Latest

CDలు, DVDలు తెచ్చుకుని సినిమాలు చూసిన రోజులు! 💿
ఇప్పుడంటే సినిమా చూడాలంటే OTTలు ఉన్నాయి. కానీ ఒకప్పుడు VCD, DVDల్లో సినిమాలు చూసేవాళ్లు. వాటికంటే ముందు వీడియో క్యాసెట్ల కాలం ఉండేది. VCRలో క్యాసెట్ పెట్టి టీవీలో సినిమా చూస్తుంటే, చుట్టుపక్కల వాళ్లంతా ఒకచోట చేరేవాళ్లు. ఆ తర్వాత VCD, DVDలు వచ్చాయి. షాప్‌కి వెళ్లి నచ్చిన సినిమా డిస్క్ తీసుకొచ్చి, ప్లేయర్‌లో పెట్టి చూసే రోజులు కూడా చాలామందికి ఇప్పటికీ గుర్తుండే ఉంటాయి. ఇప్పుడు ఒక్క క్లిక్‌తో సినిమా వస్తున్నా.. అప్పటి ఆ చిన్న చిన్న ఆనందాలు మాత్రం స్పెషల్. ఆ రోజులు గుర్తున్నాయా? కామెంట్‌లో చెప్పండి.
త్వరలో జంతర్-మంతర్ 2!
CJP ఫౌండర్ అభిజీత్ దిప్కే కీలక ప్రకటన చేశారు. 'జంతర్-మంతర్' సీజన్ 2 ఎప్పుడు స్టార్ట్ అవుతుందని ఇన్స్టాగ్రామ్‌లో చాలా మంది కామెంట్స్ చేస్తున్నారని ఆయన తెలిపారు. వాళ్లందరి కోసం త్వరలోనే 'జంతర్-మంతర్' సీజన్ 2 ని స్టార్ట్ చేయబోతున్నామని క్లారిటీ ఇచ్చారు. ఈ అప్‌డేట్‌తో నెక్స్ట్ రాజీనామా ఎవరిది అంటూ ఫాలోవర్స్ ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు.

'ద్రవిడ - వివక్షపై దక్షిణ స్వరం' పుస్తకం
మలుపు బుక్స్, ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక కలిసి తీసుకొచ్చిన పుస్తకం 'ద్రవిడ - వివక్షపై దక్షిణ స్వరం'. రచయితలు కల్లూరి భాస్కరం, సౌదా అరుణ, డా.జిలుకర శ్రీనివాస్, రాహుల్, కె.శ్రీనివాస్, కె.ఎన్.మల్లీశ్వరి, కాత్యాయనీ విద్మహే, సి.మృణాళిని రాసిన పదకొండు ఆర్టికల్స్ ఇందులో ఉన్నాయి. ద్రావిడ జాతులపై వివక్ష, ద్రవిడ భాష, సంస్కృతి, సాహిత్యం ద్వారా అస్మిత నిర్మాణం లాంటి అంశాలు ఇందులో ఉన్నాయి. ఈ పుస్తకానికి ఎడిటర్స్‌గా కె.ఎన్.మల్లీశ్వరి, కాత్యాయనీ విద్మహే ఉన్నారు. పుస్తకం ధర రూ.150. పుస్తకం కొనేందుకు <a href="https://www.telugubooks.in/products/dravida-vivakshapai-dakshina-swaram?srsltid=AfmBOoqOJwWA4xUicb-zqftKrUpqFkRMq-DrY2VrCkDrfuIxhL5bboDB">లింక్</a>.

ఈ మర్డర్‌కు ఇన్‌స్టా చాట్ కారణమా?
చెన్నైలో భార్యపై అనుమానంతో భర్త ఘోరానికి పాల్పడ్డాడు. ఇన్స్టాగ్రామ్‌లో ఫ్రెండ్స్‌తో చాట్ చేస్తుందని గొడవపడి, "పిల్లల కోసం కలిసి ఉందాం" అని భార్య దేవకి(24)ని నమ్మించి ఇంటికి రప్పించాడు చిన్న(34). ఆ తర్వాత ఆటోలో ఒక ఒంటరి ప్రదేశానికి తీసుకెళ్లి నైఫ్‌తో గొంతు కోసి మర్డర్ చేశాడు. లోకల్స్ ఇన్ఫర్మేషన్‌తో పోలీసులు సీన్‌లోకి ఎంటర్ అయి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఎఫైర్ ఉందనే డౌట్‌తోనే ప్లాన్ చేసి చంపినట్లు హజ్బెండ్ యాక్సెప్ట్ చేశాడు.

లైఫ్‌స్టైల్ ఎఫెక్ట్!
భారత్‌లో 15–49 ఏళ్ల మహిళల్లో Obesity వేగంగా పెరుగుతోంది. సెంట్రల్ గవర్నమెంట్ NFHS-6 సర్వే ప్రకారం.. 30.7% మంది మహిళలు ఓవర్‌వెయిట్‌తో ఉన్నారు. గతంలో ఇది 24% మాత్రమే. పురుషుల్లో కూడా ఈ సమస్య 22.9% నుంచి 27.3%కి పెరిగింది. మారుతున్న లైఫ్‌స్టైల్ వల్ల ఫెర్టిలిటీ సమస్యలు వస్తున్నాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అందుకే ప్లానింగ్ సమయంలోనే పేరెంట్స్ ఇద్దరూ హెల్త్ చెకప్స్ చేయించుకొని తగిన జాగ్రత్తలు తీసుకుంటే ప్రెగ్నెన్సీ రిస్క్స్ అస్సలు ఉండవని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు.

Fieldwork as a Sex Object నవల..రేపు విడుదల
ప్రముఖ రచయిత్రి మీనా కందసామి రాసిన నవల ‘Fieldwork as a Sex Object’. ఇంటర్నెట్ మాబ్స్‌ని ఎదుర్కొనే ఒక కార్యకర్త కథగా సాగే ఈ నవల డిజిటల్ హింస, డీప్‌ఫేక్ టెక్నాలజీ, ఆన్‌లైన్ స్త్రీద్వేషం, రాజకీయ తీవ్రవాదం గురించి వివరిస్తుంది. రేపు సాయంత్రం హైదరాబాద్ నగరంలోని లామకాన్‌లో సాయంత్రం 7 గంటలకు ఈ నవల విడుదల కానుంది. ఆమెతో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రీసెర్చ్ స్కాలర్, విద్యార్థి కార్యకర్త తరుణి ముఖాముఖి నిర్వహిస్తారు.

NEET పేపర్ లీక్ కేస్‌లో బిగ్ ట్విస్ట్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన NEET పేపర్ లీక్ కేస్‌లో ఢిల్లీ కోర్టు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేస్‌కు సంబంధించి CBI దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరించింది. CBI సేకరించిన ఆధారాలు, నివేదికను పరిశీలించిన న్యాయస్థానం దీనిపై నెక్స్ట్ లీగల్ యాక్షన్ తీసుకోనుంది. కోర్టు ఛార్జ్‌షీట్‌ను యాక్సెప్ట్ చేయడంతో ఈ స్కామ్‌లో ఉన్న నిందితులపై త్వరలోనే విచారణ ట్రయల్ వేగవంతం కానుంది.

మోదీకి బంగారు విగ్రహంతో త్వరలో ఆలయం?
ప్రధాని నరేంద్ర మోదీకి బంగారు విగ్రహంతో ఆలయం నిర్మించాలని బిహార్ స్టేట్ కిన్నర్ వెల్ఫేర్ బోర్డు (ట్రాన్స్‌జెండర్ వెల్ఫేర్ బోర్డు) ప్లాన్ చేసింది. ఆలయ నిర్మాణం కోసం ప్రభుత్వం నుంచి 5 ఎకరాల భూమి, రూ.112 కోట్ల నిధులు కేటాయించాలని బోర్డు కోరింది. బోర్డు తొలి సమావేశంలో సభ్యుడు డా.రాజన్ సింగ్ ఈ ప్రతిపాదన పెట్టారు. బోర్డు సభ్యులు దీన్ని ఆమోదించారు. ఈ ప్రతిపాదన క్యాబినెట్ సెక్రటేరియట్‌కు వెళ్లనుంది. ప్రభుత్వం భూమి, నిధులు ఇవ్వకపోయినా డొనేషన్లు సేకరించి ఆలయం నిర్మిస్తామని బోర్డు సభ్యులు చెప్పారు.

NTR హాస్పిటల్‌లో అడ్మిట్!
NTRకి షోల్డర్ సర్జరీ జరుగుతోంది. రీసెంట్‌గా జిమ్‌లో వర్కవుట్స్ చేస్తుండగా ఆయన భుజానికి గాయం కావడంతో డాక్టర్ల అడ్వైస్ మేరకు కొద్దిరోజులు రెస్ట్ తీసుకున్నారు. అయితే బుధవారం మార్నింగ్ సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వగా, డాక్టర్స్ ప్రస్తుతం ఆయనకు ట్రీట్మెంట్ చేస్తున్నారు. హాస్పిటల్‌లో NTR ఫ్యామిలీ మెంబర్స్, క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. సర్జరీ కంప్లీట్ అయ్యాక ఆయన హెల్త్ కండిషన్‌పై డాక్టర్స్ ఫుల్ డిటైల్స్ అనౌన్స్ చేయనున్నారు.
ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టా..స్విమ్మింగ్ పూలా?
ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 28న ప్రారంభించిన నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వర్షం నీటితో నిండిపోయింది. భారీ వర్షం కారణంగా టెర్మినల్ నుంచి పార్కింగ్ ఏరియాకు వెళ్లే పాసేజ్‌లో నీళ్లు చేరి వాటర్‌లాగింగ్ ఏర్పడింది. ఎయిర్‌పోర్ట్ అధికారులు 30 నిమిషాల్లో ఆ నీటిని తొలగించారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎయిర్‌పోర్ట్‌లో ఇలా జరగడంతో ప్రయాణికులు డ్రైనేజీ వ్యవస్థపై డౌట్ వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టా..స్విమ్మింగ్ పూలా అని కామెంట్ చేస్తున్నారు.

చర్చకు మేం సిద్ధం..ప్రతిపక్షం అడ్డుకుంటోంది: అమిత్ షా
పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ అయినప్పటినుంచి ప్రతిపక్షం రెండు సభల్లోనూ గందరగోళం చేస్తోందని, అందుకే సభలోకి వెళ్లడం వల్ల ప్రయోజనం లేదని హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. ‘మిస్సింగ్’, ‘ఫ్యూజిటివ్స్’ లాంటి పదాలు ఇటీవల పార్లమెంటరీ చర్చల్లో వినిపించడం మొదలైందని అన్నారు. NEET విద్యార్థుల నిరసనలతోసహా అన్ని అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధమేనన్న విషయం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు ఇప్పటికే చెప్పారన్నారు. అయినా ప్రతిపక్షమే అడ్డుకొంటోందని అన్నారు.

అమెరికాలో ఫైర్ యాక్సిడెంట్.. తెలుగు యువకుడు మృతి
TG: అమెరికాలో జరిగిన అగ్నిప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం గంటూరుపల్లికి చెందిన భరత్‌చందర్‌రెడ్డి (29) మృత్యువుతో పోరాడి కన్నుమూశారు. జూలై 25న ఫ్లోరిడాలోని టాంపాలో జరిగిన అగ్నిప్రమాదంలో ఆయనకు 75శాతం కాలిన గాయాలయ్యాయి. అప్పటి నుంచి టాంపా జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భరత్, 15రోజులపాటు మృత్యువుతో పోరాడి తుదిశ్వాస విడిచారు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతదేహాన్ని త్వరగా స్వగ్రామానికి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు.
Gen Zకి మోదీ అడ్వైస్!
యూత్ ఎక్కువగా సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు, రీల్స్ వైపు ఎట్రాక్ట్ అవుతున్నారని మోదీ కామెంట్స్ చేశారు. రైల్వే స్టేషన్లలో ఉండే "షార్ట్‌కట్ విల్ కట్ యు షార్ట్" అనే బోర్డును గుర్తుచేస్తూ, లైఫ్‌లో సక్సెస్ అవ్వడానికి షార్ట్‌కట్స్ వెతకొద్దని యంగ్ జెనరేషన్‌కు అడ్వైస్ ఇచ్చారు. మాజీ ప్రెసిడెంట్ రామ్‌నాథ్ కోవింద్ ఆటోబయోగ్రఫీ బుక్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న మోదీ, హిస్టరీని క్లియర్‌గా అర్థం చేసుకోవడానికి ఆటోబయోగ్రఫీలు చాలా హెల్ప్ అవుతాయని, ఈ బుక్ ఫ్యూచర్ జెనరేషన్స్‌కు మంచి ఇన్సిపిరేషన్ అని పిలుపునిచ్చారు.

హాంగ్ కాంగ్‌లో నడిరోడ్డుపై కత్తిపోట్లు..
హాంగ్ కాంగ్‌లోని పోక్ ఫు లామ్, బగ్యువో విల్లా వద్ద సోమవారం 22 ఏళ్ల యువకుడు చేతిలో కత్తి పట్టుకుని, షర్ట్ లేకుండా రోడ్డుపైకి వచ్చాడు. అతడి చేతిలోని కత్తితో రోడ్డుపై నడిచివెళ్లేవారిని వెంబడించాడు. పలువురిపై కత్తితో దాడిచేయగా , ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానిక సెక్యూరిటీ గార్డులు, ప్రజలు ధైర్యంగా నిందితుడిని పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
నరేంద్ర మోడీ, అమిత్ షాలకు భయపడకూడదు: రాహుల్ గాంధీ
‘అమిత్ షా మాట్లాడుతున్నప్పుడు మీరు మధ్యలో ఆపుతారా?’ అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మీడియాను ప్రశ్నించారు. పార్లమెంట్ బయట ఆయన మాట్లాడుతూ ‘అమిత్ షాకు ఏం ప్రత్యేకత ఉందని మొత్తం మీడియా ఆయన ముందు మౌనంగా నిలబడి ఉంటుంది?’ అని అన్నారు. నరేంద్ర మోడీ, అమిత్ షాలకు దేశ విద్యార్థులు భయపడనప్పుడు, మీడియా కూడా వారికి భయపడకూడదని చెప్పారు.

నెల రోజులకే పెళ్లి బంధం విషాదం
AP: గుంటూరుకు చెందిన శాంతి(26)కి సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండలం పోతుకుంటకు చెందిన మహేష్(33)తో నెలరోజుల క్రితం వివాహమైంది. మ్యాట్రిమోనీ ద్వారా పరిచయమైన వీరు అనంతపురంలోని ఓ ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తలుపులు తెరిచి చూడగా శాంతి రక్తపు మడుగులో మృతిచెంది కనిపించింది. తలపై రోకలిబండతో దాడిచేసి హత్య చేసినట్లు గుర్తించారు. రెండురోజుల క్రితమే హత్య జరిగి ఉండొచ్చని తెలిపారు. మహేష్ పరారీలో ఉన్నాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

నైట్ 1 గంట వరకు చర్చకి రెడీ: అమిత్ షా
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలైనప్పటి నుంచి హోంమంత్రి అమిత్ షా సభకు రావడం లేదంటూ విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. దీనిపై అమిత్ షా రియాక్ట్ అయ్యారు. PTIతో ఆయన మాట్లాడుతూ సభలో ఏ ఇష్యూపైనైనా డిస్కషన్ చేయడానికి గవర్నమెంట్ రెడీగా ఉందన్నారు. ఆపోజిషన్ MPలు స్పీకర్ ఓం బిర్లాకి లెటర్ రాస్తే మధ్యాహ్నం 3 గంటలకే చర్చ స్టార్ట్ చేద్దామన్నారు. రాత్రి 1 గంట వరకు కూర్చుని ప్రతి క్వశ్చన్‌కి ఆన్సర్ ఇస్తామని చెప్పారు. ఢిల్లీ స్టూడెంట్స్ లాఠీఛార్జ్ ఇష్యూపై డిస్కషన్‌కి రావాలని రాహుల్ గాంధీకి ఛాలెంజ్ చేశారు.

జుట్టు మొలిచినట్టున్న ఈ పండు ఏంటో తెలుసా?
చూడగానే ఇది పండా.. లేక ఏదైనా వింత పురుగులా అనిపించొచ్చు. కానీ ఇది రాంబుటాన్! ఎర్రటి తొక్కపై ముళ్లలాంటి మెత్తటి వెంట్రుకలు ఉండటం దీని ప్రత్యేకత. మలేషియాకు చెందిన ఈ పండును ఇప్పుడు కర్ణాటక, కేరళలోని అధిక తేమ ఉన్న ప్రాంతాల్లోనూ పండిస్తున్నారు. తొక్క తీస్తే లోపల తెల్లటి గుజ్జు ఉంటుంది.. రుచి తీపి, పులుపు కలయికగా ఉంటుంది. విటమిన్-సి, ఐరన్, కాల్షియం, ఫైబర్ కూడా ఉంటాయి. కేరళ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఈ పండు కిలో రూ.400 వరకు పలుకుతోంది.

40 కి.మీ వేగంతో గాలులు, పిడుగుల ముప్పు..
వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారడంతో తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. వాతావరణ శాఖ ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా, తెలంగాణలోని నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, నిర్మల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. గంటకు 30-40 కిమీ వేగంతో ఈదురుగాలులు, పిడుగులు పడే ముప్పు ఉన్నందున ప్రజలు సురక్షితంగా ఉండాలని ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) తెలిపింది.

యువతే దేశానికి బిగ్ పవర్
TG: అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి జూనియర్ కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ చివుకుల ఉష పాల్గొని మాట్లాడారు. యువశక్తితోనే దేశ ప్రగతి సాధ్యమని పేర్కొన్నారు. యువత మద్యపానం, ధూమపానం, మాదకద్రవ్యాలు, సోషల్ మీడియా వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. నూతన సాంకేతికతను అందిపుచ్చుకుని విద్య, ఉపాధి రంగాల్లో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
గంజాయి మత్తులో ఉన్నాడా? పోలీస్ కాలర్ పట్టుకొని బెదిరించి..
తిరుపతి జిల్లా: ఓ యువకుడు పోలీస్ కానిస్టేబుల్ కాలర్ పట్టుకొని బెదిరించిన షాకింగ్ వీడియో ఇది. శ్రీకాళహస్తి వన్ టౌన్ హెడ్ కానిస్టేబుల్ రమణయ్యను యువకుడు బెదిరించి దాడి చేసిన ఘటన లేటుగా వైరలైంది. విచ్ఛలవిడిగా దొరుకుతున్న గంజాయి వల్లే ఏపీలో ఇలా రెచ్చిపోతున్నారని <a href="https://x.com/JaganannaCNCTS/status/2087395778667119064?s=20"> YSRCP సోషల్ మీడియా హ్యాండిల్ పోస్ట్</a> చేసింది. ఈ ఘటన ఎప్పుడు జరిగింది. కానిస్టేబుల్-యువకుడి మధ్య గొడవేంటి, కేసు ఫైల్ అయ్యిందా లేదా అనే విషయాలు ఇంకా తెలియాలి. తెలిస్తే Appలో ప్లస్ సింబల్(+) క్లిక్ చేసి న్యూస్ మీరే ఆ న్యూస్ పోస్ట్ చెయ్యండి.