'నా మెడపై ఉండే ఉరితాడు గుర్తుతో నన్ను గుర్తుపట్టు భారత్‌మాతా' అని నవ్వుతూ ప్రాణాలు అర్పించాడు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఆయన ధైర్యం, త్యాగం భారత స్వాతంత్య్ర చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచాయి.
పసిబిడ్డ చేసిన చిన్న పనికి.. తల్లిపై దారుణం
పంజాబ్ రాష్ట్రం కాపుర్తలాలో దారుణ ఘటన జరిగింది. మాతా శ్రీ భద్రకాళి టెంపుల్ వద్ద బిక్షాటన చేస్తున్న మహిళపై ఓ వ్యక్తి ఇష్టానుసారంగా దాడి చేశాడు. ఆమెతో ఉన్న పసిబిడ్డ బైక్‌ను తాకిందని కోపంతో బైక్ ఓనర్ వికాస్ శర్మ.. మహిళను కిందకు తోసి చెప్పుతో కొట్టి, కాలితో తన్నాడు. అక్కడున్నవారు ఆపినా దాడి కంటిన్యూ చేశాడు. ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. పోలీసులు సుమోటోగా కేసు బుక్ చేసి, అతడిపై BNS సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. నిందితుడి కోసం పోలీసులు వెతుకుతున్నారు.

కొత్త స్మార్ట్ రేషన్ కార్డు.. నకిలీకి నో ఛాన్స్!
TG: తెలంగాణ ప్రభుత్వం ఇవ్వనున్న స్మార్ట్ రేషన్ కార్డులకు మల్టీ లేయర్ సెక్యూరిటీ కల్పిస్తోంది. ఫేక్ కార్డులకు అడ్డుకట్ట వేసేలా చాలా సెక్యూరిటీ ఫీచర్లతో కార్డులను డిజైన్ చేస్తున్నారు. పాస్‌పోర్టులు, కరెన్సీ నోట్లలో వాడే అడ్వాన్స్‌డ్ సెక్యూరిటీ ఫీచర్లను ఇందులో అమలు చేస్తున్నారు. కార్డుపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫొటోలు, బెనిఫిషియరీ డీటెయిల్స్, రేషన్ షాప్ నంబర్, సంతకానికి చోటు ఉంటుంది. డిజిటల్ ద్వారా కార్డు ఆథెంటిసిటీని గుర్తించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

బైక్‌పై నుంచి పడిన యువకుడిని ఈడ్చుకెళ్లిన కారు
TG: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ వద్ద హైదరాబాద్-శ్రీశైలం హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వచ్చిన రెండు బైక్‌లు ఢీకొనడంతో తాండ్రకు చెందిన శివయాదవ్ రోడ్డుపై పడిపోయారు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఆయనను ఢీకొని కొంతదూరం ఈడ్చుకెళ్లింది. తీవ్ర గాయాలతో శివయాదవ్ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

KBR పార్క్ చుట్టూ ట్రాఫిక్ మార్పులు
TG: హైదరాబాద్ KBR పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానాన్ని ఆగస్టు 18 నుంచి అమలు చేయనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. శుక్రవారం పార్క్ వాకర్లతో అధికారులు ముఖాముఖి నిర్వహించి కొత్త ట్రాఫిక్ మార్పులపై అవగాహన కల్పించారు. వాహనాలను కేటాయించిన పార్కింగ్ ప్రాంతాల్లోనే నిలపాలని, ముఖ్యంగా ఉదయం వేళల్లో రాంగ్ రూట్‌లో వెళ్లవద్దని సూచించారు. కొత్త నిబంధనలకు వాహనదారులు, పార్క్ వాకర్లు సహకరించాలని కోరారు. ప్రజల సలహాలు, సూచనల కోసం పార్క్ వద్ద QR కోడ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఉత్తరాఖండ్‌లో విషాదం.. టన్నెల్‌లోకి నీరు, మట్టి
ఉత్తరాఖండ్ రాష్ట్రం చమోలి జిల్లాలో నిన్న సాయంత్రం కన్‌స్ట్రక్షన్‌లో ఉన్న హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు టన్నెల్‌లోకి ఒక్కసారిగా నీరు, మట్టి చేరడంతో దారుణం జరిగింది. టన్నెల్‌లో ఉన్న 22 మంది కార్మికుల్లో 21 మందిని రెస్క్యూ టీమ్స్ బయటకు తీసుకువచ్చాయి. వీరిలో ఏడుగురు చనిపోగా, మరో 14 మంది గాయపడి హాస్పిటల్లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. ఘటనపై CM పుష్కర్ సింగ్ ధామి ఆందోళన వ్యక్తం చేశారు. చిక్కుకున్న కార్మికులను సేఫ్‌గా బయటకు తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

భూములు అమ్మే అధికారం ఎవరిచ్చారు?: హరీశ్‌రావు
TG: ప్రభుత్వానికి చెందిన విలువైన వారసత్వ భూములను భవిష్యత్ తరాలకు కాపాడాల్సిన బాధ్యత CM రేవంత్‌రెడ్డిపై ఉందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఈ మేరకు రేవంత్‌రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు. కంచ గచ్చిబౌలి, లగచర్ల, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ, రాయదుర్గం ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములను వేలం వేయడాన్ని BRS తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. అధికారంలోకి రాకముందు ప్రభుత్వ భూములను జాతి సంపదగా పేర్కొన్న రేవంత్‌రెడ్డి ఇప్పుడు వాటిని ఎందుకు విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రశ్నించారు.

తెల్లవారుజామున షాకింగ్ యాక్సిడెంట్
TG: హైదరాబాద్ నుంచి తమిళనాడులోని అరుణాచలానికి ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ సమీపంలో నేషనల్ హైవేపై అదుపుతప్పి బోల్తా పడింది. ప్రయాణికులు నిద్రలో ఉండటంతో కేకలు, ఆర్తనాదాలతో భయానక పరిస్థితి నెలకొంది. స్థానికులు, హైవే పెట్రోలింగ్ సిబ్బంది వెంటనే బస్సు అద్దాలు పగులగొట్టి ప్రయాణికులను బయటకు తీశారు. గాయపడిన 21 మందిని 108 అంబులెన్సుల్లో మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడం, అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.

పోలీసులపై దాడి.. పైనుంచి దూకేందుకు డ్రామా
TG: వాట్సాప్ గ్రూపుల ద్వారా హైదరాబాద్‌లో గంజాయి సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. బేగంపేట ఓల్డ్ ఎయిర్‌పోర్ట్ వద్ద అనుమానితుడిని అదుపులోకి తీసుకోగా 50గ్రాముల గంజాయి లభించింది. విచారణలో బాలానగర్ రాజీవ్‌కాలనీలో ఉంటున్న కిరణ్, దుర్గాప్రసాద్, కమలాకర్ ఈ దందా వెనుక ఉన్నట్లు గుర్తించారు. నార్కోటిక్స్ బృందాలు దాడిచేసి ముగ్గురిని అరెస్ట్ చేశాయి. కిరణ్ ఓ ఇన్‌స్పెక్టర్‌పై స్క్రూడ్రైవర్‌తో దాడికి యత్నించి అనంతరం నాల్గో అంతస్తు నుంచి దూకేందుకు డ్రామా చేసినట్లు పోలీసులు తెలిపారు.

స్కూల్ ఫీజుల నియంత్రణపై రౌండ్‌టేబుల్
తెలంగాణలో ప్రైవేట్ స్కూల్ ఫీజుల నియంత్రణ, ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతం కోసం తెలంగాణ పీపుల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. ఇవాళ (ఈ నెల 14) హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సమావేశం జరగనుంది. మాజీ IAS అధికారి ఆకునూరి మురళి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రైవేట్ స్కూల్ ఫీజుల నియంత్రణ కోసం త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు సిద్దమయ్యారు.