Latest

23న ముస్లింవాద సాహిత్య సభ
TG: ఆగస్టు 23(ఆదివారం) మహబూబాబాద్‌లోని TPTF భవన్‌లో సాయంత్రం 5.30లకు ‘ముస్లింవాద సాహిత్య సభ’ నిర్వహించనున్నారు. దీనికి కవి, కథకుడు సయ్యద్ ఖుర్షీద్ అధ్యక్షత వహించనున్నారు. కవి, కథకుడు స్కైబాబ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ‘అస్తిత్వ ఉద్యమాలు: ముస్లింవాద సాహిత్యం’ అనే అంశంపై చర్చ జరుగుతుంది. వక్తలుగా బండారు రాజ్‌కుమార్, రహిమొద్దీన్, గన్నోజు ప్రసాద్ పాల్గొంటారు.

కాంగ్రెస్‌లోనే ఉంటా.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్లారిటీ
TG: రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. బయట నుంచి వచ్చిన వ్యక్తుల కారణంగా అసలైన కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని అన్నారు. సీమాంధ్ర పాలకుల చెప్పుచేతల్లో తెలంగాణ ప్రభుత్వం ఉండకూడదన్నదే తన అభిప్రాయమన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసమే రాష్ట్ర ఉద్యమం జరిగిందని గుర్తుచేశారు. ప్రజాపాలన అంటే ప్రజల కోసం పనిచేయాలి కానీ పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్ల కోసం కాదని స్పష్టం చేశారు.

కల్యాణ లక్ష్మీపై స్టే.. కోడితో BRS మహిళల నిరసన
TG: ట్యాంక్‌బండ్ వద్ద BRS మహిళా నాయకులు కోడితో వెరైటీగా నిరసన చేపట్టారు. కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలపై హైకోర్టు స్టే విధిస్తే.. ప్రభుత్వం కావాలనే బలమైన వాదనలు వినిపించలేదని ఆరోపించారు. పథకాలను ఎత్తివేయాలనే ఉద్దేశంతోనే కోర్టులో పిటిషన్ వేయించారని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆడబిడ్డలకు తులం బంగారం కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

BCIపై CJI ఫైర్
CJI సూర్యకాంత్ పాల్గొనే గ్రాడ్యుయేషన్ డేపై నిరసన తెలిపిన నల్సార్ లా విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్ ఆపాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(BCI) ఇచ్చిన ఆర్డర్స్‌పై సుప్రీంకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థులకు పీస్‌ఫుల్‌గా నిరసన తెలిపే రైట్ ఉందని, ఇందులో BCI జోక్యం అనవసరమని స్పష్టం చేసింది. స్టూడెంట్స్, ఫ్యాకల్టీపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోకూడదని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్యా బాగ్చీల ధర్మాసనం స్టే విధిస్తూ ఇంటరిమ్ ఆర్డర్స్ ఇచ్చింది.

‘Book Thief’..హార్పర్ కాలిన్స్ కొత్త మార్కెట్ స్ట్రాటజీ
పుస్తకాలను ప్రమోట్ చేయడానికి హార్పర్ కాలిన్స్ ఇండియా సంస్థ కొత్త స్ట్రాటజీ ఫాలో అవుతోంది. తమ ఉద్యోగి కేశవ్ గాంధీని ‘Book Thief’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. “కేశవ్ గాంధీ, మా ఆఫీస్ నుంచి దొంగిలించిన పుస్తకాలు తిరిగి ఇవ్వు” అని ‘వాంటెడ్’ పోస్టర్ స్టైల్‌లో పోస్ట్ చేసింది. అతని నవ్వుతున్న ఫోటోతో ఉన్న ఈ పోస్ట్ చూసినవాళ్లు మొదట నిజంగానే అతను దొంగతనం చేశాడని అనుకున్నారు. తర్వాత అదంతా సరదాగానే అని తెలుసుకున్నారు.

IASలపై ఈటల కీలక కామెంట్స్.. CM డైరెక్షన్‌లోనే దందా?
TG: రాష్ట్రంలో కొందరు IAS అధికారులపై BJP ఎంపీ ఈటల రాజేందర్ కీలక ఆరోపణలు చేశారు. CM రేవంత్‌రెడ్డి డైరెక్షన్‌లో కొందరు అధికారులు కావాలనే భూములను బ్యాన్డ్ లిస్ట్‌లో పెడుతున్నారని ఆరోపించారు. CM లేదా ఆయనకు సంబంధించిన వారి నుంచి క్లారిఫికేషన్ వచ్చిన తర్వాతే వాటిని క్లియర్ చేస్తున్నారని అన్నారు. భూముల వాల్యూ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ దందా సాగుతోందని, బాధితుల నుంచి డబ్బులు వసూలు చేయడమే టార్గెట్ అని ఆరోపించారు. బాధితులు కలెక్టర్, సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారని పేర్కొన్నారు.

కొడుకును కాపాడబోయి.. తల్లి కూడా చెరువులోకి
TG: మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పిల్లిగుండ్ల తండాలో విషాదం చోటుచేసుకుంది. మొగిలిచర్ల శివారులోని రెడ్డి చెరువులో పడి తల్లి, కుమారుడు మృతి చెందారు. తండాకు చెందిన భూక్య నవ్య (26) తన కుమారుడు అన్వేష్ (9)తో కలిసి పశువులను మేపేందుకు వెళ్లింది. చెరువు సమీపంలో అన్వేష్ ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడగా, అతడిని కాపాడేందుకు వెళ్లిన తల్లి కూడా నీటిలో మునిగిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఇద్దరూ ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు వెతకగా చెరువులో మృతదేహాలు కనిపించాయి. మృతదేహాలను పోలీసులు బయటకు తీశారు.

కొడుకులిద్దరి పరిస్థితిని తట్టుకోలేక.. తల్లి ఆత్మహత్య
TG: రంగారెడ్డి జిల్లా జన్వాడకు చెందిన సుధ KPHB సర్దార్ పటేల్ నగర్‌లోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో హౌస్‌కీపింగ్‌గా చేస్తూ అక్కడే నివసిస్తోంది. ఆమెకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు తండ్రి హత్య కేసులో చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. చిన్న కుమారుడు గంజాయికి బానిసై తల్లిని తరచూ వేధిస్తున్నాడు. ఇద్దరు కొడుకులు పెడదోవ పట్టడంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు సుధ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

రిపోర్టర్లుగా పరిచయం.. టార్గెట్ చేసి డబ్బులు డిమాండ్
TG: కామారెడ్డి శిరీష ఆత్మహత్య కేసులో ఇద్దరు నకిలీ రిపోర్టర్లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇందూరి సిద్ధాగౌడ్, లాండే భాస్కర్ ప్రభుత్వ ఉద్యోగుల వ్యక్తిగత, ఉద్యోగ వివరాలను RTI ద్వారా సేకరించి, వాటిని ఆధారంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు డిమాండ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. శిరీషను కూడా ఉద్యోగం పోయేలా చేస్తామని బెదిరించి మానసికంగా వేధించినట్లు దర్యాప్తులో ఆధారాలు లభించాయని కామారెడ్డి DSP మధుసూదన్ వెల్లడించారు.

సావర్కర్ కేసులో రాహుల్‌కు బిగ్ రిలీఫ్.. కోర్టు కీలక తీర్పు!
సావర్కర్‌పై రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్‌పై సంబంధించిన క్రిమినల్ కేసులో ఆయనకు సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఉత్తరప్రదేశ్‌లో ఫైల్ చేసిన కంప్లెయింట్‌ను, మేజిస్ట్రేట్ జారీ చేసిన సమన్లను జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ షీల్ నాగు బెంచ్ ఈరోజు కొట్టివేసింది. కేసు నమోదుకు అవసరమైన ప్రభుత్వ అనుమతి (సాంక్షన్) తీసుకోలేదని కోర్టు స్పష్టం చేసింది. 2022 భారత్ జోడో యాత్రలో సావర్కర్‌ను బ్రిటిష్ సహకారిగా రాహుల్ పేర్కొనడంపై ఈ కంప్లెయింట్ నమోదైంది.

నాయకుల ఎంపికలో 'Peaceful Revolution' రావాలి: వాంగ్‌చుక్
2047 నాటికి ఇండియా గౌరవప్రదమైన దేశంగా ఉండాలంటే నాయకుల ఎంపిక విధానంలో 'Peaceful Revolution' రావాలని సైంటిస్ట్, యాక్టివిస్ట్ సోనమ్ వాంగ్‌చుక్ అన్నారు. దేశంలోని సగం మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు ఉండగా, ఇంకొంత మందిపై మర్డర్, రేప్, కిడ్నాప్ వంటి ఆరోపణలు ఉన్నాయన్నారు. దేశంలో నమ్మకం లోపం పెరిగిందన్న ఆయన.. నిస్వార్థ, నిర్భయ, సమర్థులైన వ్యక్తులతో చర్చించి మార్పులకు మార్గం రూపొందించాలని అన్నారు. “TOGETHER CAN WE START INDIA'S 2ND INDIPENDENCE MOVEMENT!” అని పిలుపునిచ్చారు.

పార్శి న్యూ ఇయర్!
ఆగస్టు 15న పార్శి నూతన సంవత్సరం 'నవ్రోజ్' సందర్భంగా ఢిల్లీలోని పార్శి ఇళ్లలో పండగ వంటల సందడి మొదలైంది. ఉదయాన్నే రవ్వ, పాయసంతో మొదలుపెట్టి, మధ్యాహ్నానికి సల్లీ గోష్ట్, పాత్రా నీ మచ్ఛీ, చికెన్ బెర్రీ పులావ్, దాల్ పాలా వంటి రుచికరమైన విందు సిద్ధం చేసుకుంటారు. 'లగన్-ను-కస్టర్డ్' స్వీట్ కచ్చితంగా తింటారు. ఈ రోజూ ఇళ్లను శుభ్రం చేసి ముగ్గులు, పూలతో అలంకరిస్తారు. సాంప్రదాయ దుస్తులు ధరించి అగ్ని దేవాలయంలో ప్రార్థనలు చేస్తారు.

Cab డ్రైవర్లకు లాంగ్వేజ్ టెస్ట్.. Fail ఐతే లైసెన్స్ Cancel
మహారాష్ట్రలో క్యాబ్ డ్రైవర్లకు మరాఠీ భాష తప్పనిసరి కానుంది. ఓలా, ఉబర్, ర్యాపిడో డ్రైవర్లకు కూడా ఈ కండిషన్ నుంచి ఎగ్జెంప్షన్ ఉండదని ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్ ప్రతాప్ సర్ణాయక్ తెలిపారు. ఆగస్టు 15తో మరాఠీ ట్రైనింగ్ డెడ్‌లైన్ ముగియనుండగా.. ఆ తర్వాత తనిఖీలు చేసి రూల్స్ పాటించని వారిపై యాక్షన్స్ తీసుకోనున్నారు. ఇందుకు లైసెన్స్ 3 నెలల వరకు సస్పెండ్ చేయడం లేదా క్యాన్సిల్ చేసే అవకాశముంది. ఇప్పటికే 1.10 లక్షల మందికి పైగా డ్రైవర్లు ట్రైనింగ్ పూర్తి చేశారు.

గోల్డ్ ప్రియులకు గుడ్ న్యూస్?
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో శుక్రవారం బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.710 తగ్గి రూ.1,52,890 వద్ద ట్రేడ్ అవుతుండగా, 22 క్యారెట్ల పసిడి ధర రూ.650 తగ్గి రూ.1,40,150కి చేరింది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,14,670 వద్ద కొనసాగుతోంది. అయితే మార్కెట్‌లో గోల్డ్ రేట్స్ ఎప్పటికప్పుడు మారుతుంటాయి కాబట్టి, జ్యువెలరీ కొనేముందు లేటెస్ట్ ప్రైస్ చెక్ చేసుకోవడం మంచిది.

భార్యాభర్తల హత్య వెనుక ఇద్దరు కానిస్టేబుళ్లు
TG: సూర్యాపేట జిల్లా మోతె మండలంలో భార్యాభర్తలు బూబా, నాగులు హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఘటనలో మోతె PSకు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు షరీఫ్, సుందరయ్యల ప్రమేయం ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. బూబాతో షరీఫ్‌కు వివాహేతర సంబంధం ఉండడంతో ఆమె కుమార్తె వివాహానికి షరీఫ్ రూ.3లక్షలు అప్పుగా ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఆమె డబ్బులు తిరిగి ఇవ్వకపోవడం, తమ సంబంధాన్ని బయటపెడతానని బూబా బెదిరించింది. దీంతో షరీఫ్, సుందరయ్య భార్యాభర్తలపై రాడ్‌తో దాడిచేసి హత్య చేసినట్లు పేర్కొన్నారు.

లండన్, పారిస్‌లను షేక్ చేస్తున్న మన డిజైనర్లు!
మన దేశ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లు ఇప్పుడు పారిస్, న్యూయార్క్, లండన్, మిలన్, దుబాయ్ వంటి అంతర్జాతీయ ఫ్యాషన్ షోలలో సందడి చేస్తున్నారు. సబ్యసాచి ముఖర్జీ దాదాపు 20 ఏళ్ల తర్వాత మళ్లీ న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌కి తిరిగి వస్తున్నారు. అలాగే ధ్రువ్ కపూర్ మిలన్‌లో, లవ్‌బర్డ్స్ బ్రాండ్ లండన్‌లో తమ డిజైన్లను ప్రదర్శిస్తున్నాయి. కేవలం వ్యాపారం కోసమే కాకుండా, భారతీయ కళను ప్రపంచానికి పరిచయం చేయడానికి సరిపోయే నగరాలను డిజైనర్లు ఎంచుకుంటున్నారు.
బస్సులో వేధింపులు.. మాస్ ట్రీట్‌మెంట్ ఇచ్చిన యువతి!
కర్ణాటకలోని కోలార్–బంగారపేట వెళ్లే KSRTC బస్సులో ఓ వ్యక్తి మహిళను తాకడానికి ట్రై చేశాడు. ముందు పొరపాటుగా భావించినా.. అతడి బిహేవియర్ ఎక్కువవడంతో యువతి కోపంతో అతడిపై చేయిచేసుకుంది. “ఏం పనిరా నువ్వు చేసేది? నీ వయసెంత రా?” అంటూ గట్టిగా ప్రశ్నిస్తూ చితకబాదింది. పెళ్లాం, పిల్లలు ఉన్నారని, వదిలేయాలని కాళ్లు పట్టుకుని వేడుకున్నాడు. చివరకు బస్సు నుంచి దిగి పరారయ్యాడు. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వయసు తేడాతో ప్రేమ కథా?
దర్శకుడు వెంకీ అట్లూరి 'లక్కీ భాస్కర్' సినిమాకు ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితగా జాతీయ అవార్డు గెలుచుకున్నారు. ఈ అవార్డు రావడం తన బాధ్యతను మరింత పెంచిందని ఆయన అన్నారు. ప్రస్తుతం హీరో సూర్య, మమితా బైజు జంటగా 'విశ్వనాథ్ అండ్ సన్స్' అనే సినిమా తీస్తున్నారు. ఇందులో 40 ఏళ్ల వ్యక్తికి, 20 ఏళ్ల అమ్మాయికి మధ్య ఉండే ప్రేమకథను చూపిస్తున్నామని, సూర్య నటనతో ఈ కుటుంబ కథా చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందని చెప్పారు.

3D Movies vs 2D Movies
'Times of India' రిపోర్ట్ ఆధారంగా సినిమా థియేటర్ల యజమానులు 3D సినిమాలకే ఎక్కువ షోలు ఇస్తుంటే, ప్రేక్షకులు మాత్రం 2D లో చూడటానికి ఇబ్బంది పడుతున్నారు. కళ్లద్దాలు వాడేవాళ్లు 3D గ్లాసెస్ పెట్టుకోవడం కష్టంగా ఉందంటున్నారు. పైగా థియేటర్లలో ఇచ్చే గ్లాసెస్ శుభ్రంగా లేక కంటి ఇన్ఫెక్షన్లు వస్తున్నాయని సోషల్ మీడియాలో కొందరు అంటున్నారు. కానీ థియేటర్ల నిర్వాహకులు మాత్రం ప్రతి షో తర్వాత గ్లాసెస్‌ను క్లీన్ చేస్తున్నామని, కలెక్షన్లు 3Dలోనే ఎక్కువగా వస్తున్నాయని చెబుతున్నారు.

కారు దూసుకెళ్లి స్తంభానికి ఢీ.. మెడికో స్పాట్‌డెడ్
AP: కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం అనాతవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో వైద్య విద్యార్థి అల్లం జయసూర్య (30) అక్కడికక్కడే మృతి చెందాడు. అమలాపురం కిమ్స్ ఆసుపత్రికి చెందిన నలుగురు వైద్య విద్యార్థులు కాకినాడ నుంచి అమలాపురం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మరో ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Gen-Z ఖర్చుల లెక్కలు చూస్తే షాకవ్వాల్సిందే!
ఇండియన్ Gen-Z యువత మంత్లీ ఖర్చుల్లో ప్రయాణాలకు కేవలం 5 శాతం మాత్రమే పెడుతున్నారని SalarySe రిసెర్చ్‌లో వెల్లడించింది. శాలరీ తీసుకుంటున్న 5.2 లక్షలకు పైగా Gen-Z కన్స్యూమర్ల లక్షలాది UPI ట్రాన్సాక్షన్స్‌ను అనలైజ్ చేసి ఈ స్టడీ చేశారు. వారి ఖర్చుల్లో బిల్లులు, సబ్‌స్క్రిప్షన్లు 20.1 శాతం , కిరాణా 15.7 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 12.2 శాతం, షాపింగ్ 11.9 శాతం, ఫుడ్ 11.5 శాతంగా ఉన్నాయి. దీంతో Gen-Z ఖర్చుల్లో డైలీ అవసరాలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్లు అర్థమౌతుంది.