షాదీముబారక్, కల్యాణలక్ష్మి పథకాలపై హైకోర్టు స్టే

TG: రాష్ట్రంలో అమలవుతున్న షాదీముబారక్, కల్యాణలక్ష్మి పథకాలపై హైకోర్టు స్టే ఇచ్చింది. చట్టబద్ధత లేకుండా కేవలం జీవోల ద్వారా ఈ పథకాలు అమలు చేస్తున్నారని న్యాయవాది విజయ్ గోపాల్ పిటిషన్ వేశారు. దీనిపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంతో కోర్టు స్టే ఇచ్చింది. తర్వాతి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. పేద కుటుంబాల్లోని ఆడపిల్లల పెళ్లి ఖర్చులకు సాయం చేయడం కోసం 2014 అక్టోబర్ 2న ప్రారంభమైన ఈ పథకాలపై స్టే విధించడంతో లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది.



