Latest

‘Go Back Marwadi’ ఉద్యమంపై రేపు రౌండ్ టేబుల్
TG· 11 Aug 2026

‘Go Back Marwadi’ ఉద్యమంపై రేపు రౌండ్ టేబుల్

TG: తెలంగాణలో స్థానిక వ్యాపారులకు మద్దతు అందించాలని, మర్వాడీ వ్యాపారులను నియంత్రించాలనే ఉద్దేశంతో మొదలైన ‘Go Back Marwadi’ ఉద్యమానికి ఏడాది పూర్తయింది. 2025 ఆగస్టులో ప్రారంభమైన ఈ ఉద్యమాన్ని కొన్ని సంఘాలు ముందుకు తీసుకెళ్లాయి. ఈ ఉద్యమ భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు తెలంగాణ క్రాంతి దళ్ ఆధ్వర్యంలో రేపు మధ్యాహ్నం 1 గంటకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నారు.

గంగూలీ దంపతులకు డెత్ థ్రెట్!
News· 11 Aug 2026

గంగూలీ దంపతులకు డెత్ థ్రెట్!

ఇండియన్ టీమ్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, ఆయన భార్య డోనాకి గత ఆరు నెలలుగా కంటిన్యూస్‌గా త్రెటెనింగ్ లెటర్స్ వస్తున్నాయి. రీసెంట్‌గా సోమవారం ఆఫీసుకి వచ్చిన రెండు లెటర్లలో ఇద్దరినీ ఎలిమినేట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. దీంతో గంగూలీ పర్సనల్ సెక్రటరీ వెంటనే ఠాకూర్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఫైల్ చేశారు. కేసు నమోదు చేసిన కోల్‌కతా పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయగా, ఆ లెటర్స్ బెల్ఘరియా నుంచి కొరియర్ ద్వారా వచ్చినట్టు ట్రేస్ చేశారు. పంపిన పర్సన్ ఎవరనేది కనుక్కునేపనిలో ఉన్నారు.

ఆటో డ్రైవర్ల రణభేరి..  బిగ్ డిమాండ్స్
TG· 11 Aug 2026

ఆటో డ్రైవర్ల రణభేరి.. బిగ్ డిమాండ్స్

TG: తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆటోడ్రైవర్లు జనగాం జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం అందించాలని, ఆటో కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రమాద బీమా పథకాన్ని పునరుద్ధరించాలని, ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్ల కుటుంబాలకు రూ.25లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఓలా, ఉబర్, రాపిడో వంటి సంస్థలపై చర్యలు తీసుకోవాలని, ఈ-ఆటోల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. నిరసనతో కలెక్టరేట్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది.

15న ‘ఖడ్గం’ రీ-రిలీజ్.. శ్రీకాంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Cinema· 11 Aug 2026

15న ‘ఖడ్గం’ రీ-రిలీజ్.. శ్రీకాంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

కృష్ణవంశీ డైరెక్షన్‌లో వచ్చిన ‘ఖడ్గం’ సినిమా తనకు ఎంతో స్పెషల్ అని హీరో శ్రీకాంత్ అన్నారు. ఈ మూవీ తన కెరీర్‌కు ఎంతో ప్లస్ అయిందని చెప్పారు. సినిమాలో రవితేజ, ప్రకాష్ రాజ్‌ల క్యారెక్టర్స్ అద్భుతంగా ఉంటాయని మెచ్చుకున్నారు. ‘ఖడ్గం’లోని ‘నువ్వే నువ్వే’ పాట తన ఆల్‌టైమ్ ఫేవరెట్ అని అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ‘ఖడ్గం’ థియేటర్లలో రీ-రిలీజ్ కానుంది. ఆడియన్స్ సినిమాను థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయాలని శ్రీకాంత్ విజ్ఞప్తి చేశారు.

రేపు ఆకాశంలో అద్భుతం
Science· 11 Aug 2026

రేపు ఆకాశంలో అద్భుతం

రేపు సూర్యోదయానికి ముందు ఆకాశంలో ఆరు గ్రహాలు వరుసగా కనిపించనున్నాయి. బృహస్పతి, బుధుడు, అంగారకుడు, శని, యురేనస్, నెప్ట్యూన్ తూర్పు నుంచి పడమర వైపు వరుసగా కనిపిస్తాయి. అంగారకుడు, శని గ్రహాలను సాధారణ కంటితోనే గుర్తించే అవకాశం ఉంటుంది. యురేనస్, నెప్ట్యూన్ వంటి గ్రహాలను చూడటానికి మాత్రం టెలిస్కోప్ అవసరమవుతుంది. రేపు సంపూర్ణ సూర్యగ్రహణం కూడా ఏర్పడనుంది. అయితే గ్రీన్‌లాండ్, ఐస్‌లాండ్, స్పెయిన్, యూరప్, ఆఫ్రికా, ఉత్తర అమెరికాలోని కొన్ని ప్రాంతాల నుంచి మాత్రమే ఈ సూర్యగ్రహణాన్ని చూడొచ్చు.

ప్రకృతి అద్భుతం.. కప్పల జీవచక్రం
Infotainment· 11 Aug 2026

ప్రకృతి అద్భుతం.. కప్పల జీవచక్రం

ఆడ కప్పలు నీటిలో వేలాది గుడ్లను జెల్లీని పోలిన పొడవైన గొలుసు ఆకారంలో పెడతాయి. ఒక్క ఆడ కప్ప ఒకేసారి సుమారు 8 వేల నుంచి 30 వేల వరకు గుడ్లు పెట్టగలదు. అయితే వాటిలో చాలా వరకు వివిధ కారణాలతో నశిస్తాయి. కొద్దిమాత్రమే గుడ్ల నుంచి పిల్ల కప్పలు (టాడ్‌పోల్స్) బయటకు వచ్చి, క్రమంగా శరీరంలో మార్పులు చెంది పూర్తిస్థాయి కప్పలుగా ఎదుగుతాయి. ఇలా గుడ్డు నుంచి కప్పగా మారే జీవచక్రం ప్రకృతి సృష్టిలోని అద్భుతాల్లో ఒకటి.

భారీగా పెరిగిన బంగారం ధరలు!
Business· 11 Aug 2026

భారీగా పెరిగిన బంగారం ధరలు!

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో మంగళవారం బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్‌పై ఏకంగా ₹3,160 పెరగడంతో ధర ₹1,55,130 కి చేరింది. అలాగే ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ₹2,900 పెరిగి ₹1,42,200 వద్ద ట్రేడ్ అవుతుండగా, 18 క్యారెట్ల బంగారం ధర ₹2,370 పెరిగి ₹1,16,350 కి చేరింది. మార్కెట్ ట్రెండ్స్ బట్టి ఈ ప్రైసెస్ ఎప్పటికప్పుడు చేంజ్ అయ్యే ఛాన్స్ ఉన్నందున గోల్డ్ ఆర్నమెంట్స్ కొనే ముందు లేటెస్ట్ రేట్స్ చెక్ చేసుకోవడం బెటర్.

హైవేపై గంజాయి రవాణా
Crime· 11 Aug 2026

హైవేపై గంజాయి రవాణా

AP: అనకాపల్లి జిల్లా కసింకోట వద్ద నేషనల్ హైవేపై పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. HOP హోటల్ సమీపంలో అనుమానాస్పదంగా కనిపించిన ఆటోను తనిఖీ చేయగా అందులో 60 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. దీని విలువ సుమారు రూ.30 లక్షలు ఉంటుందని తెలిపారు. గంజాయి తరలిస్తున్న నలుగురిని అరెస్ట్ చేశారు. ఆటోను సీజ్ చేసి, రెండు బైకులు, నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అక్రమ రవాణాపై జిల్లాలో తనిఖీలను మరింత ముమ్మరం చేసినట్లు DSP మోహన్ పేర్కొన్నారు.

AI కంటెంట్‌కు ఇన్‌విజిబుల్ వాటర్‌మార్క్‌.. ఎందుకంటే?
Technology· 11 Aug 2026

AI కంటెంట్‌కు ఇన్‌విజిబుల్ వాటర్‌మార్క్‌.. ఎందుకంటే?

సోషల్ మీడియాలో AI కంటెంట్ పెరుగుతున్న టైమ్‌లో, మనుషులు డిజైన్ చేసిన కంటెంట్‌కు, AI కంటెంట్‌కు మధ్య తేడాను ఐడెంటిఫై చేయడానికి ఆంథ్రోపిక్ ఇన్‌విజిబుల్ వాటర్‌మార్క్ సిస్టమ్‌ను తీసుకొచ్చింది. క్లాడ్ AI మోడల్స్‌తో డిజైన్ చేసిన టెక్స్ట్, చిత్రాలకు ఈ వాటర్‌మార్క్ జత చేయనుంది. కాపీ, పేస్ట్ లేదా కొంత ఎడిటింగ్ చేసినా ఇది తొలగిపోకుండా డిజైన్ చేశారు. యూరోపియన్ AI యాక్ట్‌కు అనుగుణంగా ఈ విధానాన్ని ఇంప్లిమెంట్ చేయనున్నారు.

నీటి కోసం రోడ్డెక్కిన కాలనీవాసులు
AP· 11 Aug 2026

నీటి కోసం రోడ్డెక్కిన కాలనీవాసులు

AP: సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలంలో తాగునీటి సమస్యపై కాలనీవాసులు ఆందోళనకు దిగారు. నెలరోజులుగా పలు కాలనీల్లో నీటి సరఫరా సరిగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు తెలిపారు. సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కరించలేదని వాపోయారు. ఖాళీ బిందెలతో MPDO కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన చేపట్టారు. MPDO అశోక్‌కుమార్‌రెడ్డి లేకపోవడంతో ఈఓఆర్‌డీ, పంచాయతీ కార్యదర్శి వారితో చర్చించారు. నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

అదానీ గ్రూప్ ప్రాజెక్టులకు 83,700 చదరపు అడుగుల అటవీ భూమి
National· 11 Aug 2026

అదానీ గ్రూప్ ప్రాజెక్టులకు 83,700 చదరపు అడుగుల అటవీ భూమి

అదానీ గ్రూప్‌కు చెందిన రెండు కంపెనీల ప్రాజెక్టుల కోసం దాదాపు 83,700 చదరపు అడుగుల అటవీ భూమిని మళ్లించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. ఇందులో రాయ్‌గడ్ జిల్లాలోని రిజర్వ్ ఫారెస్ట్, మాంగ్రోవ్ భూమి, అమరావతి జిల్లాలోని అటవీ భూమి ఉన్నాయి. అటవీ అధికారులకు ఆ భూమిలో అడ్డంకి లేకుండా ఎంట్రీ ఉంటుందన్న కండీషన్‌తో పర్మిషన్ ఇచ్చారు. అలా చేయకపోతే ఈ పర్మిషన్‌ను వెంటనే విత్‌డ్రా చేసుకుంటారు.

స్కూల్లో ఫుడ్‌పై FSSAI కీలక ప్రపోజల్!
Education· 11 Aug 2026

స్కూల్లో ఫుడ్‌పై FSSAI కీలక ప్రపోజల్!

స్కూల్లో పిల్లలు తినే ఆహారంపై ఇక మరింత ఫోకస్ ఉండనుంది. ఎక్కువ ఫ్యాట్, షుగర్, ఉప్పు (HFSS) కలిగిన ఫుడ్ ఐటమ్స్‌కు లిమిట్ ఉండాలని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ప్రపోజల్ చేసింది. సాలిడ్, లిక్విడ్ ఫుడ్ ఐటమ్స్‌కు వేర్వేరు స్టాండర్డ్స్‌ను సజెస్ట్ చేసింది. ఈ లిమిట్స్ దాటిన ఆహారాన్ని HFSSగా పరిగణించనున్నారు. దీనిపై ఆబ్జెక్షన్స్, సజెషన్స్ ఉంటే 60 రోజుల్లో సమర్పించాలని FSSAI కోరింది.

భగ్గుమన్న వెలుగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులు
AP· 11 Aug 2026

భగ్గుమన్న వెలుగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులు

AP: నష్ట పరిహారం ఇవ్వకుండా, ఇళ్ల నిర్మాణం పూర్తి కాకుండానే గ్రామాలు వదిలి వెళ్లిపోయాలని అధికారులు ఆదేశించడంపై వెలుగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులు భగ్గుమన్నారు. మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. కలెక్టరేట్‌లోకి ప్రవేశించి, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిర్వాసితులకు సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు రమాదేవితోపాటు జిల్లా కార్యదర్శి సోమయ్య సంఘీభావం తెలిపారు. ‘పరదాలు కట్టుకుని, బిక్కుబిక్కుమంటూ బతికితే ఆ బాధ మీకు తెలుస్తుందని’ అధికారులు, పాలకులను ఉద్దేశించి రమాదేవి విమర్శించారు.

మరిపెడ PSలో భద్రత కరువు
TG· 11 Aug 2026

మరిపెడ PSలో భద్రత కరువు

TG: శిథిలావస్థలో ఉన్న పోలీస్‌స్టేషన్ భవనంలో విధులు కొనసాగిస్తున్న సమయంలో ఒక్కసారిగా పెచ్చులు ఊడి ASI శ్రీనివాసరావుపై పడ్డాయి. మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీస్‌స్టేషన్‌లో జరిగిన ఈ ఘటనలో ఏఎస్సై భుజానికి గాయమైంది. వెంటనే స్పందించిన తోటి సిబ్బంది ఆయనను ఆస్పత్రికి తరలించారు. భవనం పరిస్థితి దారుణంగా ఉన్నప్పటికీ అందులోనే పోలీసులు విధులు నిర్వహించాల్సి వస్తుండటంపై సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయపడుతున్నట్లు తెలిపారు.

నకిలీ ర్యాపిడో డ్రైవర్ వివాదం..మరో వీడియో చేసిన సిద్ధి
TG· 11 Aug 2026

నకిలీ ర్యాపిడో డ్రైవర్ వివాదం..మరో వీడియో చేసిన సిద్ధి

TG: హైదరాబాద్ నగరం చార్మినార్ దగ్గర ఆగస్టు 8 రాత్రి నకిలీ రాపిడో డ్రైవర్‌ వ్యవహారంపై సిద్ధి అనే యువతి చేసిన వీడియో వైరల్ అయింది. ఈ వీడియోపై పలువురు స్పందించి, అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అనంతరం ఇవాళ సిద్ధి మరో వీడియో చేశారు. అతని పేరు ఇర్ఫాన్ కాదని, మీర్జాఅని, క్లబ్‌ల్లో బౌన్సర్‌గా పనిచేస్తున్నాడని చెప్పింది. తన వీడియోకు రాజకీయ, మతపరమైన రంగు వేయొద్దని కోరింది. రాపిడో యాప్‌ను నమ్ముతానని, కానీ ఎప్పుడూ డ్రైవర్, వాహన వివరాలు వెరిఫై చేసుకోవాలని హెచ్చరించింది.

మావోయిస్టు కీలక నేత సరెండర్.. రూ.20 లక్షల రివార్డు
Legal· 11 Aug 2026

మావోయిస్టు కీలక నేత సరెండర్.. రూ.20 లక్షల రివార్డు

TG: ములుగులో మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యురాలు కాకర్ల సమత తెలంగాణ పోలీసుల ముందు సరెండర్ అయ్యారు. 1985లో పార్టీ మెంబెర్‌గా చేరిన ఆమె 1991లో ఏరియా కమిటీ, 1994లో జిల్లా కమిటీ మెంబెర్‌గా, 2003లో రాష్ట్ర కమిటీ మెంబెర్‌గా ఎదిగారు. తెలంగాణ గవర్నమెంట్స్ సరెండర్ అండ్ రిహాబిలిటేషన్ పాలసీ కింద అర్హత కలిగిన రూ.20 లక్షల రివార్డు చెక్కును DGP సీ.వీ. ఆనంద్ ఆమెకు అందజేశారు. మిగిలిన ముగ్గురు కేడర్లు కూడా జనజీవన స్రవంతిలోకి రావాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

కలిసి ఉండలేక.. విడిపోలేక..
AP· 11 Aug 2026

కలిసి ఉండలేక.. విడిపోలేక..

AP: పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలంలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం విషాదంగా మారింది. ప్రేమ వివాహానికి కుటుంబసభ్యులు అంగీకరించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఇద్దరూ కలిసి అడవికోడి కాల్వలోకి దూకారు. ఘటనలో యువతి జగదాంబిక మృతి చెందగా, యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. కాల్వలో కొట్టుకుపోతున్న యువకుడిని గుర్తించిన స్థానికులు వెంటనే రక్షించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని యువతి కోసం గాలింపు చేపట్టారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సీనియర్ నటుడు కృష్ణేశ్వరరావు కన్నుమూత
Cinema· 11 Aug 2026

సీనియర్ నటుడు కృష్ణేశ్వరరావు కన్నుమూత

AP: సీనియర్ నటుడు, రచయిత కృష్ణేశ్వరరావు కన్నుమూశారు. ఏడాదిగా గుండె సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుంటూరు ఎ.టి.అగ్రహారంలోని తన ఇంట్లో మరణించారు. నాటక రచయితగా ఆయన విశేషమైన పేరు సంపాదించారు. 'సంపద, రోజూ చస్తున్న మనిషి, పక్కింట్లో పుట్టండి, గుర్తు తెలియని శవం' నాటకాలు ఆయనకు గుర్తింపు తెచ్చాయి. 'ప్రచండ భారతం' సినిమాతో సినిమాల్లోకి వచ్చిన ఆయన 'భద్రాచలం', 'ఔను..వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’, 'ఇడియట్’, ‘గోపి గోపిక గోదావరి', ‘చందమామ కథలు’,‘వీరతెలంగాణ’, ‘నాంది’, ‘విరూపాక్ష' తదితర చిత్రాల్లో నటించారు.

కొలంబియాలో భారీ భూకంపం..111 మంది మృతి
World· 11 Aug 2026

కొలంబియాలో భారీ భూకంపం..111 మంది మృతి

పశ్చిమ కొలంబియాలో 7.4 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. దీంతో 111 మంది మరణించగా, వందలాది మంది ఆచూకీ గల్లంతయ్యింది. కూలిపోయిన భవనాల కింద ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసేందుకు రక్షణ బృందాలు పని చేస్తున్నాయి. 21వ శతాబ్దంలో ఆ దేశంలో నమోదైన అత్యంత బలమైన భూకంపంగా కొలంబియా జియాలజికల్ సర్వీస్ దీన్ని పేర్కొంది. ఇది చోకో ప్రాంతంలోని సాన్ జోస్ డెల్ పాల్మర్ సమీపంలో ఉదయం 7:34కి సంభవించింది. దీని ప్రభావం పెరెరా, కాలి, మనిజాలెస్ వంటి నగరాల్లో ఎక్కువగా కనిపించింది.

కన్నకొడుకుపై తండ్రి దాడి
Crime· 11 Aug 2026

కన్నకొడుకుపై తండ్రి దాడి

TG: హైదరాబాద్ గుడిమల్కాపూర్‌లో తండ్రి దాడిలో తీవ్రంగా గాయపడిన కొడుకు అర్మాన్‌(4) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. PV నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్‌ నంబర్‌ 104వద్ద ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. తండ్రి సల్మాన్‌ బాలుడిపై దాడిచేయడంతో చిన్నారి తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం అతడిని DCM వాహనం కిందకు తోసేందుకు ప్రయత్నించగా స్థానికులు అడ్డుకుని పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు బాలుడిని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అర్మాన్‌ మృతి చెందాడు.

ఆరుగురు బాలికలకు పాము కాటు.. హెలికాప్టర్‌లో హాస్పిటల్‌కు
News· 11 Aug 2026

ఆరుగురు బాలికలకు పాము కాటు.. హెలికాప్టర్‌లో హాస్పిటల్‌కు

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా జప్టలై గ్రామంలోని గవర్నమెంట్ ఎయిడెడ్ ఆశ్రమ్ స్కూల్ హాస్టల్‌లో నిన్న తెల్లవారుజామున దారుణ ఘటన జరిగింది. నిద్రిస్తున్న ఆరుగురు స్టూడెంట్స్‌ను పాము కాటేసింది. వీరిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న ముగ్గురు బాలికలు చనిపోయారు. మరో ముగ్గురికి ట్రీట్‌మెంట్ చేస్తుండగా, ఒక బాలిక పరిస్థితి సీరియస్‌గా మారింది. దీంతో జిల్లా అధికారులు, పోలీసులు ఆమెను బెటర్ ట్రీట్‌మెంట్ కోసం స్పెషల్ హెలికాప్టర్‌లో నాగ్‌పూర్‌లోని GMC హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.