Latest

ఈ రాత్రి ఆకాశం వైపు ఓసారి చూడండి! ☄️
ఆకాశంలో వెలుగులు మెరుస్తూ కనిపిస్తే ఆశ్చర్యపోకండి.. ఇదికనిపించబోయే పెర్సీడ్స్ మీటియర్ షవర్. ఆగస్టు 12–13 రాత్రి ఇది గరిష్ఠ స్థాయికి చేరుతుంది. భూమి స్విఫ్ట్-టటిల్ అనే తోకచుక్క వదిలిన దుమ్ము, చిన్న రాళ్ల కణాల గుండా ప్రయాణించినప్పుడు అవి వాతావరణంలోకి దూసుకొచ్చి మండిపోవడంతో ఈ వెలుగులు కనిపిస్తాయి. చీకటి ప్రదేశం నుంచి చూస్తే గంటకు డజన్ల కొద్దీ ఉల్కలు కనిపించే అవకాశం ఉంది. ఈసారి అమావాస్య సమయం కావడంతో చంద్రకాంతి ఇబ్బంది కూడా తక్కువగా ఉంటుంది. టెలిస్కోప్ పనిలేదు; నగర వెలుగులకు దూరంగా చూస్తే చాలు.

☕Coffee Wasteతో Fuel కూడా తయారవుతుందా? ⛽
రోజూ కాఫీ చేసుకున్న తర్వాత మిగిలే కాఫీ పొడిని మనం సాధారణంగా చెత్తలో పడేస్తాం. కానీ దాంతో ఇంధనం తయారు చేసే అవకాశం ఉందని రీసెర్చర్లు చెబుతున్నారు. ఈ పొడిలో కొంత సహజ నూనె ఉంటుంది. దాన్ని ప్రత్యేక పద్ధతుల్లో బయటకు తీసి బయోడీజిల్‌గా మార్చొచ్చు. కొన్ని స్టడీస్‌లో ఇలా తయారైన బయోడీజిల్‌ను డీజిల్‌తో కలిపి ఇంజిన్లలో కూడా పరీక్షించారు. అంటే మనం పడేసే కాఫీ వ్యర్థాలు భవిష్యత్తులో బయోఫ్యూయల్ తయారీకి ఉపయోగపడే పదార్థంగా మారే అవకాశం ఉంది.

షాదీముబారక్, కల్యాణలక్ష్మి పథకాలపై హైకోర్టు స్టే
TG: రాష్ట్రంలో అమలవుతున్న షాదీముబారక్, కల్యాణలక్ష్మి పథకాలపై హైకోర్టు స్టే ఇచ్చింది. చట్టబద్ధత లేకుండా కేవలం జీవోల ద్వారా ఈ పథకాలు అమలు చేస్తున్నారని న్యాయవాది విజయ్ గోపాల్ పిటిషన్ వేశారు. దీనిపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంతో కోర్టు స్టే ఇచ్చింది. తర్వాతి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. పేద కుటుంబాల్లోని ఆడపిల్లల పెళ్లి ఖర్చులకు సాయం చేయడం కోసం 2014 అక్టోబర్ 2న ప్రారంభమైన ఈ పథకాలపై స్టే విధించడంతో లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది.

బాలీవుడ్ ఎప్పుడూ అంతే: కంగనా రనౌత్
ఢిల్లీలో విద్యార్థి నిరసనలపై కామెంట్ చేసిన సీనియర్ నటుడు నసీరుద్దీన్ షాను ‘లోండి(నక్క)’ అని పిలవడాన్ని బీజేపీ ఎంపీ, నటి కంగనా రనాత్ సమర్థించుకున్నారు. సినీ పరిశ్రమ ఎప్పుడూ ఇలాంటి వైఖరే చూపిస్తూ వచ్చిందని అన్నారు. “నిరసనకారులు పార్లమెంట్‌పై దాడి చేయాలని చూశారు. ఎంపీల కార్లపై ఎక్కి కూర్చుని అద్దాలు పగలగొట్టారు. నా ఇంటి గేటు దగ్గరకు కూడా వచ్చారు. రాత్రంతా నిద్రపోలేకపోయాను. అయినా కూడా ఇలాంటి వాళ్లు వాళ్ల గురించి మొసలి కన్నీళ్లు కార్చారు” అని కంగనా అన్నారు.

ఇంటివాడైన ఫుట్‌బాల్ సూపర్‌స్టార్ క్రిస్టియానో రోనాల్డో
పోర్చుగీస్ ఫుట్‌బాల్ సూపర్‌స్టార్ క్రిస్టియానో రోనాల్డో, అతని గర్ల్‌ఫ్రెండ్ అయిన మోడల్, ఇన్‌ఫ్లుయెన్సర్ జార్జినా రోడ్రిగ్యూజ్ పెళ్లి చేసుకున్నారు. పోర్చుగల్‌లోని కాస్కైస్‌లో ఈ వేడుక ప్రైవేట్‌గా జరిగింది. ఈ జంట తమ ఇన్‌స్టాగ్రామ్‌లో వెడ్డింగ్ రింగ్స్ ఫోటో పోస్ట్ చేసి “C❤️G” అని క్యాప్షన్ రాశారు. 2025 ఆగస్టు 11న జార్జినా డైమండ్ రింగ్‌తో ఫోటో పోస్ట్ చేసి స్పానిష్‌లో “Yes I do. In this and in all my lives” అని రాశారు. సరిగ్గా ఏడాది తర్వాత వారి పెళ్లి జరిగింది.

నువ్వు లేకుండా ఆడలేను- మెస్సీ
తన తండ్రి, ఏజెంట్ జోర్జ్ మెస్సీ హఠాన్మరణం(ఆగస్టు 8)తో అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ <a href="https://www.instagram.com/p/Db8MYnQjYsC/?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==">మెస్సీ</a> తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. "నువ్వు లేవు అంటే నమ్మలేకపోతున్నా.. నువ్వు లేకుండా ఎలా ముందుకు సాగాలో అర్థం కావట్లేదు" అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాశారు. ఇకపై ఎక్కువ కాలం ఫుట్‌బాల్ ఆడటంపై తనకు సీరియస్ డౌట్స్ ఉన్నాయని షాకింగ్ కామెంట్స్ చేశారు. చిన్నప్పటి నుండి తనకు నాన్న, ఫ్రెండ్, ప్రతినిధిగా అండగా నిలిచారని, ఆయనను చాలా మిస్ అవుతున్నట్లు ఎమోషనల్ పోస్ట్ చేశారు.

ఇల్లు కూల్చివేతలపై సుప్రీంకోర్టు కామెంట్స్
అక్రమ గృహాలను కూల్చివేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతుందో, ఆ బాధితులకు పునరావాసం కల్పించాల్సిన బాధ్యత కూడా అంతే ఉందని సుప్రీంకోర్టు స్టేట్మెంట్ ఇచ్చింది. కూల్చివేత మరియు పునరావాసం రెండూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న "జంట బాధ్యతలు"(Twin Responsibilities) అని స్పష్టం చేసింది. ఇల్లు కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవడం ప్రభుత్వ కనీస ధర్మమని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.

Blinkit లైసెన్స్ రద్దు, Zepto గోడౌన్ సీజ్🤯
సిటీల్లో సరుకులకు BlinkIt, Zepto apps పై ఆధారపడే వాళ్లు భారీగా పెరిగారు. కానీ ఆ సంస్థలు ఫుడ్ సేఫ్టీ విషయంలో కాంప్రమైజ్ అయ్యాయని తాజా తనిఖీలు చెప్తున్నాయ్. ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు ఫాలో అవలేదని ముంబై మలాడ్ Blinkit స్టోర్ లైసెన్స్ రద్దు చేశారు. బెంగళూరు Zepto గోడౌన్ సీజ్ చేశారు. పురుగులు, అపరిశుభ్రత తప్పుడు లేబుల్స్ ఐడెంటిఫై చేశారు. మే 25- జూలై 31 మధ్య ముంబైలో 3,137 చోట్ల తనిఖీ చేసి 764 నోటీసులు, 165 సస్పెన్షన్లు చేశారు. లోపాలు సరిదిద్దుకుంటే మళ్లీ లైసెన్ ఇస్తామని FDA కమిషనర్ తుకారాం ముండే చెప్పారు.

DNAను Repair చేయడం వల్ల జీవితకాలం పెరగొచ్చా? 🧬
మన DNAలో రోజూ ఎన్నో చిన్నచిన్న నష్టాలు జరుగుతుంటాయి. వాటిని మన శరీరంలోని కణాలు సహజంగానే రిపేర్ చేస్తుంటాయి. వయసు పెరిగేకొద్దీ ఈ రిపేర్ సామర్థ్యం తగ్గడం వల్ల DNAలో నష్టం పేరుకుపోవచ్చు. అందుకే DNAను మరింత సమర్థంగా రిపేర్ చేయగలిగితే వృద్ధాప్యాన్ని నెమ్మదించవచ్చా అనే దానిపై రీసెర్చ్ జరుగుతోంది. 2026లో వచ్చిన కొత్త రీసెర్చ్‌లు కూడా DNA రిపేర్, దీర్ఘాయుష్షు మధ్య సంబంధంపై దృష్టి పెడుతున్నాయి. అయితే మనుషుల జీవితకాలాన్ని పెంచే నిరూపితమైన చికిత్స ఇంకా లేదు.

ఉత్తర కొరియా మరో Ballistic Missile ప్రయోగం! 🚀
ఉత్తర కొరియా మరోసారి బాలిస్టిక్ మిసైల్‌ను ప్రయోగించింది. బుధవారం తూర్పు తీరంలోని వోన్‌సాన్ ప్రాంతం నుంచి ప్రయోగించిన ఈ మిసైల్ సుమారు 700 కిలోమీటర్లు ప్రయాణించి కొరియా ద్వీపకల్పం, జపాన్ మధ్య సముద్రంలో పడినట్లు దక్షిణ కొరియా, జపాన్ అధికారులు తెలిపారు. ఇది వారం రోజుల్లో ఉత్తర కొరియా చేసిన రెండో బాలిస్టిక్ మిసైల్ ప్రయోగం. ఈ నెల 17 నుంచి అమెరికా, దక్షిణ కొరియా వార్షిక సైనిక విన్యాసాలు ప్రారంభించనున్న నేపథ్యంలో ఈ ప్రయోగం జరగడం ఆ ప్రాంతంలో టెన్షన్‌ను మరింత పెంచింది.

CJP సౌరవ్ దాస్ ఫ్యామిలీకి బెదిరింపులు
పాండిచ్చేరి పోలీసులు తన ఫ్యామిలీ మెంబర్స్‌ను క్వశ్చన్ చేస్తూ వేధింపులకు గురిచేశారని CJP స్పోక్స్ పర్సన్ <a href="https://x.com/SauravDassss/status/2087534766874910808?s=20">సౌరవ్ దాస్</a> ‘X’ వేదికగా పోస్ట్ పెట్టారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే పోలీసులు ఈ బెదిరింపులకు పాల్పడ్డారని, ఇది చట్టబద్ధమైన విధానం కాదని ఆరోపించారు. తానెవరికీ భయపడేది లేదని, తనను సైలెంట్‌గా ఉంచేందుకు ఇలాంటి చర్యలు పనిచేయవని చెప్తూ, పోలీసుల ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
AI వచ్చినా..అమ్మకు రెస్ట్ లేదు
ప్రస్తుతం AI కాలం నడుస్తోంది. ప్రతి పనికీ ఏఐ వాడేసి, పనిని సులభంగా చేసేయడం ట్రెండ్‌గా మారిపోయింది. పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఎంప్లాయిస్‌ను తగ్గించి, ఏఐ ద్వారా పనులు చేయిస్తోంది. అయితే AI వచ్చినా అమ్మ చేసే పనులకు రెస్ట్ లేదు అంటూ స్వర్ణిక శుక్లా అనే కంటెంట్ క్రియేటర్ చేసిన వీడియో నెట్‌లో వైరల్ అవుతోంది. AI ఎంత అడ్వాన్స్ అయినా పిల్లల్ని చూసుకునే పనిని ఇంకా తల్లులకే అంటగడుతున్న సమాజం మీద సెటైర్ లాంటి వీడియో ఇది.

NTR సర్జరీ సక్సెస్
జూనియర్ <a href="https://x.com/tarak9999/status/2087524661877932480?s=20">NTR</a>కు కిమ్స్ హాస్పిటల్‌లో సర్జరీ సక్సెస్ ఫుల్‌గా జరిగింది. తన హెల్త్ అప్‌డేట్‌ను ‘ఎక్స్’ వేదికగా తానే స్వయంగా షేర్ చేశారు. "నా కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. డాక్టర్ల టీమ్‌కి నా గ్రాటిట్యూడ్. మీ ప్రేమే నా బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్.. త్వరలోనే కలుద్దాం!" అని పోస్ట్ చేశారు. రీసెంట్‌గా జిమ్‌లో వర్కవుట్స్ చేస్తుండగా ఆయన భుజానికి గాయం కావడం అందరికీ తెలిసిందే.

చెన్నైలో Anti-Caste కవిత్వ ప్రదర్శన
భారతదేశంలో తొలి Anti-Caste కవిత్వం బృందం ‘ది రిజర్వ్డ్ కంపార్ట్‌మెంట్’ చెన్నైలో ప్రత్యేక కవిత్వ ప్రదర్శన నిర్వహించనుంది. ఆగస్టు 22న అల్వార్‌పేటలోని ‘ది మెడై’ వేదికపై ఈ కార్యక్రమం జరుగుతుంది. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా రాసిన కవితల ద్వారా సామాజిక అవగాహన కలిగించడమే ఈ బృందం లక్ష్యం. కవిత్వం ద్వారా మార్పు తీసుకురావాలని కోరుకునే వారందరికీ ఈ ప్రదర్శన అరుదైన అవకాశమని నిర్వాహకులు అంటున్నారు. ఈవెంట్‌లో పాల్గొనాలనుకునేవారు ఈ <a href="https://forms.gle/qq2pivo84zd3e72w5">లింక్ </a>ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

🌏 గ్లోబల్ మార్కెట్ల ఫోకస్ అంతా US Inflation డేటాపైనే! 👀
గ్లోబల్ మార్కెట్లలో ఈరోజు అందరి ఫోకస్ US Inflation డేటాపైనే ఉంది! 👀📊 జూలై నెల కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (CPI) డేటా ఈరోజు విడుదల కానుంది. ఈ డేటా కోసం ఇన్వెస్టర్స్, ట్రేడర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. Inflation 3.4 శాతానికి తగ్గొచ్చని అంచనాలు ఉన్నాయి. అంచనాల కంటే తక్కువగా వస్తే వడ్డీ రేట్ల విషయంలో కొంత రిలీఫ్ ఉండొచ్చని, ఎక్కువగా వస్తే మార్కెట్లలో వోలాటిలిటీ పెరగొచ్చని అనలిస్ట్స్ చెబుతున్నారు. అందుకే ఈ డేటా ఈరోజు గ్లోబల్ మార్కెట్లకు చాలా ఇంపార్టెంట్‌గా మారింది.

ఆ అధికారి వల్ల చికెన్ రంగు మారింది!
మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) కమిషనర్, ఐఏఎస్ అధికారి తుకారాం ముండే వల్ల ముంబైలో రెస్టారెంట్లలో చికెన్ రంగు మారింది. ఎలాగో తెలుసా? ఫుడ్ ఇన్స్‌ఫెక్షన్‌లో ఆయన చూపిన స్ట్రిక్ట్‌నెస్ వల్ల ముంబయిలో రెస్టారెంట్లు, స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులు వంటల్లో ఆర్టిఫిషియల్ కలర్స్ వాడటం మానేశారు. చికెన్ లాలిపాప్, మంచూరియన్ లాంటి వంటలను ఎలాంటి రంగులు కలపకుండా కస్టమర్లకు అందిస్తున్నారు.

Gen Z Attention Span నిజంగానే తగ్గిందా?
Gen Zకి చాలా తక్కువ Attention Span ఉంటుందని చాలామంది అంటుంటారు. కానీ అది అందరికీ వర్తిస్తుందని చెప్పలేం. ముఖ్యంగా షార్ట్ వీడియోలు, వరుసగా వచ్చే సోషల్ మీడియా కంటెంట్ ఎక్కువగా చూస్తే, ఎక్కువసేపు ఒకే పనిపై ఫోకస్ చేయడం కొంతమందికి కష్టంగా అనిపించొచ్చు. 2026లో పుణేలో 18–25 ఏళ్ల 110 మంది GenZలపై చేసిన రీసెర్చ్‌లో, షార్ట్ వీడియోలు ఎక్కువగా చూసేవారిలో ఎక్కువసేపు చేసే పనులపై ఫోకస్ తగ్గినట్లు కనిపించింది. అయితే దీనివల్ల షార్ట్ వీడియోలే కారణమని ఖచ్చితంగా చెప్పలేం. మీకు ఇలా అనిపిస్తుందా? కామెంట్‌లో చెప్పండి.

ఆస్పత్రి బెడ్ నుంచే దేవేంద్ర నాథ్ మహతో లెటర్!
JPSC-JSSC అవినీతిపై రాంచీలోని జైపాల్ సింగ్ ముండా స్టేడియంలో దేవేంద్ర నాథ్ మహతో చేపట్టిన నిరాహార దీక్ష 11వ రోజుకు చేరింది. ప్రస్తుతం సదర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఆయన, తనను తిరిగి సత్యాగ్రహ స్థలానికి వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని సివిల్ సర్జన్‌కు లెటర్ రాశారు. "నా శరీరం ఆస్పత్రి బెడ్‌పై ఉన్నప్పటికీ, నా ఆత్మ, సంకల్పం విద్యార్థుల న్యాయ పోరాటం వద్దే ఉంది" అని దేవేంద్ర నాథ్ అందులో పేర్కొన్నారు.

రవితేజ ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్
రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘ఇరుముడి’. ప్రియా భవాని శంకర్ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాకు జి.వి.ప్రకాశ్ మ్యూజిక్ అందించారు. దీని ట్రైలర్ ఇవాళ విడుదలైంది. ఈనెల 21న థియేటర్లలో రిలీజ్ కానుంది. ట్రైలర్‌ని రవితేజ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నారు.

‘అర్థశాస్త్ర విమర్శ’ పుస్తకం
మార్క్సిజానికి మూలమైన కార్ల్ మార్క్స్ 1844లో పారిస్‌లో అర్థశాస్త్రంపై రీసెర్చ్ ప్రారంభించి జీవితాంతం కొనసాగించారు. ఈ క్రమంలో ‘Contribution to the Critique of Political Economy’ అని 1859లో ఓ పుస్తకం రాశారు. ఆయన రీసెర్చ్ ప్రారంభించిన 15 సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ పుస్తకాన్ని మార్క్స్ ఆర్థిక సిద్ధాంతాల అభివృద్ధిలో కీలక మైలురాయిగా చెప్పుకుంటారు. ఎ.గాంధీ దీన్ని తెలుగులోకి అనువదించారు. పీకాక్ బుక్స్ దీన్ని ప్రచురించింది. దీని ధర రూ.220. దీన్ని కొనే <a href="https://www.telugubooks.in/collections/a-gandhi/products/karl-marks-1859-ardhasastra-vimarsha">లింక్.</a>

దొంగతనం కాదు.. మరి చంపేసిందెవరు?
TG: నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి(45) దారుణ హత్యకు గురయ్యారు. భర్త హైదరాబాద్ వెళ్లిన సమయంలో కొందరు వ్యక్తులు ఇంట్లోకి చొరబడి కత్తులతో పొడిచి చంపేశారు. ఇంట్లో దొంగతనం జరగలేదని, భార్యాభర్తల మధ్య గొడవలు కూడా లేవని, నిన్న సాయంత్రం నుంచే ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉందని ఇంటి కింద అద్దెకు ఉన్నవాళ్లు చెప్పారు. ఘటనా స్థలాన్ని DSP, క్లూస్ టీమ్ పరిశీలించారు. నిందితుల కోసం పోలీసులు మూడు స్పెషల్ టీమ్స్‌తో సెర్చ్ చేస్తున్నారు.