Latest

కానిస్టేబుల్‌పై అటాక్.. ఇద్దరు యువకులు అరెస్ట్
AP· 13 Aug 2026

కానిస్టేబుల్‌పై అటాక్.. ఇద్దరు యువకులు అరెస్ట్

AP: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఆగస్టు 11న రోడ్డు ప్రమాదం జరిగిన ప్రాంతంలో ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ రమణయ్యతో ఇద్దరు యువకులు వాగ్వాదానికి దిగారు. వారిలో అచ్చి శ్రీనివాసులు<a href="https://www.theclearcutnews.com/n/bgHVjsn"> కత్తితో</a> దాడికి యత్నించగా, అప్రమత్తమైన రమణయ్య తృటిలో తప్పించుకున్నారు. కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు అచ్చి శ్రీనివాసులు (22), బీటెక్ విద్యార్థి సముద్రాల జితేంద్ర కుమార్ (20)ను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు శ్రీనివాసులును పట్టణ వీధుల్లో నడిపించుకుంటూ తీసుకెళ్లి కోర్టులో హాజరుపరిచారు.

హత్య చేసి మిస్సింగ్ డ్రామాతో తప్పించుకునే ప్లాన్
Crime· 13 Aug 2026

హత్య చేసి మిస్సింగ్ డ్రామాతో తప్పించుకునే ప్లాన్

TG: తండ్రిని హత్యచేసి మిస్సింగ్ కేసుగా చిత్రీకరించిన ఘటనలో కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంచిర్యాల జిల్లా భీమారం పరిధిలో జరిగిన ఈ కేసులో భీమిని ఉదయ్‌(23) నిందితుడిగా గుర్తించారు. ప్రేమ వివాహం చేసుకోవడం తండ్రి లక్ష్మణ్‌కు ఇష్టం లేకపోవడంతో తరచూ కుమారుడు, కోడలిని దూషిస్తూ గొడవపడేవాడని పోలీసులు తెలిపారు. ప్లాన్ ప్రకారం ఉదయ్‌ తండ్రిని బైక్‌పై గొల్లవాగు ప్రాజెక్టు ప్రాంతానికి తీసుకెళ్లి గొంతు పిసికి హత్య చేసినట్లు విచారణలో లేలింది. మృతదేహంపై పెట్రోల్‌ పోసి తగులబెట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.

🐕 కుక్కలు మన ముఖంలో సంతోషం, బాధను గుర్తించగలవా?
Education· 13 Aug 2026

🐕 కుక్కలు మన ముఖంలో సంతోషం, బాధను గుర్తించగలవా?

కుక్కలు మన ముఖంలో కనిపించే భావాలను కొంతవరకు గుర్తించగలవని రీసెర్చ్‌లు చెబుతున్నాయి. ఒక పరిశోధనలో కుక్కలు సంతోషంగా, కోపంగా ఉన్న మనుషుల ముఖాలను వేరు చేయగలిగాయి. మరో రీసెర్చ్‌లో మనుషుల ముఖాల్లో కనిపించే భావోద్వేగాలకు కుక్కల మెదడులోని కొన్ని భాగాలు స్పందించినట్లు గుర్తించారు. అయితే మనం “సంతోషంగా ఉన్నావు, బాధగా ఉన్నావు“ అని అర్థం చేసుకున్నంత స్పష్టంగా కుక్కలు భావాలను గుర్తిస్తాయని మాత్రం చెప్పలేం. స్వరం, శరీర భాష, ముఖ కదలికలు కూడా వాటికి ముఖ్యమైన సంకేతాలే. మీ కుక్క మీ మూడ్‌ని గుర్తించిన సందర్భం ఉందా?

ప్రభుత్వాలు మారినా.. పథకాలు ఆపొద్దు: KTR
TG· 13 Aug 2026

ప్రభుత్వాలు మారినా.. పథకాలు ఆపొద్దు: KTR

TG: ప్రభుత్వాలు మారినా ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలను కొనసాగించడమే మంచి పాలనకు నిదర్శనమని మాజీ మంత్రి KTR అన్నారు. సిరిసిల్లలో ఇటీవల మృతిచెందిన నేత కార్మికుడు వెంకటేశం కుటుంబాన్ని పరామర్శించారు. మృతుడి కుమార్తె పేరిట రూ.3 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్ బాండ్‌ను అందించారు. గత ప్రభుత్వాలు ప్రారంభించిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాలను బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించిందన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం KCR పేరుతో ఉన్న కంటి వెలుగు, KCR కిట్ వంటి పథకాలను పక్కన పెట్టడం బాధాకరమని విమర్శించారు.

పరిశ్రమలకు బిగ్ బూస్ట్
AP· 13 Aug 2026

పరిశ్రమలకు బిగ్ బూస్ట్

ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలకు మరింత ఊతమిచ్చేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది డిసెంబరు నుంచి పరిశ్రమలకు అందించే ప్రోత్సాహకాలను ఎస్క్రో ఖాతా ద్వారా చెల్లించాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో జరిగిన 20వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) సమావేశంలో ఇంధనం, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు చెందిన 25 ప్రాజెక్టులకు రూ.2.08 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలను SIPB ఆమోదించింది. ఈ ప్రాజెక్టుల ద్వారా 21,667 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

భూ అక్రమాలపై శ్వేతపత్రం రిలీజ్ చేయాలి : ఏలేటి
TG· 13 Aug 2026

భూ అక్రమాలపై శ్వేతపత్రం రిలీజ్ చేయాలి : ఏలేటి

TG: ధరణి పోర్టల్‌లో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రజలకు తెలపాలని BJP శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ధరణి ద్వారా పేదల భూములు అన్యాక్రాంతమయ్యాయని ఆరోపిస్తూ, బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ధరణి అక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిట్‌లో ఏం తేలిందో ప్రభుత్వం స్పష్టం చేయాలని అన్నారు. నిషేధిత జాబితాలో భూముల సంఖ్య ఎందుకు పెరుగుతోందో చెప్పాలని ప్రశ్నించారు. వివాదాలు లేని ప్రైవేట్ భూములను సైతం 22ఏ జాబితాలో చేర్చారని ఆరోపించారు.

కడపలో భారీ ఖనిజ నిక్షేపాలపై ఫోకస్
AP· 13 Aug 2026

కడపలో భారీ ఖనిజ నిక్షేపాలపై ఫోకస్

AP: కడప బేసిన్‌లో కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వేంపల్లి, వేముల ప్రాంతాల్లో లిథియం, గాలియం నిక్షేపాలపై పరిశోధనలు నిర్వహించేందుకు రాష్ట్ర గనులశాఖ నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. CM చంద్రబాబు సమక్షంలో ఒప్పంద ప్రక్రియ పూర్తయింది. ఇదే సమయంలో గనుల రంగంలో పరిశోధన, ఆధునిక సాంకేతికత, నైపుణ్యాభివృద్ధి కోసం ధన్‌బాద్ ఐఐటీతో మరో ఒప్పందం జరిగింది. రాష్ట్రంలో గనుల రంగానికి సంబంధించిన సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

సాగునీటిపై CM బిగ్ యాక్షన్
TG· 13 Aug 2026

సాగునీటిపై CM బిగ్ యాక్షన్

TG: గోదావరి నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని CM రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని బోధి పెవిలియన్‌లో నీటిపారుదల శాఖపై ఆయన సమీక్షా నిర్వహించారు. ఎల్లంపల్లి, దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల ద్వారా సాధ్యమైనంత ఎక్కువ నీటిని ఎత్తిపోసేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల విషయంలో NDSA సూచనలను కచ్చితంగా అమలు చేయాలని స్పష్టంచేశారు. ప్రాజెక్టుల కింద పెండింగ్‌లో ఉన్న పరిహారం, పునరావాస చెల్లింపులను వేగంగా పూర్తి చేయాలన్నారు.

ఈ రాత్రి ఆకాశం వైపు ఓసారి చూడండి! ☄️
Science· 12 Aug 2026

ఈ రాత్రి ఆకాశం వైపు ఓసారి చూడండి! ☄️

ఆకాశంలో వెలుగులు మెరుస్తూ కనిపిస్తే ఆశ్చర్యపోకండి.. ఇదికనిపించబోయే పెర్సీడ్స్ మీటియర్ షవర్. ఆగస్టు 12–13 రాత్రి ఇది గరిష్ఠ స్థాయికి చేరుతుంది. భూమి స్విఫ్ట్-టటిల్ అనే తోకచుక్క వదిలిన దుమ్ము, చిన్న రాళ్ల కణాల గుండా ప్రయాణించినప్పుడు అవి వాతావరణంలోకి దూసుకొచ్చి మండిపోవడంతో ఈ వెలుగులు కనిపిస్తాయి. చీకటి ప్రదేశం నుంచి చూస్తే గంటకు డజన్ల కొద్దీ ఉల్కలు కనిపించే అవకాశం ఉంది. ఈసారి అమావాస్య సమయం కావడంతో చంద్రకాంతి ఇబ్బంది కూడా తక్కువగా ఉంటుంది. టెలిస్కోప్ పనిలేదు; నగర వెలుగులకు దూరంగా చూస్తే చాలు.

☕Coffee Wasteతో Fuel కూడా తయారవుతుందా? ⛽
Science· 12 Aug 2026

☕Coffee Wasteతో Fuel కూడా తయారవుతుందా? ⛽

రోజూ కాఫీ చేసుకున్న తర్వాత మిగిలే కాఫీ పొడిని మనం సాధారణంగా చెత్తలో పడేస్తాం. కానీ దాంతో ఇంధనం తయారు చేసే అవకాశం ఉందని రీసెర్చర్లు చెబుతున్నారు. ఈ పొడిలో కొంత సహజ నూనె ఉంటుంది. దాన్ని ప్రత్యేక పద్ధతుల్లో బయటకు తీసి బయోడీజిల్‌గా మార్చొచ్చు. కొన్ని స్టడీస్‌లో ఇలా తయారైన బయోడీజిల్‌ను డీజిల్‌తో కలిపి ఇంజిన్లలో కూడా పరీక్షించారు. అంటే మనం పడేసే కాఫీ వ్యర్థాలు భవిష్యత్తులో బయోఫ్యూయల్ తయారీకి ఉపయోగపడే పదార్థంగా మారే అవకాశం ఉంది.

షాదీముబారక్, కల్యాణలక్ష్మి పథకాలపై హైకోర్టు స్టే
TG· 12 Aug 2026

షాదీముబారక్, కల్యాణలక్ష్మి పథకాలపై హైకోర్టు స్టే

TG: రాష్ట్రంలో అమలవుతున్న షాదీముబారక్, కల్యాణలక్ష్మి పథకాలపై హైకోర్టు స్టే ఇచ్చింది. చట్టబద్ధత లేకుండా కేవలం జీవోల ద్వారా ఈ పథకాలు అమలు చేస్తున్నారని న్యాయవాది విజయ్ గోపాల్ పిటిషన్ వేశారు. దీనిపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంతో కోర్టు స్టే ఇచ్చింది. తర్వాతి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. పేద కుటుంబాల్లోని ఆడపిల్లల పెళ్లి ఖర్చులకు సాయం చేయడం కోసం 2014 అక్టోబర్ 2న ప్రారంభమైన ఈ పథకాలపై స్టే విధించడంతో లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది.

బాలీవుడ్ ఎప్పుడూ అంతే: కంగనా రనౌత్
National· 12 Aug 2026

బాలీవుడ్ ఎప్పుడూ అంతే: కంగనా రనౌత్

ఢిల్లీలో విద్యార్థి నిరసనలపై కామెంట్ చేసిన సీనియర్ నటుడు నసీరుద్దీన్ షాను ‘లోండి(నక్క)’ అని పిలవడాన్ని బీజేపీ ఎంపీ, నటి కంగనా రనాత్ సమర్థించుకున్నారు. సినీ పరిశ్రమ ఎప్పుడూ ఇలాంటి వైఖరే చూపిస్తూ వచ్చిందని అన్నారు. “నిరసనకారులు పార్లమెంట్‌పై దాడి చేయాలని చూశారు. ఎంపీల కార్లపై ఎక్కి కూర్చుని అద్దాలు పగలగొట్టారు. నా ఇంటి గేటు దగ్గరకు కూడా వచ్చారు. రాత్రంతా నిద్రపోలేకపోయాను. అయినా కూడా ఇలాంటి వాళ్లు వాళ్ల గురించి మొసలి కన్నీళ్లు కార్చారు” అని కంగనా అన్నారు.

ఇంటివాడైన ఫుట్‌బాల్ సూపర్‌స్టార్ క్రిస్టియానో రోనాల్డో
Sports· 12 Aug 2026

ఇంటివాడైన ఫుట్‌బాల్ సూపర్‌స్టార్ క్రిస్టియానో రోనాల్డో

పోర్చుగీస్ ఫుట్‌బాల్ సూపర్‌స్టార్ క్రిస్టియానో రోనాల్డో, అతని గర్ల్‌ఫ్రెండ్ అయిన మోడల్, ఇన్‌ఫ్లుయెన్సర్ జార్జినా రోడ్రిగ్యూజ్ పెళ్లి చేసుకున్నారు. పోర్చుగల్‌లోని కాస్కైస్‌లో ఈ వేడుక ప్రైవేట్‌గా జరిగింది. ఈ జంట తమ ఇన్‌స్టాగ్రామ్‌లో వెడ్డింగ్ రింగ్స్ ఫోటో పోస్ట్ చేసి “C❤️G” అని క్యాప్షన్ రాశారు. 2025 ఆగస్టు 11న జార్జినా డైమండ్ రింగ్‌తో ఫోటో పోస్ట్ చేసి స్పానిష్‌లో “Yes I do. In this and in all my lives” అని రాశారు. సరిగ్గా ఏడాది తర్వాత వారి పెళ్లి జరిగింది.

నువ్వు లేకుండా ఆడలేను- మెస్సీ
Sports· 12 Aug 2026

నువ్వు లేకుండా ఆడలేను- మెస్సీ

తన తండ్రి, ఏజెంట్ జోర్జ్ మెస్సీ హఠాన్మరణం(ఆగస్టు 8)తో అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ <a href="https://www.instagram.com/p/Db8MYnQjYsC/?utm_source=ig_web_copy_link&amp;igsh=NTc4MTIwNjQ2YQ==">మెస్సీ</a> తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. "నువ్వు లేవు అంటే నమ్మలేకపోతున్నా.. నువ్వు లేకుండా ఎలా ముందుకు సాగాలో అర్థం కావట్లేదు" అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాశారు. ఇకపై ఎక్కువ కాలం ఫుట్‌బాల్ ఆడటంపై తనకు సీరియస్ డౌట్స్ ఉన్నాయని షాకింగ్ కామెంట్స్ చేశారు. చిన్నప్పటి నుండి తనకు నాన్న, ఫ్రెండ్, ప్రతినిధిగా అండగా నిలిచారని, ఆయనను చాలా మిస్ అవుతున్నట్లు ఎమోషనల్ పోస్ట్ చేశారు.

ఇల్లు కూల్చివేతలపై సుప్రీంకోర్టు కామెంట్స్
Legal· 12 Aug 2026

ఇల్లు కూల్చివేతలపై సుప్రీంకోర్టు కామెంట్స్

అక్రమ గృహాలను కూల్చివేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతుందో, ఆ బాధితులకు పునరావాసం కల్పించాల్సిన బాధ్యత కూడా అంతే ఉందని సుప్రీంకోర్టు స్టేట్మెంట్ ఇచ్చింది. కూల్చివేత మరియు పునరావాసం రెండూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న "జంట బాధ్యతలు"(Twin Responsibilities) అని స్పష్టం చేసింది. ఇల్లు కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవడం ప్రభుత్వ కనీస ధర్మమని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.

Blinkit లైసెన్స్ రద్దు, Zepto గోడౌన్ సీజ్🤯
News· 12 Aug 2026

Blinkit లైసెన్స్ రద్దు, Zepto గోడౌన్ సీజ్🤯

సిటీల్లో సరుకులకు BlinkIt, Zepto apps పై ఆధారపడే వాళ్లు భారీగా పెరిగారు. కానీ ఆ సంస్థలు ఫుడ్ సేఫ్టీ విషయంలో కాంప్రమైజ్ అయ్యాయని తాజా తనిఖీలు చెప్తున్నాయ్. ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు ఫాలో అవలేదని ముంబై మలాడ్ Blinkit స్టోర్ లైసెన్స్‌ రద్దు చేశారు. బెంగళూరు Zepto గోడౌన్ సీజ్ చేశారు. పురుగులు, అపరిశుభ్రత తప్పుడు లేబుల్స్ ఐడెంటిఫై చేశారు. మే 25- జూలై 31 మధ్య ముంబైలో 3,137 చోట్ల తనిఖీ చేసి 764 నోటీసులు, 165 సస్పెన్షన్లు చేశారు. లోపాలు సరిదిద్దుకుంటే మళ్లీ లైసెన్ ఇస్తామని FDA కమిషనర్ తుకారాం ముండే చెప్పారు.

DNAను Repair చేయడం వల్ల జీవితకాలం పెరగొచ్చా? 🧬
Science· 12 Aug 2026

DNAను Repair చేయడం వల్ల జీవితకాలం పెరగొచ్చా? 🧬

మన DNAలో రోజూ ఎన్నో చిన్నచిన్న నష్టాలు జరుగుతుంటాయి. వాటిని మన శరీరంలోని కణాలు సహజంగానే రిపేర్ చేస్తుంటాయి. వయసు పెరిగేకొద్దీ ఈ రిపేర్ సామర్థ్యం తగ్గడం వల్ల DNAలో నష్టం పేరుకుపోవచ్చు. అందుకే DNAను మరింత సమర్థంగా రిపేర్ చేయగలిగితే వృద్ధాప్యాన్ని నెమ్మదించవచ్చా అనే దానిపై రీసెర్చ్ జరుగుతోంది. 2026లో వచ్చిన కొత్త రీసెర్చ్‌లు కూడా DNA రిపేర్, దీర్ఘాయుష్షు మధ్య సంబంధంపై దృష్టి పెడుతున్నాయి. అయితే మనుషుల జీవితకాలాన్ని పెంచే నిరూపితమైన చికిత్స ఇంకా లేదు.

ఉత్తర కొరియా మరో Ballistic Missile ప్రయోగం! 🚀
World· 12 Aug 2026

ఉత్తర కొరియా మరో Ballistic Missile ప్రయోగం! 🚀

ఉత్తర కొరియా మరోసారి బాలిస్టిక్ మిసైల్‌ను ప్రయోగించింది. బుధవారం తూర్పు తీరంలోని వోన్‌సాన్ ప్రాంతం నుంచి ప్రయోగించిన ఈ మిసైల్ సుమారు 700 కిలోమీటర్లు ప్రయాణించి కొరియా ద్వీపకల్పం, జపాన్ మధ్య సముద్రంలో పడినట్లు దక్షిణ కొరియా, జపాన్ అధికారులు తెలిపారు. ఇది వారం రోజుల్లో ఉత్తర కొరియా చేసిన రెండో బాలిస్టిక్ మిసైల్ ప్రయోగం. ఈ నెల 17 నుంచి అమెరికా, దక్షిణ కొరియా వార్షిక సైనిక విన్యాసాలు ప్రారంభించనున్న నేపథ్యంలో ఈ ప్రయోగం జరగడం ఆ ప్రాంతంలో టెన్షన్‌ను మరింత పెంచింది.

CJP సౌరవ్ దాస్ ఫ్యామిలీకి బెదిరింపులు
Politics· 12 Aug 2026

CJP సౌరవ్ దాస్ ఫ్యామిలీకి బెదిరింపులు

పాండిచ్చేరి పోలీసులు తన ఫ్యామిలీ మెంబర్స్‌ను క్వశ్చన్ చేస్తూ వేధింపులకు గురిచేశారని CJP స్పోక్స్ పర్సన్ <a href="https://x.com/SauravDassss/status/2087534766874910808?s=20">సౌరవ్ దాస్</a> ‘X’ వేదికగా పోస్ట్ పెట్టారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే పోలీసులు ఈ బెదిరింపులకు పాల్పడ్డారని, ఇది చట్టబద్ధమైన విధానం కాదని ఆరోపించారు. తానెవరికీ భయపడేది లేదని, తనను సైలెంట్‌గా ఉంచేందుకు ఇలాంటి చర్యలు పనిచేయవని చెప్తూ, పోలీసుల ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

AI వచ్చినా..అమ్మకు రెస్ట్ లేదు
Viral· 12 Aug 2026

AI వచ్చినా..అమ్మకు రెస్ట్ లేదు

ప్రస్తుతం AI కాలం నడుస్తోంది. ప్రతి పనికీ ఏఐ వాడేసి, పనిని సులభంగా చేసేయడం ట్రెండ్‌గా మారిపోయింది. పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఎంప్లాయిస్‌ను తగ్గించి, ఏఐ ద్వారా పనులు చేయిస్తోంది. అయితే AI వచ్చినా అమ్మ చేసే పనులకు రెస్ట్ లేదు అంటూ స్వర్ణిక శుక్లా అనే కంటెంట్ క్రియేటర్ చేసిన వీడియో నెట్‌లో వైరల్ అవుతోంది. AI ఎంత అడ్వాన్స్ అయినా పిల్లల్ని చూసుకునే పనిని ఇంకా తల్లులకే అంటగడుతున్న సమాజం మీద సెటైర్ లాంటి వీడియో ఇది.

NTR సర్జరీ సక్సెస్
News· 12 Aug 2026

NTR సర్జరీ సక్సెస్

జూనియర్ <a href="https://x.com/tarak9999/status/2087524661877932480?s=20">NTR</a>కు కిమ్స్ హాస్పిటల్‌లో సర్జరీ సక్సెస్ ఫుల్‌గా జరిగింది. తన హెల్త్ అప్‌డేట్‌ను ‘ఎక్స్’ వేదికగా తానే స్వయంగా షేర్ చేశారు. "నా కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. డాక్టర్ల టీమ్‌కి నా గ్రాటిట్యూడ్. మీ ప్రేమే నా బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్.. త్వరలోనే కలుద్దాం!" అని పోస్ట్ చేశారు. రీసెంట్‌గా జిమ్‌లో వర్కవుట్స్ చేస్తుండగా ఆయన భుజానికి గాయం కావడం అందరికీ తెలిసిందే.