Latest

NTR హాస్పిటల్‌లో అడ్మిట్!
News· 12 Aug 2026

NTR హాస్పిటల్‌లో అడ్మిట్!

NTRకి షోల్డర్ సర్జరీ జరుగుతోంది. రీసెంట్‌గా జిమ్‌లో వర్కవుట్స్ చేస్తుండగా ఆయన భుజానికి గాయం కావడంతో డాక్టర్ల అడ్వైస్ మేరకు కొద్దిరోజులు రెస్ట్ తీసుకున్నారు. అయితే బుధవారం మార్నింగ్ సికింద్రాబాద్‌ కిమ్స్ హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వగా, డాక్టర్స్ ప్రస్తుతం ఆయనకు ట్రీట్మెంట్ చేస్తున్నారు. హాస్పిటల్‌లో NTR ఫ్యామిలీ మెంబర్స్, క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. సర్జరీ కంప్లీట్ అయ్యాక ఆయన హెల్త్ కండిషన్‌పై డాక్టర్స్ ఫుల్ డిటైల్స్ అనౌన్స్ చేయనున్నారు.

ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టా..స్విమ్మింగ్ పూలా?
Viral· 12 Aug 2026

ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టా..స్విమ్మింగ్ పూలా?

ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 28న ప్రారంభించిన నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ వర్షం నీటితో నిండిపోయింది. భారీ వర్షం కారణంగా టెర్మినల్ నుంచి పార్కింగ్ ఏరియాకు వెళ్లే పాసేజ్‌లో నీళ్లు చేరి వాటర్‌లాగింగ్ ఏర్పడింది. ఎయిర్‌పోర్ట్ అధికారులు 30 నిమిషాల్లో ఆ నీటిని తొలగించారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎయిర్‌పోర్ట్‌లో ఇలా జరగడంతో ప్రయాణికులు డ్రైనేజీ వ్యవస్థపై డౌట్ వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టా..స్విమ్మింగ్ పూలా అని కామెంట్ చేస్తున్నారు.

చర్చకు మేం సిద్ధం..ప్రతిపక్షం అడ్డుకుంటోంది: అమిత్ షా
National· 12 Aug 2026

చర్చకు మేం సిద్ధం..ప్రతిపక్షం అడ్డుకుంటోంది: అమిత్ షా

పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ అయినప్పటినుంచి ప్రతిపక్షం రెండు సభల్లోనూ గందరగోళం చేస్తోందని, అందుకే సభలోకి వెళ్లడం వల్ల ప్రయోజనం లేదని హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. ‘మిస్సింగ్’, ‘ఫ్యూజిటివ్స్’ లాంటి పదాలు ఇటీవల పార్లమెంటరీ చర్చల్లో వినిపించడం మొదలైందని అన్నారు. NEET విద్యార్థుల నిరసనలతోసహా అన్ని అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధమేనన్న విషయం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు ఇప్పటికే చెప్పారన్నారు. అయినా ప్రతిపక్షమే అడ్డుకొంటోందని అన్నారు.

అమెరికాలో ఫైర్ యాక్సిడెంట్.. తెలుగు యువకుడు మృతి
TG· 12 Aug 2026

అమెరికాలో ఫైర్ యాక్సిడెంట్.. తెలుగు యువకుడు మృతి

TG: అమెరికాలో జరిగిన అగ్నిప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం గంటూరుపల్లికి చెందిన భరత్‌చందర్‌రెడ్డి (29) మృత్యువుతో పోరాడి కన్నుమూశారు. జూలై 25న ఫ్లోరిడాలోని టాంపాలో జరిగిన అగ్నిప్రమాదంలో ఆయనకు 75శాతం కాలిన గాయాలయ్యాయి. అప్పటి నుంచి టాంపా జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భరత్‌, 15రోజులపాటు మృత్యువుతో పోరాడి తుదిశ్వాస విడిచారు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతదేహాన్ని త్వరగా స్వగ్రామానికి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు.

Gen Zకి మోదీ అడ్వైస్!
Politics· 12 Aug 2026

Gen Zకి మోదీ అడ్వైస్!

యూత్ ఎక్కువగా సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు, రీల్స్ వైపు ఎట్రాక్ట్ అవుతున్నారని మోదీ కామెంట్స్ చేశారు. రైల్వే స్టేషన్లలో ఉండే "షార్ట్‌కట్ విల్ కట్ యు షార్ట్" అనే బోర్డును గుర్తుచేస్తూ, లైఫ్‌లో సక్సెస్ అవ్వడానికి షార్ట్‌కట్స్ వెతకొద్దని యంగ్ జెనరేషన్‌కు అడ్వైస్ ఇచ్చారు. మాజీ ప్రెసిడెంట్ రామ్‌నాథ్ కోవింద్ ఆటోబయోగ్రఫీ బుక్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న మోదీ, హిస్టరీని క్లియర్‌గా అర్థం చేసుకోవడానికి ఆటోబయోగ్రఫీలు చాలా హెల్ప్ అవుతాయని, ఈ బుక్ ఫ్యూచర్ జెనరేషన్స్‌కు మంచి ఇన్సిపిరేషన్ అని పిలుపునిచ్చారు.

హాంగ్ కాంగ్‌లో నడిరోడ్డుపై కత్తిపోట్లు..
News· 12 Aug 2026

హాంగ్ కాంగ్‌లో నడిరోడ్డుపై కత్తిపోట్లు..

హాంగ్ కాంగ్‌లోని పోక్ ఫు లామ్‌, బగ్యువో విల్లా వద్ద సోమవారం 22 ఏళ్ల యువకుడు చేతిలో కత్తి పట్టుకుని, షర్ట్ లేకుండా రోడ్డుపైకి వచ్చాడు. అతడి చేతిలోని కత్తితో రోడ్డుపై నడిచివెళ్లేవారిని వెంబడించాడు. పలువురిపై కత్తితో దాడిచేయగా , ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానిక సెక్యూరిటీ గార్డులు, ప్రజలు ధైర్యంగా నిందితుడిని పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

నరేంద్ర మోడీ, అమిత్ షాలకు భయపడకూడదు: రాహుల్ గాంధీ
National· 12 Aug 2026

నరేంద్ర మోడీ, అమిత్ షాలకు భయపడకూడదు: రాహుల్ గాంధీ

‘అమిత్ షా మాట్లాడుతున్నప్పుడు మీరు మధ్యలో ఆపుతారా?’ అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మీడియాను ప్రశ్నించారు. పార్లమెంట్ బయట ఆయన మాట్లాడుతూ ‘అమిత్ షాకు ఏం ప్రత్యేకత ఉందని మొత్తం మీడియా ఆయన ముందు మౌనంగా నిలబడి ఉంటుంది?’ అని అన్నారు. నరేంద్ర మోడీ, అమిత్ షాలకు దేశ విద్యార్థులు భయపడనప్పుడు, మీడియా కూడా వారికి భయపడకూడదని చెప్పారు.

నెల రోజులకే పెళ్లి బంధం విషాదం
Crime· 12 Aug 2026

నెల రోజులకే పెళ్లి బంధం విషాదం

AP: గుంటూరుకు చెందిన శాంతి(26)కి సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండలం పోతుకుంటకు చెందిన మహేష్‌(33)తో నెలరోజుల క్రితం వివాహమైంది. మ్యాట్రిమోనీ ద్వారా పరిచయమైన వీరు అనంతపురంలోని ఓ ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తలుపులు తెరిచి చూడగా శాంతి రక్తపు మడుగులో మృతిచెంది కనిపించింది. తలపై రోకలిబండతో దాడిచేసి హత్య చేసినట్లు గుర్తించారు. రెండురోజుల క్రితమే హత్య జరిగి ఉండొచ్చని తెలిపారు. మహేష్ పరారీలో ఉన్నాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

నైట్ 1 గంట వరకు చర్చకి రెడీ: అమిత్ షా
Politics· 12 Aug 2026

నైట్ 1 గంట వరకు చర్చకి రెడీ: అమిత్ షా

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలైనప్పటి నుంచి హోంమంత్రి అమిత్ షా సభకు రావడం లేదంటూ విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. దీనిపై అమిత్ షా రియాక్ట్ అయ్యారు. PTIతో ఆయన మాట్లాడుతూ సభలో ఏ ఇష్యూపైనైనా డిస్కషన్ చేయడానికి గవర్నమెంట్ రెడీగా ఉందన్నారు. ఆపోజిషన్ MPలు స్పీకర్ ఓం బిర్లాకి లెటర్ రాస్తే మధ్యాహ్నం 3 గంటలకే చర్చ స్టార్ట్ చేద్దామన్నారు. రాత్రి 1 గంట వరకు కూర్చుని ప్రతి క్వశ్చన్‌కి ఆన్సర్ ఇస్తామని చెప్పారు. ఢిల్లీ స్టూడెంట్స్ లాఠీఛార్జ్ ఇష్యూపై డిస్కషన్‌కి రావాలని రాహుల్ గాంధీకి ఛాలెంజ్ చేశారు.

జుట్టు మొలిచినట్టున్న ఈ పండు ఏంటో తెలుసా?
Health· 12 Aug 2026

జుట్టు మొలిచినట్టున్న ఈ పండు ఏంటో తెలుసా?

చూడగానే ఇది పండా.. లేక ఏదైనా వింత పురుగులా అనిపించొచ్చు. కానీ ఇది రాంబుటాన్! ఎర్రటి తొక్కపై ముళ్లలాంటి మెత్తటి వెంట్రుకలు ఉండటం దీని ప్రత్యేకత. మలేషియాకు చెందిన ఈ పండును ఇప్పుడు కర్ణాటక, కేరళలోని అధిక తేమ ఉన్న ప్రాంతాల్లోనూ పండిస్తున్నారు. తొక్క తీస్తే లోపల తెల్లటి గుజ్జు ఉంటుంది.. రుచి తీపి, పులుపు కలయికగా ఉంటుంది. విటమిన్-సి, ఐరన్, కాల్షియం, ఫైబర్ కూడా ఉంటాయి. కేరళ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఈ పండు కిలో రూ.400 వరకు పలుకుతోంది.

40 కి.మీ వేగంతో గాలులు, పిడుగుల ముప్పు..
News· 12 Aug 2026

40 కి.మీ వేగంతో గాలులు, పిడుగుల ముప్పు..

వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారడంతో తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. వాతావరణ శాఖ ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా, తెలంగాణలోని నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, నిర్మల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. గంటకు 30-40 కిమీ వేగంతో ఈదురుగాలులు, పిడుగులు పడే ముప్పు ఉన్నందున ప్రజలు సురక్షితంగా ఉండాలని ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) తెలిపింది.

యువతే దేశానికి బిగ్ పవర్
TG· 12 Aug 2026

యువతే దేశానికి బిగ్ పవర్

TG: అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి జూనియర్ కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ చివుకుల ఉష పాల్గొని మాట్లాడారు. యువశక్తితోనే దేశ ప్రగతి సాధ్యమని పేర్కొన్నారు. యువత మద్యపానం, ధూమపానం, మాదకద్రవ్యాలు, సోషల్ మీడియా వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. నూతన సాంకేతికతను అందిపుచ్చుకుని విద్య, ఉపాధి రంగాల్లో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

గంజాయి మత్తులో ఉన్నాడా? పోలీస్ కాలర్ పట్టుకొని బెదిరించి..
Politics· 12 Aug 2026

గంజాయి మత్తులో ఉన్నాడా? పోలీస్ కాలర్ పట్టుకొని బెదిరించి..

తిరుపతి జిల్లా: ఓ యువకుడు పోలీస్ కానిస్టేబుల్ కాలర్ పట్టుకొని బెదిరించిన షాకింగ్ వీడియో ఇది. శ్రీకాళహస్తి వన్ టౌన్ హెడ్ కానిస్టేబుల్‌ రమణయ్యను యువకుడు బెదిరించి దాడి చేసిన ఘటన లేటుగా వైరలైంది. విచ్ఛలవిడిగా దొరుకుతున్న గంజాయి వల్లే ఏపీలో ఇలా రెచ్చిపోతున్నారని <a href="https://x.com/JaganannaCNCTS/status/2087395778667119064?s=20"> YSRCP సోషల్ మీడియా హ్యాండిల్ పోస్ట్</a> చేసింది. ఈ ఘటన ఎప్పుడు జరిగింది. కానిస్టేబుల్-యువకుడి మధ్య గొడవేంటి, కేసు ఫైల్ అయ్యిందా లేదా అనే విషయాలు ఇంకా తెలియాలి. తెలిస్తే Appలో ప్లస్ సింబల్(+) క్లిక్ చేసి న్యూస్ మీరే ఆ న్యూస్ పోస్ట్ చెయ్యండి.

CM విజయ్‌కు డీఎంకే మద్దతు
National· 12 Aug 2026

CM విజయ్‌కు డీఎంకే మద్దతు

కేంద్ర ప్రభుత్వం చేయాలని చూస్తున్న డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా టీవీకే ప్రభుత్వం తీసుకున్న తీర్మానానికి తమిళనాడు అసెంబ్లీ సమావేశంలో డీఎంకే మద్దతు తెలిపింది. ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ ‘డీలిమిటేషన్ పేరుతో పార్లమెంటు సభ్యుల సంఖ్య తగ్గకూడదు. వచ్చే 25 ఏళ్లపాటు డీలిమిటేషన్ చేయకూడదనేదే మా స్టాండ్’ అని చెప్పారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ తీర్మానాన్ని స్వాగతిస్తున్నామన్నారు. తమిళనాడుకు డీలిమిటేషన్ వల్ల నష్టం జరగకూడదని నిర్ణయించినట్టు తెలిపారు.

పట్టపగలే గుడి దగ్గర గుప్త నిధుల వేట
TG· 12 Aug 2026

పట్టపగలే గుడి దగ్గర గుప్త నిధుల వేట

TG: పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగాయన్న ప్రచారం కలకలం రేపుతుంది. గ్రామ సమీపంలోని పురాతన దేవాలయం సందెరెల్లి గుల్ల వద్ద భారీగా మట్టి తవ్వి గుంత ఏర్పాటు చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. తవ్వకాలకు ఉపయోగించిన పరికరాలు ఎక్కడి నుంచి వచ్చాయనే అంశంపై చర్చ జరుగుతోంది. అర్ధరాత్రి, పట్టపగలే తవ్వకాలు జరుగుతుంటే పోలీసులకు, రెవెన్యూ అధికారుల కళ్లకు కనిపించడం లేదా అని, లేక సమాచారం ఉన్నప్పటికీ పట్టించుకోవట్లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

గోల్డ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్!
Business· 12 Aug 2026

గోల్డ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్!

బులియన్ మార్కెట్‌లో వరుసగా రెండో రోజూ గోల్డ్ రేట్స్ భారీగా పెరిగాయి. బుధవారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై ₹1,040 పెరిగి ₹1,54,860కి చేరగా, 22 క్యారెట్ల బంగారం ₹950 పెరిగి ₹1,41,950 వద్ద, 18 క్యారెట్ల బంగారం ₹770 పెరిగి ₹1,16,140 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. మార్కెట్ ట్రెండ్స్ ప్రకారం ధరలు ఎప్పటికప్పుడు మారుతున్నందున, బంగారం కొనేముందు లైవ్ రేట్స్‌ను చెక్ చేసుకోవడం మంచిది.

నిద్రలో ఉన్న భార్యపై ఇటుకతో దాడి
TG· 12 Aug 2026

నిద్రలో ఉన్న భార్యపై ఇటుకతో దాడి

TG: మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లోని ద్వారకానగర్‌లో మాధవి (37)ని ఆమె భర్త కాట్రావత్ రాజు సిమెంట్ ఇటుకతో కొట్టి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. 18ఏళ్ల క్రితం వివాహమైన ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. గత కొంతకాలంగా రాజు మద్యానికి బానిసై భార్యను అనుమానిస్తూ వేధిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. గత అర్ధరాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన రాజు.. కుటుంబసభ్యులు నిద్రిస్తున్న సమయంలో మాధవిపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

వెండితెరపై 'మిర్జాపూర్'
Cinema· 12 Aug 2026

వెండితెరపై 'మిర్జాపూర్'

భారతీయ ఓటీటీ చరిత్రలో సంచలనం సృష్టించిన క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ ‘మిర్జాపూర్’ ఇప్పుడు వెండితెరపై అలరించేందుకు సిద్ధమైంది. రితేష్ సిధ్వాని, ఫర్హాన్ అక్తర్ నిర్మిస్తున్న ఈ భారీ మూవీ అధికారిక ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. గుర్‌మీత్ సింగ్ దర్శకత్వం వహిస్తుండగా, సిరీస్‌లో అదరగొట్టిన ప్రధాన నటీనటులందరూ మళ్లీ పెద్ద తెరపై కనిపించనున్నారు . ఈ క్రైమ్ యాక్షన్ డ్రామా సెప్టెంబర్ 4న థియేటర్లలోకి రానుంది.

స్టూడెంట్స్‌కు నీళ్ల చారు, ఉడకని అన్నం
AP· 12 Aug 2026

స్టూడెంట్స్‌కు నీళ్ల చారు, ఉడకని అన్నం

AP: కర్నూలు జిల్లా హొళగుంద ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లో మధ్యాహ్న భోజనం నాణ్యతపై SFI నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు నీళ్ల చారు, సరిగ్గా ఉడకని అన్నం అందిస్తున్నారని ఆరోపిస్తూ విద్యార్థులతో కలిసి తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ఎమ్మార్వో కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి, అనంతరం కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ప్రస్తుత వంట ఏజెన్సీని వెంటనే రద్దు చేసి, నాణ్యమైన, పౌష్టికాహారం అందించే ఏజెన్సీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

జైలులో ఫోన్-పెన్‌డ్రైవ్‌తో చిక్కిన ప్రజ్వల్ రేవణ్న
Politics· 12 Aug 2026

జైలులో ఫోన్-పెన్‌డ్రైవ్‌తో చిక్కిన ప్రజ్వల్ రేవణ్న

బెంగళూరు: హాసన్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్న (మాజీ ప్రధాని HD దేవెగౌడ మనవడు) జైల్లో జల్సాలు చేస్తున్నాడా? పనిమనిషిపై రేప్ కేసులో జీవిత ఖైదీగా ఉన్న రేవణ్న దగ్గర ఫోన్, పెన్ డ్రైవ్ గుర్తించారు. 2024 లోక్‌సభ ఎన్నికల టైంలో బయటికొచ్చిన రేవణ్న సెక్స్ కుంభకోణం పెద్ద సంచలనం. JDS-BJP అభ్యర్థిగా పోటీ చేసిన రేవణ్న ఆ ఎన్నికల్లో ప్రధాని మోదీ వచ్చి ప్రచారం చేసినా ఓడిపోయారు. 2025లో కోర్టు దోషిగా తేల్చి జీవిత ఖైదు శిక్ష వేసింది. రేవణ్నకు ఫోన్ ఎలా వచ్చిందో దర్యాప్తు చేస్తున్నారు. ఓ జైలు అధికారిని సస్పెండ్ చేశారు.

హాలీవుడ్ రికార్డులను బద్దలు కొట్టేలా 'రామాయణ'
Cinema· 12 Aug 2026

హాలీవుడ్ రికార్డులను బద్దలు కొట్టేలా 'రామాయణ'

నితీష్ తివారీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మైథలాజికల్ సినిమా 'రామాయణ' పార్ట్-1 నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా 59 వేల స్క్రీన్లలో విడుదల కానుంది. సోనీ పిక్చర్స్ భాగస్వామ్యంతో కేవలం ఓవర్సీస్‌లోనే 50 వేల స్క్రీన్లలో విడుదల చేస్తూ ‘పుష్ప 2’, ‘RRR ’లతో పాటు హాలీవుడ్ చిత్రం ‘అవతార్ 2’ రికార్డులను కూడా ఇది దాటుతుంది. ఈ సినిమాని 'బ్రహ్మ AI' అడ్వాన్స్డ్ టెక్నాలజీతో 40కి పైగా భాషల్లో గ్లోబల్ ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు.