← Back to news

నెల రోజులకే పెళ్లి బంధం విషాదం

By dk· 12 Aug 2026· అనంతపురం జిల్లా
నెల రోజులకే పెళ్లి బంధం విషాదం

AP: గుంటూరుకు చెందిన శాంతి(26)కి సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండలం పోతుకుంటకు చెందిన మహేష్‌(33)తో నెలరోజుల క్రితం వివాహమైంది. మ్యాట్రిమోనీ ద్వారా పరిచయమైన వీరు అనంతపురంలోని ఓ ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తలుపులు తెరిచి చూడగా శాంతి రక్తపు మడుగులో మృతిచెంది కనిపించింది. తలపై రోకలిబండతో దాడిచేసి హత్య చేసినట్లు గుర్తించారు. రెండురోజుల క్రితమే హత్య జరిగి ఉండొచ్చని తెలిపారు. మహేష్ పరారీలో ఉన్నాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 6h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.